Our Vision

చారిత్రాత్మక ప్రాంతాలలో ఎంతో ప్రాముఖ్యత గల ప్రదేశం ఓరుగల్లు.  ఈ మహా నగరంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, ఎంతో మంది ఆద్యాత్మిక గురువులు విద్యారణ్యులు, నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్యులు లాంటి మహానుభావులకు నెలవై, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులకు పుట్టినిళ్లుగా, కాకతీయులు పాలించిన పోరాటాల పురిటిగడ్డగా నిలిచింది.

ఇలాంటి గొప్ప చరిత్ర గల వరంగల్ మహా నగరంలో తెలంగాణాలోనే అత్యదిక బ్రాహ్మణ జనసాంద్రత గల నగరంగా ప్రసిద్దికెక్కింది. ఎంతో మంది బ్రాహ్మణ సంఘ నాయకులు, ప్రముఖులు వివిద దశలలో వారి శక్తికొలది బ్రాహ్మణ అభ్యుదయానికి పాటుపడ్డారు, ఐతే పేద, మద్య తరగతి బ్రాహ్మణులు స్వంత ఇల్లు లేక వారి కుటుంభాలలో ఎవరైనా గతించి ఇబ్బంది జరిగితే దశదిన కర్మలకు, తద్దినాలకు, మాసికాలకు ఒక వేదిక లేక కిరాయి ఇళ్లలో చేసుకోలేక ఇబ్బంది పడుతున్న సంధార్భాలు అనేకం.

ఈ పరిస్తుతులను అదిగమించడానికిగాను ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆద్యాత్మిక వేత్త సహృదసహకారంతో భూ విరాళంగా 250 చదరపు గజాలను కర్మా భవన నిర్మాణం కోసం విప్రా ఫౌండేషన్ బ్రాహ్మణ వెల్ల్ఫైర్ సొసైటీ కి పూర్తిగా విరళంగా ఉచితంగా అంధించారు. వారిచ్చిన సహకారంతో బ్రాహ్మణ బందువులందరి దీర్గకాళిక అవసరాల రీత్యా బ్రాహ్మణ భవనం, కర్మా భవన్, వేద పాఠశాల నిర్మాణం చేపట్టడం కోసం మీ అందరి సహాకారం కోరుతున్నాం…..

మీ వల్లూరి పవన్ కుమార్