Categories
Vipra Foundation

మహాత్మా గాంధీ జయంతి

(1869 అక్టోబర్ 2 – 1948 జనవరి 30)

   ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. అక్టోబరు 2న భారత దేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు – స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)

15 జూన్ 2007 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను “ప్రపంచ అహింసా దినం” గా ప్రకటించింది.

గాంధీని అనుసరించే వారు ఈ రోజున మంసాహారం ముట్టుకోరు. భారత దేశంలో నాయకులు, విద్యార్ధులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది.

జీవిత చరిత్ర :

బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా మలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని బాపూజీబ్రిటిష్ ప్రభుత్వ్నా గడగడలాడించడంతో భారత దేశాకి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్య్న్రా పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధాన్నా సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2 వ తేది కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు జన్మించాడు. కాగా గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో ఒక దివాన్ గా పచేసేవాడు. ఉన్నత విద్య చదవక పోయినా సమర్థుడైన ఉద్యోగిగా పేరు సంపాదించాడు. అలాగే తల్లి హిందూ సంప్రదాయాలను తు.చ. తప్పక పాటించే సాధ్వీమణి. తల్లి దండ్రుల సంరక్షణలో గాంధీజీ బాల్యం గడిచింది. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. తరగతి గదిలో ఎక్కువ బిడియ పడుతూ వెనుక వరసలో కూర్చొనే వాడు. పాఠశాల విడిచిన వెంటనే ఆట పాటల యందు ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి పోయేవాడు. ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియ వాడ్‌లో కొనసాగింది. గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. అయితే గాంధీ ఇందుకు రాకరించాడు. చెడు సావాసాల వల్ల పొగ త్రాగడం, మాంసం తినడం జరిగింది. అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది తిరిగి ఇటువంటి పనులు చేయనని తల్లి దండ్రులకు ప్రమాణం చేశాడు. గాంధీకి 13 వ ఏట కస్తూరి బాయితో బాల్య వివాహం జరిగింది. గాంధీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బారిష్టర్ విద్యను అభ్యసించడాకి తన 17 వ ఏట లండన్ నగరాకి వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం కఠోర నియమాలతో విద్యను పూర్తి చేసి స్వదేశాకి తిరిగి వచ్చాడు. కొంత కాలం ముంబై, కథియ వాడ్ లలో న్యాయవాదిగా ప్రాక్టీసు నిర్వహించారు. సత్య వాక్య పరిపాలనా దక్షుడైన గాంధీజీకి క్నొ సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురై బాధ కలిగింది. కాగా 1893 లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లాడు. అయితే అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొని మిక్కిలి మనస్తాపానికి గురయ్యాడు. అయినా మొక్కవో ధైర్యంతో సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని శ్వేత జాతీయుల దురహంకారnni ఎదిరించి జాతి భేద్నా తొలగించేందుకు అవిశ్రాంత పోరాట్నా సాగించాడు. ట్రాన్స్ వాల్ పట్టణంలో ఫోక్స్ ఆశ్రమ్నా స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపీయన్ అనే వార పత్రికను స్ధాపించాడు. కాగా 1915 జనవరి 9 వ తేది న దక్షిణాఫ్రికా నుండి భారత దేశాకి తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమ్నా స్దాపించాడు. ఇక్కడే తన అనుచరులకు సత్యం, అహింస మొదలగు మార్గాలను అనుసరించే విధాన్నా బోధించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ మహాత్మా అని సంబోధిస్తూ టెలిగ్రాం పంపాడు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను తొలిసారిగా కలుసుకున్నాడు. ఇతర జాతీయ నాయకులు సంస్కరణల కోసం చర్చలు సాగిస్తుండగా గాంధీజీ బీహార్ లో చంపారన్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. ఇక్కడి రైతులు తీన్ కథియా అనే పద్ధతికి కట్టుబడి ఉండేవారు. తమ భూముల్లో పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విన్న చాలా మంది చంపారన్ రైతులు తమ ప్రాంతాకి వచ్చి కాపాడమని ఆయనను ఆహ్వాంచారు. గాంధీ అక్కడికి వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వాకి తెలియ పరచడంతో తీన్ కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ సాధించిన ఈ విజయం అనేక మంది యువ జాతీయ వాదులను ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, గుణ శీలమైన, నిర్ణయాత్మకమైన, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారి ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే గుజరాత్ లో కైరా జిల్లాలో పంటలు పండక పోయినప్పటికీ పన్నులు చెల్లించమని రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు నిరసనగా 1918 లో సత్యాగ్రహం ప్రారంభించాడు. అపుడు ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేసింది. ఇదే సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పనివారు తమ వేతనాలను పెంచమని సమ్మె చేయగా గాంధీజీ సత్యాగ్రహం చేపట్టి మిల్లు యజమానులను అంగీకరింప జేసి కార్మికుల వేతనాల్లో 35 శాతం పెరుగుదలను సాధించాడు. స్ధానిక ప్రాంతాలలో చేసిన సత్యాగ్రహ ప్రయోగాలలో విజయ్నా సాధించిన తర్వాత గాంధీజీ తన దృష్టి జాతీయ సమస్యల వైపు మళ్లించాడు. కాగా బ్రిటిష్ ప్రభుత్వం 1919 లో ప్రవేశపెట్టిన మాంటేగు ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతీయులలో అసంతృప్తి కలిగించాయి. అంతే గాకుండా విప్లవ కారుల కార్యక్రమాలను అణచి వేసేందుకు విచారణ లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్ట్నా చేసింది. భారతీయులందరూ ఈ చట్ట్నా తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా గాంధీజీ రౌలత్ చట్టాకి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా సాధారణ హర్తాళ్ కు పిలుపుచ్చాడు. ప్రజలు స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాలని సూచించాడు. ఈ పిలుపుకు స్పందించి దేశ ప్రజలందరూ అపూర్వ ఉత్సాహంతో కదలి వచ్చారు. ప్రజా ప్రతిఘటన అణచి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీజీ ఢిల్లీ కి వెళుతుండగా ఆయనను మధ్యలోనే ఆపి బలవంతంగా ముంబైకి పంపారు. గాంధీ ముంబైకి చేరుకున్న సమయంలో గుమిగూడిన ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ప్రజా నిరసన వెల్లువను అణచి వేత చర్య తో ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గాంధీజీ యంగ్ ఇండియా, నవ జీవన్ పత్రికల్లో సంపాదకత్వ్నా ప్రారంభించాడు. 1919 ఏప్రిల్ 10 న పంజాబ్‌లో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే నాయకులను అరెస్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీnni అమృతసర్ లో ప్రజలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. కొంత మంది అధికారులు కూడా మరణించారు. ఇద్దరు బ్రిటిష్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వారి చర్య పట్ల నిరసన తెలిపేందుకు 1919 ఏప్రిల్ 13 న అమృత సర్ లో జలియన్ వాలా బాగ్ అనే విశాల మైన బహిరంగ స్ధలం ఉన్న ఒక తోట మైదానంలో అధిక సంఖ్య లో ప్రజలు సమావేశమయ్యారు. దీనికి మూడు వైపులా మూసి ఉండి కేవలం ఒక వైపు మాత్రమే ద్వారం ఉండేది. అప్పటి  సైనిక కమాండర్ అయిన జనరల్ డి.డయ్యర్ తన సైక విభాగం తో చుట్టుముట్టి ఉన్న ఒక ద్వార్నా మూసివేయించి రైఫిల్లతో, మెషిన్ గన్‌లతో కాల్పులు జరపమని ఆదేశించాడు. సైనికులు తమ దగ్గర ఉన్న మందు గుండు సామాగ్రి అయిపోయేంత వరకూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. వేలాది మంది గాయ పడ్డారు. గాంధీజీ దీన్ని అత్యంత అనాగరిక చర్యగా పేర్కొని తీవ్రంగా ఖండించారు. కాగా 1920 లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ ప్రవేశ పెట్టిన సహాయ రాకరణోద్యమ తీర్మాన్నా ఏకగ్రీవంగా ఆమోదించింది. 1942 లో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో భారత రాజకీయ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. గాంధీజీ బ్రిటిష్ పాలకులకు క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా గాంధీతో సహా చాలా మంది నాయకుల్ని నాటి ప్రభుత్వం నిర్భందించింది. అనంతరం నాటి భారతీయుల స్వాతంత్య్ర పోరాటానికి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావనిని భారతీయులకు అప్పగించింది. కాగా స్వతంత్ర భారత అభివృద్ధి చూడక ముందే 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యాడు. ఆధునిక కాలంలో ఆవిర్భవించిన మహాత్ములలో ప్రప్రథముడు మన జాతిపిత. సత్యాహింసలు అనే ఆయుధాలతో భారతీయులను స్వతంత్ర సమర యోధులుగా తయారు చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు చరమ గీతం పాడిన మహా మనిషి … ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా మహాత్మడి జన్మదినోత్సవ్నా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు ఎంతో గర్వ కారణం. భారత ప్రభుత్వం జనవరి 9 వ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా ప్రకటించింది.కాగా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నేటి పాలకులు, ప్రజలు అనుసరించి,ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం ఉండగలదని ఆశిద్దాం!

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

లాల్‌ బహాదుర్‌ శాస్ర్తి జయంతి

         భారతదేశ ప్రగతికి రైతే ప్రధానం. కర్షకుడు సంతోషంగా ఉన్న రోజున మన దేశం అభివృద్ధి చెందిన దేశమని చెప్పవచ్చు. చలి, ఎండ, వానకు ఎరువక కుటుంబాన్ని వదిలి సరిహద్దులో ఉన్న సైన్యం ప్రశాంతంగా ఉన్న నాడు దేశ రక్షణకు ఇబ్బందిలేదు. అందుకే జై జవాన్‌.. జై కిసాన్‌ అని నేను అంటున్నాను.. అన్నాడు మన దేశ రెండవ ప్రధాని లాల్‌బహదుర్‌ శాస్ర్తి.(ఈయన కంటే ముంద గుల్జారీలాల్‌ నందా ప్రధానిగా చేసినా అది తాత్కాలిక బాధ్యతలు మాత్రమే.. కాబట్టి అధికారికంగా రెండవ ప్రధాని శాస్ర్తిగారే..)

లాల్‌ బహదుర్‌ శాస్ర్తి

ప్రధానమంత్రి పదవిలో…

జూన్‌ 9, 1964 – జనవరి 11, 1966

విదేశీ వ్యవహారాల మంత్రిగా…

9 జూన్‌, 1964 – 18 జులై, 1964

హోం మంత్రిగా…

4 ఏప్రిల్‌ 1961- 29 ఆగస్టు 1963

జననం : 2 అక్టోబరు 1904

ప్రాంతం : మొగల్‌సారాయ్‌, ఉత్తరప్రదేశ్‌

మరణం : 11 జనవరి 1966 (వయసు 61)

ప్రాంతం : తాష్కెంట్‌, ఉజ్బెకిస్తాన్‌

వృత్తి : రాజకీయాలు

రాజకీయ పార్టీ : భారత జాతీయ కాంగ్రెస్‌

భార్య : లలితా దేవి

లాల్‌ బహాదుర్‌ శాస్ర్తి భారత దేశ రెండవ శాశ్వత ప్ర ధానమంత్రి, దేశ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి. దేశ ప్రజలతోనే కాదు ఇతర దేశాధినేతలతో నూ పొట్టివాడైనా గట్టివాడు అనిపించుకున్నాడు. ఉత్తరప్ర దేశ్‌ రాష్ట్రంలోని మొగల్‌ సరాయ్‌లో లాల్‌ బహదూర్‌ 1904 అక్టోబర్‌ 2న శారదా ప్రసాద్‌, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్‌ రాయ్‌ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కు టుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్‌ బహదూర్‌ను చూసుకొని ఆ త ల్లిదండ్రులెంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్యశృంఖా లలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయా లని అప్పటికే కృషి చేస్తున్న మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు 2న, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతు లకు మరీ ఆనందం కలుగచేసింది. నిరాడంబరతకు తో డు ఎంతో అభిమానవంతుడైన లాల్‌ బహదూర్‌ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండే ది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి.

అది స్వల్పమే అయినా లాల్‌ బహదూర్‌ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊ రికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్‌బహదూర్‌ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. దురదృష్టవశా త్తు ఏడాదిన్నరకే లాల్‌ బహదూర్‌ తండ్రి మరణించ డంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధా రమైంది. ఆ కుటుంబాన్ని లాల్‌ బహదూర్‌ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. తాత గారింట భయభక్తులతో పెరిగిన లాల్‌ బహ దూర్‌ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరం గా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానా లను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు త నకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తు న్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపా ధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు.

స్వాతంత్య్రోద్యమం..

1921లో గాంధీ ప్రారంభించిన సహా య నిరాకరణోద్యమంలో పాల్గొనడా నికి కాశీలోని జాతీయవాద కాశీ విద్యా పీఠంలో చదవడం ప్రారంభించాడు. 1926లో శాస్ర్తి అనే పట్టభద్రుడయ్యా డు. స్వాంతంత్య్రోద్యమ పోరాటకా లంలో తొమ్మిది సంవత్సరాలు జైలు లోనే గడిపాడు. సత్యాగ్రహ ఉద్య మం తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు.

రాజకీయ జీవితం : స్వాతంత్య్రం త ర్వాత, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ మంత్రివర్గంలో గృహ మంత్రిగా పని చేశాడు. 1951లో లోక్‌సభ ప్రధాన కార్యద ర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరి యళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతి క బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశా డు. తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో చేరి తొలుత ర వాణా శాఖ మంత్రిగా, గృహ మంత్రిగా, హోంశాఖా మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు.

ప్రధానమంత్రిగా.. : 1964లో అప్పటి ప్రధాని నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికి, లాల్‌ బహదూర్‌ శాస్ర్తీ, మొరార్జీదేశాయ్‌ సిద్ధంగా ఉండగా, అప్ప టి కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంటు కామరాజ్‌ సోషలిస్టు భావా లున్న లాల్‌ బహదూర్‌ శాస్ర్తీకి మద్దతుపలికాడు. శాస్ర్తి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేశాడు. దీర్ఘకాలిక పరిష్కారానికి దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్‌ రెవల్యూషన్‌) బాటలు పరిచాడు. 1965 ఆగష్టులో పాకిస్తాన్‌ తన సేనలను ప్రయోగించి జమ్మూకా శ్మీర్‌లోని కచ్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. జమ్మూ కాశ్మీర్‌ లో ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుంచి విడిపోతార ని ఆశించింది. అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్‌ ఆక్రమణ గురించి తెలుసుకున్న శాస్ర్తి త్రివిధ దళాలకు ని యంత్రణ రేఖను దాటి లాహోర్‌ను ఆక్రమించుకోవడానికి ఆదేశాలు ఇచ్చి ధీర పటిమను ప్రదర్శించారు.

మరణంపై

వీడని మిస్టరీ…

తాష్కెంట్‌లో ఉన్న సమయంలో శాస్ర్తిగారు మరణించారు. చనిపోవడానికి కొద్ది సేపటి ముందు తన వ్యక్తిగత సహాయకుడు చేసిన వంట కాకుండా.. ఆయన భారత రాయబారి టిఎన్‌ కౌల్‌ వంట మనిషి జాన్‌ మహమ్మద్‌ చేసిన వంట తిన్నారు. ఆ తర్వాత ఆయన శరీరం నీలంగా మారడం, సహజ మరణమేనని ఓ పత్రంపై సంతకం చేయమన్నా వ్యక్తిగత సహాయకులు నిరాకరించడం అనుమానాలకు తావిచ్చింది. చివరకు లలితా శాస్ర్తి 1970లో తన భర్త మరణంపై విచారణకు డిమాండ్‌ కూడా చేశారు.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

తిరుమల బ్రహ్మోత్సవం

           భాద్రపదమాసంలో శుక్లపక్షం ఏకాదశి శ్రవణానక్షత్రం సోమవారంనాడు నారాయణగిరిలో స్వామి పుష్కరిణి తీరంలో ఈ శ్రీనివాసుడు ఆవిర్భవించాడని పద్మపురాణం చెబుతోంది. దేవతల కొలువులందుకుని వేంకటాచలంలో వెలసిన శ్రీ వేంకటేశునికి కన్యామాసంలో ధ్వజారోహణాది ఉత్సవాలను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ప్రారంభించాడు.

                ‘వేం’  అనగా పాపాలు, ‘కట’ అంటే దహింప (నశింప) చేసేదని అర్థం. సర్వపాపాలను, పాపఫలితాలైన దుఃఖాలను నశింపజేసేదే ఆనంద నిలయం. ఇది అర్థపరమైన నిర్వచనం. శబ్దశక్తిని అనుసరించి చూస్తే ‘వేం’  అమృతశక్తి బీజం. ‘కటం’ ఐశ్వర్య బీజం. అమృత తత్వం (కైవల్యం, ఆనందం), ఐశ్వర్యం కలగలిపిన శక్తివంతమైన క్షేత్రం ఇది. ఆ క్షేత్రం వేంకటగిరిపై వెలసిన ప్రభువే శ్రీ వేంకటేశ్వరుడు. అందుకే ఈ బ్రహ్మోత్సవాలకు వెళ్లే యాత్రికులు, తమ ఇండ్లనుంచి వేసే ప్రతి అడుగుకు ఒక్కొక్క క్రతువు చేసిన ఫలం దక్కుతుందని, అలా వెళ్ళే భక్తులకు యథాశక్తిగా సేవచేసేవారికి శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని, అలాగే యాత్రికులకు అపకారం చేసినవారికి భయంకరమైన రౌరవ నరకం తప్పదని వామన పురాణం ఘోషిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీ వేంకటేశుని వైభవాన్ని వర్ణించటం ఎవరితరం కాదు.

శ్రీ వేంకటేశునికి సంవత్సరం పొడుగునా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఎన్నో. వీటిలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అతి విశిష్టమైనవి. నవ బ్రహ్మలు నవహ్నిక దీక్షతో నిర్వహిస్తారు కనుక ఇవి బ్రహోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. ‘కలౌ వేంకటనాయక’ అని ప్రసిద్ధి పొందిన దేవ దేవుడైన శ్రీనివాసుడు వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుడిని పిలిచి జగత్ కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివేదనాదులు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.

        శ్రీ స్వామివారి ఆజ్ఞప్రకారమే శ్రీ వేంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం (ఆశ్వయుజం) లోని శ్రవణానక్షత్రం నాటికి పూర్తయ్యేటట్టుగా బ్రహోత్సవాలను నిర్వహించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ పదినాళ్ల ఉత్సవాలను కాలక్రమంలో ఎందరో రాజులు తమ విజయపరంపరలకు కృతజ్ఞతగా తిరుమల శ్రీనివాసునికి బ్రహ్మోత్సవాలు పేరిట ఉత్సవాలను నిర్వహించేవారు. అవి నెలకు ఒకటి వంతున ప్రతియేటా పండెండ్రు బ్రహ్మోత్సవాలు జరిగేవట. ఆ తరువాత…

         క్రీ.శ. 1254 చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ. 1328 ఆషాఢ మాసంలో ఆడి తిరునాళ్లను త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధ యాదవ రాయలు, క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప రాయలు, క్రీ.శ. 1446లో మాసి తిరునాళ్ల పేరుతో హరిహరరాయలు, క్రీ.శ. 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు, ఇలా క్రీ.శ 1583నాటికి సంవత్సరంలో ఇంచుమించు ప్రతి నెల ఒక బ్రహ్మోత్సవం జరిగేదన్న విషయం బోధపడుతుంది. ఆ రాజులు, వారి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినందువల్ల వారు ఏర్పాటు చేసిన ఉత్సవాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కాని అలనాడు శ్రీనివాస ప్రభువు ఆనతిమేరకు జగత్ కళ్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ శ్రీనివాసుని విభవాన్ని చాటుతున్నాయి. అందువల్లనే బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఉత్సవాలకు ముందు బ్రహ్మరధం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యంలో వహిస్తాడు. ఒక్క రథోత్సవంనాడు మాత్రమే బ్రహ్మరథం ఉండదు. శ్రీస్వామివారి రథోత్సవంనాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తేరుపగ్గాలను పట్టుకుని లాగుతూ రధోత్సవంలో పాల్గొంటారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాటులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకు స్వామివారి సేనాధిపతి విష్వక్ష్సేనుడు ఆలయంలోని నైరుతి దిశలో ఉండే వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తరువాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారంలోని నందులాట, బాహు, స్థన ప్రదేశాలనుండి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీనినే మ్రిత్సంగ్రహణం అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, ప్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికి సోముడు అధిపతి, శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్ధిస్తారు. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తరువాత పూర్ణకుంభ ప్రతిష్ట జరుగుతుంది. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయ్యింది.

       బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే తొలిరోజు ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియను నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరించి గరుడధ్వజ పటం సిద్ధంచేసి దాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగశ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడపతాకమే ముక్కోటి దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులలోనూ ముక్కోటి దేవతలందరూ శ్రీవారి ఆలయం చుట్టూ తిరుగుతుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ధ్వజారోహణం తరువాత సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని పుష్పమాలాంకృతుల్ని చేసి వాహన మండపంలో ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు. తరువాత ఉత్సవమూర్తులను రంగనాయక మండపంలో ఉంచుతారు. స్వామి కొలువుతీరి ఉన్న శేషాద్రి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు, బ్రహోత్సవాలలో అతి ప్రధానమైనది. అలా మొదలైన బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో పూర్తవుతాయ. ఈ రోజున స్వామి పుష్కరిణిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. చక్రస్నానం పూర్తయిన తరువాత అదేరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లు అవుతుంది. బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పూర్తయినట్లు భావిస్తారు. ఇన్ని విశేషాలు కలిగిన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను వీక్షించిన వారందరిదే పుణ్యం. అలాంటివారందరికీ ఆ స్వామి అష్టయిశ్వర్యాలను, సకల శుభాలను ప్రసాదిస్తారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

అధిక మాసం సమగ్ర వివరణ

అధిక ఆశ్వయుజ (పురుషోత్తమ) మాసం ప్రారంభం (18 సెప్టెంబరు 2020 నుండి 16 అక్టోబరు 2020

అధిక మాసం : పంచాంగ గణనం ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు సూర్యసంక్రాంతి లేకుండా పోయిన చాంద్రమాసానికి అధికమాసం అని పేరుపెట్టారు.

ఈ అధిక మాసము ఎప్పుడూ చైత్రమాసము నుండి ఆశ్వయుజమాసము మధ్యలోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆతర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. ధర్మ సింధువు ననుసరించి అధిక మాసంలో ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనము, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు. ముహూర్తాలతో ప్రమేయం లేని నిత్యం చేసే పూజ పునస్కారాలు యధావిధిగా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు తప్పని సరిగాచేయాలి. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు, ముఖ్యమైన దైవకార్యాలు చేయకూడదు, జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ ఎక్కువచేస్తే మంచిది. మరణ సంబంధమైన క్రతువులు, అంటే మాసికం, ఆబ్దికం మొదలైనవి, అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది. అధికమాసంలో వచ్చే మహాలయ పక్షాలు పితృకర్మలకు విశిష్టమైనవిగా చెబుతారు.

వివరణ :  సూర్యుని చుట్టూ భూమి చుట్టివచ్చే కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. కాని ఈ భ్రమణం వల్ల నెలలు ఏర్పడవు. నెలలను కొలవడానికి చంద్ర భ్రమణమే మూలం. భూమి చుట్టు చంద్రుని ప్రదక్షిణాకాలాన్ని నెల అంటారు. దాన్నే చాంద్ర మాసమని అంటారు. ఆ విదంగా ఏర్పడిన 12 చాంద్ర మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అనలేము. సూర్యుడు …. మేషం, వృషభం వంటి 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్క నెల సంచరించడాన్ని సౌర మాసం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించ డాన్ని రాశి సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరుగుతుంది. కాని మనం మకర రాశి సంక్రమణాన్ని మాత్రమే మకర సంక్రాంతిగా గుర్తిస్తున్నాము. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు…… రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. దాన్నే అధిక మాసం అంటారు.

అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆదారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్నిపూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. అనగా 12 x 27 = 354 రోజులు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు పడుతుంది. చంద్రునికైతె 354 రోజులె పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 11 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు….. ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే.

            క్షయ మాసము :- సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది. కానీ దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం. మరొక విధంగా చెప్పాలంటే అమావాస్య నుండి అమావాస్య వరకుగల సమయంలోపల, సూర్యుడు రెండు రాశులు దాటుతాడు. ఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి సంభవిస్తుంటుంది. వెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ జరుగుతుంది. దీనిని క్షయ మాసం అని పిలుస్తారు.

1823 లో వచ్చిన స్వభాను నామ సంవత్సరం తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 లో వచ్చిన క్రోధి నామ సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964 తరువాత మళ్ళీ కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 లో రుధిరోద్గారి నామ సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించింది. ఇక మనెవ్వరి జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము. ఎందుకంటే తరువాయి క్షయ మాసం సంభవించబోయేది 141 ఏళ్ళ తరువాత 2124 లోని తారణ నామ సంవత్సరంలోనే.

ఈ శతాబ్ధపు అధిక మాసాలు

సంవత్సరము  మాసము

2001 వృష  – ఆశ్వీయుజ మాసము

2004 తారణ  – శ్రావణ మాసము

2007 సర్వజిత్తు  – జ్యేష్ట మాసము

2010 వికృతి  – వైశాఖ మాసము

2012 నందన  – భాద్రపద మాసము

2015 మన్మథ  – ఆషాడ మాసము

2018 విలంబి  – జ్యేష్ట మాసము

2020 శార్వరి  – ఆశ్వీయుజ మాసము

2023 శోభకృతు  – శ్రావణ మాసము

2026 పరాభవ  – జ్యేష్ట మాసము

2029 సాధారణ  – చైత్ర మాసము

2031 విరోధికృతు  – భాద్రపద మాసము

2034 ఆనంద  – ఆషాడ మాసము

2037 పింగళ  – జ్యేష్ట మాసము

2039 సిధ్ధార్థి  – ఆశ్వీయుజ మాసము

2042 దుందుభి  – శ్రావణ మాసము

2045 క్రోధన  – జ్యేష్ట మాసము

2048 శుక్ల  – చైత్ర మాసము

2050 ప్రమోదూత  – భాద్రపద మాసము

2053 శ్రీముఖ  – ఆషాడ మాసము

2056 ధాత  – వైశాఖ మాసము

2058 బహుధాన్య  – ఆశ్వీయుజ మాసము

2061 వృష  – శ్రావణ మాసము

2064 తారణ  – జ్యేష్ట మాసము

2067 సర్వధారి  – చైత్ర మాసము

2069 విరోధి  – శ్రావణ మాసము

2072 నందన  – ఆషాడ మాసము

2075 మన్మథ  – వైశాఖ మాసము

2077 హేవిలంబి  – ఆశ్వీయుజ మాసము

2080 శార్వరి  – శ్రావణ మాసము

2083 శోభకృతు  – జ్యేష్ట మాసము

2086 ప్లవంగ  – చైత్ర మాసము

2088 కీలక  – శ్రావణ మాసము

2091 విరోధికృతు  – ఆషాడ మాసము

2094 ఆనంద  – వైశాఖ మాసము

2096 నల  – భాద్రపద మాసము

2099 సిధ్ధార్థి  – శ్రావణ మాసము

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం

ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |

లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం

తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా ||

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పితృ తర్పణము – విధానము

శ్రీః శ్రీమతే వేద పురుషాయ నమః

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు, తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి, బ్రాహ్మణుడు దొరకకున్ననూ, ఎవరికి వారు తర్పణము చేయవచ్చును. (తర్పణము అర్థము, అవసరము, ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను) ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ‘పార్వణ శ్రాద్ధం ’ లేక  ‘చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు … తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు… దర్శ శ్రాద్ధము, ఆమ శ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి, తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |

ఓం భూః ..ఓం భువః…ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| …..ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద……దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం …—–  గోత్రాణాం. .. ——, ——–, —— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——– గోత్రాణాం, ——-, ——— ,——-దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … —— గోత్రాణాం, ——–, ———-, ——— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం,

——–, ————, ————— దానాం, వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )

తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |

అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | ——– గోత్రాణాం…——– ,  ——— , ——— శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——— గోత్రాణాం, ———, ———, ——–దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … ——- గోత్రాణాం, ———, ——– , ———- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం,

——–, —- , ——— దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు …దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే’ తర్పణం’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ, బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య, గ్రహణ కాలము, అర్ధోదయ, మహోదయ పుణ్యకాలాలు, ఆయనములు, సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే, సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది… వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః … పితుః… మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య…. ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి…ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి…

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి

తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు…

ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.

దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి… వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ——నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , —–ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ……..ఋతౌ ( ఋతువు పేరు ) , ….. మాసే ( మాసపు పేరు ) , …..పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,….తిథౌ ( ఆనాటి తిథి పేరు )….. వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ….

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)

అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే…

( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే …..

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే…

( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)

మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.

ప్రథమ కూర్చే ..

|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే….——— గోత్రాన్. .. ———( తండ్రి పేరు ) , ………తాతయ్య పేరు , ……..ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

——– గోత్రాః , ——– , ———–, ———దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..—— గోత్రాన్ ………( తల్లి యొక్క తండ్రి ) , ……….( తల్లి తాత ), ………( తల్లి ముత్తాత ) శర్మాణః …వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,

——– గోత్రాః ,……..( తల్లి యొక్క తల్లి ) , ………( తల్లి యొక్క అవ్వ ) , ………..( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. …పితృ వర్గ తర్పణం |

౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి … అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

——– గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

——- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

——- గోత్రాన్. .. ———– శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——–గోత్రాన్. .. ——— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

——- గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

——— గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——– గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——- గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——- గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

—— గోత్రాః , ——— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

——– గోత్రాః , ———దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం

——— గోత్రాః , ———– దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

——–గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

———- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

———- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——— గోత్రాన్. .. ———— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

———-గోత్రాన్. .. ————- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

———- గోత్రాన్. .. ———— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——–గోత్రాన్. .. ———– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——— గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——– గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )

——— గోత్రాః , —— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

——–గోత్రాః , ——- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం

——- గోత్రాః , ——-దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి…

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ——దేవీదామ్—–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పెద్దమ్మ ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పిన్ని ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతులం ( మేనమామ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( మేనత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు….ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )—–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భావుకం ( బావ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ స్నుషాం ( కోడలు) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి

అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మద్గురుం ( గురువు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మదాచార్యం ( ఆచార్యుడు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం … …. …. అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి

|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |

ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః

తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే…ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి, మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి, శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి … బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )

( బ్రహ్మ యజ్ఞం విధి ప్రత్యేకముగా వ్రాయుచున్నాను )

ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

విశ్వ కర్మ జయంతి

      విశ్వకర్మ బ్రహ్మ దేవుని కుమారునిగా పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ సకల కళలకు ఆదిదేవుడు, అధిపతి. దేవలోకాలను నిర్మించిన భవన శిల్పి, వాస్తు శిల్పి, స్థపతి (ఆర్కిటెక్చర్). దేవతలకు ఆకాశాన విహరించే పుష్పక విమానాలు, ఆయుధాలు, వివిధ రకాల సువర్ణాభరణాలు మరియు పనిముట్లను సృష్టించి ఇచ్చిన రూప శిల్పి. విశ్వకర్మ భగవానుడు సమస్త హస్తకళలన్నింటికి ఆది దేవుడు మరియు విశ్వము యొక్క ప్రధాన రూపశిల్పి. విశ్వకర్మ ప్రపంచానికి దైవ యాంత్రికుడు (ఇంజనీరు).

       విశ్వకర్మ భగవానుడు చతుర్ముఖుడు. కిరీటాన్ని, సువర్ణా భరణాలను ధరించి ఎనిమిది హస్తములు కలిగి, ఒక చేతిలో నీటి బిందెను, ఒక చేత గ్రంధాన్ని, ఒక చేత ఉచ్చు, మిగిలిన హస్తాలయందు వివిథ ఆయుధాలను మరియు పనిముట్లను ధరించి దివ్య పురుషునిగా దేవతలచే కీర్తించబడే వేలుపు.

హిందూ పురాణాలన్ని విశ్వకర్మచే సృష్టించబడిన అద్భుత నిర్మాణాలతో నిండినవే. నాలుగు యుగాలన్నింటిలోను ఆయన దేవతలకు అనేక పట్టణాలు మరియు రాజభవనాలు నిర్మించి ఇచ్చిన స్థపతి, వాస్తు మరియు భవన శిల్పి. సత్య యుగంలో ఇంద్రుడు పరిపాలించే ఇంద్ర లోకాన్ని, త్రేతాయుగంలో స్వర్ణ లంకను, ద్వాపరయుగంలో ద్వారకా నగరాన్ని, కలియుగంలో హస్తినాపురాన్ని, ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన అద్భుత శిల్పి, గొప్ప స్థపతి.

     స్వర్ణ లంక: పరమేశ్వరుడు పార్వతి దేవిని పరిణయమాడిన పిదప, తాము నివసించడానికి ఒక సుందర నగరాన్ని నిర్మించి ఇవ్వవలసిందని విశ్వకర్మను కోరగా, విశ్వకర్మ బంగారముతో చేయబడిన సుందర రాజ భవనాన్ని అద్భుత కళా నైపుణ్యంతో శివునికి నిర్మించి ఇచ్చాడు. శివుడు, రావణ బ్రహ్మను తన నూతన రాజగృహ ప్రవేశ పూజలను, సంస్కారాలను నిర్వహించ వలసినదిగా కోరగా, రావణుడు శాస్త్రోక్తంగా రాజగృహ ప్రవేశ వేడుకలను నిర్వహించాడు. దానికి సంతోషించిన శివుడు ప్రతిఫలంగా రావణుడిని ఏదైనా వరం కోరుకో మన్నాడు. ఆ సుందర స్వర్ణ రాజగృహ సౌందర్యానికి అచ్చెరువొందిన రావణుడు, ఆ బంగారు నగరాన్నే తనకు బహుమతిగా ఇవ్వ వలసినదిగా కోరాడు. శివుడు రావణుడి కోరికను సమ్మతించాడు. ఆనాటి నుండి అది రావణుడి వశమై స్వర్ణ లంకగా మారిందని పురాణ ప్రతీతి.

     ద్వారక: ద్వాపర యుగంలో కృష్ణుని కోరిక మేరకు విశ్వకర్మ సుందర ద్వారకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. దీనిని రాజధానిగా చేసుకుని కృష్ణుడు ద్వారకను కర్మ భూమిగా పరిపాలించాడని శాస్త్రోక్తి.

     హస్తినాపురం: కురు పాండవ రాజధాని అయిన హస్తినాపురాన్ని కలియుగంలో విశ్వకర్మ భగవానుడు నిర్మించి ఇచ్చాడు. కురుక్షేత్రానంతరం కృష్ణుడు, ధర్మరాజును హస్తినాపురానికి పట్టాభిషక్తుడిని చేసాడని మహాభారత పురాణం తెలియజేస్తోంది.

      ఇంద్రప్రస్థం: దృతరాష్ట్రుడు పాండవులు నివసించడానికి ఖాండవప్రస్త అనే స్థలాన్ని కానుకగా ఇచ్చాడు. ధర్మరాజు తనకు ఇవ్వబడిన ఖాండవప్రస్తలో తన తమ్ములతో కలసి నివసించ సాగాడు. అపుడు కృష్ణుడు విశ్వకర్మను ఆహ్వానించి అక్కడ పాండవులకు ఒక అద్భుత రాజధాని నగరాన్ని నిర్మించి ఇవ్వవలసినదిగా కోరాడు. విశ్వకర్మ అనేక అద్భుతాలు గల అత్యంత మహత్తర మైన ఇంద్రపస్థాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇదే మయసభగా ప్రఖ్యాతి గాంచినది. మయసభ లోని విశేషాలను, వింతలను ప్రత్యేకించి ప్రస్థుతించ వలసిన అవసరం లేదు. సుయోధనుడికి మయసభలో కలిగిన వింత అనుభూతులు, అనుభవాలు జగద్విదితం.

      విశ్వకర్మ పూజ (జయంతి) : సెప్టెంబర్ 17 వ తేదీ విశ్వకర్మ జయంతి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన విశ్వకర్మ జయంతిని అన్ని ప్రాంతాల వారు ఘనంగా జరుపుకుంటారు. విశ్వకర్మ దైవ యాంత్రికుడు (ఇంజనీరు) కావడం వలన భక్తి సూచకంగా ఆ రోజున సాంకేతిక లోకం (ఇంజనీర్లు, కర్మకారులు, సాంకేతిక నిపుణులు, సూత్రగ్రాహకులు) మరియు వివిధ వృతుల వారు, పరిశ్రమల వారు విశ్వకర్మ పేరున తమ పరికరాలను, పనిముట్లను శాస్త్రోక్తంగా పూజిస్తారు. విశ్వకర్మ జయంతి రోజున కర్మాగారాల్లో విధిగా కార్మికులు విశ్వకర్మను కొలిచి తమ పరికరాలను, పనిముట్లను పూజిస్తారు. ఈ రోజున కృషీవలులు (రైతులు) విశ్వకర్మను భక్తితో కొలిచి తమ నాగళ్ళను మరియు ఇతర వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున సంతోష సూచికంగా ఆనందంతో గాలి పటాలను ఎగుర వేస్తారు. ఈ జయంతిని దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా అస్సాము, పశ్చిమ బెంగాలు, ఉత్తరాఖండ్, డెహ్రాడున్, రాజస్థాన్ రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుని భక్తి సూచకంగా కేంద్ర ప్రభుత్వము కూడా ప్రతి ఏటా అత్యన్నత ఉన్నత విశ్వకర్మ పురస్కారాలను ఉత్తమ ప్రతిభను కనబరిచిన పరిశ్రమలకు అందజేస్తోంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సెప్టెంబర్ 17 – తెలంగాణా విమోచన దినం

ఒక వాస్తవం.. కానీ అనే చరిత్రలు. ప్రపంచంలో ఏ ప్రాంతానికీ ఈ పరిస్థితి ఉండదేమో.. సరిగ్గా ఇదే రోజున అంటే 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ స్టేట్ అంతరించింది పోయింది.. ఇది వాస్తవం.

                1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారత దేశ మంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది.. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్నహైదరాబాద్ నవాబు అసఫ్ జాహీ వంశస్తుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు.. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు.. కానీ సంస్థానంలోని మెజారిటీ ప్రజలు తాము భారత దేశంలో కలవాలని కోరుకున్నారు..

ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది.. ఒకవైపు దేశ్ ముఖ్, జాగీర్దార్, దొరల దాష్టీకం, వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో రజాకార్లు (నేటి ఎంఐఎం పూర్వరూపం) చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలవతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని గురేస్తానని విర్ర వీగాడు..

ఇలాంటి పరిస్థితితో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి.. ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు ఉస్మాన్ అలీఖాన్.. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది.. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు.. ఐదు రోజుల ప్రతి ఘటన తర్వాత నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు.. కానీ కమ్యూనిస్టులు మాత్రం తమ సాయుధ పోరాటాన్ని మరి కొంత కాలం కొనసాగించారు..

ఇది మనకు ప్రధానంగా కనిపిస్తున్న వాస్తవ చరిత్ర.. కానీ రకరకాల భావజాలాల నేపథ్యంలో ఈ చరిత్రకు ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతారు.. ఇది హైదరాబాద్ పై భారత్ దురాక్రమణ అని, భారత సైన్యాలు ముస్లింలను హింసించాయని, మరి కొంత కాలం సాగి ఉంటే కమ్యూనిస్టుల సాయుధ పోరాటం విజయవంతం అయ్యేదని.. కొందరి వాదన.. దురదృష్టవశాత్తు హైదరాబాద్ పోరాట గాధ చరిత్ర పుటలకు ఎక్కలేదు.. మన పాఠ్య గ్రంధాలకు ఎక్కకపోవడం వల్ల గత రెండు తరాలకు అవగాహన ఈ చరిత్ర తెలిసే అవకాశం లేకుండాపోయింది.. హైదరాబాద్ విమోచనం అన్నా, తెలంగాణ విమోచనం అన్నా ఒకటే.. విమోచనం, విముక్తి అనే పదాల్లో పెద్దగా తేడా లేదు.. దీన్ని భూతద్దంలో శోధించాల్సిన అవసరం లేదు..

హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది 1948 సెప్టెంబర్ 17న.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనాడూ ఉత్సవాలు నిర్వహించిన పాపాన పోలేదు.. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత బొంబాయి(మహారాష్ట్ర), మైసూర్(కర్ణాటక) రాష్ట్రాల్లో కలిసిపోయిన పాత హైదరాబాద్ సంస్థాన భూభాగాలైన మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తున్నాయి.. కానీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భూభాగమైన తెలంగాణలో మాత్రం ఇక్కడి సర్కారు వేడుకలు జరిపేందుకు మొదటి నుండీ జంకుతూ వచ్చింది.. దీనికి కారణం ముస్లింలు నొచ్చుకుంటారనే భయమట.. వాస్తవానికి ఎందరో ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.. షోయబుల్లాఖాన్, ముక్దుం మొయినుద్దీన్, షేక్ బందగీ.. వీరంతా ఎవరు ముస్లింలు కాదా? హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం వల్ల సహజంగానే వారు బాధితులు అనే కోణంలో దీన్ని అర్థం చేసుకోవల్సి ఉంది..

1947 ఆగస్టు 15కి ఎంత ప్రాధాన్యత ఉందో, 1948 సెప్టెంబర్ 17కీ అంతే ప్రాధాన్యత ఉంది.. ఈ రెండు కూడా స్వాతంత్ర్య దినోత్సవాలే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ స్వాతంత్ర్యం పొందిన సందర్భాన్ని గౌరవించకపోవడం కూడా తెలంగాణ సమస్య మూలాల్లో ఒకటి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.. ఇప్పటికైనా సంకుచిత భావాలను వదిలేసి ఈ రోజును తెలుగువారంతా గౌరవించి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

మహాలయ అమావాస్య (పెత్రమావాస్య)

    మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’  నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది.

        శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.

       మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.

   ‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

బతుకమ్మ పండుగ ప్రారంభం (పెత్రమావాస్య)

తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శభాకాంక్షలు!

తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శభాకాంక్షలు!

    బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.

     ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య రోజు ‘పెత్రమవస్య’ గా లేక ‘ఎంగిలిపూవు బతుకమ్మ’గా పిలుచుకుంటూ ఆనాటి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకలు కొనసాగిస్తం. ‘మహర్నవమి’ గా నవమిరోజు ‘సద్దుల పండుగ’ పేరుతో తిరిగి పెద్ద ఎత్తున ‘బతుకమ్మ’  పేర్చుకొని వైభవంగా పండుగను జరుపుకుంటం. తీరుతీరు పూలతో, తీరైన వంటలతో తల్లిని కొలుస్తూ పాడే పాటలు, తమ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో కూడిన పాటలు ఇలా బతుకమ్మ పండుగకు పాడుకునే పాటలు ఎన్నో.

     అంతేకాదు, పండుగ ప్రారంభం నుండి తొమ్మిదవ రోజు వరకే గాకుండా, బతుకమ్మను సాగనంపే వరకు ఎన్నో సన్నివేశాలు. ఆ సన్నివేశాలకు తగిన పాటలు, ఆటలు నిజంగా చూసే కన్నులకు, వినే చెవులకూ ఆనందమే.

     పెత్రమావాస్య రోజు జరుపుకునే పండుగను ‘ఎంగిలిపూవు బతుకమ్మ’ గా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పిలుస్తం. ఈ పండుగకు ఒకరోజు ముందు నుండే పూలను సేకరించి నీళ్ళలో వేస్తం. అయితే, ఎంగిలిపూవు బతుకమ్మ లేక పెత్రమావాస్య రోజు తమ పెద్దలకు నైవేద్యాలు సమర్పిస్తం. పెత్రమావాస్య రోజు పెద్దవిగా బతుకమ్మలను పేర్చి, సంబరం చేసుకుంటూ ఆనాటి నుండి ఆ తొమ్మిది రోజులు, దుర్గా నవరావూతుల్లో ప్రతిరోజు బతుకమ్మలను పేరుస్తం. ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడటంతోపాటు ఆట అనంతరం స్త్రీలు రకరకాల వాయినాలను ఇచ్చుకుంటుంటరు.

     మొదటి రోజు వక్కలు, తులసి ఆకులు, సత్తుపిండి మొదలైనవి. రెండవ రోజు పప్పు, బెల్లం ప్రసాదంగా, మూడవ రోజు బెల్లం వేసి ఉడికించిన శనిగపప్పు, నాలుగో రోజు నానిన బియ్యం (బెల్లం కలిపిన పాలలో నానబెట్టిన బియ్యం), ఐదవ రోజు అట్లు పోసి ప్రసాదంగా పంచుకుంటాం. ఆరవ రోజు బతుకమ్మ పేర్చము, ఆడము. ఆ రోజు బతుకమ్మ అలిగిందనే విశ్వాసం ఒకటుంది.

     ఏడవ రోజు పప్పు బెల్లం, ఎనిమిదవ రోజు నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా తయారు చేసి పంచుకుంటం. గతంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలను పేర్చడం, వాయినాలు ఇచ్చుకోవడం జరిగేది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలు పేరుస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో పెత్రమావాస్య రోజు, సద్దుల బతుకమ్మ నాడు రెండు రోజులు మాత్రమే ఘనంగా జరుపుకోవడం, మధ్య రోజుల్లో బతుకమ్మ ఆడటం చూస్తున్నం.

తొమ్మిదవ రోజు నాటి బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటం. పండుగ ఉత్సాహం ఈ రోజు అధికంగా కనిపిస్తుంది. దసరా పండుగకు ముందురోజు బతుకమ్మ పండుగ. ఈ రెండు రోజులు సంతోషంగా గడపడం కోసం పల్లెను చేరే వాళ్ళతో, ఊర్లన్నీ సంబరంగా ఉంటయి. అంతేకాదు, ఎక్కువ పూలతో ఈనాటి బతుకమ్మలను చాలా పెద్దవిగా చేసి, ఐదు రకాల సద్దులు కలిపి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటం.

     బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరునుబట్టి ప్రజలు తనను ఆరాధించడానికే శక్తి ఆ రూపాన్ని కోరిందా అనిపిస్తుంది. శ్రీ చక్రోపాసనం సర్వోత్కృష్టమైన శక్త్యారాధన విధానాల్లో ఒకటి. బతుకమ్మను పేర్చేటప్పుడు కమలం షట్చక్షికం/అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం మొదపూడతారు. శ్రీ చక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటది. శ్రీ చక్రంలోని కుండలినీ యోగ విశేషశక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలుపడం జరుగుతది. ఇక్కడి స్త్రీలు గౌరమ్మను, లక్ష్మి, సరస్వతిగా భావించి పూజిస్తరు. పాటలను పాడుతుంటరు. ఎన్నో పాటలు ఉన్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నపాట ‘శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ…’

‘శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ

భారతి సతివయ్యి

బ్రహ్మ కిల్లాలివై

పార్వతిదేవివై

పరమేశురాణివై

భార్యవైతివి హరునకు గౌరమ్మా…

అలా బతుకమ్మ ఆటలో పాడుకునే మరో గౌరిపాట…

శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో

చేయబూనితివమ్మా ఉయ్యాలో

కాపాడి మమ్మేలు ఉయ్యాలో

కైలాసవాసి ఉయ్యాలో

శంకరీ పార్వతి ఉయ్యాలో

శంభూని రాణి ఉయ్యాలో

తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో

ధ్యానింతునమ్మ ఉయ్యాలో….

-అంటూ రకరకాల పూలతో, పసుపు కుంకుమలతో, నైవేద్యాలతో పూజిస్తామని తెలుపుతూ, జయము శుభము కల్గించమని వేడుకుంటరు.

బతుకమ్మ పండుగ రోజు సాయంకాలం, గ్రామంలోని గుడి ముందరగాని, ఎప్పుడు అందరూ కలిసి జరుపుకునే ఏదేని మైదానానికి చేరుకొని బతుకమ్మ ఆటను ఆడుతరు. బతుకమ్మను పెట్టి ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండిచెట్టు గాని పెట్టి, గౌరమ్మను నిల్పి పూజ చేసి ఆట మొదపూడతరు. స్త్రీలు వలయాకారంగా నిలబడి కుడివైపుకు జరుగుతూ, చప్పట్లు చరుస్తూ, వంగి లేస్తూ, ఒక స్త్రీ పాట చెబుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ పాడుతుంటరు.

      ఇలా సాగే బతుకమ్మ ఆట పాటను గమనిస్తే ఈ పండుగ ప్రయోజనమేమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాలవారు కలిసి ఆడటంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతయి. భారతదేశ ఔన్యత్యాన్ని, తెలంగాణ ప్రశస్థిని తెలిపే ఈ సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతోంది. స్త్రీల సమైక్యత, వారిలోని కళాత్మకత ఈ సందర్భంగా చక్కగా వెల్లడవుతుంది.

      కుటుంబం, అనుబంధం, చారివూతక నేపథ్యం, పౌరాణికతలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా ఆ సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతం.

బతుకమ్మ ఆట తరువాత స్త్రీలు కోలాటాలు వేస్తరు. ఈ కోలాటాలను కొన్ని చోట్ల కర్రలతో, మరికొన్ని చోట్ల ఇత్తడి, వెండి కోలలతో, మరికొన్ని ప్రాంతాలలో చేతులతో వేస్తూ ఆనందిస్తరు. ఈ కోలాటం పాటలు రసరమ్యంగా, ఆనందంగా, వినోదాత్మకంగా ఉంటయి.

   ‘చేమంతి వనములో భామలు, చెలియకుంటలోన భామలు, చెలియకుంటలోన భామలు వోలలాడినారు…’

అంటూ గొల్లభామలు – కృష్ణుని పాటలు,

   ‘రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయల వాడోయమ్మ’ అనే శివ మహత్యం తెలిపే పాటలు,

   ‘చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా ఈ వాడలోన….’ అంటూ సాగే పాటపూన్నో పాడుకుంటరు.

      అదే విధంగా గౌరిపూజ చేసి, గౌరమ్మ కళ్యాణం (పసుపు ముద్ద గౌరమ్మ) చేసి, గౌరిని అంటే బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడుకుంటరు. ఈ పండుగ వేళ చేసే ప్రతీ పని ఆట, పాట అన్నీ మానవ జీవితంలోని సన్నివేశాలను ముఖ్యంగా స్త్రీలు కోరుకునే పేరంటం, సౌభాగ్యాలను చిత్రిస్తయి.

వినవంతూ నింట్లో పుట్టి హిమవంతూ నింట్లో పెరిగి…’ అంటూ సాగే పాటలు స్త్రీల ఉద్దేశ్యాలను తేటతెల్లం చేస్త్తయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి

ఇంజినీర్స్ డే…. నవ శకానికి నాంది

     భారతదేశంలోని ప్రఖ్యాత ఇంజనీరు అయిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలను కొన్నిటిని తెలుసుకుందాం! ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లలో అతి ముఖ్యుడు. వీరి అసలు పేరు విశ్వేశ్వరాయ. కానీ వారిని అందరూ విశ్వేశ్వరయ్య అని ప్రేమగా పిలిచేవారు.

     ఈయన, 15-09-1860న, శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ అనే పుణ్యదంపతులకు, నేటి కర్ణాటక రాష్ట్రంలోని, బెంగుళూరు సమీపంలోని ముద్దినేహళ్లి అనే కుగ్రామంలో జన్మించారు. వీరిది అతి పేదకుటుంబం. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లాలోని ‘మోక్షగుండం’ గ్రామానికి చెందినవారు. ఉదర పోషణార్ధం, వారు కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి వలస వెళ్ళారు. శ్రీ విశ్వేశ్వరయ్య గారి తండ్రి గొప్ప సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. సంపాదనకోసం ఎక్కువగా ఇతర గ్రామాలను సంచరించేవారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయటం విశ్వేశ్వరయ్యగారి తల్లి మీద పడింది. ఆమె గొప్ప భక్తిపరాయణురాలు. విశ్వేశ్వరయ్యగారు తల్లి సంరక్షణలో విద్యాబుద్ధులు పొందటమే కాకుండా-ఋజువర్తన, క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకున్నారు. ఆ మహాతల్లి కొడుకును చక్కగా తీర్చిదిద్దింది.

      ఆయన బాల్యంలోనే వారి కుటుంబం చిక్ బళ్ళాపూరుకి మకాం మార్చింది. అయన ప్రాధమిక విద్య చిక్ బళ్ళాపూరులోనే జరిగింది. ఉపాధ్యాయులు అతని ప్రతిభను గుర్తించి, అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. వీరికి గణిత శాస్త్రమంటే ఎక్కువ మక్కువ. ఈ విషయాన్ని గ్రహించి శ్రీ నాదముని నాయుడు గారు అనే ఉపాధ్యాయుడు ఇతనికి గణిత శాస్త్రంలో బాగా తర్ఫీదునిచ్చి, ప్రవీణుడిని చేసారు. మేనమామగారైన శ్రీ రామయ్య గారి ఆర్ధిక సహాయంతో బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో బి. ఎ లో చేరారు. సరిగ్గా ఈ సమయంలో శ్రీ విశ్వేశ్వరయ్య గారికి పితృవియోగం కలిగింది. అప్పుడు విశ్వేశ్వరయ్య గారి వయసు 15 సంవత్సరాలే! ఈ విషాద ఘట్టం ఆయనను మానసికంగా బాగా కృంగతీసింది. తన్ను తానే ఓదార్చుకొని, గుండె నిబ్బరపరచుకొని, పిల్లలకు ట్యూషన్లు చెప్పి కష్టపడి బి. ఎ ను పూర్తిచేసారు. అదృష్ట వశాత్తు మైసూరు మహారాజావారి దృష్టిలో పడ్డారు. రాజావారి ఆర్ధిక సహాయంతో పూనాలో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసారు.

      ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత, మొదటిసారిగా బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు. ఆ సమయంలో వీరు బొంబాయిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. 1908 లో నిజాం నవాబు ఆహ్వానం మేరకు, నిజాం ప్రభుత్వంలో ఇంజనీరుగా చేరి పలు రిజర్వాయులను నిర్మించటమే కాకుండా, హైదరాబాద్ ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. నిజాం నవాబు వీరి మేధస్సును గుర్తించి 1912 లో దివాన్ గా పదోన్నతిని కల్పించారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఏ పనిని ఆయనకు ఎవరు అప్పగించినా, ఆయన ఆ పనిని ఒక తపస్సుగా చేపట్టేవారు. రోజుకు 18 గంటలు పనిచేయటం ఆయనకు నిత్యకృత్యం. ఈ క్రమశిక్షణ, పట్టుదల, నీతీనిజాయితీలే ఆయనను ప్రఖ్యాత వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

      ఆయన తన చివరిదశలో కూడా ఇలా అనేవారు, “నాకు ఈ క్రమశిక్షణ, ఋజువర్తన ప్రసాదించింది నా మాతృమూర్తే!” అని. నిజం నవాబు తనకు అప్పగించిన పని పూర్తి అయిన తరువాత, నాటి మైసూరు రాష్ట్రంలో ఉద్యోగిగా చేరారు. అన్నివిధాలా ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. వారి పనితీరుని, నిజాయితీని మెచ్చి, మైసూరు మహారాజావారు బహుమానాలతో, బిరుదులతో సత్కరింపతలచిన వేళ, విశ్వేశ్వరయ్య గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు. జీతం తప్ప మరే ఇతర ప్రతిఫలాన్ని ఆయన తన జీవితంలో ఆశించలేదు. నేటి కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజ సాగర్ డ్యాం, బృందావన్ గార్డెన్స్, మైసూరు విశ్వ విద్యాలయం మొదలగునవి ఆయన కృషి వలెనే సాధ్యపడ్డాయి. ఆయన ప్రఖ్యాత ఆర్ధికవేత్త కూడా! ఆయన మైసూరు బ్యాంకు అనే సంస్థను కూడా స్థాపించి, మధ్యతరగతి ప్రజలకు పొదుపు చేసుకోవలసిన అవసరం గురించి తెలియచేసారు.

      ఆయన ప్రతిభను గుర్తించి, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్ తో సత్కరించాయి. 1917 లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో అయన ప్రముఖ పాత్ర వహించారు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. ఆయనకు బ్రిటిషు ప్రభుత్వపు నైట్హుడ్ (సర్) బిరుదు వచ్చింది. 1955 లో భారత ప్రభుత్వం ఆయనను ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది. ప్రాంతీయ బేధాలను పట్టించుకోకుండా భారత దేశానికి అనితర సేవలందించిన ఈ మహనీయుడు, తన శతజయంతి ఉత్సవాలను పూర్తిచేసుకొని, 12-04-1962 న స్వర్గస్తులయ్యారు. ఎవరైనా అఖండ మేధావిని గురించి చెప్పేటప్పుడు, ‘ఆయన బ్రెయిన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్’అని చెప్పటం ఒక సామెతగా మారింది. ఆయన పుట్టిన రోజును ‘ఇంజనీర్స్ డే !’ గా జరుపుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుంది. పనిని, కర్తవ్యాన్ని దైవంగా భావించే శ్రీ విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర మన అందరికీ ఆదర్శనీయం! ఆచరణీయం!! నీతీనిజాయితీలతో, క్రమశిక్షణతో పనిచేయటమే ఆయనకు మనమిచ్చుకునే నివాళి!

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)