Categories
Vipra Foundation

దాశరథి రంగాచార్యులు గారి జయంతి

(ఆగస్టు 24, 1928 – జూన్ 8, 2015)

      దాశరథి రంగాచార్యులు విఖ్యాత రచయిత, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు.

జీవిత విశేషాలు : దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24 న ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరు లో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

      ఉద్యమ రంగం : నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

       తండ్రి కుటుంబ కలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.

       సాహిత్య రంగం : తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు జనపదం”లో అక్షరీకరించారు.

       వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు “చిల్లర దేవుళ్లు”లో కనిపిస్తాయి.

       నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, ఆ నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును ఆ నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆళ్వారుస్వామి ప్రణాళికను స్వీకరించినట్టు రచయిత తెలిపారు.

       తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్ ప్రోద్బలంతో ఆత్మకథ “జీవన యానం” రచించారు. అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు. వేదాలకు ప్రవేశికగా వేదాలు మానవజాతి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపాయో, నేటి యాంత్రిక నాగరికతకు వేదసాహిత్యంలో ఎటువంటి సమాధానలు ఉన్నాయో వివరిస్తూ “వేదం-జీవన నాదం” రచించారు.

ఇవే కాక ఇతర నవలలు, వ్యాసాలు, పుస్తకాలు కలిపి ఎన్నో పుటల సాహిత్యాన్ని సృష్టించారు.

       విశిష్టత, ప్రాచుర్యం : దాశరథి రంగాచార్యులు రాసిన “చిల్లర దేవుళ్లు” నవల సినిమాగా తీశారు. టి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది.

       దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ “జీవనయానం” వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.

       పురస్కారాలు, సత్కారాలు : దాశరథి రంగాచార్యుల “చిల్లర దేవుళ్లు” నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994న ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

       మరణం: డాక్టర్ దాశరథి రంగాచార్య(86) గారు అనారోగ్యానికి గురై సోమాజిగుడాలోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2015, జూన్ 8 సోమవారం రోజున ఉదయం కన్నుమూశారు.

      రచనలు : రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.

నవలలు:-

మోదుగుపూలు

చిల్లర దేవుళ్ళు

జనపథం

రానున్నది ఏది నిజం?

అమృతంగమయ

జీవనయానం

అనువాదాలు

నాలుగు వేదాల అనువాదం

ఉమ్రావ్ జాన్

జీవిత చరిత్ర రచన

శ్రీమద్రామానుజాచార్యులు

బుద్ధుని కత

శ్రీమద్రామాయణం

శ్రీ మహాభారతం

వేదం-జీవన నాదం

శతాబ్ది

       తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవచేసిన శ్రీ దాశరథి రంగాచార్యగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం..

      మహాయోధుడు, సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట యోధుడికి, బ్రాహ్మణ సంఘం నివాళులు సమర్పిస్తోంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

(1872 ఆగష్టు 23 —- 1957 మే 20)

   శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23వ తేదీన అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. చిన్నతనమంతా వల్లూరు లోనూ, నాయుడుపేట లోనూ గడిపిన ప్రకాశం చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా, ధైర్యంగా ఉండేవాడు.

     ఒకసారి స్కూల్లో సూర్యనారాయణ అనే విద్యార్ధి తిరస్కారంగా మాట్లాడి ప్రకాశాన్ని కొట్టాడు. ఆ కోపం పట్టలేక అతని ఇంగ్లీషు పుస్తకం తీసుకొని సువర్ణముఖి ఒడ్డుదాకా పారిపోయి అక్కడ ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. ఆ విషయం హెడ్మాష్టారు గారికి తెలిసి ప్రకాశంను డిస్మిస్ చేశాడు. అప్పుడు ఆ బాల ప్రకాశం కలెక్టరు వద్దకు వెళ్ళి ధైర్యంగా ఉన్నదున్నట్లు చెప్పాడు. సూర్యనారాయణ తనకన్నా పెద్దవాడు కాబట్టి పగతీర్చుకోవటానికీ పని చేశానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. నిర్భయంగా ఉన్నదున్నట్లు చెప్పినందుకు ఆ డిప్యూటీ కలెక్టరు సంతోషించి ప్రకాశంను తిరిగి స్కూలులో చేర్చుకోవాలని ఆదేశించారు.

      ప్రకాశంకి పన్నెండు సంవత్సరాలు వచ్చే సరికి తండ్రి మరణించాడు. అసలే పేద కుటుంబం. దానికి తోడు ఇంటికి పెద్ద మరణించటంతో వారి కుటుంబానికి పెద్ద దెబ్బే తగిలింది. కొన్నాళ్ళు మేనమామ గారింట్లో ఉండి, తరువాత కుటుంబం ఒంగోలుకి తరలిపోయింది. అక్కడ ప్రకాశం తల్లి చిన్న హొటలు ప్రారంభించి కుటుంబాన్ని పోషించింది. పూటకూళ్ళమ్మలంటే చులకనగా ఆ రోజుల్లో భావించినా నలుగురికి భోజనం పెట్టి జీవించడమే గౌరవ ప్రధమని ఆ తల్లి సాహసంతో బందువులు, స్నేహితులు నివ్వెరపోయేలా చేసింది. ఏ పని చేయాలన్నా ఎదుటి వారేమనుకుంటారోనని భయపడక తన అంతరాత్మ అంగీకరిస్తే ఆ పని పూర్తి చేయాలనే అలవాటు ఆమె నుంచి ప్రకాశం పుణికిచ్చుపుకున్నాడు.

      ఒంగోలు మిషన్ స్కూలులో ఉపాధ్యాయులు శ్రీహనుమంత రావుగారు ప్రకాశంను ఎంతో అభిమానిస్తూండేవారు. అతనిలోని ధైర్యం నిజాయితీ ఆయనను ఆకట్టుకున్నాయి. ఆయన, అతని చదువు విషయంలో ఎంతో శ్రద్ద చూపి, అతనికి ఆర్ధికంగా కూడా సహాయం చేస్తుండేవారు. తన “నా జీవిత యాత్ర” పుస్తకంలో హనుమంతరావుగారి గురించి ప్రస్తావిస్తూ “ఆయన నా జీవితానికి మార్గదర్శకుడు, నా అభివృద్దికి మూల కారకుడు అని కృతజ్ఞతా పూర్వకంగా విశ్వసిస్తాను” అని రాశారు ప్రకాశం.

      హనుమంతరావు గారి ప్రోత్సాహంతో బాగా చదువుకుంటూ, తెలిసిన వాళ్ళ ఇళ్ళలో వారాలు చేస్తూ చదువు పూర్తి చేసి, ప్లీడరు వృత్తి చేపట్టాడు. అనతి కాలంలోనే మంచి పేరు ప్రతిష్టలు గడించి, తరువాత ఇంగ్లాండ్ వెళ్ళి బారిష్టరు పరీక్ష పాసయి, న్యాయవాది వృత్తిలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ముఖ్యంగా పేదవారి విషయంలో ఎంతో సహాయం చేస్తూ వారి నుంచి ఎటువంటి ఫీజును తీసుకునేవాడు కాదు.

       భారతదేశంలో తెల్లవారికి వ్యతిరేకంగా 1915లో దివ్యఙ్ఞాన సమాజం స్థాపకురాలు అనిబిసెంటు ఒక ఉద్యమం ప్రారంభించారు. భారతీయులు స్వయం పరిపాలనా అధికారం పొందాలని “హొం రూలు లీగు” ను స్థాపించిన దేశ భక్తులకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రకాశం గారు లక్షలు గడిస్తున్న తన వృత్తికి తిలోదకాలు ఇచ్చి ధైర్యంగా, ఆ ఉద్యమంలో చేరి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడిని తీసుకురాగలిగారు.

      స్వాతంత్ర్యం సమరంలో నిర్వహించిన ప్రతి ఉధ్యమాలలోనూ ప్రకాశం గారు ముఖ్య పాత్ర వహించి, మహత్మాగాంధీ వంటి పెద్దల మెప్పు పొందారు. “స్వరాజ్య” పత్రికను స్థాపించి ఎంతో ధైర్యంగా నిరంకుశ చర్యలను నిర్భయంగా వెల్లడించి, తన అచంచలమైన దేశభక్తిని చాటుకున్నారు. టంగుటూరి ప్రకాశం గారి రాజకీయ జీవితం 1906 నుండి ప్రారంభమయింది. బిపిన్ చంద్రపాల్ మద్రాసు సందర్శించినపుడు జరిగిన బహిరంగ సమావేశంలో ప్రకాశం అధ్యక్షత వహించారు. 1907 లో సూరత్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రేస్ సమావేశంలో ప్రకాశం మొదటిసారిగా హజరైనారు. తరువాత రాజమండ్రి పురపాలక సంఘాద్యక్షునిగాను, మద్రాసులో మంత్రిగానూ, ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. జాతీయోద్యమంలో పాల్గొని చాలా పర్యాయాలు అరెష్టు చేయబడ్డారు. వీరిని “ఆంధ్రకేసరి” అని పిలిచారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దానికి ముఖ్యమంత్రి అయినారు.

      ఆయనను ఆంధ్రకేశరిగా ప్రజలు అంగీకరించడానికి అత్యంత ముఖ్యమైన సంఘటన ఒకటి వుంది. 1927లో తెల్లదొరలు సైమను నాయకత్వంలో కొందరిని భారతదేశం పంపారు. వారి వలన దేశానికి ఎటువంటి సహాయం ఉండదని మన నాయకులు అభిప్రాయపడి ఆ సైమన్ కమీషన్ ను బహిష్కరించాలని నిత్ణయించారు. ఆ కమీషను మద్రాసు వచ్చినప్పుడు, దేశభక్తులు శాంతియుతంగా పికెటింగ్ చేయటం ఆరంభించారు. అది చూసి రెచ్చిపోయిన పోలీసులు వారిపైన తుపాకి కాల్పులు మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రకాశం గుంపులోంచి ముందుకు వచ్చి తన చొక్కా చింపి ఎదురు చాతిని పోలీసులకు చూపి “ఇదిగో నేను సిద్దంగా ఉన్నాను కాల్చండి” అన్నాడు. ఆ సంఘటన అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పోలీసులు వెనకకు తగ్గారు. మన రాష్ట్ర అభివృద్దికి అనితర సాధ్యమైన సహాయాన్ని అందించిన ఆ మహామనిషి 1957 సంవత్సరము మే 25 వ తేదీన స్వర్గస్థులయారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

       జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. 

ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||

అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |

యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||

పుండరీకాక్ష!  పుండరీకాక్ష!  పుండరీకాక్ష!

(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)

ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.            ఓం కేశవాయ స్వాహా,

2.            ఓం నారాయణాయ స్వాహా,

3.            ఓం మాధవాయ స్వాహా,

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4.            ఓం గోవిందాయనమః,

5.            ఓం విష్ణవే నమః,

6.            ఓం మధుసూదనాయనమః,

7.            ఓం త్రివిక్రమాయనమః,

8.            ఓం వామనాయనమః,

9.            ఓం శ్రీధరాయనమః,

10.          ఓం హృషీకేశాయనమః,

11.          ఓం పద్మనాభాయనమః,

12.          ఓం దామోదరాయనమః,

13.          ఓం సంకర్షణాయనమః,

14.          ఓం వాసుదేవాయనమః,

15.          ఓం ప్రద్యుమ్నాయనమః,

16.          ఓం అనిరుద్ధాయనమః,

17.          ఓం పురుషోత్తమాయనమః,

18.          ఓం అధోక్షజాయనమః,

19.          ఓం నారసింహాయనమః,

20.          ఓం అత్యుతాయనమః,

21.          ఓం జనార్దనాయనమః,

22.          ఓం ఉపేంద్రాయనమః,

23.          ఓం హరయేనమః,

24.          ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.  అటు పిమ్మట:

భూతోచ్చాటన:

(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)

ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |  దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామం :

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను.

       బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.

       ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |  ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||

తదుపరి సంకల్పం : మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, సత్యయుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య వాయువ్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే

(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)

యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.

ప్రథమోపవీత ధారణం:

యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య

పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,

దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||

“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్

ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం

యజ్ఞోపవీతం బలమస్తు తేజః “

అని చెప్పి అని ధరించవలెను.

(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)

ద్వితీయోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి

పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

తృతీయ యజ్ఞోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి

పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట: 

తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ…

 “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. 

మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.

      తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి,

దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. 

(బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:

“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్”

తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.

జీర్ణోపవీత విసర్జనం : తిరిగి ఆచమనం చేసి

శ్లో:   ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం

విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||

శ్లో:   పవిత్రదంతా మతి జీర్ణవంతం

వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం

ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం

జీర్నోపవీతం విసృజంతు తేజః ||

శ్లో:   ఏతా వద్దిన పర్యంతం

బ్రహ్మత్వం ధారితం మయా

జీర్ణత్వాత్తే పరిత్యాగో

గచ్ఛ సూత్ర యథా సుఖం ||

     విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.

      తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి

గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. 

      ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను. 

తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను. 

నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:

       జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను….

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)   

Categories
Vipra Foundation

జంథ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి

జంథ్యాల పౌర్ణమి : –

       “శ్రావణపౌర్ణమి”నే జంథ్యాల పౌర్ణమిగా బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని చోట్ల రుషి తర్పణం అని కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి భారతీయ సంస్కృతికి చిహ్నం. యజ్ఞోపవీతధారణ అనంతరం కొబ్బరితో చేసిన స్వీట్లు అందరికీ పంచుతారు. “జంథ్యం” వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని పాటిస్తాడు.

 దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.

      ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

యజ్ఞోపవీతం పరమపవిత్రం

ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా

యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం

యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!

బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.

ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

హయగ్రీవ జయంతి :-

    సకల చరాచర సృష్టికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్టికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు. బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు.

       వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను „సృష్టిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి. ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు.

     రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

రాఖీ పౌర్ణమి : –

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,

తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’

     అంటూ బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న. రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు… సకల పూజారాధనలు అందుకునే రోజు ఈ శ్రావణ పౌర్ణమి. రాకీలతోపాటు పూజాథాలీ( పూజ పళ్ళాలు) అలంకరణ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

      శ్రావణ పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ పండుగ మూడు నాలుగు రకాలుగా ఉంది. రక్షాబంధనం (రాఖీ) పండుగ గానూ, హయగ్రీవ పూజ, వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా ఓ కథను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు ఘోర యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం. చరిత్రలో మొగలాయి చక్రవర్తుల పాలనలో ఈ రక్షాబంధనానికి నూతనమైన విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌ షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది. రక్షాబంధనానికి సంబంధించి ఇతర పురాణ కథలు కూడా ఉన్నాయి. పౌరాణిక గాథలు ఎలా ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో రాఖీ పౌర్ణమి సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకగా మారింది. ఏడాదిలో అన్నిటి కన్నా సోదరసోదరీమణుల మధ్య ప్రేమకు ఈ పర్వదినమే ప్రతీకగా నిలుస్తుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

వరలక్ష్మీ వ్రతవిధానం

     సర్వశుభాలను, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో ముత్తయిదువలంతా భక్తి ప్రపత్తులతో ఆచరిస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ. ఈ సందర్భంగా నోము నోచుకొనే మహిళల కోసం సశాస్త్రీయమైన పూజా విధానం ‘నవ్య’ పాఠకులకు ప్రత్యేకం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

(అని ముందుగా గణపతిని ధ్యానించి, తదుపరి ఆచమనం చేయాలి)

ఓం కేశవాయ స్వాహాః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)

ఓం నారాయణాయ స్వాహా ః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)

ఓం మాధవాయ స్వాహా ః (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)

ఓం గోవిందాయనమః (చేతులు కడుక్కోవాలి)

ఓం విష్ణవేనమః (కళ్లు తుడుచుకోవాలి)

ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివ్రిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః

ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః

యేతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥

(అనే శ్లోకాన్ని పఠిస్తూ నాలుగు అక్షతలను వెనక్కు వేసుకోవాలి. ఆ తరువాత ఈ కింది మంత్రం పఠిస్తూ ప్రాణాయామం చేయాలి.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః

ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్

సవితుర్వరేణ్యుం, భర్గో దేవస్య ధీమహి ధియోయోనః

ప్రచోదయాత్, ఓం మాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భవస్సురోమ్…

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య……. (శ్రీశైలానికి వ్రతం చేసేవారి ఊరు ఏ దిక్కులో ఉందో, ఆ దిక్కుని చెప్పాలి) ప్రదేశే, కృష్ణా, కావేరీ మధ్య దేశే (ఏ నదుల మధ్య ప్రాంతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి.

సొంత ఇల్లయితే స్వగృహే అని అద్దె ఇల్లయితే శోభనగృహే అని చెప్పాలి) సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిధౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ నందన నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్ల పక్షే నవమ్యాం, లక్ష్మీ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ, శ్రీమత్యాః …. గోత్రస్య…. శర్మణః ధర్మపత్నీ శ్రీమతీ… గోత్రవతీ (గోత్రంపేరు)… నామధేయవతి (పేరు చెప్పుకోవాలి). అస్మాకం సహకుటుంబానాం క్షేమ,స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్యర్ధం, ధర్మార్ధ, కామమోక్ష చతుర్విధ ఫల పురషార్ధ సిద్యర్ధం, సత్సంతాన సౌభాగ్య ఫలాప్రాప్త్యర్ధం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య, శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన మావాహనాది షోషశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్య వేలుతో నీటిని తాకాలి).

కలశపూజ:

(పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ తీసుకుని అందులో నీరు పోసి, అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడు వైపులా గంధాన్ని రాసి, కుంకుమను పెట్టాలి. ఈ విధంగా చేసి, దానిపై కుడిచేయినుంచి కింది శ్లోకాన్ని పఠించాలి)

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః

కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యములపైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి.

(గమనిక: పూజలో అవసరమైన సమయంలో ఈ కలశంలోని నీటినే ఉపయోగించాలి. ఆచమనం చేసేందుకు ఉపయోగించే జలాన్ని పూజకు ఉపయోగించరాదు. అలాగే కలశంలోని నీటిని ఆచమనమునకు ఉపయోగించరాదు. ఏ వ్రతంలోనైనా, పూజలోనైనా ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం) కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పైనుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి.

గణపతి పూజ:

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

(అనంతరం స్వామివారి ముందు పండ్లుగాని బెల్లాన్ని గాని నైవేద్యంగా ఉంచాలి)

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్… (నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓం వ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనం సమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

వరలక్ష్మీ పూజ ప్రారంభం

ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహేసురాసురనమస్క­ృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి)

ఆవాహనం:

సర్వమంగళమాంగల్యే విష్ణువక్షస్థలాలయే అవహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామి

(కలశం ముందు అక్షతలు వేయాలి)

సింహాసనం:

సూర్యాయుతాని భస్పూర్తేస్ఫుర ద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థియతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)

అర్ఘ్యం:

శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామితేదేవీ గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్య పాత్రలో వేయాలి)

పాద్యం:

సువాసితజలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

ఆచమనీయం:

సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

పంచామృత స్నానం:

పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)

శుద్ధోదక స్నానం:

గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం శుద్ధోదకస్నాన మిదం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి) స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. (అర్ఘ్య పాత్రలో ఓ ఉద్ధరిణెడు నీటిని వేయాలి)

వస్త్రం:

సురార్చితాంఘ్రియుగళేదుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)

ఆభరణం:

కేయూరకంకణే దివ్యేహారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి. (పుష్పాలు ఉంచాలి)

ఉపవీతం:

తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం మిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి (దూదితో చేసిన సూత్రం చివర్లలో గంధం రాసి కలశానికి హారంలా అంటించాలి)

గంధం:

కర్పూరాగరు కస్తూరీరోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి (కలశంపై గంధం చిలకరించాలి)

అక్షతలు:

అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి (అక్షత లు వేయాలి)

పుష్పం:

మల్లికా జాజి కుసుమై శ్చంపకై ర్వకుళై స్తథా శతపత్రైశ్చరైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి (అమ్మవారి కలశం ముందు పుష్పం ఉంచాలి)

అధాంగపూజ:

(పుష్పాలు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి) చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయై నమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః – నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠం పూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీ వరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి. (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ఓం ప్రకృత్యై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః, ఓం బుద్ధ్యె నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీపాయై నమః, ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం లోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మ గంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్ర రూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యె నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యై నమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశగతానందాయై నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం జయాయై నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యై నమః, ఓం నారాయణసీమాశ్రితాయై నమః, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః

ధూపం:

దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణతమ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రపయామి ధూపందర్శయామి (అగరువత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి చూపాలి)

దీపం:

ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. (దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచె నీటిని అర్ఘ్య పాత్రలో వేయాలి)

నైవేద్యం:

నైవేద్యం షడ్రషోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్య పాత్రలో ఉంచాలి)

పానీయం:

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి (ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్య పాత్రలో ఉంచాలి)

తాంబూలం:

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి, (పండు, పుష్పంతో కూడిన తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి)

నీరాజనం:

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్తితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః నీరాజనం సమర్పయామి (ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి)

మంత్రపుష్పం:

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః మంత్రపుష్పం సమర్పయామి (పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)

ప్రదక్షిణ:

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవం త్రాహిమాం కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షిణలు చేయాలి)

నమస్కారం:

నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి (అమ్మవారికి అక్షతలు వేసి నమస్కరించాలి)

తోరపూజ:

తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ కింది విధంగా పూజించాలి. కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి, లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీయై నమః – నవమ గ్రంథిం పూజయామి.

కింది శ్లోకములు చదువుతూ తోరము కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వాయనం ఇవ్వడం

వాయనం ఇచ్చేటప్పుడు ఈ కింది శ్లోకం చదవాలి.

ఏవం సంపూజ్యకళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః

దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే

ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వైదదాతిచ

ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమోనమః

(వాయనం ఇచ్చాక కథ చదివి అక్షతలు శిరసుపై వేసుకోవాలి)

కావలసిన వస్తువులు

పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెవస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధానకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి.

పూజకు సిద్ధంగా…

వరలక్ష్మీ వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో ఉంటే అక్కడ అందంగా అమర్చుకోవాలి. పూజా సామగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

తోరం ఎలా తయారు చేసుకోవాలి?

తెల్లటి దారమును ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారమును ఉపయోగించి, ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరాలను తయారుచేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

శుభప్రదం వరలక్ష్మీవ్రతం

శ్రీ వరలక్ష్మీవ్రత కథా ప్రారంభం

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందసమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది.

అందుకా త్రినేత్రుడు ..దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి…. దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతల్లో ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్త్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి చాలా సంతోషించింది. హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది… అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.

చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకుంది. (శక్తికొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

లక్ష్మీ కటాక్షం

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లు ఘల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితలయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తువాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేస్తూ సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి, సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా… శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.

ఈ కథ విని, అక్షతలు శిరసుపై ఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువలకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

పుత్రాద ఏకాదశి /పవిత్రోపన ఏకాదశి

       శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి/ పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాదపడుతుంటే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది. అందుకీ దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు .

శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురానా గాథ

     పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు .అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తీ శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు కాని రాజ వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను,పండితులను సంప్రదించిన తన సమస్య కు దారి దొరకలేదు .

     చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని వెళ్లి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న బాదలు ఏంటి ,నువ్వు చేసిన పాపా కర్మములు ఏంటి అని అడగగా అప్పుడు తన పుర్వహృత్తంతం అంత చెప్పగా దయర్తా హృదయడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పదను అని చెప్పి శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు .

   పూర్వం రాజు వర్తక వ్యపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్లి అక్కడే నిల్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవు ని నిల్లలోకి తోసేసాడట దానికి పాపా పరిహారంగా రాజు గారికి సంతానం కలుగలేదు అని కథనం .

మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు . ఆ తరువాత రాజు గారి మంచి సంతానం కలుగుతుంది . దానికి రాజు చాల సంతోషపడి బ్రాహ్మణులకు,రాజ్యంలో ఉన్న ప్రజలకు చాల దాన ధర్మాలు చేసాడట .

     శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపా లు అన్ని హరిస్తాయని,మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

పంద్రాగస్టు

(స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు – హ్యేపీ ఇండిపెండెన్స్ డే)

     నేడు ఈరోజు మనదేశం మనదైనది.. సత్యాహింసల బలమే త్యాగధనుల హృదయ బలమై, జనబలమై, ఘన ఫలమై… మనదేశం మనదైనది. తలవంపులు తొలగిపోయి, తెగతెంపులు జరిగిపోయి, వెలిగుంపులు వెడలిపోయిన సుదినం నేడే..!

     ఎందరో మహానుభావుల కలల పంటలు, మరెందరో అమరవీరుల త్యాగ ఫలాలకు రూపమైన భారతావని స్వాతంత్ర్య దినోత్సవం నేడే. సకల మానవాళి సంబరాలు అంబరాన్ని తాకే మహోజ్వల దినం నేడే…!

     స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన… గగనంలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాయే, భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది. ఈ జెండాలోని కాషాయం రంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా భాసిల్లుతోంది.

      ఇక మూడవదైన ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపదమీద ఆధారపడి ఉన్నాయో… ఆ పచ్చటి చెట్లకు గుర్తు. జెండాలోని అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతిఒక్కరి నియమాలు కావాలి.

     చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవముండే ప్రతిచోటా చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇకమీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలనేదాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే చక్రం… శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం.

     ఇదిలా ఉంటే… కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు.. తెలుపు శాంతికి, సత్యానికి… ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలుగా భావిస్తారనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.

“ఝండా ఊంఛా రహే హమారా…” అనే పాటను వినని వారుండరు. ఆ పాటను వింటుంటే భారతీయ హృదయాలు పొంగిపోతాయి. మువ్వన్నెల జెండా రెప రెపలాడుతుంటే చిన్న చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళ గుండెలూ సంతోషంతో నిండిపోతాయి. గర్వంగా తలఎత్తి సెల్యూట్‌ చేయాలనిపిస్తుంది.

      భారతదేశంలోని ఏ మూలైనా 15 ఆగస్టు, 26 జనవరి నాడు -మువ్వన్నెల జెండా ఎగురవేసి పండుగ చేసుకుంటారు. సంబరాలు జరుపుకుంటారు. ఆ రెండు రోజులూ ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించుకొని, స్వతంత్ర సముపార్జనలో ప్రాణాలొడ్డిన మహనీయులను స్మరించుకుంటారు.

కాగా… ఆధునిక పోకడలో ఎందరో మన జాతీయ జెండా ప్రాముఖ్యాన్ని మరిచిపోతున్నారు. జాతీయ పతాకమే కాదు జాతీయ గీతాన్ని కూడా పాడటం లేదు. ఎవరయినా సరే జాతీయ జెండాను అవమానపరిస్తే కఠిన శిక్ష విధించబడుతుంది. మన రాజ్యాంగంలోని 42వ అధికరణం 4 (ఎ) సవరణ ప్రకారం విధిగా ప్రతిపౌరుడూ భారత జాతీయ జెండాను గౌరవించాలి.

మనం మన భవిష్యత్తరాలకు జాతీయ గీతం, జాతీయ పతాకం విశిష్టతను ప్రాముఖ్యతను చెప్పలేకపోతే, ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సముపార్జించిన స్వాతంత్య్రానికి విలువలేకుండా పోతుంది.

అందుకే మనం మన జెండా గురించి, జెండా పండుగ గురించి తెలుసుకోవాల్సి ఉంది. మరొకరికి తెలియచెప్పాల్సిన అవసరమూ ఉంది.

ప్రతిమనిషికి పేరు (గుర్తింపు) అన్నట్లే, దేశానికి గుర్తింపు ఉంటుంది. అదే దేశానికి తొలి ఆనవాలు (గుర్తు) అదే జాతీయ పతాకం అంటే ఆ దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు… వారి సార్వభౌమ అధికారం ఎవరికీ తలవంచని దేశాధ్యక్షుడైనా జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే…!

ఏది ఏమైనా నేడు చాలామంది జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలు పాటించడం లేదన్నది నగ్నసత్యం. చాలామంది అధికారులు, రాజకీయ నాయకులు సైతం తమ కార్లకు పెట్టుకునే జాతీయ పతాకం దుమ్ముకొట్టుకుపోతున్నా పట్టించుకోరు. మరి కొంతమందయితే, జాతీయ జెండాను క్రింద వేసుకొని మరీ కూర్చుంటున్నారు. ఇలా మన జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచిన వారిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి శిక్ష పడేట్లు చేయాలి. మన జాతి గౌరవానికి జాతి ఐకమత్యానికి, సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకాన్ని మనం విధిగా గౌరవించాలన్న విషయం మరువకూడదు. ప్రభుత్వాధికారులు ఈ నిజాన్ని గ్రహించి, ఇప్పటికయినా జాతీయ జెండాను అవమానించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే రేపటి పౌరులైన నేటి బాలలకు జాతీయ పతాకం విశిష్టతను తెలియజెప్పిన వారమౌతాం…!

భారత్ మాతా కి జై, వందేమాతరం,  జై హింద్…   జై భారత్….

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

నాగపంచమి(గరుడ పంచమి)

        సనాతన మన భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దక్షిణ భారత దేశంలో ఆషాఢం తో గ్రీష్మం సమాప్తమై, శ్రావణంతో వర్ష ఋతువు ప్రారంభమౌతుంది. వర్షాలు విస్తారంగా పడతాయి. కృషీవలుల వ్యవసాయ కార్య క్రమములు, తీవ్ర తరమౌతాయి. అంతవరకు,చల్లదనముకొరకు, పుట్టలలో దాగున్న సర్పసంతతి,తమ ఆహారాన్వేషణకొరకు బయటకువచ్చి, పొలాలలో, సంచరించు ఎలుకలు, కప్పలకొరకు విచచచలవిడిగా సంచరించ ప్రారంభిస్తాయి.

అర్ధరాత్రి, అపరాత్రి, పొలాలలో సంచరించు, కృషీవలులకు వానివలన ప్రాణ హాని కలుగవచ్చును. ఇటువంటి ప్రమాదములనప ను నివారిచుటకొరకు, విజ్ఞులై మనపెద్దలు, ఈ శ్రావణ మాసంలో నువ్వులు, బెల్లం, చలిమిడి (బియ్యంపిండితోచేసిన తీపి పదార్థం) పాలతో కలిపి చేలగట్టులయందున్న పుట్టలలో సమర్పించమని చెప్పినారు.ఈ కార్య క్రమములో ఆధ్యాత్మికతనుకూడా జోడించుటవలన,జనులకు భక్తి, భయము ఏర్పడినాయి. పాములు పాలుతాగవనునది జగమెరిగినసత్యము. మరి పుట్టలలో పాలు, ఇతరపదార్థములు ఎందుకువేయుచున్నారనగా ఆపిండిపదార్థములు, నూవులు, బెల్లం ఇత్యాదులను తినుటకు, చిన్నక్రిములు, చీమలు, వాటిని తినుటకు, కప్పలుమరియు ఎలుకలు ఆపుట్టల బొరియలలో ప్రవేసించునుగదా, సర్ప సంతతికి బొరియలనుండి బయటికిరాకుండగనే, వాటిస్థానమందు, తమ ఆహారము లభించుటవలన,ప్రశాంతముగా తమ ఆహారమునారగించున వగుచున్నవి. ఇందువలన వాటికి ప్రాణహాని, వాటివలన జనుల ప్రాణ హాని, రెండూ నివారింపబడినవి. ఎలుకలను సర్పములారగించుటవలన, రైతులకు పంట హానికూడా కొంత తగ్గును.

        అందువలన నిజమై న పుట్టలయందు పాలుపోయుటవలన ప్రయోజనమున్నదికాని, రాతి ప్రతిమలకు పాలుపోయుటవలన కేవలంసాంకేతికమే కాని ప్రయోజనము నెరవేరదు. దేవస్థాములందు ఇట్టుల చేయుటవలన, క్రిమి కీటకాదుల కొరకు, కప్పలు, ఎలుకలు, వాటి నారగించుటకు.సర్ప సంతతి ఆలయములలో ప్రవేసించవచ్చును.

సర్పములవలన మనుష్యులకు జరుగు హానికన్నా, మనుష్యలవలన సర్ప సంతతికి ఎక్కువ కీడు జరుగుచున్నది.మనిషికి కరుస్తుందని భయము, మరి వాటికో మనుష్యులనుండి తప్పించుకొని పారిపోవుటయే ప్రాణ సంకటము.

సమస్త సర్ప సంతతి తమ నెలవులందు, నిర్భయముగా జీవిచుగాక.

అందుకే ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ

” తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో”

యజుర్వేద మంత్రం.

ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను, యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll

భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు

మరలా మరలా నమస్కారము.

” ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l

సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll

శుభంభవతు

శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి

ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః

పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ

విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ”

       ఓ పార్వతీ దేవి… శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదే. వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

శ్రావణ మంగళవారం “మంగళ గౌరీవ్రతం”

విధానం : శ్రావణ మంగళవారం వ్రతం నిర్వహించుకున్న మొదటి సంవత్సరంలో అయిదుగురు ముత్తయిదులను పిలిచి, వారికి పసుపురాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ, కొబ్బరి వగైరా వంటివి వాయనాలు ఇవ్వాలి. ఇదే విధంగా రెండవసంవత్సరంలో పదిమంది ముత్తయిదువులని, మూడవ సంవత్సరంలో పదిహేనుమంది, నాలుగోసంవత్సరంలో ఇరవైమంది, అయిదవ సంవత్సరంలో ఇరవైఅయిదుమంది ముత్తయిదువులను పిలిచి వాయనాలివ్వాలి. అయిదేళ్ల తరువాత ఉద్యాపన చేయాలి.

ఉద్యాపన : అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి, మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

       శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.  అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.

వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.

వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)

ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.

ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.

పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళగౌరీ వ్రత విధానం :

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః     మధుసూదనాయ నమః    త్రివిక్రమాయ నమః    వామనాయ నమః     శ్రీధరాయ నమః

ఋషీకేశాయ నమః     పద్మనాభాయ నమః   దామోదరాయ నమః     సంకర్షణాయ నమః   వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః   అనిరుద్దాయ నమః    పురుషోత్తమాయ నమః   అధోక్షజాయ నమః    నారసింహాయ నమః

అచ్యుతాయ నమః    జనార్ధనాయ నమః    ఉపేంద్రాయ నమః      హరయే నమః     శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః     శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః

శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః     శ్రీ శచిపురంధరాభ్యం నమః

శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః    శ్రీ  సీతారామాభ్యం నమః

సర్వేభ్యో దేవేభ్యో నమః   మాతృభ్యో నమః,  పితృభ్యో నమః

       ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే ,  శుభ తిథౌ, భౌమ వాసరే,  శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే, అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య, శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ :

       తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం  –  శ్రీ మంగళ గౌరీ ధ్యానమ్ :

ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి

ఓం శ్రీ  గౌరీ రత్నసింహాసనం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ  అర్జ్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి

ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి

అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.

రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.

తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..

ఆ తరువాత ఈ విధంగా చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.

ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

శ్రీ మంగళ గౌరీ  వ్రతకథ : పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

శ్రావణ మాసం ప్రాముఖ్యత

      శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయన్తి  ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా,  చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

శ్రావణ సోమవారం

      ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు

శ్రావణ మంగళవారం

      శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక  ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని  నోచుకొంటారు.

శ్రావణ శుక్రవారం

      ఈ మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని  షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అయిదవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని పెద్దలు చెప్పారు. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి.  లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం 

శ్రావణ శనివారాలు

      ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. 

శ్రావణ పౌర్ణమి

      శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి .

      జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు

రక్షా బంధనం

      శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక, కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటి నుండి వస్తున్నా సంప్రదాయమేనని తెలుస్తోంది.

              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)