Categories
Vipra Foundation

మహర్నవమి

       ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ”మహర్నవమి” అంటారు. ”దుర్గాష్టమి”, ”విజయదశమి” లాగే ”మహర్నవమి” కూడా అమ్మవారికి విశేషమైన రోజు.

       మహర్నవమి నాడు అమ్మవారిని ”అపరాజిత”గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు.

       మహార్నవమి రోజున ఇతర పిండివంటలతోబాటు చెరుకుగడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ”కన్యా పూజ” నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు.

       అమ్మవారికి అభిషేకం చేసి, ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు. ఈ రోజున కుంకుమ పూజ చేయించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.

       తెలంగాణా ప్రాంతాల్లో మహర్నవమి నాడు బతుకమ్మ పూజ చేసి సరస్వతీ ఉద్యాపన చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ చేయగా కేరళ రాష్ట్రంలో మాత్రం మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. నవరాత్రులు ముఖ్యంగా మహర్నవమి సందర్భంగా మైసూరు మహారాజా ప్యాలెస్ ను మహాద్భుతంగా అలంకరిస్తారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దుర్గాష్టమి ఆయుధ పూజ

విశిష్ఠత: దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత “మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు.

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమః” అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.ఈ దినం “ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.

అలాగే నవరాత్రులలో ప్రతీ దినం “సుహాసినీ పూజ” చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు. తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.

//విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం

కన్యాభిః కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం

హస్తైశ్చక్రగదాసిఖే్టి విసిఖాంశ్చాపం గుణం తర్జనీం

బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే//          

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఉండ్రాళ్ల తద్ది

     భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్ది అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్లతద్ది స్త్రీల పండుగ. స్త్రీలలోనూ కన్నెల, పడుచుల పండుగ. మగ పిల్లలు చిన్నవారు కూడా ఇందులో పాల్గొంటారు. తలంటు స్నానం అయిన తర్వాత చేతివేళ్లకు కాలివేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారు జామున గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసును, గట్టి పెరుగుతో భోజనం చేసి తాంబూలం వేసుకుని, ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం వాటితో కాలక్షేపం చేస్తారు. గోరింట ఈ పర్వ కలాపంలో ప్రవేశం పొందింది. ఆషాఢమాసంలో ఏదో ఒక రోజున, ఉండ్రాళ్ల తద్దికి, అట్టతద్దికి గోరింటాకు పెట్టుకోవడం మనలో ఒక ఆచారంగా ఉంటూ ఉంది. గోరింట ఆకును బాగా నూరి ఆడపిల్లలు, స్త్రీలు చేతి గోళ్లకు, పారాణిగా పాదాలకు పెట్టుకుంటారు. గోరింటాకు సంస్కృతంలో నఖరంజని అని పేరు. రంగును కలిగించేది అని అర్థం. ఈ గోరింటాకు గురించి స్త్రీలకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. స్త్రీలు అరికాళ్లలో గోరింటాకు నూరిన ముద్దతో చుక్కపెట్టుకుంటారు. అది బాగా పట్టినట్లయితే ఆ స్త్రీకి తరగని అయిదవతనం. గోరింటాకు బాగా పండితే ఆ పడుచును భర్త బాగా ప్రేమిస్తాడు. ‘ప్రేమ కలవారి కంటు గోరింట’ అనే నానుడి.

      గోరింట మంచి మూలిక. దాని ఆకులు, పట్ట, పూవులు, గింజలు ఓషధీగుణం కలవి. గోరింటలో ఒకవిధమైన చిరువిషం కలదు. హన్నొటాన్నిక్‌ ఆసిడ్‌ కలదు. పూవులతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు. గింజలో చమురు ఉంది.

ఉండ్రాళ్ల తద్ది

      ఉండ్రాళ్లు తైల పక్వము కాక కేవలం ఆవిరి మీద ఉడికే పిండివంట. భాద్రపద మాసంలో వచ్చే మూడు పండుగలకు ప్రత్యేకం ఉండ్రాళ్లే నివేదన వస్తువులుగా ఉండడం మనం గమనించాలి. శివుణ్ణి పతిగా కోరి పార్వతి సాగించిన తపస్సుకు మోదితుడై శివుడు ప్రత్యక్షమైన రోజు అని ధర్మసింధువు. తెలుగు వారికి ఇది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది. పదహారు బిళ్ల కుడుములు వండి పూజ చేసి నైవేద్యం పెట్టడం అప్పటి ఆచారం. ఇప్పటికీ అనుకరణలో వ్రత నిష్ఠ విధానాలు చెప్పే షోడశోమా వ్రతం తెలుగులో ఈ పేరు కూర్చుకున్నది. రాజస్తాన్‌, మహారాష్ట్ర, మాళవ, ఉత్కళ దేశాల్లో ఆ రోజు నైవేద్యం ఆవిరి కుడుములే.

       ఉండ్రాళ్లు ఆవిరి కుడుములు సేవించడం ఆరోగ్య దృష్ట్యా వరణీయమన్నమాట. ఉండ్రాళ్లను సంస్కృతంలో మోదకాలు అంటారు. వరి బియ్యపు పిండిని ముందు నీళ్లలో ఉడికిస్తారు. ఈ ఉడికే పిండిలో కొద్దిగా బొబ్బర్లు కాని, శనగ పప్పుకాని వేయం కూడా కద్దు. ఉడికిన ఈ పిండిని ముద్దలుగా చేసి నీటి ఆవిరి మీద గుడ్డ కట్టి కాని ఎండు గడ్డిగాని చుట్టి కాని ఇడ్లీల మాదిరిగా వండుతారు.

      మేహశాంతిని చేయడంలో ఈ పిండి వంట పెట్టింది పేరు. బలకరమైనదే అయినా దీని వద్ద గురుత్వం చేసే గుణం కూడా ఉంది. కాబట్టి విస్తరించి వాడకూడదు. వరి పిండితో మినపపిండి కూడా మిళాపు చేసి ఇడ్లీలు, పొట్టింకులు మొదలైనవి చేస్తారు. అవి ఉండ్రాళ్ల భిన్న స్వరూపాలు అనుకోవచ్చు. ఉండ్రాళ్లను పాలలో నానవేస్తే పాల ఉండ్రాళ్లు, అవుతాయి. పాల ఉండ్రాళ్లు వీర్యపుష్టిని ఇస్తాయి. భోగినాడు తలంటు, గోరింటాకు పెట్టుకొనుట, మరునాడు తెల్లవారు జామున ఆడుకోవడం, పగలు పుష్పాచయము, పత్రాపచయము కోసం తోటల వెంట తిరుగుట ఊయల ఊగుట విహార విధులను ఈ పండుగ రోజున చేసే కార్యక్రమాలు. ఉండ్రాళ్ల తద్దినాడు ఉండ్రాళ్లు పగలు పూజ అయ్యాక తినేవి. ఈ రోజు తెల్లవారు జామున తినే పదార్థాలు కొన్ని అనుచానంగా వస్తూ ఉన్నది.

      వెల్లుల్లి వేసిన గోంగూర పచ్చడి, నీరుల్లి పాయల పులుసు, నువ్వుల పొడి, పెరుగు అన్నంతో భోజనం చేయాలి. ఆ మీద అవి అరిగేటట్లు ఆడుకోవాలి. ఇక ఈ పండుగ సందర్భంలో తినే గోంగూర, నువ్వులు, ఉల్లిపాయ ఓషధీగుణాలు కూడా తెలుసుకోతగ్గవే. ఇక ఊయల ఊగడం మనోల్లాసకరమైన క్రీడలలో ఊయల ఊగడం ఒకటి. ప్రతివారి పసితనం అయిదారు మాసాల వరకు విశేషకాలం ఊయలలోనే గడుస్తుంది. అది వాతహరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాగా పెద్దవారు

కూడా అప్పుడప్పుడు ఊయల ఊగడం మంచింది. ఊయల ఊగడం ఉల్లాసంగా ఉత్సాహంగా వుంటుంది.

ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు. ఉండ్రాళ్లు వండుతారు. దేవికి అవి నైవేద్యం పెడతారు. భోజనంతో పాటు వానిని తింటారు. పిండివంటల్ని పట్టి ఏర్పడ్డ పండుగలలో ఇది ఒకటి. భాద్రపదశుద్ధ చవితి వినాయక చవితినాటి పిండివంట కూడా ఉండ్రాళ్లు. వినాయక చవితి వెళ్లిన పదిహేను రోజులకే ఉండ్రాళ్ల తద్ది. ఉండ్రాళ్లు ఆవిరి కుడుముల సేవనం ఈ కాలపు ఆరోగ్యానికి మంచిది. అజీర్ణం చేయకుండా బలాన్ని కలిగిస్తాయి. మేహ, పైత్య సంబంధరోగాలను ఉండ్రాళ్లు పొట్టెంకలు, జిల్లేడు కాయలు శమింపజేసాయి. ఉండ్రాళ్ల తదియ వ్రత చర్యలో ఐదుగురు ముత్తయిదులకు తలంటిపోసి గోరింటాకు ఇవ్వటం ముఖ్యంగా చెప్పబడింది. ఇది పొద్దుపోయే సమయాన చేస్తారు.

       కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి” అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.

     ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ‘‘ఉండ్రాళ్లతద్ది” అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. ‘‘నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటుచే” మని అడిగింది.

      ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది.

      చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న ఉండ్రాళ్లను చేసి, నైవేద్యం పెట్టింది. అయిదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంత.. ఐదేళ్లు నిర్వఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పితృ తర్పణము – విధానము

శ్రీః శ్రీమతే వేద పురుషాయ నమః

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు, తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి, బ్రాహ్మణుడు దొరకకున్ననూ, ఎవరికి వారు తర్పణము చేయవచ్చును. (తర్పణము అర్థము, అవసరము, ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను) ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ‘పార్వణ శ్రాద్ధం ’ లేక  ‘చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు … తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు… దర్శ శ్రాద్ధము, ఆమ శ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి, తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |

ఓం భూః ..ఓం భువః…ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| …..ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద……దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం …—–  గోత్రాణాం. .. ——, ——–, —— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——– గోత్రాణాం, ——-, ——— ,——-దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … —— గోత్రాణాం, ——–, ———-, ——— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం,

——–, ————, ————— దానాం, వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )

తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |

అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | ——– గోత్రాణాం…——– ,  ——— , ——— శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——— గోత్రాణాం, ———, ———, ——–దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … ——- గోత్రాణాం, ———, ——– , ———- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం,

——–, —- , ——— దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు …దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే’ తర్పణం’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ, బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య, గ్రహణ కాలము, అర్ధోదయ, మహోదయ పుణ్యకాలాలు, ఆయనములు, సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే, సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది… వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః … పితుః… మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య…. ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి…ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి…

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి

తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు…

ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.

దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి… వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ——నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , —–ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ……..ఋతౌ ( ఋతువు పేరు ) , ….. మాసే ( మాసపు పేరు ) , …..పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,….తిథౌ ( ఆనాటి తిథి పేరు )….. వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ….

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)

అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే…

( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే …..

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే…

( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)

మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.

ప్రథమ కూర్చే ..

|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే….——— గోత్రాన్. .. ———( తండ్రి పేరు ) , ………తాతయ్య పేరు , ……..ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

——– గోత్రాః , ——– , ———–, ———దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..—— గోత్రాన్ ………( తల్లి యొక్క తండ్రి ) , ……….( తల్లి తాత ), ………( తల్లి ముత్తాత ) శర్మాణః …వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,

——– గోత్రాః ,……..( తల్లి యొక్క తల్లి ) , ………( తల్లి యొక్క అవ్వ ) , ………..( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. …పితృ వర్గ తర్పణం |

౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి … అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

——– గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

——- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

——- గోత్రాన్. .. ———– శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——–గోత్రాన్. .. ——— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

——- గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

——— గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——– గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——- గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——- గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

—— గోత్రాః , ——— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

——– గోత్రాః , ———దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం

——— గోత్రాః , ———– దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

——–గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

———- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

———- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——— గోత్రాన్. .. ———— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

———-గోత్రాన్. .. ————- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

———- గోత్రాన్. .. ———— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——–గోత్రాన్. .. ———– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——— గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——– గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )

——— గోత్రాః , —— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

——–గోత్రాః , ——- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం

——- గోత్రాః , ——-దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి…

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ——దేవీదామ్—–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ——శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పెద్దమ్మ ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( పిన్ని ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతులం ( మేనమామ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

తత్పత్నీం ( మేనత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.

( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు….ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )—–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

తద్భర్తారమ్( ఆమె భర్త )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ భావుకం ( బావ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ స్నుషాం ( కోడలు) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) —–దేవీదాం / కవీదాం ——–గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి

అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మద్గురుం ( గురువు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మదాచార్యం ( ఆచార్యుడు )—–శర్మాణం—గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం … …. …. అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి

|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |

ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః

తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే…ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి, మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి, శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి … బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )

( బ్రహ్మ యజ్ఞం విధి ప్రత్యేకముగా వ్రాయుచున్నాను )

ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం)

     భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.

      ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం – వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే |

యాచిత్వాపి నరః కుర్యాత్ పితౄణాం తన్మహాలయం ||

మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి.

      అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు. గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.

      దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, ఆ పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. ఆ విధంగా సమీపంలో ఉన్న ఏ ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, ఆ నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.

      ఈ విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే… కర్ణా… ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఏ ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు ఓ అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.

      అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.

      కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.

      ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో…. ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.

      ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, ఆ రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, ఆ యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు. ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు… సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, ఆ వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.

శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ |

అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్ ||

ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః |

కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై ||

భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే |

అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం ||

క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః |

దరిద్రోరోదనం కుర్యాత్ ఏవంకాననభూమిషు ||

తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః |

హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః ||

      పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు.  భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు.  మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు.

    — శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..

-వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఉమా మహేశ్వర వ్రతం

గణపతిపూజ : ఓం శ్రీ గురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్,

దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!  సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|  అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||  యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం|| 

 శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|  తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|  పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|  ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|  లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||  సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|  శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|  ఉమా మహేశ్వరాభ్యాం  నమః|  వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః|  అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః|  సర్వేభ్యోమహాజనేభ్యో నమః| 

ఆచ్యమ్య:

ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః,  మాధవాయ స్వాహాః,  గోవిందాయ నమః,  విష్ణవే నమః,  మధుసూదనాయ నమః,  త్రివిక్రమాయ నమః,  వామనాయ నమః,  శ్రీధరాయ నమః,  హృషీకేశాయ  నమః,  పద్మనాభాయ నమః,  దామోదరాయ నమః,  సంకర్షణాయ నమః,  వాసుదేవాయ నమః,  ప్రద్యుమ్నాయ నమః,  అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,  అధోక్షజాయ నమః,  ,నారసింహాయ నమః,  అచ్యుతాయ నమః,  ఉపేంద్రాయ నమః,  హరయే నమః,  శ్రీ కృష్ణాయ నమః,  శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః,   ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

 ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.  మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య  శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు ………. సంవత్సరే, …….ఆయనే,  ……. మాసే, …….పక్షే  ,……తిది, ,,,,,,,,వాసరే  శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం,  శుభతిథౌ శ్రీమాన్ … గోత్రః …నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,  పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం,  సర్వాభీష్ట సిద్ధ్యర్థం,  మహా గణాధిపతి  ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:

(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః

కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః

అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే

ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం

విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః

సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప

సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః

కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ:

మం: ఓం అసునీతేపునరస్మాసు  చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ  సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||  స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |

ధ్యానం:

మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం

జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||

శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి.  ఆవాహయామి ఆసనం సమర్పయామి |  పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి |  శుద్ధ ఆచమనీయం సమర్పయామి | 

శుద్దోదక స్నానం:

మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ   చక్షశే|

యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః  ఉషతీరివ మాతరః

తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||

శ్రీ మహాగణాదిపతయే నమః  శుద్దోదక స్నానం సమరపయామి.  స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

వస్త్రం:

మం:  అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|

అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||

శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం:

మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్| 

ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||

శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం:

మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|

ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||

శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |

అక్షతాన్:

మం: ఆయనేతే పరాయణే  దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||

శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |

అధఃపుష్పైపూజయామి.

ఓం సుముఖాయనమః

ఓం ఏకదంతాయనమః

ఓం కపిలాయనమః

ఓం గజకర్నికాయనమః

ఓం లంభోదరయానమః

ఓం వికటాయనమః

ఓం విఘ్నరాజాయనమః

ఓం గానాదిపాయనమః

ఓం దూమ్రకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయనమః

ఓం గజాననాయనమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్పకర్ణాయ నమః

ఓం హీరంభాయ నమః

ఓం స్కందాగ్రజాయ నమః

ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి. 

ధూపం:

వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం |

ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం || 

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి. 

దీపం:

సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం |

భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె  || 

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం:

మం:   ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||

శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.  ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి ||

తాంబూలం:

ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం |

ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం:

మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి

మాధవ్యోసనీతి   ఏకదా బ్రహ్మణ ముపహరతి

ఏకదైవ ఆయుష్తేజో దదాతి.

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||

మంత్రపుష్పం:

శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః ||  షోడశైతాని  నామాని యఃపఠే చ్రునుయాదపి |  విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే |  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షణ నమస్కారం:

శ్లో:  యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||

యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు  |  న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |  ఉత్తరే శుభకర్మణ్య  విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||

మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే  యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||

శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

ఉమామహేశ్వర పూజ:

ప్రాణ ప్రతిష్టాపన:

ఓం అస్యశ్రీ ఉమామహేశ్వర ప్రాణ ప్రతిష్టాపన మహా మంత్రస్య|

బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః  ఋగ్యజుర్ సామాదర్వణ వేదాః చందాసి,

ప్రాణ శక్తి, పరాదేవతా హ్రాం హ్రీం శక్తి|

హ్రూం కీలకం, ఉమామహేశ్వర ప్రాణ ప్రతిష్టా సిధ్యర్దే జపెవినియోగః ||

కరన్యాసః:

హ్రాం అంగుష్టాభ్యాం నమః |

హ్రీం తర్జనీభ్యాం నమః| 

హ్రూం మధ్యమాభ్యాం నమః | 

హ్రైం అనామికాభ్యాం నమః | 

హ్రౌం కనిష్టికాభ్యాం నమః | 

హ్రః కరతలకర పృష్టాభ్యాం  నమః ||

అంగన్యాసః:

హ్రాం హృదయాయ నమః| 

హ్రీం శిరసే స్వాహా| 

హ్రూం శిఖాయై వషట్ | 

హ్రైం కవచాయహుం | 

హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ | 

హ్రః అస్త్రాయఫట్ 

భూర్భువస్సువరోమితి దిగ్భందః||

ధ్యానం:

శ్లో:  రక్తాంభోది స్థపోతోల్ల సదరుణ సరోజాది రూడా కరాబ్జ్యై

పాశం కోదండ మిక్ష్శోద్భవమణి గణ పమ్యంజ్కుశం పంచాబాణాణ్

బిభ్రాణా సృక్కపాలం త్రివయనలసితా పీనవక్షోరుహాడ్యా

దేవీ బాలార్క వర్ణ భవతు సుఖ క్రీ ప్రాణ శక్తి పరానః ||

ఓం ఆం హ్రీం క్రోం యం రం ళం వం శం షం సం హం శం క్షం అనయో ఉమామహేశ్వర ప్రానప్రతిష్టంతు| 

ఓం ఆం హ్రీం క్రోం యం రం ళం వం శం షం సం హం ళం క్షం అనయో ప్రతి మాయో జీవస్తిష్టతు|

ఓం ఆం హ్రీం క్రోం యం రం ళం వం శం షం సం హం శం క్షం అనయో ప్రతి మయో సర్వెంద్రియాని శ్రోత్ర చక్షు జిహ్వ ఘ్రాణ వాక్పాని పాదపా యుపస్తాని ఇహైవా గత్యసుఖం చిరంతిష్టంతు స్వాహా|

మం:  అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణ మిహనో దేహి భోగం,

         జోక్పస్యేమ సూర్య ముచ్చరంతా మనుమతే మ్రుడయానస్వస్తి అమృతం

         వై ప్రాణా అమ్రుతపాపః ప్రాణానేవ యధాస్థాన ముపహ్వాయతే||

         ఆవాహితౌ భావతం|  స్తాపితౌ భావతం | సుప్రసంనౌ భావతం | స్తిరాసనం కురుతం | ప్రసీదతం ప్రసీదతం ప్రసీదతం ||

ధ్యానం:

శ్లో:  ముక్తామాలా పరీతాంగం| రుకూల పరివేష్టితం |

పంచానస మమాకాంత| మనలేన్డురవిప్రభం|

చంద్రార్ధ శేఖరం నిత్యం \ జతామకుట మండితం |

త్రిపుండ్రా రేఖావిలస | త్పాలనేత్రో పరిష్తితం|

భాస్మోదూలిత సర్వాంగం | రుద్రాక్ష భరణాన్వితం  |

మందస్మిత మనాదార | మాదారం జగతాం ప్రభుం |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:

శ్లో:  కైలాసశిఖరా ద్రమ్యాత్|  పార్వత్యా సహితప్రభో

ఆగశ్చ  దేవ దేవేశ – మద్భక్త్య చంద్రశేఖరః||

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమఃఆవాహయామి.

ఆసనం: 

శ్లో:  సురాసుర శిరో రత్న విరాజిత మదాంబుజ|

ఉమా మహేశ మద్దత్త మాన సంప్రతి గుహ్యతాం|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యం:

శ్లో:  యద్భాక్తలేశ సంపర్క | పరమానంద సంభవో |

ఉమా మహేశ చరనే | పాద్యం వం కల్పయామిచ |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:

శ్లో:  నమస్తే పార్వతీకాంత | నమస్తే భక్త వత్సల |

త్రయంబక మహాదేవ | గృహాణార్ఘ్యం సదాశివ |

నమస్తే దేవి శర్వాణి | ప్రసన్న భయ హారిణి |

అంబికే వరదే దేవి | గృహాణార్ఘ్యం శివప్రియే |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:

శ్లో:  మునిభిర్నారద ప్రఖై |  ర్నిత్యమాఖ్యాత వైభవో |

ఉమా మహేశౌ మత్ప్రీత్యా గృహాణాచమనం శుభం|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:

శ్లో:  సర్వ కల్మష నాశాన్యై | పరిపూర్ణ సుఖాత్మనే |

మధుపర్క మమేశంభో | కల్పయామి ప్రసీదతం|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః మధుపర్కం సమర్పయామి.

మంచామృత స్నానం:

మం:  ఆప్యాయస్వసమే తుతే విశ్వతస్సోమ  వృష్ణియం  |

భావావాజస్య సంఘదే |  (క్షీరం )

మం: దదిక్రావర్ణో అకారిషం జిశ్నో రశ్వస్య వాజినః |

సురభినో ముఖాకర త్ప్రణ ఆయూగింషీ తారిషత్ |  (దధి)

మం:  శుక్రమసి జ్యోతిరసి తెజోసి దేవోవ స్సవితోత్పునా త్వచ్చిద్రేణ

పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి: (ఆజ్యం)

మం:  మధువాతా ఋతాయతే | మధుక్షరంతి సిన్ధవః | మాద్వీర్ణ స్సన్త్వోషదీ మధు నక్తముతో శసి |

మధుమత్పార్దివగుం రజః మధుద్యోవ్రస్తునః పితా | మధుమాన్నో వనస్పతి ర్మదుమాగు అస్తు సూర్యః |

మాద్వీర్ఘావో భవన్తునః |  (మధు:)

మం:  స్వాదు: పవస్వదివ్యాయ జన్మనే స్వాదు రింద్రాయ సుహావేటు నామ్నే

స్వాదుర్మిత్రాయ వరునాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః  (శర్కరా)

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః మంచామృత స్నానం సమర్పయామి. 

స్నానం:

మం:  నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషావేనమః ………… ఇతి రుద్రా సూక్తేన స్నానం.

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమఃశుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రం:

మం:  అబివస్తాసు వసనాన్యరుశాభి దేనూసుదుఘః పూయమానః

అభిచంద్రా భర్త వేనో హిరణ్యా భ్యశ్వా రాధినో దేవసోమ |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం:

మం:  యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ |

ఆయుష్య మగ్రియం ప్రతి మున్చశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

భస్మలేపనం  :

మం:  అగ్నిరితి భస్మ |  వాయురితి భస్మ |  జలమితి భస్మ |  స్థాలమిటి భస్మ |

వ్యోమేతి భస్మ |  సర్వగుం హవైదగుం భస్మ వాజ్మన ఇత్యేతాని చక్షూగుంషి కారణాని భాస్మాని|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః భస్మ పరికల్పయామి. 

గంధం:

మం:  గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాం కరీషిణీం

ఈశ్వరీగుం సర్వ భూతానాం తామి హోపహ్వాయే శ్రియం|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః గంధం పరికల్పయామి.

అక్షతాన్:

మం:  ఆయనేతే పరాయనే దూర్వారోహే హస్తు పుష్పిణీం  |

హ్రద్రాశ్చ  పున్దరీకాని తామి హోపహ్వాయే శ్రియం|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః అక్షతాన్ సమర్పయామి.

హరిద్రా కుంకుమా చూర్ణం:

శ్లో:  హరిద్రా కుంకుమ చైవ |సింధూరం కజ్జలాధికం|

నీలలోహిత తాటంకీ| మంగళ ద్రవ్య మీశ్వర |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః సుగంధ సుపరిమళ ద్రవ్యాణి సమర్పయామి.

ఆభరణం:

శ్లో:  కిరీతహార కేయూర | కంకణాది విభూషణై  |

అలంకరోమి దేవేశో | భక్తా భీష్ట ఫలప్రదౌ ||

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః నానావిధ సువర్ణ భూషణాని సమర్పయామి.

అధాంగ పూజ:

శివాయై నమః                       –         శిరః పూజయామి

పృధువేణ్య   నమః                 –         వేణీం పూజయామి

సీమంత రాజితాయై నమః       –         సీమంతం పూజయామి

కుంకుమ ఫాలాయై నమః       –         ఫాలం పూజయామి

చక్షుష్మత్యై  నమః                  –         నేత్రే పూజయామి

శ్రుతిశ్రోత్రాయై నమః                –         శ్రోత్రే పూజయామి

గంధ ప్రియాయై నమః             –         ఘ్రాణం పూజయామి

సుభాగకపోలాయై  నమః        –         కపోలౌ పూజయామి

కుట్మల దంతాయై నమః         –         దంతాన్ పూజయామి

విద్యా జిహ్వాయై నమః            –         జిహ్వం పూజయామి

బిమ్బోష్టై నమః                     –         ఓష్ఠం పూజయామి

వృత్త  కంఠ్యై నమ                  –         కంఠం పూజయామి

పృదులకుచాయై  నమః         –         కుచౌ పూజయామి

విశ్వా గర్భాయై నమః            –         ఉదరం పూజయామి

శుభ కట్యై నమః                   –         కటిం పూజయామి

దివ్యోరుదేశాయై నమః           –         ఊరూం పూజయామి

వృత్తి జంఘాయై  నమః          –         జంఘే నమః

లక్ష్మిసెవితపాదుకాయై నమః  –         పాదౌ పూజయామి

మహేశ్వర ప్రియాయై నమః    –          నఖాన్ పూజయామి

శోభన విగ్రహాయై నమః          –          సర్వాంగం పూజయామి

అదాష్టోత్తర శతనామ పూజా:-

ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం వామదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం కపర్దినే నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శంకరాయ నమః                                                               

ఓం శూలపానిణే  నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం అంభికానాథాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భాక్తవత్సలాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః                                                           

ఓం శితికంఠాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కపాలినే నమః

ఓం కామారినే నమః

ఓం అంధకాసుర సూదనాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం కాలకాలాయ నమః  

ఓం కృపానిధయే నమః

ఓం భీమాయ నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం మ్రుగపానిణే నమః

ఓం జటాధరాయ నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కవచినే నమః

ఓం కఠోరాయ నమః   

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం వృషభారూడాయ నమః                                                      

ఓం భస్మొద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సామప్రియాయ నమః

ఓం సర్వమయాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం పరమాత్మాయ నమః

ఓం సోమ సుర్యాగ్నిలోచనాయ నమః

ఓం హావిషే నమః

ఓం యజ్ఞామయాయ నమః                                                    

ఓం సోమాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం గణనాథాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం హిరణ్య రేతాయ నమః

ఓం దుర్దర్షాయ నమః   

ఓం గిరిశాయ నమః

ఓం గిరీశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం భుజంగ భూషనాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిద్వనినే నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం కృత్తి వాసాయ నమః

ఓం పురారాతయే నమః

ఓం భగవతే నమః

ఓం ప్రమధాదిపాయ నమః                                                      

ఓం మృత్యుంజయాయ నమః

ఓం సుక్ష్మతనవే నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగద్గురవే నమః

ఓం వ్యోమవేశాయ నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం స్థాణవే నమః                                                                  

ఓం అహిర్భుద్నాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం అనేకాత్మాయ నమః

ఓం సాత్త్వికాయ నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం అజాయ నమః

ఓం పాశ విమోచకాయ నమః 

ఓం మృడాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం దేవాయ నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం హరియే నమః

ఓం పూషదంతభేత్రే  నమః

ఓం అవ్య గ్రాయ నమః

ఓం దక్షాధ్వర హరాయ నమః

ఓం హరాయ నమః                                                                   

ఓం భగనేత్రభిదే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదవే నమః

ఓం అపవర్గ ప్రదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం తారకాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః        

సూత్రగ్రంది పూజ

శివాయనమః                          ప్రధమ గ్రంధిం పూజయామి

శాంతాయ నమః                     ద్వితీయ గ్రంధిం పూజయామి

మహాదేవాయ నమః                తృతీయ గ్రంధిం పూజయామి

వ్రుశభద్వాజాయ  నమః           చతుర్ధ గ్రంధిం పూజయామి

రుద్రాయ నమః                       పంచమ గ్రంధిం పూజయామి

త్రయంబకాయ నమః               శ్రష్టమ గ్రంధిం పూజయామి

ఉమా పతయే  నమః               సప్తమ గ్రంధిం పూజయామి

నీల కంఠయ నమః                 అష్టమ గ్రంధిం పూజయామి

శశిశేఖరాయ నమః                నవమ గ్రంధిం పూజయామి

ఈశ్వరాయ నమః                  దశమ గ్రంధిం పూజయామి

భీమాయ నమః                     ఏకాదశ గ్రంధిం పూజయామి

త్రిపురాంతకాయ నమః           ద్వాదశ గ్రంధిం పూజయామి

భీమాయ నమః                     త్రయోదశ గ్రంధిం పూజయామి

కాలాత్మనే నమః                    చతుర్దశ గ్రంధిం పూజయామి

సర్వేశ్వరాయ నమః                పంచదశ గ్రంధిం పూజయామి

ధూపం:

శ్లో:  దశాంగం గగ్గులోపెతం | సుగంధంచ సుమనోహరం|

గృహ్నీతం సర్వ దేవేశో | శివో వంచ నమోస్తుతే||

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ధూపం సమర్పయామి.

దీపం:

శ్లో;  సవజ్ఞౌ సర్వ లోకేష | త్రిలోక్యతిమిరాపహౌ |

గృహ్ణీతం   మంగళం దీప | ఉమా మహేశ్వరౌ ముదా||

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః దీపం దర్శయామి.

నైవేద్యం:

శ్లో;  అన్న చతుర్విధ స్వాదు | రసైషడ్భి సమన్వితం|

భక్ష భోజ్య సమాయుక్తం | నైవేద్యం ప్రతి గృహ్యాతాం ||

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:

శ్లో:  కర్పూరేలా లవంగాడి | తాంబూలీదళ సంయుతం |

క్రముకాది ఫలం దైవ | తాంబూలం ప్రతిగృహ్యాతాం|

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః తాంబూలం సమర్పయామి.

కర్పూర నీరాజనం:

శ్లో:  కర్పూర చంద్ర సంకాశం | జ్యోతిస్సూర్య సమప్రభం |

భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివో ||

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః కర్పూర నీరాజనం సమర్పయామి.

మంత్ర పుష్పం:

మం:  తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి|

తన్నో రుద్రః ప్రచోదయాత్ ||

ప్రదక్షిణం:

శ్లో:  యానికానిచ పాపాని | జన్మాంతర కృతానిచ |

తాని తాని ప్రనశ్యంతి | ప్రదక్షణ పదే పదే |

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.

ఉమా మహేశ్వర వ్రత కథ

       పూర్వము నైమిశారణ్యముణ  సూతమహాముని చే చెప్పబడుతున్న సకల పురాణ ఇతిహాసములను శౌనకాది మహామునులు శ్రద్దగా వింటున్నారు.  ఒకనాడు సూతమర్షి ఉమా మహేశ్వర వ్రతము గూర్చి ఈ విధంగా వివరించసాగాడు. 

          శివసాయిజ్యము పొందుటకు అతి సులభమైన మార్గము రుద్రాక్షలను ధరించుట…..మరియు వాటిని ధరించి “శివనామ మహత్యమును” పఠించిన వారికిని, వినిన వారికిని భూలోకమునండు సర్వ సౌఖ్యములను పొందుటయే కాక మోక్షము ప్రాప్తిస్తుంది.  శివానం మహత్యమును పఠించిన వారికే ఈ విధమైన మోక్షము కలిగి శివుని యొక్క వ్రాత్ములను శ్రద్దాభక్తులతో ఆచరిన్చేదివారి పుణ్యములు ఇంతని చెప్పుటకు వీలులేదు.  అటువంటి ఒక శైవ వ్రతంబు గురించి చెప్పెదను వినుడు.  అని సూతమహర్షి చెప్పసాగాడు. 

           పూర్వము కైలాసములో పరమేశ్వరుడు, పార్వతి కొలువుదీరి మాట్లాడుకొనుచున్నారు. ఆ మాటల యందు జగదంబ ఈ సృష్టి అంతయు తన యొక్క స్వరూపమేననియు, సృష్టి, స్థితి, లయలు తనచే జరుపబడుచున్నవని పలికినది.  జగత్తులోని సర్వం శక్తిమయంబని జగదంబ పలుకగా శివుడు ఆ మాటలను ఆలకించి  కోపముతో తన పురుష శక్తిని ఉపసంహరించుకున్నాడు.  ఇది జరిగిన వెంటనే జగదంబ కు లోకమంతయు చీకటిగా తోచి దిగ్బ్రాంతి చెందినది.  అంతట ఈ వైపరీత్యము స్వామీ తన  నుండి దూరమగుట వలననే కలిగినదని తెలుసుకొని దు:ఖ పడి, దానికి పరిష్కార మార్గము కొరకు గౌతమ మహర్షి వద్దకు వెడలి తను ఈశ్వరుని అర్ధ భాగమును ఆక్రమించుట ఏ విధముగా జరుగునో దానికి తగు ఉపాయమును తెలుపమనియు, అటువంటి వ్రతంబు ఏదైనా వున్న యెడల తనకి సవివరముగా వుపదేశింప వలెనని  కోరినది.  అంతట గౌతముడు అట్టి వ్రతము వున్నదని తెలిపి ఆ యొక్క వ్రతంబును గురించి సవివరముగా తెలిపినాడు.  అంట ఆ మహాదేవి ఆ వ్రతంబును శ్రద్దాభక్తులతో ఆచరించి పరమేశ్వరుని కృపను పొంది అర్ధ శరీరము పొందినది. పార్వతీదేవికి గౌతముడు ఉపదేశించిన వ్రత విధానము ఏమనగా!

        భాద్రపద పూర్ణిమ నందు ఈ వ్రతము ఆచరిన్చవలేయును. ముందుగా చతుర్దశి నాడు ప్రాతః కాలముననే లేచి కాళ్ళ కృత్యములను  తీర్చుకొని స్నానమాచరించి పరమేశ్వరుని భక్తితో పూజించి నమస్కరించి “ఓ మహాదేవా! నేను నీయొక్క వ్రతమును చేయుచున్నాను.  ఆ యొక్క వ్రతమును ఆచరించుటకు నాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఈ వ్రతమును చేసుకొనే శక్తిని ప్రసాదించు తండ్రీ! అని ప్రార్ధించుకోవాలి. ఆ రోజు సాయంత్రము అంతయు స్వామివారినే ప్రార్ధించి పూజ నిర్వహించుకొని నిదురించి మరుసటి దినము ప్రాతః కాలముననే లేచి కాలక్రుత్యములను తీర్చుకొని శుభ్రమైన వస్త్రములను ధరించి దేహమునకు విభూది రాసుకొని, త్రిపున్ద్రమును నుదిటిపై పెట్టుకోవలేయును.  తరువాత రుద్రాక్షలను ధరించి యధావిధిగా భక్తి శ్రద్దలతో శివుని పూజించి, పరమేశ్వరుని ప్రీతికి హోమమును చేయవలేయును. 

          ఈ వ్రతమును చేయువారు ముందుగా తమ శక్తి కొలది బంగారముతోగాని, వెండితోగాని, మట్టితో గాని ఉమా మహేశ్వరుల ప్రతిమలు చేసి వుంచుకోవలెను.  తరువాత పదిహేను వరుసలు, పదిహేను ముడులతో తోరమును తయారు చేసుకొని ఆ తోరనమును పసుపు కుంకుం లతో, పువ్వులతో పూజింపవలెను.  అటు పిమ్మట ఉమా మహేశ్వరుల ప్రతిమను కలశము నందు వుంచి వస్త్రమును కలశామునకు చుట్టి , ఆ ప్రతిమలకు స్నానము చేయించి గంధ పుష్పాడులతో పూజించవలెను.  పూజానంతరము శివాలయమునకు వెడలి శివునికి అభిషేకము చేయించి సమీపమున కలశము ప్రతిష్టించి ఆ కలశము ముందు తోరమును పళ్ళెములో వుంచావలేయును. ఉమా మహేశ్వరులను భక్తి శ్రద్దలతో పూజించి, తోరమును చేతికి కట్టుకోవలెను.  గోధుమపిండి తో చేసిన పదిహేను రకముల పిండి వంటలను నైవేద్యముగా పెట్టవలేయును.  తరువాత భక్తితో నమస్కరించి వస్త్రముతోపాటు వున్న కలశమును ఉమా శంకరుల  ప్రతిమలను బ్రాహ్మణులకు దానమివ్వవలెను. 

          ఈవిధముగా 15 సంవత్సరములలో అష్టమీ, చట్రుదషీ, పౌర్ణమి యందు 15 సార్లు ఈ వ్రతంబును చేసుకోవలేయును.  పదహారవ సంవత్సరమున ఉద్యాపన చేసుకోవలేయును.  వీలు కాని యెడల తదుపరి సంవత్సరము వ్రతము చేసుకోను ఉద్యాపన చేసుకోవలేయును. 

             ఉద్యాపన వ్రతమును పదిహేను సంవత్సరములు ఆచరించిన తరువాత చేసుకోవలెను.  ఆరున్నర తులములతోగాని, అందున సగము లేదా దానిలో సగముతో గాని బంగారము తో ఉమా శంకరుల ప్రతిమలను చేయించవలెను.  బంగారముతో చేయించలేని పక్షమున వెండితో చేయించవలెను.  సహ్క్తి అనుసారముగా వెండి, రాగి కలశాములను పదిహేను చేయించవలెను.  భాద్రపద శుద్ధ చతుర్దశ దినమున పదిహేను మంది “వీర శివులను” తీసుకవచ్చి వారని “రుత్విక్కులుగా” పిలువవలెను.  ఆ రోజు రాత్రి వ్రతము ఆరంభించవలెను  ముందుగానే దక్షిణ తామ్బూలములను ఇవ్వవలెను. తరువాత శుబ్రముగా కడిగి ముగ్గులు పెట్టిన గృహమునందు శివస్థానమును కల్పించి ఆ స్థానమున పువ్వులతో మంగళ కరముగా  అలంకరించి ఉమా మహేశ్వరులను ప్రతిష్టించి, ఋత్వికుల సమక్షమున ఈ పూజ చేసుకోను వారితో సహా ఉపవాసము రాత్రియంతా ఉంది నాలుగు ఝాముల యందును పూజ నిర్వహింప వలెను  .

         ఎవరైతే ఈ విధముగా శ్రద్దా భక్తులతో ఉమా మహేశ్వర వ్రతమును ఆచరించెదరో వారు అష్టిశ్వర్యములతో తులతూగి చివరకు శివసాన్నిధ్యము  చేరుదురు.        

          ఈ వ్రత కథను తెలుసుకోనిన మహర్షులు ఇంతటి మహోన్నతమైన వ్రతము ఎవరు ఆచరిన్చిరనియు, వారు ఎవరో సవివరుగా తెలుపుమని గౌతమ మహర్షిని కోరగా ఆయన ఈవిధముగా వివరించెను. 

          ఒకానొకప్పుడు దూర్వాసముని అన్ని లోకములను సంచరించుతూ వైకుంథము చేరెను.  ఆయన రాకకు విష్ణుమూర్తి సంతోషించి ఆ మహర్షికి అతిధి మర్యాదలు చేసి పూజించి ఆసీనులవ్వమని పలికినారు.  అంతటికిని సంతోషించి ఆ ముని మిక్కిలి ఆనందముతో శివునిచే తనకు ఇవ్వబడిన  “బిల్వమాలికను” విష్ణుమూర్తికి ఇచ్చినాడు.  అంతట విష్ణుమూర్తి ఆ మాలికను స్వీకరించి తాను ధరింపక గరుత్మంతుని కంఠమున అలంకరించెను.  ఇది వీక్షించినంతనే  దూర్వాస మహామునికి కూపమువచ్చి ఓయీ! పరమశివునిచే ఇవ్వబడిన ఈ మాలికను ప్రేమతో నీకు ఇచ్చిన ఆ మాలను గరుడునకు వేసితివి.  నీవు చేసిన ఈ చర్య వలన నీ సర్వస్వమునకు మూలమైన లక్ష్మి నశించుగాక! గరుత్మంతుడు నశించి పోవుగాక, వైకుంఠాధిపత్యము పోయి కారడవి యందు వ్రుక్షముగా పుట్టి గొడ్డలితో దెబ్బలు తిన్డువుగాక అని శపించి వెల్లిపోయిను. 

          శాప ఫలితముగా లక్ష్మిదెవి పుట్టింటికి వెడలెను.  విష్ణువు వృక్షముగా పుట్టెను.  కొంత కాలంనకు నేను అచటకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విషయమును తెలిపి శాప విమోచనమును వుపదేశించామనేను.  అంతట తను ఈ ఉమా మహేశ్వర వ్రతమును గురించి తెలుపగా విష్ణుమూర్తి యధావిధిగా శ్రద్దలతో ఈ వ్రతము ఆచరించినాడు.  అంతట శంకరుడు ప్రసన్నుడై లక్ష్మిదెవిని విష్ణుమూర్తి వద్దకు చేర్చి గరుత్మంతుని ఇచ్చి విష్ణువునకు శాప విమోచనము గావించెను. 

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

అనంత వ్రత కల్పము

            శ్రీ  అనంత పద్మనాభ వ్రతమునకు కావలసిన ముఖ్య వస్తువులు : విష్ణుమూర్తి యొక్క బొమ్మ లేదా చిత్ర పటము, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్నోపవీతములు, పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, ఈ వ్రతమునకు తోరములు ముఖ్యము. ఇవి ఎర్రని సిల్కు దారముతో చేసినవి గాని లేదా తెల్లని దారముతో చేసినవైతే కుంకుమ నీటిలో తడిపి ఉంచుకొనవలెను. వీటికి పదునాలుగు ముడులు ఉండవలెను. ప్రసాదమునకు గోధుమ పిండిని ఐదు పళ్ళు (అనగా ఐదు శేర్లు) తీసుకొని బెల్లముతో అతిరసములు (అప్పములు) తయారు చేసుకొనవలెను. ఇందులో ఇరువది ఎనిమిది అతిరసములు దేవునికి నైవేద్యము పెట్టి తోరము కట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు వాయన దానమిచ్చి, తక్కిన వానిని తాను భుజింపవలయును. పూజా ద్రవ్యము లన్నియు పదునాలుగు చొప్పున ఉండవలయును. బ్రాహ్మణ పిమ్మట యజమానులు (పూజ చేసేవారు) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు  మొత్తం 24 కలవు.

ఆచమనం

1. ” ఓం కేశవాయ స్వాహా ” అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.

2. ” ఓం నారాయణాయ స్వాహా “అనుకొని ఒకసారి

3. ” ఓం మాధవాయ స్వాహా ” అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను. తరువాత

4. ” ఓం గోవిందాయ నమః ” అని చేతులు కడుగు కోవాలి.

5. ” విష్ణవే నమః ” అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.

6. ” ఓం మధుసూదనాయ నమః ” అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

7. “ఓం త్రివిక్రమాయ నమః ” క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

8,9.” ఓం వామనాయ నమః ” ” ఓం శ్రీధరాయ నమః ” ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి.

10. ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి.

11.  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి.

12. ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను.

13. ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను.

14. ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను.

15.16. ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను.

17.18. ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను

19.20  ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను.

21. ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం, హృదయం తాకవలెను.

22. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను.

23.24. ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను, ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి, వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను. ఆచమనము అయిన తరువాత,  కొంచెం నీరు చేతిలో పోసుకొని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః

       యేతే షామవిరోదేన బ్రహ్మ కర్మ సమారభే  ||

  ప్రాణా యామమ్య : ఓం భూ : – ఓం భువః ఓం సువః – ఓం మహః -ఓం జనః ఓం తపః -ఓం సత్యం -ఓం తత్ సవితురేణ్యం.భర్గో దేవస్య ధీమహి దీయోయోన : ప్రచోదయాత్.

ఓం ఆపో జ్యోతిర సోమ్రుతం బ్రహ్మ భూర్భు వస్సువ రోం అని సంకల్పము చెప్పు కొనవలెను.

     సంకల్పము : యమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్దే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనము ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్ర మానేన ………… సంవత్సరే, ………… ఆయనే, …….. ఋతు, ………..మాసే, ……… పక్షే, ………. తిధౌ,……… వాసరే శుభ నక్షత్రే, శుభయోగే, శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ …….. గోత్రశ్య ……. నామధేయః, శ్రీమత్యః, గోత్రస్య, నామ దేయస్య అనియు, స్త్రీలైనచో  శ్రీమతి,  గోత్రవతి, నామదేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః నామదేవ వత్యాః అనియు (పూజ చేయువారి గోత్రము, నామము చెప్పి) నామ దేయశ్యః ధర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో) మమ సహ కుటుంబస్య, క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సకల విధ మనో వాంచా ఫల సిద్ద్యర్ధం, శ్రీ అనంత పద్మనాభ దేవతా ముద్దిశ్య అనంత పద్మనాభ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకొని) సంభ వద్బి రుపచారై : సంభవతాని యమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో, నాకు తోచిన నియమములతో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్దలతో సమర్పించు కొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

పిదప కలశారాధనము చేయవలెను.

     కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి, లేక కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని, కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య,  ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించవలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారు చేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువ వలెను.

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్రస్సమాశ్రితః

         మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః

         ఋ గ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః

         అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

శ్లో ||    గంగైచ యమునేచైవ కృష్ణే, గోదావరి, సరస్వతి, నర్మదా సింధు

          కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ||

     ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ అనంత పద్మనాభ దేవతాః (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పు కొనవలెను) పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని, ఆకుతో గాని చల్లాలి.

మూనర్జము :

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాంగతోపివా

యస్స్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||

     అని పిదప కాసిని అక్షతలు, పసుపు, గణపతిపై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ మహా గణాది పతయే నమః

ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహోర్తోస్తూ తదాస్తు. తరువాత ఇలా చదువుతూ స్వామికి నమస్కరించ వలెను.

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

      ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

      సుముఖశ్చైక దంతశ్చక పిలో గజ కర్ణకః

      లంబో దరశ్చ వికటో విఘ్న రాజో వినాయకః

      ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః

      వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూర్వజః

      షోడ శైతాని నామాని యః పటేచ్చ్రుణుయాదపి

      విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా

      సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్యన జాయతే ||

అనంత పద్మనాభుని వ్రతమునకు ముందుగా యమునా పూజను చేయవలెను .

యమునా పూజా :

ధ్యానం : శ్లో || క్షీరో దార్ణవ సంభూతే ఇంద్ర నీల సమప్రభే, ధ్యానం కరోమి యమునే విష్ణు రూపి నమోస్తుతే.

యమునా దేవీం ధ్యాయామి అని యమునా దేవిని ధ్యానించవలెను.

ఆవాహనం :  శ్లో || యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయినీ, ఆవాహయామి భక్త్యాత్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.

యమునా దేవ్యై నమః ఆవాహయామి అని ఆ దేవతను మన ఇంటి లోనికి పిలుచుచున్నట్లుగా (ఆహ్వానించు చున్నట్లుగా) భావించి అక్షతలు తీసుకొని వేయవలెను.

ఆసనం : శ్లో || నమస్కరోమి యమునే సర్వ పాప ప్రణాశిని, రత్న సింహాసనం దేవీ స్వీకురుష్వ మయార్పితం.

యమునా దేవ్యై నమః ఆసనం సమర్పయామి అని కూర్చొనుటకు సింహాసనము ఇచ్చినట్లుగా  భావించి దేవిపై అక్షతలు వేయవలెను.

పాద్యం : శ్లో || సింహాసన సమారూడే దేవ శక్తి సమన్వితే, పాద్యం గృహణ దేవేశి సర్వ లక్షణ సంయుతే.

యమునా దేవ్యై నమః పాద్యం సమర్పయామి అని దేవికి కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణెతో తీసుకొని చల్లవలెను.

అర్ఘ్యం : శ్లో || నంది పాదే నమస్తుభ్యం సర్వ పాప నివారిణి, అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిద ముత్తమం ||

యమునా దేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుగు కొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని నీటిని ఉద్దరిణె తో వేరొక పాత్ర లోనికి వేయవలెను.

ఆచమనీయం : శ్లో || హర వైడూర్య సంయుక్తే సర్వ లోక హితే శివే, గృహణాచమనం దేవి శంకరార్ధ శరీరణి ||

యమునా దేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి అని పంచ పాత్రలోని శుద్ధ జలమును ఉద్దరిణెతో అర్ఘ్య పాత్ర లోనికి వదల వలెను.

స్నానం : శ్లో || దేవ సలిలే నమస్తుభ్యం సర్వ లోక హితే ప్రియే, సర్వ పాప ప్రశమని తుంగ భద్రే నమోస్తుతే ||

యమునా దేవ్యై నమః స్నానం సమర్పయామి అని స్నానమునకు నీరు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్ర లోని నీటిని పువ్వుతో లేదా ఉద్దరిణెతో వేరొక గిన్నె లోనికి వదలవలెను.

వస్త్ర యుగ్మం : శ్లో || గురు పాదే నమస్తుభ్యం సర్వ లక్షణ సంయుతే, సువ్రతం కురుమే దేవి తుంగ భద్రే నమోస్తుతే ||

యమునా దేవ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అని వస్త్రమునకు సమర్పిస్తున్నట్లుగా భావించి పత్తితో బిళ్ళ వలె చేసి , దానికి కుంకుమ పెట్టిన వస్త్ర యుగ్మమును దేవికి సమర్పించ వలెను.

మధుపర్కం : శ్లో || కృష్ణ వేణి నమస్తుభ్యం కృష్ణవేణీ సులక్షణే, మధుపర్కం గృహాణే దం మయాదత్తం శుభప్రదే ||

యమునా దేవ్యై నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ, ఈ మధుపర్కం ను ప్రతిమకు అద్దవలెను.(ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచు కొన్న దానిని మధుపర్కం అంటారు).

ఆభరణాని : శ్లో || నంది పాదే నమస్తుభ్యం శంకరార్ధ శరీరణి, సర్వలోక హితే తుభ్యం భీమ రధ్యై నమోస్తుతే ||

యమునా దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి అని తమ శక్తి కొలది ఆభరణములను దేవి వద్ద ఉంచి నమస్కరించ వలెను.

ఉత్తరీయం : శ్లో || సహ్య పాద సముద్భూతే సర్వ కామ ఫల ప్రదే, సర్వ లక్షణ సంయుక్తే భవ నాశినితే నమః ||

యమునా దేవ్యై నమః ఉత్తరీయం సమర్పయామి అనుచూ కండువా వంటి తెల్లని వస్త్రమును సమర్పించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణి తో అర్ఘ్య పాత్ర లోనికి వదలవలెను.

గంధం : శ్లో || కృష్ణ పాద సముద్భూతే గంగేత్రి పధ గామిని, జటాజూట సమద్భూతే సర్వ కామ ఫల ప్రదే ||

యమునా దేవ్యై నమః గంధం సమర్పయామి అనుచు గంధమును ఈ దేవతపై రెండు, మూడు చుక్కలు చల్లవలెను

అక్షతలు : శ్లో || గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని, స్వీకురుష్వ జగద్వంద్వే అక్షతా నమలాన్ శుభాన్ ||

యమునా దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి అనుచు అక్షతలను (కొద్ది బియ్యమును తీసుకొని తడిపి పసుపు వేసి కలుపవలెను) దేవిపై చల్ల వలెను.

పుష్ప పూజ : శ్లో || మందారై: పారిజాతైశ్చ పాటలాశోక చంపకై:, పూజయామి తవ ప్రీత్యై వందే భక్త వత్సలే.

యమునా దేవ్యై నమః పుష్పై : పూజయామి అనుచు కొన్ని పూవులను తీసుకొని అక్షతలు, పూవులు కలిపి దేవిపై వేయవలెను.  ఈ షోడశోపచార పూర్తి అయిన పిమ్మట 13 నామములు గల అధాంగ పూజను చేయవలెను. ప్రతి నామమునకు పువ్వులు కాని, పసుపు కాని  కుంకుమ కాని వేయవచ్చును.                                                                                                                                                       

అధాంగ పూజ :-

ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి ; ఓం సుజంఘాయై నమః జంఘే పూజయామి ; ఓం చపలాయై నమః జానునీ పూజయామి ; ఓం పుణ్యాయై నమః ఊరూ పూజయామి ; ఓం కమలాయై నమః కటిం పూజయామి ; ఓం గోదావర్యై నమః స్తనౌ పూజయామి ; ఓం భావ నాశిన్యై నమః కంటం పూజయామి ;ఓం తుంగభద్రాయై నమః ముఖం పూజయామి ; ఓం సుందర్యై నమః లలాటం పూజయామి ; ఓం దేవ్యై నమః నేత్రే పూజయామి ; ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః కర్ణౌ పూజయామి ; ఓం సునాసికాయై నమః నాసికం పూజయామి ; ఓం భాగీరధ్యై నమః శిరః పూజయామి.

యమునా దేవ్యై నమః సర్వాంణ్యంగాని పూజయామి.

ధూపం : శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు సంయుతం, యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతి గృహ్యతాం.||

యమునా దేవ్యై నమః ధూపం సమర్పయామి అని ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తి వెలిగించి తిప్పుతూ దూపమును దేవికి చూపవలెను.

దీపం : శ్లో || ఘ్రుతవర్తి  సమాయుక్తం త్రైలోక్య తిమిరాపహమ్, గృహాణ మంగళం దీపం సర్వేశ్వరి నమోస్తుతే.

యమునాదేవ్యై నమః దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం దేవికి చూపుతూ పై శ్లోకమును చదువ వలెను.

నైవేద్యం : శ్లో || భక్త్యైశ్చ భోజ్యైశ్చ రసై షడ్భిస్సమన్వితం, వేద్యం గృహ్యాతం దేవి యమునాయై నమోనమః

యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి అని పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి దేవి వద్ద నుంచి ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో పదార్దాములపై పువ్వులతో నీళ్ళు చల్లుతూ ‘ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ‘ అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణి తో) స్వామికి నివేదనం చూపించాలి. పిదప ఓం యమునా దేవ్యై నమః నైవేద్యానంతరం’ హస్తౌ ప్రక్షాళయామి’ అని ఉద్దరిణెతో పంచపాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ళ పాత్ర) లో వదలాలి.

తరువాత ‘పాదౌ ప్రక్షాళ యామి’ అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. నిత్య పూజా విదానమందు ఈ విధంగా చేసే నైవేద్యం అనంత పద్మనాభ వ్రతమునకు 14 రకముల పిండి వంటలు చేసి అందు రకమునకు 14 చొప్పున ఒక పళ్ళెములో వుంచి నివేదన చేయాలి పునః శుద్దాచామనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి తదనంతరం ……..

హస్త ప్రక్షాళనం : శ్లో || పానీయం పావనం శ్రేష్టం గంగా సరసోద్భవం, హస్త ప్రక్షాళ నార్ధం వై గృహాణ సుర పూజితే.

     యమునా దేవ్యై నమః హస్త ప్రక్షాళనం సమర్పయామి అని భోజనము అయిన పిదప చేతులు కడుగుకొనుటకు నీళ్ళు ఇస్తున్నట్లుగా భావించి పంచ పాత్రలోని జలమును ఉద్దరిణితో అర్ఘ్య పాత్ర లోనికి హస్తౌ ప్రక్షాళయామి అంటూ వదలవలెను.

తాంబూలం : శ్లో || కరూప్ర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం, తాంబూలం గృహ్యతాం దేవీ యమునాయై నమోస్తుతే ||

యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి అని మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు వేసి దేవి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ‘తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’ అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి.

నీరాజనం :  పిమ్మట కర్పూరం వెలిగించి ……………

                    శ్లో || ఘ్రుత వర్తి సహస్త్యైశ్చ కర్పూర శకలై స్తదా, నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||

ఓం శ్రీ యమునా దేవ్యై నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి మూడుసార్లు త్రిప్పుచూ, చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ‘కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’ అని చెప్పి నీరాజనం దేవికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి.

తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని,

మంత్ర పుష్పం :

ఓం శ్రీ యమునాదేవ్యై నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు దేవి వద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం : శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ, నమస్తే విఘ్న రాజాయ నమస్తే విఘ్న నాశన. ||

             శ్లో || ప్రమాద గణ దేవేశ ప్రసిద్దె గణ నాయక, ప్రదక్షణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే. ||

             శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ యమునా దేవ్యై నమః ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి. చేతిలో అక్షతలు, పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగ వారు పూర్తిగా  పడుకొని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎదమకాలుపై వేసి) తరువాత చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ………

ప్రార్ధనం : శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపో యజ్ఞ క్రియాది షు, న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

యమునా పూజా విధానం సంపూర్ణం

అధ శ్రీ మదనంత పద్మనాభ పూజా కల్పః

ధ్యానం :                                                                                              

శ్లో || కృత్వా దర్బ మయం దేవం పరిధాన సమన్వితం

     ఫణై స్సప్తభి రావిష్టం పింగాలాక్షంచ  చతుర్భుజం

     దక్షిణాగ్ర కరే పద్మం శంఖం తస్యా ప్యధః కరే

     అవ్యయం సర్వ లోకేశం పీతాంబర ధరం హరిం

     దుగ్దాబ్ది శాయనం ద్యాత్వా దైవ మావాహయే త్సుదీ ||

     ఓం నమో భగవతే వాసుదేవాయ

     శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః – ధ్యానం సమర్పయామి అని స్వామిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం : శ్లో || అగచ్చానంత దేవేశ తేజో రాశే జగత్పతే, ఇమాం మాయా కృతం పూజాం గృహాణ సుర సత్తమ ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి అని ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.

ఆసనం : శ్లో || అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః, రత్న సింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆసనం సమర్పయామి . నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీత వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.

తోరస్తాపనం : శ్లో || తస్యాగ్ర తోదృడం సూత్రం కుంకు మాక్తం సుదోరకం, చతుర్దశ గ్రంధి సంయుక్తం ఉప కల్ప్య ప్రజాజయేత్ ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోరా స్థాపనం కరిష్యామి అని 14 ముడులతో సిద్దం చేసి ఉంచుకున్న ఎర్రని దారముతో చేసిన తోరమును (ఎర్రని దారము కానిచో తెల్లని దారముతో తయారు చేసి కుంకుమ నీళ్ళలో ముంచినది) స్వామిపై వేయవలెను.

వస్త్ర యుగ్మం : శ్లో || శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే, పీతాంబర ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని వస్త్రయుగ్మం అంటారు) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

ఉపనీతోత్తరీయాన్ : శ్లో || నారాయణ నమస్తేస్తు త్రాహిమాం భవ సాగరాత్, బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఉపనీతోత్తరీయాన్ సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయ వచ్చును. ప్రత్తిని తీసుకొని పసుపు చేత్తో బ్రొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి కుంకుమ అద్దవలెను. దీనిని స్వామిపై ఉంచవలెను.

గంధం : శ్లో || శ్రీ గంధం చంతనో న్మిశ్రం కుంకుమాది భిరంవితం, విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః గంధాన్ సమర్పయామి గంధమును రెండు మూడు చుక్కలు స్వామిపై చల్లవలెను.

అక్షతాన్ : శ్లో || శాలీయాన్ తండులాన్ రమ్యాన్ మయాదత్తాన్ శుభావహాన్, అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీకురు ప్రభో.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి అని కొద్ది అక్షతలను తీసుకొని (పసుపు కలిపిన బియ్యమును) స్వామిపై చల్లవలెను.

పుష్ప పూజ : శ్లో || కరవీరై ర్జాతి కుసుమైశ్చం పకైర్వకు లై శ్శుభై:  పత్రైశ్చ కల్హారైరర్చయే పురుషోత్తమ.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పుష్పాణి పూజయామి కొద్ది పుష్పములను తీసుకొని స్వామీ పాదములపై ఉంచి నమస్కరించ వలెను.

పిమ్మట క్రింది అధాంగ పూజను ఒక్కొక్క నామమునకు పువ్వులు లేదా పసుపు లేదా కుంకుమను స్వామిపై వేస్తూ పూజించవలెను.

అధాంగ పూజ :                                                                                     

ఓం అనంతాయ నమః పాదౌ పూజయామి ; ఓం శేషాయ నమః గుల్ఫౌ పూజయామి ; ఓం కాలాత్మనే నమః జంఘే పూజయామి ; ఓం విశ్వ రూపాయ నమః జానునీ పూజయామి; ఓం జగన్నాదాయ నమః గుహ్యం పూజయామి; ఓం పద్మనాభాయ నమః నాభిం పూజయామి ; ఓం సర్వాత్మనే నమః కుక్షిం పూజయామి; ఓం శ్రీ వత్స వక్షసే నమః వక్ష స్థలం పూజయామి ; ఓం చక్ర హస్తాయ నమః హస్తాన్ పూజయామి ; ఓం ఆజాను బాహవే నమః బాహున్ పూజయామి ; ఓం శ్రీ కంటాయ నమః కంటం పూజయామి ; ఓం చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి ; ఓం వాచస్పతయే నమః వక్త్రం పూజయామి ;

ఓం కేశవాయ నమః నాసికాం పూజయామి ; ఓం నారాయణాయ నమః నేత్రౌ పూజయామి ; ఓం గోవిందాయ నమః శ్రోత్రే పూజయామి ;ఓం అనంత పద్మనాభాయ నమః శిరః పూజయామి ; ఓం విష్ణవే నమః సర్వాణ్యం పూజయామి .

పిమ్మట క్రింది 108 నామములకు ఒక్కొక్క నామమునకు స్వామిపై అక్షతలు గాని, పసుపు గాని, కుంకుమ గాని వేయుచు ఈ నామములతో పూజించ వలెను.

అర్ఘ్యం : శ్లో || అనంత గుణ రత్నాయ విశ్వ రూప ధరాయచ, దదామితే దేవ నాగాది పతయే నమః

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి అని దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళిస్తు న్నామని మనసున తలుస్తూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం : శ్లో || సర్వాత్మన్ సర్వ లకేశ సర్వ వ్యాపిన్ సనాతనా, పాద్యం గృహణ భగవాన్ దివ్య రూప నమోస్తుతే ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పాద్యం సమర్పయామి అనుచు దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్ర లోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం : శ్లో || దామోదర నమస్తేస్తు నర కార్ణ వ తారక, గృహణచ మనం దేవ మయా దత్తం హికేశవ.||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి అని దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణె తో ఒక మారు నీరు వదలవలెను.

సూచన : అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణంలో వదలరాదు.

మధుపర్కం : శ్లో || అనంతానంత దేవేశ అనంత ఫల దాయక, మధ్వాజ్య నమ్మిశ్రం మధుపర్కం దదామితే ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చు చున్నామని తలుస్తూ, ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు)

పంచామృత స్నానం : శ్లో || అనంత గుణ గంభీర విశ్వా రూప ధరానమ, పంచామృ తైశ్చ విదివత్స్నా పయామి దయానిధే ||

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.

శుద్దోదక స్నానం :

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు, స్నానం ప్రకల్పయే త్తీర్ధం సర్వ పాప ప్రముక్తయే.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి అని పంచపాత్ర లోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

అదాష్టోత్తర శతనామ పూజా:-

ఓం కృష్ణాయ నమః ఓం తమల శ్యామలా కృతియే నమః ఓం దుర్యోదన కులాంతకాయ నమః ఓం కమల నాదాయ నమః ఓం గోపా గోపీశ్వరాయ నమః ఓం విదురాక్రూర వరదాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం యోగినే నమః ఓం విశ్వ రూప ప్రదర్శకాయ నమః ఓం సనాతనాయ నమః ఓం కోటి సూర్య సమ ప్రభాయ నమః 40 ఓం సత్యవాచే నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం ఇలాపతయే నమః ఓం సత్య సంకల్పాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం సత్య భామా రతాయ నమః ఓం లీలా మానుష విగ్రహాయ నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం జయినే నమః ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం సుభద్రా పూర్వజాయ నమః 80 ఓం యశోదా వత్సలాయ నమః ఓం వనమాలినే నమః ఓం విష్ణవే నమః ఓం హరి : యే నమః 10 ఓం పీతవసనే నమః ఓం భీష్మ ముక్తి ప్రదాయకాయ నమః ఓం చతుర్భుజాత్త సక్రాసి గదా నమః ఓం పారిజాతా పహారికాయ నమః ఓం జగద్గురువే నమః ఓం శంఖాంబుజా యుదాయుజా నమః ఓం గోవర్ధనాచ లోద్దర్త్రే నమః ఓం జగన్నాధాయ నమః ఓం దేవకీ నందనాయ నమః ఓం గోపాలాయ నమః ఓం వేణునాద విశారదాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం సర్వ పాలకాయ నమః 50 ఓం వృషభాసుర విద్వంసినే నమః ఓం నంద గోప ప్రియాత్మజాయ నమః ఓం అజాయ నమః ఓం బాణాసుర కరాంత కృతే నమః ఓం యమునా వేద సంహారిణే నమః ఓం నిరంజనాయ నమః ఓం యుధిష్టర ప్రతిష్టాత్రే నమః ఓం బలభద్ర ప్రియానుజాయ నమః ఓం కామజనకాయ నమః ఓం బర్హి బర్హావతంసకాయ నమః ఓం పూతనా జీవిత హరాయ నమః ఓం కంజ లోచనాయ నమః ఓం పార్ధసారదియే నమః 90 ఓం శకటాసుర భంజనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం నంద వ్రజజనా నందినే నమః 20  ఓం మధురా నాదాయ నమః ఓం గీతామృత మహోదదియే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం ద్వారకానాయకాయ  నమః ఓం కాళీయ ఫణి మాణిక్యరం నమః ఓం నవనీత విలిప్తాంగాయ నమః ఓం బలినే నమః ఓం జిత శ్రీ పదాంబుజాయ నమః ఓం అనఘాయ నమః ఓం బృందావనాంత సంచారిణే నమః 60 ఓం దామోదరాయ నమః ఓం నవనీత హరాయ నమః ఓం తులసీధామ భూషణాయ నమః ఓం యజ్ఞ భోక్త్రే నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం శమంతక మణే ర్హర్త్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం షోడశ స్త్రీ సహస్రేశాయ నమః ఓం నర నారాయణాత్మకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం కుబ్జ కృష్ణాంబర ధరాయ నమః ఓం పర బ్రహ్మణే నమః ఓం మధురాకృతయే నమః ఓం మాయినే నమః ఓం పన్నాగాశన వాహనాయ నమః 100 ఓం శుకవాగ మృ తాబ్దీందవే నమః 30 ఓం పరమ పురుషాయ నమః ఓం జలక్రీడా సమాసక్త గోపీ నమః ఓం గోవిందాయ నమః ఓం ముష్టి కాసుర చాణూర నమః ఓం వస్త్రా పహారకాయ నమః ఓం యోగినాం పతయే నమః ఓం మల్ల యుద్ద విశారదాయ నమః ఓం పుణ్య శ్లోకాయ నమః ఓం వత్సవాటి చరాయ నమః ఓం సంసార వైరిణే నమః ఓం తీర్ధ కృతే నమః ఓం అనంతాయ నమః ఓం కంసారయే నమః ఓం వేదవేద్యాయ నమః ఓం ధేనుకాసుర భంజనాయ నమః ఓం మురారయే నమః 70 ఓం దయానిధయే నమః ఓం తృణీ కృత    తృణవర్తాయ నమః ఓం నరకాంతకాయ నమః ఓం సర్వ తీర్దాత్మకాయ నమః ఓం యమళార్జున భంజనాయ నమః ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః ఓం సర్వ గ్రహ రూపిణే నమః ఓం ఉత్తలోత్తాల భేత్రే నమః ఓం శిశుపాల శిరచ్చేత్రే నమః ఓం ఓం పరాత్పరాయ నమః 108

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

పిమ్మట పద్నాలుగు ముళ్ళు కలిగిన తోరమును స్వామీ వద్ద ఉంచి, క్రింది నామములతో పసుపు కాని, కుంకుమ లేదా పువ్వులతో పూజించ వలెను.

తోర గ్రంధి పూజా:-

ఓం కృష్ణాయ నమః ప్రధమ గ్రంధిం పూజయామి

ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంధిం పూజయామి

ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంధిం పూజయామి

ఓం కాలాయ నమః చతుర్ధ గ్రంధిం పూజయామి

ఓం బ్రాహ్మణే నమః పంచమ గ్రంధిం పూజయామి

ఓం భాస్కరాయ నమః షష్టమ గ్రంధిం పూజయామి

ఓం శేషాయ నమః సప్తమ గ్రంధిం పూజయామి

ఓం సోమాయ నమః అష్టమ గ్రంధిం పూజయామి

ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంధిం పూజయామి

ఓం విశ్వాత్మనే నమః దశమ గ్రంధిం పూజయామి

ఓం మహాకాలాయ నమః ఏకాదశ గ్రంధిం పూజయామి

ఓం సృష్టి స్థిత్యన్త కారిణే నమః ద్వాదశ గ్రంధిం పూజయామి

ఓం అచ్యుతాయ నమః త్రయోదశ గ్రంధిం పూజయామి

ఓం అనంత పద్మనాభాయ నమః చతుర్దశ గ్రంధిం పూజయామి

ధూపం : శ్లో || వనస్పతి సైర్దివ్యై ర్నాగా గంధైశ్చ సంయుతం, ఆఘ్రేయ సర్వ దేవానాం దూపోయం ప్రతి గృహ్యాతాం

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ధూపం సమర్పయామి అంటూ అగరువత్తులను వెలిగించి ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపించవలెను.

దీపం  : శ్లో || సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా, గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః దీపం సమర్పయామి సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో వున్న అదనపు వత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి పుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం : శ్లో || నైవేద్యం గృహ్య దేవేశ భక్తిం మే హ్యచ లాంకురు, ఈప్సితం మేవరం దేహి పరత్రచ పరాం గతిం.

                  అన్నం చతుర్విధం భక్ష్యై : రసై : షడ్బి : సమన్వితం, మయా నివేదితం తుభ్యం స్వీకురు ష్వ జనార్ధన.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి అని పళ్ళు, కొబ్బరికాయ, ప్రత్యేకంగా నివేదనకు చేసిన ప్రత్యేక పదార్దములు స్వామీ వద్ద వుంచి ‘ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం అనంత పద్మనాభ స్వామినే నమః’

అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణె తో) స్వామికి నివేదనం చూపించాలి. పిదప ఓం శ్రీ స్వామి నైవేద్యానంతరం ‘హస్తౌ ప్రక్షాళ యామి’ అని ఉద్దరిణె తో పంచ పాత్ర లోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర ( పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర) లో వదలాలి. తరువాత ‘పాదౌ ప్రక్షాళ యామి’ అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణె తో వదలాలి.

పునః శుద్దాచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.

తాంబూలం : శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం

 శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః  తాంబూలం సమర్పయామి అని చెపుతూ మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు వేసి స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ‘తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’ అంటూ ఉద్దరిణె తో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి.

పిమ్మట కర్పూరం వెలిగించి ……………

నీరాజనం : శ్లో || సమస్సర్వ హితార్ధాయ జగదాధారా మూర్తయే, సృష్టి స్థిత్యంత రూపాయ హ్యనంతాయ నమోనమః

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడు మార్లు త్రిప్పుచూ, చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ‘కర్పూర నీరాజనానంతరం శుద్దాచామనీయం సమర్పయామి’ అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అడ్డుకోవాలి. తరువాత చేతిలో పువ్వులు, అక్షతలు, చిల్లర డబ్బులు పట్టుకొని ………….

మంత్ర పుష్పం : శ్లో || నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణు : ప్రచోదయాత్ |

                             ఆకాశాత్పతితం తోయం యదా గచ్చతి సాగరం, సర్వ దేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ||

ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పుకొని చేతిలో ఉన్న పువ్వులు, అక్షతలు, చిల్లర స్వామివారి పాదముల వద్ద ఉంచవలెను.

ప్రదక్షిణ నమస్కారాన్ : శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,

తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.

                                   పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః

                                   త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల

                                   అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

                                   తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన,

                                   నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీ ధర

                                    నమస్తే సర్వా నాగేంద్ర నమస్తే పురుషోత్తమ.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని శ్రీ స్వామికి చేతిలో అక్షతలు, పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ  ప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి మగవారు పూర్తిగా పడుకొని తలను నెలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ళపై పడుకొని కుడికాలు ఎడమకాలు పై వేసి చేయవలెను) తరువాత స్వామిపై ఉన్న అక్షతలు పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ……………

తోర గ్రహణం : శ్లో  || దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవృద్దయే, అనంతాఖ్య మిదం సూత్రం దారయామ్యహ ముత్తమమ్.

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోర గ్రహణం కరిష్యామి అని స్వామి వద్ద వుంచి

పూజించిన తోరములను చేతిలోనికి తీసుకొని పై శ్లోకమును చదువు కొనవలెను.

తోర నమస్కారం :

శ్లో || అనంత సంసార మహాసముద్ర మగ్నం మమభుద్దర వాసుదేవ, రూపిన్ వినియోజయ స్వహ్య నంత సూత్రాయ నమో నమస్తే

శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః తోర నమస్కారం సమర్పయామి అని స్వామి వద్ద నుంచి తీసుకొన్న తోరమును చేతియందుంచుకొని నమస్క రించవలెను.

తోర బంధనం : శ్లో  ||   సంసార గహ్వర గుహాసు సుఖం విహర్తుం

                            వాంచం తియేకురుకులోద్వ హ శుద్ధ సత్వాః

                            సం పూజ్యచ త్రిభువనేశ మనంత రూపం

                            బద్నంతి దక్షిణ కరే వరదో రకంతే.

అనంత పద్మనాభ స్వామినే నమః తోర బంధనం కరిష్యామి అని స్వామిని స్మరించి తోరమును దక్షిణ హస్తమున (కుడి చేతికి) కట్టుకోనవలెను.

జీర్ణ తోర విసర్జనం : శ్లో || అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక, సూత్ర  గ్రంధి షు సంస్థాయ విశ్వరూపాయతే నమః

అని పాతదైన తోరమును విప్పుతూ పై శ్లోకమును చాడువుకోనవలెను.

ఉపాయన దానం : శ్లో || అనంతః ప్రతి గృహ్జా తి అనంతో వైడ దాతిచ, అనంత స్తార కోభ్యాభ్యా మనంతాయ నమోనమః

పునః పూజ : ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని, పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను.

ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.

ఏతత్ఫలం శ్రీ కృష్ణార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను.

పిమ్మట ‘శ్రీ కృష్ణ ప్రసాదం శిరసా గృహ్ణామి’ అనుకొని స్వామివద్దఅక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

శ్లో :    || యస్య స్మృత్యాచ నో మొక్త్యాత పః పూజా క్రియాది షు న్యూనం  సంపూర్ణతాం

యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన,

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే, అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార

పూజాయాచ భగవాన్సర్వాత్మక : శ్రీ అనంత పద్మనాభ స్సుప్రీతో వరదో భవతు, శ్రీ అనంత పద్మనాభ ప్రసాదం శిరసా గృహ్ణామి అని దేవునికి నమస్కరించి ప్రసాదమును స్వీకా రించవలెను. ఇతి పూజావిధానం సమాప్తమ్.

అనంత వ్రత కధా ప్రారంభము

సూత పౌరాణి కుండు శౌనకాది మహర్షులను చూచి యిట్లనెను. మునివర్యులారా ! లోకంబున మనుజుండు దారిద్ర్యముచే పీడింప బడుచున్నచో అట్టి దారిద్ర్యమును తొలగ చేయునట్టి ఒక శ్రేష్టమైన వ్రతము కలదు. దానిని చెప్పెదను వినుడు, పూర్వము పాండురాజ పుత్రుడైన ధర్మరాజు తమ్ములతో అరణ్యమున నివసించు చుండగా (అరణ్య వాసము) చేయుచు మిక్కిలి కష్టములను అనుభవించుచూ ఒకనాడు కృష్ణుని చూచి “మహాత్మా ! నేను తమ్ముల తోడ అనేక దినములుగా అరణ్యవాసము చేయుచూ మిగుల కష్టము చెంది యున్నవాడను, ఇట్టి కష్ట సాగరము నందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలయు” నని ప్రార్ధించిన శ్రీ కృష్ణుడు ఇట్లనియె.

‘ఓ ధర్మరాజా ! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రతము అనునొక వ్రతము కలదు. మఱియు ఆ అనంత వ్రతమును భాద్ర పద శుక్ల పక్ష చతుర్దశి నాడు చేయవలెను. అట్లు చేసినచో కీర్తియును, సుఖమును, శుభమును, పుత్ర లాభమును గలుగు” నని చెప్పిన కృష్ణునితో ధర్మరాజు ఇట్లనియె. “ఓ రుక్మిణీ ప్రాణ వల్లభా ! ఆ అనంతుడను దైవము ఎవరు? ఆది శేషుడా ! లేక తక్షకుడా ! లేక సృష్టి కర్తయైన బ్రహ్మయా ! లేక పరమాత్మ స్వరూపుడా” యని అడిగిన ధర్మరాజుతో శ్రీ కృష్ణుడు ఇట్లు అనెను. “ఓ పాండు పుత్రా ! అనంతుడనువాడను నేనే తప్ప మరి యెవరును కాదు. సూర్య గమనముచే కళా కాష్ట ముహూర్తములనియు, పగలు రాత్రియనియు, యుగ సంవత్సర ఋతు మాస కల్పములనియు నీ సంజ్ఞ కలుగ నొప్పు చున్న కాలం బెద్ది కలదో అదియే నా స్వరూపము. నేనే కాల స్వరూపుడను, అనంతుడు అను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించితిని. నన్ను కృష్ణుని గాను, విశ్నునిగాను, హరిహర బ్రహ్మలుగాను, సర్వ వ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారణ భూతునిగను, అనంత పద్మనాభునిగను, మత్స్య, కూర్మ ఆద్యవతార స్వరూపునిగను తెలుసుకొనుము. ఏ నా హృదయ మందే పదునాలుగు భువనములను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, సప్తర్షులును, సరి దద్రి ద్రుమములను, భూలోకం, ఆకాశం, స్వర్గం ఉన్నచో అట్టి నా స్వరూపమును నీ కెరింగించితి” ననిన ధర్మరాజు కృష్ణ మూర్తిం గాంచి “ఓ జగన్నాధా ! నీవు వచించిన అనంత వ్రతం బెటులాచరింప వలయును? ఆ వ్రతంబాచరించిన ఏమి ఫలము గలుగును ? ఏ ఏ దానములను చేయవలయును ? ఏ దైవమును పూజింప వలయును ? పూర్వము ఎవరు ఈ వ్రతమును ఆచరించి సుఖము పొందిరి ? అని అడిగిన ధర్మరాజుతో కృష్ణ మూర్తి యిట్లనియె. ఓ ధర్మరాజా ! చెప్పెదను వినుము. పూర్వయుగము లందు వసిష్ఠ గోత్రము నందు జన్మించినవాడు, వేద శాస్త్రములను అధ్యయనం చేసినవాడు అయిన సుమంతుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి భ్రుగు మహాఋషి పుత్రికయగు దీక్షా దేవియను భార్య కలదు. ఆ దీక్షాదేవితో సుమంతుడు చిరకాలము కాపురము చేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణ వతియను ఒక కన్యను కనెను. ఆ బాలికకు శీల యను నామకరణము చేసిరి.

            ఇట్లుండగా కొన్ని దినములకు దీక్షాదేవి తాప జ్వరంబుచే మృతి నొందెను.పిదప సుమంతుడు వైదిక కర్మ లోప భయంబుచే కర్కశయను కన్యను వివాహము చేసుకొనెను. ఆ కర్కశ మిగుల కటిన చిత్తు రాలుగను, గయ్యాళి గను, కలహా కారిణి గను ఉండెను. ఇట్లుండ ప్రధమ బార్యయగు దీక్షాదేవి పుత్రిక యైన శీల, తండ్రి గృహముననే పెరుగుచూ, గోడల యందును, గడపల యందును చిత్ర వర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచూ, కూటము మొదలగు స్థలములందు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టుచూ దైవ భక్తి గలదై యుండెను. ఇట్లుండగా ఆ శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడనే సుమంతుడు వివాహము చేయవలయునని ప్రయత్నంబు చేయు చుండ కౌండిన్య మహా ముని కొన్ని దినంబులు తపస్సు చేసి, పిదప పెండ్లి చేసుకోన వలయునను ఇచ్చ (కోరిక) కలిగి దేశ దేశములం తిరుగుచు ఈ సుమంతుని గృహమునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహా మునిని అర్ఘ్య పాద్యాదులచే పూజించి శుభ దినంబున శీలయను తన కూతురు నిచ్చి వివాహము చేసెను..ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానమును ఇయ్యవలయునని తలంచి తన భార్య యగు కర్కశ యొద్దకు పోయి “ఓ ప్రియురాలా ! మన యల్లునికి ఏదైనా బహుమానము ఇయ్యవలయును గదా ! ఏమి ఇయ్యవచ్చు” నని అడుగగనే ఆ కర్కశ చివుక్కున లేచి లోపలి పోయి తలుపులు గడియ వేసికొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను. అంత సుమంతుడు మిగుల చింతించి దారి బత్తెంబుకైనా (దారి ఖర్చులకైనను) ఇయ్యక పంపుట యుక్తము కాదని (మంచిది కాదని) తలంచి పెండ్లికి చేయబడి మిగిలి యుండెడు పేలపు పిండిని ఇచ్చి అల్లుని తోడ కూతురును పంపెను. అంత కౌండిన్యుండును సదాచార సంపన్నురాలగు భార్య తోడ బండి నెక్కి తిన్నగ తన ఆశ్రమమునకు పోవుచూ మద్యాహ్న వేళ యైనందున సంధ్యా వందనాది క్రియలు సల్పుటకై బండి దిగి తటాకంబునకు (సరస్సునకు) వెళ్ళెను. నాటి దినము అనంత పద్మనాభ చతుర్దశి కావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేకమంది స్త్రీలు ఎఱ్ఱని వస్త్రములు ధరించి మిక్కిలి భక్తి యుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ సేయు చుండగా కౌండిన్యుని బార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు పోయి, “ఓ వనితా మణులారా ! మేరే దేవుని పూజించు చున్నారు ? ఈ వ్రతము పేరేమి ? నాకు సవిస్త రంబుగా చెప్పవలయు ” నని ప్రార్దించగా, ఆ పతివ్రతలు యిట్లనిరి. “ఓ పుణ్యవతీ చెప్పెదము వినుము. ఇది అనంతపద్మనాభ స్వామి వ్రతము . ఈ వ్రతమును చూచినచో అనంత ఫలంబు లబించును. మఱియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్ర వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయముచే (ఆవు పేడతో) అలికించి సర్వతో భద్రంబను ఎనిమిది దళములు (ఆకులు) గల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండపమునకు చుట్టును పంచ వర్ణపు (అయిదు రంగుల) ముగ్గుల తోను, తెల్లని బియ్యపు పిండి చేతను ముగ్గులను అలంకరించి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున (కుడి వైపు) కలశమును ఉంచి అందులో కొద్ది నీటిని పోసి, ఆ వేదిక నడుమ సర్వ వ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని వుంచి అందు ఆవాహనం చేసి,

శ్లో || కృత్వా దర్భ మయం దేవం శ్వేత ద్వీపై స్థితం హరిమ్, సమన్వితం సప్త ఫణై : పింగళాక్షం చతుర్భుజం ||

అను శ్లోకమును పటిస్తూ శ్వేత ద్వీపవాసిగను, పింగళాక్షుండుగను, సప్త ఫణ సహితుండుగను, శంఖ చక్ర గదాధరుండుగను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోప చార పూజలొనర్చి, ప్రదక్షిణ నమస్కారములను చేసి పదునాలుగు ముళ్ళు కలిగి కుంకుమతో తడిపిన కొత్త తోరమును ఆ పద్మనాభస్వామి సమీపమున ఉంచి పూజించి ఐదు పళ్ళ (ఐదు శేర్లు) గోధుమ పిండితో ఇరువదెనిమిది అతిరసములం (అరిశెలు లేదా అప్పములు) చేసి నైవేద్యము పెట్టి తోరమును కట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు ఉపాయాస దానములిచ్చి (దక్షిణ తాంబూలమును ఇచ్చి) తక్కిన వానిని తాను భుజింప వలయును. మఱియు పూజ ద్రవ్యములన్నియు పదునాలుగేసిగా నుండ వలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ నుండవలయును. ఓ శీలా ! ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సర ము నందు ఉద్యాపనము చేసి మరల వ్రతము నాచరించు చుండవలయు ” నని చెప్పిన కౌండిన్య ముని భార్య యగు శీల తక్షణంబున స్నానం బొనర్చి యా స్త్రీల సాహాయము వలన వ్రతము నాచరించి తోరము గట్టుకొని దారి బత్తెమునకు గాను తెచ్చిన పిండిని వాయన దాన మిచ్చి తానును భుజించి సంతుష్టయై, భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండి నెక్కి ఆశ్రమమునకు బోయెను. అంత శీల అనంత వ్రతము ఆచరించిన మహత్యము వలన ఆశ్రమ మంతయు స్వర్ణ మయముగాను (బంగారముతో నిండినది గాను), గృహము నందు అష్టైశ్వర్యములు కలిగి యుండుట చూచి దంపత లిరువురును సంతోష భరితులై సుఖముగ నుండిరి. శీల గోమేధిక పుష్య రాగ మరకత మాణిక్యాది మణి గణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములను కావించు చుండెను. అట్లుండ ఒకనాడు దంపతు లిరువురు కూర్చుండి యుండగా దురాత్ముడగు కౌండిన్యుడు శీల చేతికి గల తోరమును చూచి’ ఓ కాంతా ! నీవు చేతియందొక తోరము కట్టుకొని యున్నావు గదా ! అదెందులకు కట్టుకొని యున్నావు ? నన్ను వశ్యంబు చేసికొనుటకా లేక మరియొకరి ని వశ్యంబు చేసికొనుటకు కట్టుకోన్నావా యని అడిగిన ఆ శీల యిట్లనియె .. “ఓ ప్రాణ నాయకా ! అనంత పద్మనాభ స్వామిని పూజించి ఆ తోరమును ధరించి యున్నాను. ఆ దేవుని అనుగ్రహంబు వలననే మనకు ఈ ధన ధాన్యాది సంపత్తులు గలిగి యున్న” వని యదార్ధము వచించిన కౌండిన్యుండు మిగుల కోపోద్రిక్తుడై కండ్లెర్ర చేసి అనంతుడనగా ఏ దేవుడిని దూషించుచూ ఆ తోరమును త్రెంచి భగ భగ మండు చుండేడు అగ్నిలో పడ వైచెను. అంత నా శీల హాహా కారం నర్చుచూ పరుగెత్తి పోయి యా తోరమును తీసుకొని వచ్చి పాలలో తడిపి పెట్టెను.

            పిదప కొన్ని దినంబులకు కౌండిన్యుడు ఇట్టి అపరాధము చేసి నందు వలన అతని ఐశ్వర్య మంతయు నశించి గోధనములు దొంగల పాలై, గృహమగ్ని పాలయ్యెను. గృహమున వస్తువులన్నియు నశించెను. ఎచ్చటికీ పోయినను కలహము సంభ వించి ఎవరును మాటలాడ రైరి. అంత కౌండిన్యుడు ఏమియుం తోచక దారిద్ర్యముచే పీడింప బడుచు వనములో ప్రవేశించి క్షుద్బాదా పీడితుడై అనంత పద్మనాభ స్వామి జ్ఞాపకము కలిగి ఆ మహాదేవుని మనసున ధ్యానించుచూ పోవుచూ ఒక చోట పుష్ప ఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనను వ్రాలకుండుట గాంచి ఆశ్చర్యము నొంది ఆ చెట్టుతో నిట్లనియె. ఓ వృక్ష రాజమా ! అనంతుడను నామంబు గల దైవమును చూచితివా ? అని అడిగిన నా వృక్షము నెరుంగ నని చెప్పెను అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చి గడ్డిలో అటునిటు దూడతో తిరుగుచున్న గోవును చూచి ఓ కామ దేనువా అనంత పద్మనాభ స్వామిని చూచితివా యని అడిగిన అదియు తానెరుగ నని చెప్పెను. పిదప కౌండిన్యుడు కొంత దూరము పోయి పచ్చికలో నిలుచుండిన ఒక వృషభమును (ఎద్దును) గాంచి ఓ వృషభ రాజా ! అనంత పద్మనాభ స్వామిని చూచితివా ? అని అడిగిన, అనంత పద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదని చెప్పెను. మరి కొంత దూరము పోగా మనోహరమైన రెండు కొలనులు తరంగములతోను, కమల కల్హార కుము దోత్పలంబుల తోను హంస కారండవ చక్ర వాకాదులతో కూడి జలంబు మరియొక కొలనుకు పొరలు చుండుట చూచి కమలా కరంబులారా ! మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడుగగా మేమెరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరి కొంత దూరము పోయి ఒక చోట నిలుచుని యుండి న గాడిద, ఏనుగులను చూచి మీరు అనంత పద్మనాభస్వామిని జూచితిరా యని అడిగెను. అవియును మేమెరుంగ మని చెప్పెను. అంత కౌండిన్యుడు మిగుల విషాదంబు చెంది మూర్చ బోయి క్రింద పడెను. అప్పుడు భగవంతుడు కృప కలిగి వృద్ద బ్రాహ్మణ రూప దారుండయి కౌండిన్యుని చెంతకు వచ్చి”ఓ విప్రోత్తమా ! ఇటురమ్మ” ని పిలిచి తన గృహమునకు తీసుకొని పోయెను. అంత ఆ గృహము నవరత్న మణి గణ ఖచితంబుగను, దేవాంగనల తోడం గూడియు నుండుట చూచి యాశ్చర్యం బు నొంది యుండ, సదా గరుడ సేవింతుండుగను, శంఖచక్ర ధరుండుగను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుండు సంతోష సాగర మగ్నుండై భగవంతుని ఈ విధంబున భజియించెను.

శ్లో     || నమో నమస్తే వైకుంట శ్రీ వత్స శుభ లాంచన త్వన్నామ స్మరణాత్పా సమ శేషం

            నః ప్రణశ్యతి, నమో నమస్తే గోవిందా నారాయణ జనార్ధనా ||

            అని అనేక విధముల స్తోత్రము చేసిన అనంత పద్మనాభుడు మిగుల సంతుష్టుడై ఓ విప్రోత్తమా ! నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంత సించితిని. నీకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభ వించ కుండునటులను, అంత్య కాలమున శాశ్వత విష్ణు లోకము కలుగు నట్లును వరము నిచ్చితి ననిన కౌండిన్యుడు ఆనందాంబుధం తేలుచూ ఇట్లనియె. ఓ జగన్నాధా ! నే త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంత మేమి ? ఆ ఆవు ఎక్కడిది ? ఆ వృష భంబు ఎక్కడ నుండి వచ్చే ? ఆ కొలను విశేషంబేమి ? ఆ గాడిద, ఏనుగు, బ్రాహ్మణులు ఎవ్వరని అడిగిన భగవంతుడిట్లనియె. ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా ! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికిని నుపయోగించని మామిడి చెట్టుగా జన్మించెను. తొల్లి (పూర్వము) ఒకండు మహాబాగ్య వంతుడై యుండి తన జీవిత కాలము నందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగు చున్నాడు. ముందొక రాజు ధన మదాందుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానం చేసినందున ఆ రాజు వృషభంభై అడవిలో తిరుగు చున్నాడు. ఆ కొలనులు (సరస్సులు) రెండును ధర్మం ఒకటి , అధర్మం ఒకటి అని ఎరుంగుము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచు ఉండి నందున గాదిదయై పుట్టి తిరుగు చున్నాడు. పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసు కొనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్ష మైతిని. కాన నీవు ఈ అనంత వ్రతంబును పదునాలుగు సంవత్సరములు ఆచరించి తివేని నీకు నక్షత్ర స్థానము నిచ్చెదనని వచియించి భగవంతుడు అంతర్దానము నొందెను. పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రతంబు నాచరించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపద లనుభవించి యంత్య కాలమున నక్షత్ర మండలంబు చేరెను. ఓ ధర్మరాజా ! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబు నందు కానం బడుచున్నాడు. మఱియు అగస్త్య మహాముని ఈ వ్రతంబు నాచరించి లోకంబునం ప్రసిద్ది పొందెను. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతంబొనర్చి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అత్యంబున స్వర్గము పొందిరి. కావున ఈ వ్రత కధను సాంతము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యములు అనుభవించి పిదప ఉత్తమ పదంబును (స్వర్గ ప్రాప్తిని) పొందుదురు.

ఇట్లు భవిష్యోత్తర పురాణమున చెప్ప బడిన అనంత వ్రత కధ సంపూర్ణం

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వామన జయంతి

          దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారం వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి.

పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః | పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||

ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.

ఆ కథ ఏమిటంటే…? పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.

ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో “దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని” పలికి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.

ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.

అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై… వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా..”వామనుడు మూడు పాదముల భూమి”ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.  సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెబుతున్నాయి.

వామన నోము విధానం :-

కథ : ఒకానొక రాజుకు ‘‘అమృతవల్లి” అనే అందమైన కూతరు వుండేది. ఆనాటి యువరాణులలోని అందాచందాలలో ఆమెకు ఆమె సాటి. దీంతో కేవలం అలనాటి రాజకుమారులే కాకుండా… వివాహితులైన ఎందరో రాజులు ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆశించేవారు. దీంతో ఇతర రాజకుమార్తెలు అమృతవల్లిపై ఈర్ష్య పెంచుకున్నారు. ప్రతిఒక్కరాజు ఆమెవైపే మొగ్గుచూపడంతో.. ఎవరు వీరిని వివాహం చేసుకోరు అనే భంగిమలో పడిపోయారు.

దీంతో వీరంతా ‘తంబళ’ అనే మంత్రికురాలి దగ్గరకు వెళ్లి అమృతవల్లి అందాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపించారు. దాంతో తంబళ అమృతవల్లికి  హాని  తలపెట్టింది. అది మొదలు ఆమె అందాచందాలన్ని మాయమైపోయాయి. అలా జరిగిన ఆమెను చూసి.. రాజులందరూ ఆమె మీద పెంచుకున్న మోజును తగ్గించుకున్నారు. ఆమెను వివాహమాడేందుకు ఏ ఒక్కరాజు కూడా ముందుకు రాలేదు.  

ఇదిలావుండగా…. తీర్థయాత్రలకు వెళ్లిన రాజపురోహితుడు తిరిగి వచ్చి ఈ విషయం గురించి తెలుసుకున్నాడు. తరువాత రాజు దగ్గరకు వెళ్లి… ‘‘మహారాజా! నేను కాశీలో వుండగా యువరాణిగారి విషాదగాధ గురించి తెలిసింది. అనుక్షణమే అక్కడ వున్న పండితులతో దీని గురించి చర్చించాను. రాజకుమార్తెకు జరిగినటువంటి సంఘటనలుగాని, కోపాలు, శాపాలు వంటివి వామన నోము చేయడం ద్వారా తొలగిపోతాయని వారు చెప్పారు. తొందరగా యువరాణి ద్వారా వామన నోమును పట్టించండి” అని చెప్పాడు. ఇలా నోమును నిర్వహించిన పదిరోజులకల్లా అమృతవల్లి తన అందాన్ని, ఆరోగ్యాన్ని తిరిగి పొందింది.

ఈ నోము ప్రతిఏటా భాద్రపద మాసంనాడు నిర్వహించుకుంటారు. ఆరోజు పైన చెప్పకున్న కథను ఒకసారి చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. ఈ భాద్రపద మాసంలో శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం వుండాలి. ఇలా ఉపవాసం వుండడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తారు. శుద్ధ ద్వాదశి శ్రవణా నక్షత్ర ఘడియలలో, గాలీ వెలుతురూ బాగా వీచి, మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశంలో ఈ పూజను నిర్వహించుకోవాలి.

గడ్డకట్టి, కదలకుండా వుండే పెరుగును ఒక పాత్రలో తీసుకోవాలి. పాత్ర మీద వామనుడి స్వర్ణ ప్రతిమ ఉంచి, ఒక చేత్తో పెరుగన్నం గిన్నె, మరొక చేత్తో అమృత కలశం ధరించి వున్నట్లుగా భావిస్తూ యధాశక్తి పూజించి దద్దోజనం నివేదించాలి. ఇలా పూజ కార్యక్రమాలు పూర్తయిన తరువాత ప్రసాదాన్ని 12 మంది పేదవారికి కడుపునిండా పెట్టి, ఆ తరువాత తాము తినాలి. ఈ విధంగా ఈ పూజను 12 సంవత్సరాల వరకు చేయాలి.

ఉద్యాపనం : 12వ సంవత్సరంలో ఈ నోము నిర్వహించుకునేటప్పుడు 12 పెరుగు పాత్రలు, 12 వామన విగ్రహాలు, 12 దద్దోజన పాత్రలు దానమివ్వడం సంప్రదాయం.

బాల్యం నుంచి ఈ నోమును నోచుకుంటే.. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి రోగాలు సోకవు. గాలీధూళీ సోకవు. ఈ నోము నిర్వహించిన తరువాత కూడా ఎటువంటి ఆపదలు ఏమైనా సంభవిస్తే.. మళ్లీ ఇంకొకసారి ఈ నోమును రెండుసంవత్సరాలవరకు నిర్వహించుకుంటే అంతా శుభమే జరుగుతుంది. భక్తిగా ఆచరిస్తే గొప్ప ఫలితం ఉంటుంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

పరివర్తన ఏకాదశి /పార్శ్వ ఏకాదశి /వామన ఏకాదశి

భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబదించినదిగా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలి ని పాతాల లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశి వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకమ్.

శ్రీ మహా విష్ణువు అది శేషు ని పైన శయనించి (ధక్షనయనంలో) విశ్రాంతి లోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అని అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో “దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని” పలికి అదృశ్యమవుతాడు.

ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.

అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై… వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. “వామనుడు మూడు పాదముల భూమి”ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.

శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

రాధాష్టమి

       రాధాకృష్ణ తత్త్వం : భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమి అని అంటారు. సకల లోక జగజ్జనని రాధాదేవి అవతార సందర్భాన్ని స్మరించుకుంటూ, ఆమె మహత్వాన్ని ధ్యానిస్తూ ఈ పండుగను చేసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడి అర్ధాంగి రాధాదేవి అని, ఆమె శ్రీకృష్ణుడి కంటే భిన్నమైంది కాదని బ్రహ్మవైవర్త పురాణం నలభై ఎనిమిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ అధ్యాయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు స్వయంగా రాధ చరిత్రను వివరించాడు. రాధ తనకు ఇష్టదైవమైన శ్రీకృష్ణుడి భార్యేనని పార్వతికి వివరించాడు పరమేశ్వరుడు. పూర్వం బృందావనంలో ఉన్న రాసమండలంలో శతశృంగ పర్వతం మీద రత్న సింహాసనంపై శ్రీకృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నప్పుడు జగత్తుకంతటికీ శ్రేయస్సును కలిగించే ఓ విచిత్రం జరిగింది. స్వేచ్ఛామయుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎందుకో తాను ఆడుకోవాలనే కోరిక కలిగింది. ఆయన సంకల్పాన్ని అనుసరించి ఆ మరుక్షణంలోనే ఆయనే రెండు రూపాలుగా మారాడు. ఆ రూపాలలో కుడివైపు ఉన్నది శ్రీకృష్ణుడిగానూ, ఎడమవైపు ఉన్నది రాధాదేవిగాను రూపు దాల్చాయి. రాధాదేవి రూపం అమూల్య రత్నాభరణాలను ధరించి ఉంది. బంగారు వన్నెగల వస్త్రాలను ధరించి ఓ అద్భుతమైన రత్నసింహాసనం మీద కూర్చొని ఉంది. ఆమె శరీర కాంతి బంగారు వర్ణంలోనే ఉంది. చక్కని పలువరుస కలిగి చిరునవ్వుతో ఆమె కనిపించింది. శరత్కాలంలోని పద్మం వంటి ముఖంతో మాలతీ పుష్పమాల చుట్టి ఉన్న కొప్పుతో, సూర్యతేజస్సు వంటి తేజస్సు కలిగిన రత్నాల మాలను, గంగానది ధారలాంటి ముత్యాలను ధరించి ఆమె ఎంతో అందంగా కనిపించింది. నవయౌవనంతో ఉన్న ఆ మాతను చూడగానే శ్రీకృష్ణుడు ఎంతో ఆనందించాడు. కృష్ణుడి ఆనందాన్ని చూసి రాధాదేవి తన అందాన్ని మరింతగా ఇనుమడింపజేసింది. ఆ ఇద్దరూ పరస్పరం ఎంతో అనురాగాన్ని ప్రదర్శించుకున్నారు. ఇద్దరి మధ్యా అన్ని విషయాల్లోనూ సమానత్వం కనిపించింది. ఆ రాసమండలంలోని మాలతి, మల్లికా నికుంజంలో శ్రీకృష్ణుడు రాధాదేవితో క్రీడించడమే కాక నిత్యం ఆమెను స్మరించడం, ఆమె నామాన్నే జపిస్తూ ఉండటం చేశాడు. రాధ అనే పేరే ముక్తి పథానికి సోపానం లాంటిదని కృష్ణుడే స్వయంగా అన్నాడు. రా అనే అక్షరాన్ని పలికిన భక్తుడు అత్యంత దుర్లభమైన ముక్తిని పొందుతాడు. రాధ అనే అక్షరాన్ని పలకగానే శ్రీహరి నివసించే వైకుంఠ ధామానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా నేరుగా వెళ్లిపోతాడు. ఆ కారణంతోనే రాధ నామ జపానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అలా రాధాకృష్ణుల రాసమండలంలో మనోహరంగా విహరిస్తున్నప్పుడే విశ్వ సృష్టి విస్తరించింది. శ్రీకృష్ణుడి వామపార్శ్వం నుంచి రాసేశ్వరి అయిన రాధాదేవి ఆవిర్భవించగానే ఆమె అంశ వల్ల, అంశాంశల వల్ల దేవతా స్త్రీలంతా ఆవిర్భవించారు. ఆమె నుంచే సర్వ గోపికా సంఘం ఉత్పన్నమైంది. శ్రీకృష్ణుడి నుంచి సమస్త గోపజనం ఆవిర్భవించారు. రాధాదేవి ఎడమ పార్శ్వం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ మహాలక్ష్మి జగత్తు అంతటికీ అధిష్ఠాన దేవతగా, గృహలక్ష్మిగా పిలుపులందుకుంది. వైకుంఠనాథుడు, చతుర్భుజుడు అయిన నారాయణుడికి ఆ మహాలక్ష్మి భార్య అయింది. ఆమె అంశ స్వరూపమే రాజ్యలక్ష్మి. ఆ దేవి రాజులకు రాజసంపదను ఇస్తూ ఉంటుంది. రాజ్యలక్ష్మి అంశ స్వరూపమే మర్త్యలక్ష్మి. ఆ దేవి భూలోకంలో అందరి ఇళ్లల్లోనూ దీపాధిష్ఠాన దేవతగా అయింది. అలా సర్వదేవతా స్త్రీలకు మూలకారణమైన ఆ రాధాదేవి శ్రీకృష్ణుడి వక్షస్థలం మీద ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఆ పరమాత్మ ప్రాణాలకు అధిష్ఠాన దేవత. సృష్టిలోని చరాచరాలన్నిటికీ రాధాకాంతుడైన ఆ పరమాత్మే పతి. ఆయనకు ఇష్టసఖి రాధ. రాధాదేవి కృష్ణుడికి తన ప్రాణాలకంటే ప్రియమైనది, విష్ణువుకు మాత కూడా ఆమే. ఆమెనే మూల ప్రకృతి అని అంటారు. సత్పురుషులకు తప్ప బ్రహ్మాది దేవతలకు సయితం ఆ రాధాదేవి దర్శనం సులభంగా లభించదు. శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో పలు చోట్ల రాధకూ, తనకూ భేదం లేదని, రాధను విడిచి తనను మాత్రమే పూజించినందువల్ల ఫలితం ఉండదని స్పష్టంగా చెప్పాడు. రాధాకృష్ణుల ప్రేమ తత్త్వాన్ని అందరూ అనుసరిస్తూ వారిని పూజించడమే ఉచితమైందని పరమేశ్వరుడు పార్వతికి రాధ ఆవిర్భావాన్నీ, ఆమె గొప్పతనాన్నీ గురించి వివరించాడు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)