Categories
Vipra Foundation

కార్తీకపురాణం మొదటి అధ్యాయం : కార్తీక మాసం విశేషం

       ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.

          పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.

         మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

        దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.

         వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.

కార్తీక వ్రతవిధానం

          “ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.

        వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

భగినీ హస్త భోజనం సోదరి ఇంట భోజనం చేయాలి

        కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది.

“భయ్యా ధూజీ” అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

        ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ … “ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు” అంటాడు. దీనికి కారణం ఉంది.

        యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఆంధ్రులకు దానిని గురించి తెలిసినా పెద్దగా పాటించరు. రక్షాబంధనం కూడా అంతే ఈ మధ్య ప్రాంతీయ భేదాలు సమసిపోవటం కారణంగా ఇవి మన దాకా కూడా వచ్చాయి. కాని, రాఖీ పూర్ణిమ ప్రాచుర్యం పొందినంతగా భగినీ హస్తభోజనం ఆంధ్రదేశంలో వ్యాప్తి పొందలేదు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీక పురాణాధ్యాయ పరిచయము – కార్తీక స్నానసంకల్పం – కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.

        శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెలరోజులూ పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోటముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ దూప దీప నైవేద్యాలను సమర్పిస్తారు.

       ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకిమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టనివారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాటు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం.అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్

నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర:

       కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి.కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనదే.నదీ స్నానం,ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో అచరించదగ్గ విధులు.కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో,పిల్లకాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలో గంగ, యమున, గోదావరి,కృష్ణ,కావేరి,నర్మద, తపతి,సింధు మొదలైన నదులన్నింటి నీరూ ఉరిందని భావించాలి.

కార్తీక పురాణాధ్యాయ పరిచయము

1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.

2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.

3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.

4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ.

5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాతమూషికములు మోక్షము నొందుట.

6 వ అధ్యాయము : దీపదానవిధి – మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట.

7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.

8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణాధన్యోపాయం, అజామీళుని కథ.

9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము.

10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.

11 వ అధ్యాయము : మంథరుడు – పురాణమహిమ.

12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామదాన మహిమ.

13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము.

14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక్మాసశివపూజాకల్పము.

15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట.

16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట.

17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.

18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.

19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము.

20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.

21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట.

22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట.

23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట.

24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.

25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట.

26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.

27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.

28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ.

29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట – ద్వాదశీ పారాయణము.

30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.

      కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.

 నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

 శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.

 ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.

 ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.

ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు

 శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ

 దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి ” నాగుల చవితి

 కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి

 ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ‘ఉత్థాన ఏకాదశీ లేదా ‘ప్రబోధన ఏకాదశి ‘ అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.

శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి

 పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

కార్తీక స్నానసంకల్పం

ప్రార్ధన : ‘నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమొస్తుతే || (అనుకుంటూ ఆచమనం చేసి)

సంకల్పం : దేశ కాలౌ సంకీర్త్య – గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశే: పౌదరీ కాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్తర్ధం, ఇహ జన్మని జన్మాన్తరేచ బాల్య కౌమార యౌవన వార్ధ కేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్య వస్థాషు జ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వత:  ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానా మపానో దనార్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, క్షేమ స్థయిర్య విజయా యురారోగ్యై శ్వర్యాదీనాం ఉత్తరోత్త రాభి వ్రుద్ధ్యర్ధం శ్రీ సివకేశావానుగ్రహ సిద్ధర్ధం వర్షే వర్షే ప్రయుక్త కార్తీకమాసే ………. వాసర (ఏ వారమో ఆవారం పేరు చెప్పుకొని) యుక్తాయాం ………… టితో (ఏ టితో ఆ తిథి చెప్పుకోవాలి) శ్రీ ………. (గోత్ర నామం చెప్పుకొని) గోత్రాభి జాతం ……. (పేరు చెప్పుకొని) నామతే యోహం – పవిత్ర కార్తీక ప్రాతః స్నానం కరిష్యే || (అని, స్నానం చేయాలి). అనంతరం

మంత్రం : ” తులారాశింగతే సూర్యే, గంగా త్ర్యైలోక్య పావనీ,

సర్వత్ర ద్రవ రూపేన సాసం పూర్ణా భవేత్తదా || “

అనే మంత్రముతో – ప్రవాహానికి ఎదురుగానూ, తీరానికి పరాన్ గ్ముఖం గానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆలోడనం చేసి, 3  దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి, తీరం చేరి, కట్టుబట్టల కోణాలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణ మంటారు. అనంతరం (పొ) డి వస్త్రాలను, నామాలను ధరించి, ఎవరెవరి కులాచారాల రీత్యా వారు వారు సంధ్యావందనం గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని – శివుణ్నో, విష్ణువునో అర్చించి ఆవునేతితో దీపారాధానం చేసి, అనంతరం స్త్రీలు  తులసి మొక్కనూ, దీపాన్నీ- పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.

దానముచేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్  – ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన – మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని – ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును. 

దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం

(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).

ఓం ………… ఏతత్ ……………. ఇదం

( ఓమితి చిత్త నిరోధనస్యాత్ – ఏటదితి కర్మణ్యే – ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం – (స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).

 అద్యరీత్యా – దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని – దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) – ఇదం అముకం దానం  గృహ్ణామి ……….. (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ‘ పరిగ్రుహ్ణామి లేదా ‘ స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.

శ్రీ శివ స్తోత్రం

శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం

వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||

శ్రీ విష్ణు సోత్రం

శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం

లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం

వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం ||

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కేదారేశ్వర వ్రత విశిష్ఠత, వ్రతవిధానము

      మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం ఈ వ్రతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు..

వ్రతవిధానము

      భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు మీరు కోరిన వరంబియ్యగలడు.

శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం, శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్చ దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన మంత్రము

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం.

శ్రీ కేదారేశ్వర పూజ

ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో // శూలం ఢమరుకంచైవ – దదానం హస్త యుగ్మకే

కేదారదేవ మీశానం ధ్యాయేత్త్రిపుర ఘాతినమ్ //

శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి.

(పుష్పము వేయవలెను).

ఆవాహనం:

కైలాస శిఖరే రమ్యే పార్వత్యా స్సహితోప్రభో

ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి.

(పుష్పము వేయవలెను).

ఆసనం:

సురాసుర శిరోరత్న – ప్రదీపిత పదాంబుజ

కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగృహ్యతామ్

.శ్రీ కేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి.

(అక్షతలు వేయవలెను.)

పాద్యం:

గంగాధర నమస్తేస్తు – త్రిలోచన వృషభద్వజ

మౌక్తికాసన సంస్థాయ – కేదారాయ నమోనమః

శ్రీ కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

అర్ఘ్యం గృహాణ భగవన్ – భక్త్యాదత్తం మహేశ్వర

ప్రయచ్ఛ మే మనస్తుభ్యం – భక్తానా మిష్టదాయకం

శ్రీ కేదారేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

ఆచమనం:

మునిభిర్నా రదప్రఖ్యైర్నిత్న మాఖ్యాత వైభవః

కేదారదేవ భగవాన్ గృహాణా చమనం విభో

శ్రీ కేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమరపయామి.

(నీరు చల్లవలెను.)

పంచామృతస్నానం :

స్నానం పంచామృతైర్దేవ శుద్ధ శుద్ధోద కైరపి

గృహాణగౌరీరమణత్వద్భక్తేన మాయార్పితమ్

శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృతస్నానం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)

స్నానం:

నదీజల సమాయుక్తమ్ మయాదత్త మనుత్తమం

స్నానమ్ స్వీకురుదేవేశ – సదాశివ నమోస్తుతే

శ్రీ కేదారేశ్వరాయ నమః స్నానం సమర్పయామి

(నీరు చల్లవలెను.)

వస్త్రం:

వస్త్రయుగ్మం సదాశుభ్రం – మనోహర మిదం శుభం

శ్లో// వేదసూక్తసమాయుక్తే యజ్ఞసామ సమన్వితే

శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:

స్వర్ణ యాజ్ఞోపవీతం కాంచనం చోత్త రీయకం

రుద్రాక్షమాలయా యుక్తం – దదామి స్వీకురు ప్రభో

శ్రీ కేదారేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:

సమస్త గ్రంధద్రవ్యాణాం – దేవత్వమసి జన్మభూః

బ్భక్త్యాసమర్పితం ప్రీత్యా – మయాగంధాది గృహ్యతామ్.

శ్రీ కేదారేశ్వరాయ నమః గందాన్ సమర్పయామి.

(గంధం చల్లవలెను.)

అక్షతలు :

అక్షతో సి స్వభావేన – భక్తానామక్షయం పదం

దదాసినాథ మద్దతైరక్షతైః స్స్వీయతాం భవాన్

శ్రీ కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి.

(అక్షతలు సమర్పించవలెను)

పుష్పసమర్పణం:

కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వై రభ్యర్చిత సురైః

కుంకుమైః పార్దివై రేభిరిదానీమర్చతాం మయా

శ్రీ కేదారేశ్వరాయ నమః పుష్పాణీ సమర్పయామి.

(పుష్పాములు వేయవలెను)

తతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివస్య దక్షిణభాగే (కుడివైపున) బ్రహ్మణే నమః ఉత్తరభాగే (ఎడమప్రక్క) విష్ణవే నమః మధ్యే (మధ్యలో) కేదారేశ్వరాయ నమః

(పుష్పాములు వేయవలెను)

అథాంగపూజా:

మహేశ్వరాయ నమః – పాదౌ పూజయామి,

ఈశ్వరాయ నమః – జంఘే పూజయామి,

కామరూపాయ నమః – జానునీ పూజయామి,

హరాయ నమః – ఊరూం పూజయామి,

త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి,

భవాయ నమః – కటిం పూజయామి,

గంగాధరాయ నమః – గుహ్యం పూజయామి,

మహాదేవాయ నమః – ఉదరం పూజయామి,

పశుపత్యై నమః – హృదయం

పినాకినేన నమః – హస్తాన్పూజయామి,

శివాయ నమః – భుజౌ పూజయామి,

శితి కంఠాయ నమః – కంఠం పూజయామి,

విరూపాక్షాయ నమః – ముఖం పూజయామి,

త్రినేత్రాయ నమః – నేత్రాణీ పూజయామి,

రుద్రాయ నమః – లలాటం పూజయామి,

శర్వాయ నమః – శిరః పూజయామి,

చంద్రమౌళ్యై నమః – మౌళిం పూజయామి,

పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి.

తదుపరి కేదారేశ్వర అష్టోత్తర శతనామావళి చదవగలరు

అనంతరము సూత్రపూజ చేయవలెను

తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను

ధూపం:

దశాంగం ధూపముఖ్యంచ – హ్యంగార వినివేశితం

ధూపం సుగంధై రుత్పన్నం – ట్వాంప్రీణయతుశంకర

శ్రీ కేదారేశ్వరాయ నమః ధూపమాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

దీపం:

యోగీనాం హృదయే ష్వేవ – జ్ఞానదీపాంకురోహ్యపి

బాహ్యదీపో మయాదత్తో – గృహ్యతాం భక్త గౌరవాత్

శ్రీ కేదారేశ్వరాయ నమః దీపం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

నైవేద్యం:

తైలోక్యమసి నైవేద్యం – తత్తే తృప్తిస్తథాబహిః

నైవేద్యం భక్త వాత్పల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా

(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)

ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)

ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

శ్రీ కేదారేశ్వరాయ నమః మహానైవేద్యం సమర్పయామి.

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:

నిత్యానంద స్వరూపస్త్యం – మోగిహృత్కమలేస్థితః

గౌరీశభక్త్యామద్దత్తం – తాంబూలం ప్రతిగృహ్యతామ్

శ్రీ కేదారేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి.

పానీయం:

అర్ఘ్యం గృహాణ భగవన్ – భక్త్యాదత్త మహేశ్వర

ప్రయచ్చ మే మనస్తుభ్యం – భక్త్యానా మిష్టదాయక

శ్రీ కేదారేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి.

నీరాజనం:

దేవేశ చంద్ర సంకాశం – జ్యోతి సూర్యమివోదితం

భక్త్యాదాస్యామి కర్పూర నీరాజనం మిదం శివః

శ్రీ కేదారేశ్వరాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

మంత్రపుష్పమ్:

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.

నమో హైరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే

శ్రీ కేదారేశ్వరాయ నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.

( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )

ప్రదక్షిణ :

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

భూతేన భువనాదీశ – సర్వదేవాది పూజిత

ప్రదక్షిణం కరీమిత్యాం – వ్రతం మే సఫలం కురు

శ్రీ కేదారేశ్వరాయ నమః ప్రదక్షిణం సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:

హరశంభో మహాదేవ – విశ్వేశామరవల్లభ

శివశంకర సర్వత్మా – నీలకంఠ నమోస్తుతే

శ్రీ కేదారేశ్వరాయ నమః నమస్కారాన్ సమర్పయామి.

సర్వోపచారాలు:

ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి, సమస్తరాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార, పూజాం సమర్పయామి.

ప్రార్ధనం:

అభీష్టసిద్దిం కురుమే శివావ్యయ మహేశ్వర !

భక్తానాం మిష్టదానార్ధం మూర్తీకృతకళేభరః

పూజా తోరము తీసుకొనునపుడు పఠించు మంత్రము

కేదారదేవదేవేశ భగవన్నంబికా పతే !

ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యమం ప్రభో !!

తోరము కట్టుకొనుటకు పఠించు మంత్రము :

ఆయుశ్చ విద్యాం చ తథా సుఖంచ సౌభాగ్యవృద్దిం కుర దేవ దేవ

సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మాంరక్ష కేదార నమో నమస్తే //

వాయనమిచ్చునప్పుడు పఠించునది :

కేదారం ప్రతిగృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకో భాభ్యాం కేదారాయ నమో నమః //

ప్రతిమాదన మంత్రం :

కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ తస్మాదస్యాః ప్రదానేన మమాస్తు శ్రీరచంచలా //

శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సుప్రీతః సుప్రసన్నోవరదోభవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.

పూజా విధానము సంపూర్ణం.

అష్టోత్తర శతనామావళి :

ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం శశిరేఖాయ నమః

ఓం పినాకినే నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శూలపాణయే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం అంబికానాధాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం శితికంఠాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కామారయే నమః

ఓం గంగాధరాయ నమః

ఓం కాలకాలయ నమః

ఓం భీమాయ నమః

ఓం మృగపాణయే నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సర్వమయాయ నమః

ఓం అశ్వనీరాయ నమః

ఓం పరమాత్మవే నమః

ఓం హవిషే నమః

ఓం సోమాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం కపర్ధినే నమః

ఓం శంకరాయ నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం శ్రీకంఠాయ నమః

ఓం భవాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం కపాలినే నమః

ఓం అంధకాసురసూదనాయ నమః

ఓం లలాటక్షాయ నమః

ఓం కృపానిధయే నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం జటాధరాయ నమః

ఓం కవచినే నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషభరూఢాయ నమః

ఓం సోమప్రియాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః

ఓం యజ్జమయాయ నమః

ఓం పంచవక్త్రాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం గణనాధాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం దుర్ధార్షాయ నమః

ఓం గిరీశాయ నమః

ఓం భుజంగభూషణాయ నమః

ఓం గిరిధన్వినే నమః

ఓం కృత్తివాసనే నమః

ఓం భగవతే నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం జగద్వాయ్యపినే నమః

ఓం వ్యోమకేశాయ నమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం అహిర్భుద్న్యాయ నమః

ఓం అష్టమూర్తయే నమః

ఓం సాత్వికాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం అజాయ నమః

ఓం మృణాయ నమః

ఓం దేవాయ నమః

ఓం అవ్యయాయ నమః

ఓం పూషదంతభిదే నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం భగనేత్రవిదే నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం తారకాయ నమః

ఓం హిరణ్యరేతసే నమః

ఓం అనఘాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిప్రయాయ నమః

ఓం పురారాతయే నమః

ఓం ప్రమధాధిపాయ నమః

ఓం సూక్ష్మతనవే నమః

ఓం జగద్గురవే నమః

ఓం మహాసేన జనకాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం స్థాణవే నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అనేకాత్మనే నమః

ఓం శుద్ద విగ్రహాయ నమః

ఓం ఖండపరశువే నమః

ఓం పాశవిమోచకాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం మహాదేవాయ నమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం హరాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం అనంతాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ సదాశివాయ నమః

అధసూత్రపూజ :

ఓం శివాయ నమః ప్రధమ గ్రందింపూజయామి.

ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రందింపూజయామి.

ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రందింపూజయామి.

ఓం వృషభధ్వజాయ నమః చతుర్ధ గ్రందింపూజయామి.

ఓం గౌరీశాయ నమః పంచమ గ్రందింపూజయామి.

ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రందింపూజయామి.

ఓం పశుపతయే నమః సప్తమ గ్రందింపూజయామి.

ఓం భీమాయ నమః అష్టమ గ్రందింపూజయామి.

ఓం త్రయంబకాయ నమః నవమ గ్రందింపూజయామి.

ఓం నీలలోహితాయ నమః దశమ గ్రందింపూజయామి.

ఓం హరాయ నమః ఏకాదశ గ్రందింపూజయామి.

ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రందింపూజయామి.

ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రందింపూజయామి.

ఓం శంభవే నమః చతుర్ధశ గ్రందింపూజయామి.

ఓం శర్వాయ నమః పంచదశ గ్రందింపూజయామి.

ఓం సదాశివాయ నమః షోడశ గ్రందింపూజయామి.

ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రందింపూజయామి.

ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రందింపూజయామి.

ఓం శ్రీకంఠాయ నమః ఏకోన వింశతి గ్రందింపూజయామి.

ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రందింపూజయామి.

ఓం మృత్యుంజయాయనమః ఏకవింశతి గ్రందింపూజయామి

కేదారేశ్వర వ్రతకథ :

      సూతపౌరాణీకుడు శౌనకాది మాహర్షుల గాంచి ఇట్లనియె, ఋషిపుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం బనునొక వ్రతంబు గలదు. ఆ వ్రత విధానంబును వివరించెదను వినుండు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకలసంపద లనుభవించి, పిదప జీవసాయుజ్యంబు నొందుదురు. ఓ ఋషి శ్రేష్ఠులారా ! ఈ వ్రత మాహాత్మ్యంబును వివరించెద వినుండు, భూలోకమునందీశాన్యభాగంబున పుగుంపులుతో గూడి యున్నను గిరిత్కాల మేఘములుంబోలుచు నిఖిలమణి నిర్మితంబైన శిఖరముల చేతను, పలురంగులైన లతావిశేషములచేతను, బహువిదంబులగు పుష్పఫలాదులచేతను, నానావిధములైన పక్షుల చేతను మరియు ననేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తాల తమాల రసాల హింతాల వకుళాశోకచందన దేవదారు నారికేళామ్రపనసనాగపున్నాగ చంపకాదివృక్షముల చేతను నదియును గాక నానాతరు విశేషముల చేత భాసిల్లునట్టి ఉద్యానవనముల చేత బ్రకాశించుచూ నిఖిల కళ్యాణ ప్రదంబులై సర్వజన నమస్కృతంబై కైలాసం అని పేర్కొనబడియొక పర్వతశ్రేష్టము గలదు. అందు సద్గుణైశ్వర్యసంపన్నులగు మహనీయులగు యోగులచేతను, సిద్ధ, గంధర్వ, కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబయియున్న యా పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రథమగణములచే బరివేష్ఠింపబడి, భవానీ సమేతుడై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచుండి, ప్రసన్నుడై కూర్చుండియున్న యొక సమయంబున చతుర్ముఖాది సురలందరికి దర్శనమిచ్చె. అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మఱియు ఇంద్రాదిదేవతలును వశిష్ఠాది మహర్షులును, రంభా మొదలగు దేవతా స్త్రీలును, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలను,సేనానియు, గణపతియును, తత్సామీప్యంబును బొందియున్న నంది, భృంగి మొదలగు ప్రమధ గణములు తమను పరివేష్టించి కొలుచుచున్నట్టి భవానీ వల్లభుని యత్యద్భుతమంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకులా స్వామి యనుజ్ఞ వడసి గానము జేసిరి. రమణీయంబయి శ్రావ్యంబగు వ్యాదలయలతో గూడి నృత్యమొనర్చిరి. అప్పుడా వేల్పు బానిసెల లోపల మిగుల సొగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించె, ఆ సమయంబున భృంగిరిటి భక్తవరుండా స్వామి సన్నిధియందు తత్ వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా నా పార్వతి కైలాసాధిపతియొక్క పూర్వభాగమునందుండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాసముజనించె. అట్టి యాశ్చక్యకరంబగు హాసమువలన నప్పుడా పర్వతగుహలు నిండునటుల గొప్ప కలకలధ్వనికలిగె, ఇట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడా భృంగిరిటిని జూచి, నీచేత మిగలు హర్ష ప్రవృద్ధంబైన నాట్యము చేయబడెనని మెచ్చి మదంబంది యా భక్తుని యనుగ్రహించె. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు కలుగటంజేసి ప్రీతుండై సకల విధులచేత గౌరవింపబడి, సమాహితచిత్తుడై వినయముతో గూడి యా పార్వతీదేవిని వదలి యీశ్వరునికి మాత్రము ప్రదక్షిణమొనర్చి యాస్వామికి వందన మాచరించె. అప్పుడు పూజ్యురాలగు మృడానియు చిరునవ్వుతో గూడినదై తన భర్తయగు నప్పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామీ ! ఈ భృగిరిటి నన్ను విడిచి మీకు మాత్రము ప్రదక్షిణం బాచరించుటకు గారణంబేమి? వినవేడుకైయున్నది? ఆనతీయవో యని వేడగా, నా శశిశేఖరుండు ఓ ప్రియురాలా ! చెప్పెద వినుము.

పరమార్థవిదులగు యోగులకు నీవలన ప్రయోజనంబులేమింజేసి నాకు నమస్కరించెనని సెలవివ్వగా నా పరమేశ్వరి మిగుల వ్రీడనుబొంది ఆ భర్తయందున్న తన శక్తి నాకర్షించగా స్వామి త్వగస్థి విశిష్టామాత్రానయవుండాయె. అంతట నాదేవియు సారహీనురాలై వికుటరాలయ్యె, పిదప నాదేవి కోపించి దేవతల చేత నూనడింపబడినదై కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధములగు సింహ, శరభ, శార్దూల, గజ, మృగాదులచేత సేవింపబడియు నిత్య వైరంబుడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచేత నిబిడంబగు నానావిధ వృక్ష, లతా, గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్ఠ ప్రదంబై యున్న గౌతమాశ్రమమున బ్రవేశించె. అంత నా గౌతముండు వన్యంబులైన హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను గ్రహించుకొని వనంబునుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమంబగు నిది మిగుల శోభిల్లుచున్న రేకులవంటి కన్నులు గలిగి యలంకృతరాలైయున్న యామహేశ్వరింగనుకొని పూజ్యురాలవైన ఓ భగవతీ ! నీవిచటకేతెంచుటకు కారణంబేమి? అని యడుగ నద్దేవియు నాజడధారికి తన విషాదకరమును వచించి నమస్కరించుచు ఓయీ ! మునీశ్వరుడా ! యే వ్రతము యోగ సమ్మతంబైనదో ఏ వ్రతానుష్టానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో యట్టి వ్రతము ఉపదేశిపుము మనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనంబాచరించి యీప్సితార్థప్రదంబగు శ్రీమత్కేదారనామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశింపగా నంత నాదేవియు నావ్రతానుష్ఠాన క్రమంబానతీయుమని వేడగానిట్లు చెప్పదొడంగె. భాద్రపద శుక్లమునందు శుద్ద మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులె చేత హస్తమునందు ప్రతిసరమును దరించి యాదినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున దాన్యరాశియందు పూర్ణకుంభముంచి యిరువది యొక్క సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని, శక్తి కొలది సువర్ణముగాని యుంచి, గంధపుష్పాక్షతలచే నర్చించి యిరువది యొక్కరైన బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి యచ్చట నాకేదారదేవుని ప్రతిష్టింపజేసి, చందనాగరు కస్తూరీ కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను, తాంబూలమును, వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథా శాస్త్రముగ ధూపదీపాదులచేత బూజించి యేకవింశతి సంఖ్యాకులైన భక్ష్యభోజ్యచోష్యలేహ్యాదులను కదళీఫలములను నైవేద్యంబుజేసి తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రము జేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి, వ్రతమును లెస్సగా ననుష్ఠించి, ఈశ్వరునకు మనస్సంతుష్ఠి చేసిన యెడల ప్రీతుండై యావృషభద్వజుండు నీవు కోరిన వరంబియ్యగలడు అని వచించిన నా కాత్యాయనియునట్లే యగును గాక ! యని యాచరించె. అంత పరమశివుండు సంతుష్ఠాతరంగుడయి , యిచ్చటికి దేవగుణంబులతోడ వచ్చి నిజశరీరార్థము నీకిచ్చెదననగా పార్వతి యుప్పొంగి శంకర దేహార్థమునండి లోకానుగ్రహము చేయదలచి తన భర్తయగు నీశ్వరునితో నీ వ్రతంబాచరించిన వారలకు సకలాభీష్టసిద్ది గలుగునటుల యనుగ్రహించితిరేని యెల్లవారు నాచరింతురనగా నట్లే యగుగాక! యని యంగీకరించి సురసంఘములతో గూడ నంతర్హితుండయ్యె. మరికొంత కాలమునకు శివభక్తి యక్తుండగు చిత్రాంగదుడను గంధర్వుండు నంది కేశ్వరునివలన నా వ్రతక్రమంబెఱిగి మనుష్య లోకమునకుంజని వారల కుపదేశింప వలయునను నిచ్ఛగలవాడై యుజ్జయనీ పట్టణమునకు బోయి వజ్రదంతుడను రాజున కుపదేశింప నతడు ఆ వ్రతమును గల్పోక్త ప్రకారంబుగా నాచరించి సార్వభౌముండాయెను.

       మరికొంత కాలమునకు నా పట్టణంబుననున్న వైశ్యునకు బుణ్యవతియనియు, భాగ్యవతియనియు, నిద్దరు కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రియొద్దకుబోయి కేదారవ్రత మాచరించునట్లాజ్ఞ యొసంగుమని వేడగా నేనుమిగులరిక్తుండను. దానికీవలయుసామాగ్రి లేమింజేసి మీ సంకల్పంబు మాను డనగా ఓ తండ్రీ ! నీ యాజ్ఞ మాకు పరమదన్యంబు గాన నాజ్ఞయొసగు మని సెలవు పుచ్చుకొని బాదరించుట వటవృక్షమూలంబున కూర్చుండి ప్రతిరసము గట్టుకొని యధావిధిగా పూజింప వారల భక్తికిమెచ్చి యీశ్వరుడు అప్పుడు వలయుసామాగ్రినిచ్చెను.

       అంతట వారలు చక్కగా వ్రతం బాచరించుటవలన నమ్మహాదేవుడు ప్రీతుండై యక్కన్యల కాయురారోగైశ్వర్యములును దివ్యరూపంబుల ఒసంగి యంతర్హితుడయ్యెను. పిమ్మట నావ్రతమాహాత్మ్యము వలన నుజ్జయనీ పట్టణమేలుచున్న రాజు పుణ్యవతియును కన్యను చోళభూపాలుడు భాగ్యవతియును కన్యను పాణీగ్రహ మొనర్చినందువలన నావైశ్యుండు ధనసమృద్ధుండై సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖంబున నుండ నంత వారిలో రెండవదియైన భాగ్యవతియనునది యైశ్వర్యమదమోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడలింపబడి పుత్రునితోడ యడవిని తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని యిల్లుచేరి, ఇచ్చట తన బుత్రుని జూపి యోపుత్రా! యక్కయగు పుణ్యవతిని యుజ్జయనీ పట్టణరాజు వివాహమాడియున్నాడు. నీవచ్చటికి జని దానింజూచి ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మనగా నతండా పట్టణమునకు బోయి పెద్దతల్లికి తనయొక్క దుస్సహంబగు కష్టమును దెలపగా నా పుణ్యవతియును సుతునకు విస్తారముగా దనమునిచ్చె, అంతనంతండా ధనమును దీసుకొనివచ్చునెడల మార్గంబున నదృశ్యరూపుండైన యద్దేవునివలన నాధనము నపహరింపబడగా దోదూయమాన మానసుండై నిలువబడియున్న వానితో నీశ్వరుండదృశ్యుండై యో చిన్నవాడా ! వ్రతభ్రష్ఠుల కీధనము గ్రహించనలవిగాదని చెప్పగా నావాక్యము విని విస్మయంబంది యా చిన్నవాడు మరల పూర్వమువలె నచటికింజని యీశ్వరోక్తంబగు వృత్తాంతమును దెలుపగా నా పుణ్యవతి యాలోచించి పుత్రుని వ్రతం బొనర్రింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించునటుల చెప్పవలయునని ద్రవ్యము నొసంగి పంపగా నతండు బయలు వెడలి వచ్చునెడ మార్గంబున నప్రయత్నంబుగ పూర్వము గొనిపోయిన ధనమంతయు స్వవశమైనందున సంతసించి, సర్వము గ్రహించుకొని కాంచీపట్టణమును ప్రవేశించి సమయంబునకు జనియె . అంతట తల్లిదండ్రులతో గూడి సుఖముల ననుభవించుచుండె. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు ఈ అవిచ్చిన్నంబగు నిఖిల సంపదల ననుభవించుచుండిరి, కావున యెవ్వరైనను యదోక్త ప్రకారము నీ వ్రత మహత్మ్యమును భక్తియుక్తులైన వినిన, చదివిన నట్టి వారందరును, శ్రీ మహాదేవుని యనుగ్రహము వలన ననంతంబులగు నాయురారోగ్య ఐశ్వర్యములను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెనని సూతుండు శౌనుకాదులకు చెప్పగా శ్రీ వ్యాసభట్టారsకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను.

కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణము.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

దీపావళి వృత్తాంతము

        పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది.మెదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి.

నరక చతుర్దశి నాడు సూర్యోదయమునకు ముందుగా లేచి అభ్యంగన స్నానం చేయాలి. నరకుని ఉద్దేశించి నాలుగువత్తులతో దీపమును దానము చేయాలి. సాయంకాలం గుళ్ళలో దీపాలని వెలిగించాలి. ఆనాటి వంటలో మినప ఆకులతో కూర వండుకుంటారు.

అమావాస్యనాడు సూర్యుడు ఉదయిస్తున్న ప్రత్యూష కాలంలో తలస్నానం చేయాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో అన్నదానాలు చేస్తారు. సాయంత్రము లక్ష్మీ పూజ చేయాలి. దేవాలయాలలో, ఇంటి ముంగిళ్ళలో దీపాలను అలంకరించుకోవాలి. కొన్ని ప్రాంతాలలో చెక్కతో చెట్లలాగా చేసి అందులో దీపాలను ఉంచుతారు. వీటినే దీప వృక్షాలంటారు. కొన్ని గుళ్ళల్లో ఇత్తడి దీప వృక్షాలు కూడా దర్శనమిస్తాయి. ఆకులతో దొన్నెలు కుట్టి వాటిలో నూనెతో దీపాలను చేసి నదులలో, కొలనులలో, నూతులలో(బావి) తెప్పలవలే వదులుతారు.

ఆనాటి రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని(అలక్ష్మి, పెద్దమ్మారు,దారిద్ర్యానికి సూచన) ఇండ్లనుండి తరుముతారు. తరువాత ఇంటిని ముగ్గులతో అలంకరించి, బలి చక్రవర్తిని స్థాపించి పూజింస్తారు. ఇది మూడవ రోజు. బలిపాడ్యమి. ఉదయము జూదములాడుతారు. ఆరోజు గెలిచిన వారికి సంవత్సరమంతా జయం కలుగుతుందని నమ్మకం. ఈనాడు గోవర్ధన పూజ కూడా చేస్తారు.

దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటానడానికి అనేక కథలు చెప్తారు.అందులో ప్రధానమైనవి:

1.నరకాసుర వధ

2.బలిచక్రవర్తిరాజ్య దానము

3.శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మవటం (భరత్ మిలాప్) పురస్కరించుకుని

4.విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు

ఈ కథలలో బలిచక్రవర్తికథ తప్ప మరి ఏది వ్రతగ్రంథములలోను,ధర్మశాస్త్రగ్రంధములలోను కనిపించదు. ధర్మసింధువంటిఅన్ని గ్రంధములలోను బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడింది. నేడు దీపావళి అనగానే మనకు గుర్తువచ్చే బాణాసంచ కాల్పులుకు ఆధారమైన నరకాసురవధ ఎంతో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ కథ ప్రస్తావన వ్రతగ్రంధములలో కనపడదు.నరకభయనివారణార్థము అభ్యంగనస్నాము, దీపములతో అలంకరించటం,లక్ష్మీపూజ తదితర విషయములు తెల్పబడ్డాయి. ఈ వ్రత గ్రంధాలలోని “నరక”శబ్దానికి నరకము అనుటానికి మారుగా “నరకాసురుడు” అని అన్వయించి తర్వాతివారు పురాణకథతో జోడించి ఉంటారని కొందరు పండితుల అభిప్రాయం.ఇందులో జ్యోతిశ్శాస్త్ర సంబంధమగు రహస్యం ఇమిడి ఉన్నదని కొందరి అభిప్రాయం.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

  1. నరకాసురవధ వృత్తాంతము

విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రములో దాక్కున్నాడు. విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి సముద్రమున ప్రవేసించి, ఆ రాక్షసుడిని చంపి, భూమిని మరల పైకి తీసుకువచ్చాడు. ఆ సమయమున వరహా అవతారముననున్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. విష్ణ్డువు తాను త్రేతాయుగమున రామావతారమున రావణ సంహారము చేసిన పిదప నీవు శిశువును ప్రసవింపగలవని భూదేవికి తెలుపాడు.

త్రేతాయుగమున జనకునకు సీతను భూమి నుండి దొరికినపుడు,భూదేవి జనకుని వద్ద తనకొక ఉపకారము చేయవలెనని ప్రమాణము చేయించుకున్నది. ఆ ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమరుని పెంచి, నరకుడని నామమునిచ్చి విద్యా బుద్ధులను నేర్పించాడు.నరకునకు పదహారు సంవత్సరముల వయసు వచ్చే సమయానికి అతనిని భూదేవి గంగాతీరమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది.విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి అయుధాన్ని, దివ్య రధమును అనుగ్రహించి,కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరము రాజధానిగా పాలించుకొనుమని చెప్పి భూదేవితోగూడి అదృశ్యమయ్యాడు.

నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపరయుగంలో నరకునకు బాణుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు. కోపించిన వశిష్టులవారు “నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అవమానించుతున్నావు. నీ జన్మదాత చేతనే మరణించెదవు” అని శపించారు. ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలు, రాక్షసులనుండి మరణములేకుండునట్లు వరమును పొందాడు. ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను బాధించాడు. పదహారువేల రాజకన్యలను చెరపట్టాడు.

వాని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడగు శ్రీకృష్ణుని ప్రార్ధించగా, ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు. ఆయనతో సత్యభామాదేవి కూడా రణరంగానికి వచ్చింది. ఘోరయుద్ధం జరిగింది. చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశినాటి రాత్రి రెండుజాములకు నరకాసుర సంహారం జరిగింది. నరకుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు.ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ రెండు రోజులు ప్రజలు ప్రతియేటా పండుగ చేసుకొంటున్నారు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

2 బలిచక్రవర్తి రాజ్యదాన వృత్తాంతము

బలిచక్రవర్తి అజేయ బలపరాక్రమాలు కలవాడు. మాహాదాత. అతడు దేవతలను జయించి తన వద్ద బందీలుగా ఉంచుకున్నాడు. ఇంద్రాదులు విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి బలి తపోఫలము ముగిసిన తరువాత అతనిని జయిస్తానని తెలిపాడు. కొంత కాలానికి అదితి గర్భాన వామనరూపంలో జన్మించాడు. ఒకనాడు బలి మహా యజ్ఞమును చేయసాగాడు. అక్కడు వామనావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు వచ్చి మూడు అడుగుల స్థలం ఇవ్వమని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి సరే అనగానే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో భూమిని, మరొక అడుగుతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడవ అడుగుకు స్థలం చూపమని అడుగగా, బలిచక్రవర్తిని తన తలమీద వేయాల్సిందింగా కోరతాడు. బలి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదించాడు.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

3 శ్రీరాముడు రావణ సంహారానంతరము అయోధ్యకు తిరిగి చేరుకున్న వృత్తాంతము

పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యా నగరాన్నితిరిగి చేరుకున్నరోజున తిథి అమావాస్య ! ఆ రాత్రంతా చీకటిమయంగా వుండటంతో ఆ చీకటిని పారదోలేందుకుగాను అయోధ్యా నగరవాసులు లక్షల సంఖ్యలోకాగడా దీపాలని వెలిగించి నగరాన్నిపట్ట పగలులా ప్రకాశించేలా వెలుగుల్నిచిమ్మించారు. అలా పౌరులు హర్షాతిరేకంతో ఎదురెళ్ళి శ్రీరామునికి స్వాగతం పలికిన అరేయి కాస్తా దీపావళిగా మన దేశచరిత్రలో నిలిచిపోయింది. ఆనాడు అయోధ్యానగర పౌరులు పొందిన ఆనందాన్ని ఈతరంలో మనం కూడా పంచుకుంటున్నట్లుగా ప్రతి ఏటా ఆసంతోష ఘడియల స్మరణార్థం ఈ దీపావళి పండుగని జరుపుకుంటున్నాము.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

లక్ష్మీపూజ విశిష్టత

      దీపం శ్రీ లక్ష్మీదేవి స్వరూపం … అనేక దీపాల నడుమ ఆ తల్లికి ఆహ్వానం పలకడమే దీపావళి. సాధారణంగా అమావాస్య రోజున శుభ సంబంధమైన కార్యక్రమాలు చేపట్టరు. కానీ ఈ అమావాస్యని ‘మహానిశి’గా భావిస్తుంటారు. లక్ష్మీదేవిని ఆరాధించడానికి … ఆమె అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

      ఈ మహానిశి వేళలోనే అమ్మవారు తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేయడానికి బయలుదేరుతుంది. ఇతరులకి హానికలిగించని విధంగా ఎవరైతే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో, ఏ ఇంట నిత్యం దైవారాధన జరుగుతూ వుంటుందో అమ్మవారు ఆ ఇంటి దగ్గర ఆగుతుంది. తాను ప్రసాదించే దానిలో ఇతరులకి సహాయపడే గుణం కలిగినవారి ఇంటి వాకిట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అనునిత్యం ఏ ఇల్లు పచ్చనితోరణాలతో .. చక్కని ముగ్గులతో .. పసుపు కుంకుమల అలంకరణలతో కళకళలాడుతూ వుంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అక్కడ లక్ష్మీకళను ఉంచుతుంది.

      అందువలన ఈ రోజు ఉదయాన పూజా మందిరాన్ని పూలమాలికలతో అలంకరించాలి. పూజామందిరం ఎదురుగా చెక్కపీట వేసి దానిపై పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై స్వస్తిక్ గుర్తు గీయాలి. స్వస్తిక్ గుర్తుపై రాగిచెంబును కలశంగా వుంచి … ఆ కలశంలో కొన్ని నీళ్లు పోసి అందులో కొన్ని గులాబీ రేకులు … కొన్ని సగ్గుబియ్యం … రెండు నాణాలు వెయ్యాలి. కలశంపై కొబ్బరిబొండాం వుంచి దానికి స్వస్తిక్ గుర్తుపెట్టాలి. ఆ తరువాత పసుపు గణపతిని తయారుచేసి … దీపారాధన చేసి పూజ ప్రారంభించాలి.

      అమ్మవారి వెండి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి ఆ తరువాత మట్టి ప్రమిదల్లో 12 దీపాలను నువ్వుల నూనెతో వెలిగించాలి. తామరపువ్వులతోను .. బంతులతోను .. గులాబీలతోను .. పసుపు అక్షింతలతోను అమ్మవారిని పూజించాలి. ఆ తల్లికి నువ్వులతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. తమకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని అమ్మవారిని కోరుకోవాలి.

       పూజ పూర్తయిన తరువాత అక్షింతలను తలపై ధరించాలి. ఈ విధంగా అమ్మవారిని సంతోషపెట్టడం వలన, కోరిన వరాలను ప్రసాదిస్తుందని అంటారు. ఈ రోజున అమ్మవారు, ధనలక్ష్మి .. ధాన్యలక్ష్మి .. ధైర్యలక్ష్మి .. విద్యాలక్ష్మి .. విజయలక్ష్మి .. సంతాన లక్ష్మి .. రాజ్యలక్ష్మి .. వీరలక్ష్మి రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

“బాలల దినోత్సవం” – జవహర్లాల్ నెహ్రు జయంతి

        బాల్యం ఓ అద్భుత వరం. బాల్యం ఓ తీయని అనుభూతి. బాల్యంతో కాలం కూడా స్నేహం చేస్తుంది. తిరిగిరాని బాల్యమంటే తరిగిపోతున్న వయసుకు ఆందోళన. అది మరలిరాదని తెలిసినా ఆగిపోని ఆవేదన. ఐనా బాల్యం గుర్తుకొస్తే చాలు భారమైన వయసు తేలికవుతుంది. బాల్యం నాటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే ఆవిష్కరింపజేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలుచుకోని మనిషి ఉండడు. ముద్దు ముద్దు మాటలతో, చిలిపి అల్లరి చేష్టలతో ఇంటిల్లిపాదినీ అలరించే బాలలంటే అందరికీ ప్రేమే. ప్రకృతితో సహా అందరి ప్రేమకు అర్హులైనవారు వీరు మాత్రమే. అందుకే వారి కోసం ప్రత్యేకమైన ఆటలు, ప్రత్యేకమైన పాటలు, ప్రత్యేకమైన తోటలు. ఆ కోవలోనే వారికోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతోంది బాలల దినోత్సవం. ప్రపంచం మొత్తం జరుపుకునే వేడుక ఇది. ఒక్కో దేశంలో ఒక్కొ రోజు జరుపబడుతుంది. మన దేశంలో నవంబర్ 14న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు జన్మ దినాన జరుపబడుతోంది. నెహ్రూ జన్మదినోత్సవం నాడే ఈ వేడుక జరపుకోడానికి నెహ్రూకి బాలలపట్ల ఉన్న ప్రేమే కారణం. ఆయన పసిపిల్లలతో దిగిన అనేక ఫొటోలు పిల్లలపట్ల ఆయన ప్రేమను తెలియజేస్తాయి.

        బాలల దినోత్సవం ఒక పండుగలా దేశమంతటా నిర్వహించబడుతూంది. ఈ వేడుకకు అంతర్జాతీయంగా వచ్చిన గుర్తింపు బాలలకు ఈ వేడుకపట్లగల మక్కువను తెలియజేస్తూంది. తమకంటూ ఓ ప్రత్యేక వేడుక ఉన్నదన్న ఆనందం వారిలో ఆ రోజు ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మరిపించే రీతిలో ఈ దినోత్సవం జరుపబడుతోంది. ఇందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అభినందించి తీరవలసిందే. పైగా ఆ రోజు వివిధ టీవీ చానెళ్ళలో వీరికోసం ప్రసారం చేయబడే వివిధ కార్యక్రమాలు కూడా వీరికి ఎంతో ఉత్తేజాన్నిస్తుంటాయి. మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగానే ఈ వేడుకలు నిర్వహించబడుతున్నా అందరు బాలల దగ్గరకు ఈ వేడుకలు చేరువవుతున్నాయా అంటే ఆలోచించకతప్పదు. వీధి బడుల్లో కూడ కాస్తో కూస్తో ఘనంగానే నిర్వహించబడుతున్న ఈ వేడుకలు వీధి బాలలకు మాత్రం చేరువవడంలేదన్నది ఓ చేదు వాస్తవం. బాలలంటే బడి పిల్లలే కానక్కరలేదు. సాటి పిల్లల్లా విద్య ద్వారా ఉత్తమ భవిష్యత్తును అందుకోవాలని ఆశించినా, ఆర్ధిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి, బడికి దూరమై బ్రతుకు భారాన్ని అతి పిన్నవయసులో మోయవలసిన పరిస్థితిలో భవిష్యత్తంటే ఏ పూటకాపూట కడుపు నింపుకోవడమే అనే ఏకైక ఆలోచనకు బలవంతంగా బద్ధులై బ్రతికే సగటు బాలుడు బడి బాలుడులాంటి బాల్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు?

        బాలలందరికీ నిర్దేశించబడిన ఈ బాలల దినోత్సవం చదదువుకునే బాలలకు మాత్రమే పరిమితం కావడం వెనుక ముఖ్యంగా ఆర్ధిక కారణాలే ఉంటాయి. ఆర్ధిక అసమానత్వం బాలల్లో కూడా అంతరాయాలను పెంచడం దారుణం. తల్లిదండ్రులకు మాత్రమే పరిమితం కావలసిన ఆర్ధిక విషయాలు బాలలకు బాధ్యత కావడం మన చట్టాల అమలులోని లోపభూయిష్టతను చూపుతోంది. దేశ ఆర్ధి పరిస్థితి మెరుగుదలకు ఇతర రంగాలపట్ల శ్రద్ధ చూపించే మన సంస్కరణలు బాల వ్యవస్థ సంస్కరణకు ప్రత్యేకమైన శ్రద్ధను చూపడం లేదు. “నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు” అన్న స్లోగన్ ఏవిధంగా భావి భారత పౌరులో నిర్దిష్టంగా చెప్పలేకపోతుంది. విద్యా సంస్కరణలు ఎన్ని వచ్చినా, విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన పధకాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు వంటి ఎన్నో సంస్కరణలు బాలల అభ్యున్నతి కోసం చేపట్టినా వీధి బాలల వ్యవస్థను రూపుమాపలేకపోతుంది. మధ్యలో బడి మానేసిన విద్యార్ధులకోసం బ్రిడ్జి స్కూళ్ళ నిర్వహణ కొంతవరకు ఉపయోగపడుతున్నా బాలలను పూర్తిగా సమాజంలో భాగస్వాములను చేయలేకపోతోంది. చట్టాలను కఠినంగా అమలుచేయడమే కాదు సమాజంలో ఆ చట్టాల పట్ల అవగాహన పెంపొందేందుకు కృషి చేయాలి.

        బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్ను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటుచేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది. ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది. కేవలం యునిసెఫ్ మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ సంస్థలు బాలల కోసం ప్రత్యేకంగా స్థాపించబడి వారి ఉన్నతికి కృషి చేస్తున్నప్పటికీ బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన చెందకపోవడం వెనక గల కారణాలను అన్వేషిస్తే పేదరికమే ముందు స్థానంలో నిలుస్తుంది. దానికితోడు పేద కుటుంబ వ్యవస్థకు నానాటికీ పూర్తిగా దూరమవుతున్న విద్య మరో కారణమవుతుంది. బాల వ్యవస్థ పునర్నిర్మాణం కోసం ప్రవేశపెట్టబడ్డ పధకాలను గురించి తెలుసుకోలేని నిస్సహాయతను ఇది కల్పిస్తోంది. మెరుగైన సమాచారం వారికి అందుబాటులోకి రాకుండాపోతోంది. అందుకు ఏ ఒక్కరినో నిందించనవసరంలేదు. ఇప్పటికే పల్స్ పోలియోను సమర్ధవంతంగా నిర్వహిస్తూ వికలాంగులకు వీలులేని వ్యస్థను రూపొందించడానికి ప్రభుత్వం ఏళ్ళ తరబడి ఎంతగానో కృషి చేస్తోంది. ఆ దిశలో సాధించిన ముందడుగు సామాన్యమైందేమీ కాదు. పోలియో నిర్మూలనకు నడుంకట్టి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటుకు చేస్తున్న కృషి త్వరలోనే సత్ఫలితాలు ఇవ్వనుంది. దీనితోపాటు హెచ్.ఐ.వి./ఎయిడ్స్కు గురైన అమాయక బాలలకు పునరావాసాన్ని కల్పించడంలోనూ నిరంతరం కృషిచేస్తూ ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇప్పుడిప్పుడే చట్టాన్ని సమర్ధవంతంగానూ, కఠినంగానూ అమలుచేసేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా సైకిల్ షాపుల్లోనూ, మెస్సుల్లోనూ, టీ బంకులలోనూ, ఇళ్ళలో పనిమనుషులగానూ బాల్యం కర్పూర హారతై పోతున్న కుటుంబాలలో వెలుగు రేఖలను ప్రసరింపజేస్తోంది. అనేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాలల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తోంది.

అసలు వీటన్నిటికి తోడు బాలలకు కావలసిందేమిటో వారినుండే తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా ఉందన్న విషయం ముందుగా గమనించాలి. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తమకు సముచితమనిపించిన పధకాలను రూపొందించడం, తమకు అనువైన రీతిలో వాటిని నిర్వహిస్తూ పోవడం ద్వారా మాత్రమే బాల కార్మిక వ్యవస్థగానీ, బాలలకు సంబంధిన మరే పధకమైనాగానీ ఫలవంతం అవుతుందనుకోవడం సమంజసం కాదు. బాలల మనోభావాలను అర్ధం చేసుకునే వ్యవస్థ ఆవిర్భావం ముందుగా జరగాలి. బాలలు-వారి పరిసరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. బాలలంటే ఉన్న చులకన భావం పోయి బాల భవిత చల్లన అనే భావన అందరి హృదయాన కలిగిన రోజునే నిజమైన బాలల దినోత్సవం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ధన త్రయోదశి

     ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.

      వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం- ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు న్విహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని, అత్యంత సంరంభంగా జరుపుతారు. ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు. ‘ఆమాదేర్ జ్యోతిషీ’ గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. ‘ధన్ తేరస్’ పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.

      ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి, పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

      ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య, సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే, శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.

       యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడు తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య, తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాశులుగా పోసి, ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ, బంగారం, వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి, వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ, ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి, బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి- ధన త్రయోదశి.

      ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మాన వులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.

‘చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ

తషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ అని శాస్త్ర వచనం.

‘చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగి స్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

ఆశ్వీయుజ కృష్ణ ద్వాదశి —— గోవత్స ద్వాదశి

      ఆశ్వీయుజ బహుళ ద్వాదశి.  ఈ రోజున దూడతో కూడిన గోవును పూజించాలి.  ప్రదోష కాలంలో నున్న ద్వాదశీ రోజున చేయాలి.  ఈ రోజున వత్స (దూడ) తో కూడి వున్న గోవును పూజించాలి.  రాగి పాత్రతో దాని పాదమందు అర్ఘ్యము ఇవ్వాలి. 

       క్షీర సాగర మదనంలో కామధేనువై జన్మించి దేవాసురులచే పూజించ బడినట్టి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతా  నీకు నమస్కారము.  ఈ అర్ఘ్యం గ్రహించు అని అర్ధం.

         ఋగ్వేదంలో “ఋక్కులు” పశువుల యొక్క ప్రాముఖ్యతను వివరించాయి.  ఋగ్వేద  కాలమునాటి ఆర్యులు పశు సంపద మీద ఎక్కువగా ఆధార పడ్డారు కాబట్టి ఆవుకు అతి పవిత్రమైన స్థానమిచ్చి చాలా ప్రాముఖ్యతను ఆపాదించారు.  ఈ కాలంలో పశువులను “గోధనముగా”భావించడమే కాకుండా, ఎవరికి ఎక్కువ పశు సంపద వుంటుందో, వారిని “గోమతులు” అని పిలిచేవారు. 

           ఈ రోజున తైల పక్వము, స్థాలీ పక్వము గోసంభందమైన పాలు, పెరుగు, నెయ్యి మొదలగు అన్నింటిని విడిచి పెట్టాలి.  రాత్రి పూత మినుముతో చేసిన ఆహారాన్ని తిని భూమి మీదనే విశ్రమించాలి.  ఇలా ఐదు రోజులు ఈ విధిని ఆచరించాలి.  ఈ ఐదు రోజులు రాత్రి తోలి అర్ధ భాగంలో నీరాజన విధి నిర్వర్తించాలి.  ఈ ద్వాదశి వెళ్ళిన మరునాడు త్రయోదశి రోజున అపమృత్యు నివారణార్ధం యమునికి బలిదీపాన్ని ఇవ్వాలి. 

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చంద్రోదయ ఉమావ్రతం (అట్లతద్ది వ్రతం)

    ప్రతీ సంవత్సరం ఆత్మీయుజ బహుళ తదియనాడు ఈ చంద్రోదయ ‘‘ఉమావ్రతం – అట్లతద్ది” ని స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. సాధారణంగా కొన్ని వ్రతాలు పెళ్లయిన స్త్రీలు మాత్రమే పెట్టాల్సి వుంటుంది. అయతే ఈ వ్రతం మాత్రం వయస్సుతో ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా… చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరు కలిసి చేసుకుంటారు.

తమ జీవితంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా, తమ పిల్లాపాపలతో జీవితాంతం సుఖసంతోషాలతో గడపాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

ఈ వ్రతంలో చిన్నపిల్లలు కూడా పాల్గొంటారు కాబట్టి.. వివాహం అయిన స్త్రీలు ఆ పిల్లలను చూసి తమ చిన్నతనంలో గడిపిన మధురజ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా చిన్నచిన్న పల్లెలప్రాంతాలలో ఈ వ్రతాన్ని ఎంతో ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించుకుంటారు.

పల్లెటూర్లలో ఈ పండుగను ‘‘గోరింటాకు పండుగ”  లేదా ‘‘ఊయల పండుగ” గా వ్యవహరించుకుంటారు.

పండుగ విశేషాలు :

ఇక పండుగకు ముందురోజు భోగి అని అంటారు. ఈ భోగిరోజు రాత్రి చిన్నపిల్లలనుంచి పెద్దవారివరకు ప్రతిఒక్కరు తమ చేతులకు, పాదాలకు గోరిటాకు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్న తరువాత ఎవరి చేతులు అయితే బాగా ఎర్రగా పండుతాయో వారు చాలా అదృష్టవంతులని, వారి కోరికలు నెరవేరుతాయని స్త్రీలు విశ్వసిస్తారు. ఈ పండుగరోజు స్త్రీలు తమ ఇంటిపెరిటిలో ఊయలను కట్టుకుంటారు.

ఇక మరుసటిరోజయిన ఆశ్వీయుజ బహుళ తదియనాడు (అట్లతద్ది) తెల్లవారుజామునే లేచి, తమ రోజువారి కార్యక్రమాలను ముగించుకుని, పెరుగన్నాన్ని భుజించుకుంటారు. తరువాత అందరి ఇళ్లల్లో వున్నవారిని లేపి, ఆటలు ఆడుకుంటూ.. పాటలు పాడుకుంటూ.. ఊయల ఊగుటలో వెళ్లి సంతోషంగా తమ సమయాన్ని గడిపి, ఇతరులకు కూడా కనువిందు చేస్తారు.

అట్లతద్ది రోజు మొత్తం స్త్రీలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుకుని చంద్రోదయం అయ్యేంతవరకు ఉపవాసం వుంటారు. చంద్రోదయం కాగానే తలంటుస్నానాలు చేసుకుని, అట్లు వేసుకుని నివేదనకు సిద్ధం అవుతారు. అనంతరం షాడశోపచారములతో ఉమాశంకరులను పూజించుకుంటారు.

ఈ విధంగా ఈ వ్రతాన్ని నిర్వహించుకోవడం వల్ల పెళ్లికాని అమ్మాయిలకు సమర్థవంతమైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వివాహితులకు సుఖసంతోషాలతో కూడిన జీవితం వరిస్తుందని ప్రతిఒక్కరు ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు.

కథ :

పూర్వం ఒక మహారాజు కావేరి అనే కూతురు ఎంతో అందంగా వుండేది. ఆమె తన తల్లి ద్వారా వ్రతమహత్యం గురించి తెలుసుకుని, తన రాజ్యంలో వున్న స్నేహితురాళ్లయిన మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురితో కలిసి ఈ ‘‘చంద్రోదయ ఉమావ్రతాన్ని’’ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంది.

అయితే కొన్నిరోజుల తర్వాత కావేరి స్నేహితులందరికీ వివాహ వయస్సు రాగానే వారందరూ సమన్వయవంతులైన భర్తలతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఈమెకు మాత్రం పెళ్లిగాని, ఎటువంటి సంబంధాలు కాని వచ్చేవి కావు.

అప్పుడు మహారాజు తన కూతురుకి పెళ్లిజరగడం లేదన్న ఆవేదనతో ఆమె పెళ్లికి కావలసిన అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కేవలం వృద్ధులు, కురూపులు మాత్రమే ముందుకు రాగలిగారు.

తన తండ్రి చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం అవుతున్నాయన్న బాధతో.. కావేరి రాజ్యాన్ని వదిలేసి సమీపంలోవున్న అరణ్యానికి చేరుకుని, ఘోరతపస్సు చేయసాగింది.

ఒకరోజు పార్వతీపరమేశ్వరులు లోకకళ్యాణం కోసం సంచారం చేస్తుండగా… ఘోరతపస్సు చేస్తున్న కావేరి అనుగ్రహం కలిగి ఆమె ముందు ప్రత్యక్షమవుతారు.

అప్పుడు వారు ‘‘ఓ కన్యాకుమారీ! ఎందుకు నువ్వు ఇంత ఘోర తపస్సును ఆచరిస్తున్నావు? నీకు ఏం వరం కావాలో కోరుకో” అని కావేరికి ఒక వరాన్ని ప్రసాదిస్తారు.

కావేరి.. ‘‘ఓ పార్వతీపరమేశ్వరులారా! నేను నా తల్లి ద్వారా తెలుసుకున్న ‘‘చంద్రోదయ ఉమావ్రతం” (అట్లతద్ది వ్రతం)ను.. నా స్నేహితులతో కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించాను. అయితే వారందరి కోర్కెలమేరకు వారు మంచి భర్తలతో వివాహం చేసుకుని వెళ్లిపోయారు. నా పెళ్లికోసం నా తండ్రిగారు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అవ్వడమే గాక… కురూపులు, వృద్ధులు అయినవారు మాత్రమే దొరుకుతున్నారు. ఇందులో నా దోషమేంటి’’ అని దు:ఖంతో తన ఆవేదనను వ్యక్తపరిచింది.

అప్పుడు వారు… ‘‘ఓ సౌభాగ్యవతి! ఇందులో నీ దోషం ఏమీ లేదు. నువ్వు ఆ వ్రతాన్ని నోచుకున్న తరువాత ఉపవాస దీక్షను సహించలేక… సొమ్మసిల్లి పడిపోయావు. ఈ విషయాన్ని నీ తల్లి ద్వారా తెలుసుకున్న నీ సోదరులు.. ఇంద్రజాల విద్యను ప్రదర్శించి.. అద్దం ద్వారా నీకు చంద్రుడిని చూపించారు. దాంతో నువ్వు ఉపవాస దీక్షను విరమించావు. ఆ విధంగా నీ వ్రతం భంగిమం కావడం వల్లే నీకు ఇలా జరుగుతోంది. నీ సోదరులు కూడా నీ మీద ప్రేమతో ఇలా చేశారు. అయినా ఇందులో బాధపడాల్సిన విషయం ఏమీలేదు. రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా ఈ వ్రతాన్ని ఆచరించు. నీకు తప్పకుండా మంచి భర్త లభిస్తాడు”  అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతారు.

ఆ తరువాత రాకుమార్తె అయిన కావేరి.. ఎంతో భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి… ఎంతో అందమైన, నవయవ్వన రాకుమారుడిని పొందతుంది. నిత్యం ఉమాశంకరులను పూజిస్తూ.. సుఖసంతోషాలతో జీవితాన్ని గడపసాగింది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)