Categories
Vipra Foundation

రథ సప్తమి

       మాఘ శుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రధసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రధసప్తమి. షష్ఠితో కూడిన సప్తమి (తిధిద్వయం) కలిసి రావడం వల్ల రధసప్తమి అత్యంత శ్రేష్టమైనది. ఆ రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధికఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు  ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని (నమస్తే ఆదిత్యత్వమేవ-చందోసి) సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు. కోణార్క్, అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్దం. అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ఞ, ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు  దర్శనమిస్తాడు.

       రధసప్తమి నాడు సూర్య వ్రతాన్ని ఆచరించేవారు నెత్తిమీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకొని స్నానం చేయాలి.

స్నాన విధానం:

       వ్రతచడామణిలో “బంగారు, వెండి, రాగి, ఇనుము, వీనిలో దేనితోనయినా చేసిన దీపప్రమిదను సిద్ధం చేసుకొని, దానిలో (నెయ్యి, నువ్వులనూనె, ఆముదం, ఉప్పనూనె – వీనిలో ఏదో ఒకదానితో) దీపం వెలిగించి, ఆ దీపాన్ని నెత్తిపై పెట్టుకొని, నదీతీరానికిగానీ, చెరువుల వద్దకుగానీ వెళ్లి, సూర్యుణ్ణి ధ్యానించి, ఆ దీపాన్ని నీళ్లలో వదలి, ఎవరునూ నీటిని తాకకముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులుగానీ, ఏడు రేగు ఆకులుగానీ తలపై పెట్టుకోవాలి.

సప్తమీవ్రతం:

       రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి – మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి!

       పంచాంగకర్తలు రధసప్తమిని ‘ సూర్యజయంతి ‘ అన్నారు. వైవస్వతమన్వాది ఈనాడే కావడం విశేషం. ఈ రోజు అభోజ్యార్క వ్రతాదులు ఆచరించాలి (భోజనం చేయకుండా చేసే వ్రతం). వైవస్వతుడు ఏడవమనువు. సూర్యుడు వివస్వంతుడు. ఇతనికొడుకు కనుక వైవస్వతుడు (ఇప్పటి మనువు వైవస్వతుడే). ఇతని మన్వంతరానికి రధసప్తమియే సంవత్సరాది – అనగా ఉగాది. మన్వంత రాదిపర్వదినం పితృదేవతలకు ప్రియమైనది. కనుకనే రధసప్తమినాడు – మకర సంక్రాంతివలనే – పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంతోషం కల్గించాలి. చాక్షుషమన్వంతరంలోని ద్రవిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే, ఈ కల్పంలో వైవస్వతుడుగా పుట్టినాడు.

జిల్లేడు, రేగు ఆకుల ప్రాశస్త్యం:

       రధసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగుఆకులను (రేగుపండ్లు కూడ) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి. మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిల్చి వున్నాయి. వాటిల్ని గురించి తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా సత్ఫలితం మాత్రం తప్పక వుంటుంది. కానీ తెలిపి ఆచరించడం ద్వారా తాను లాభపడుటేగాక, ఇతరులతోనూ చేయించి, వారిను సత్ఫలవంతుల్ని చెయవచ్చు.

రుద్రాక్ష చెట్టు:

       ఈ చెట్టు ఎక్కువగా ఉత్తరహిందూస్ధాన్‌లో వున్నాయి. వీటి గింజలే రుద్రాక్షలు. వీని భేధాలూ, ప్రభావాలూ జగద్విదితం. వాతశ్లేష్మాన్ని హరిస్తాయి. రుద్రాక్షలు నానబెట్టి, ఆ నీళ్లు సేవిస్తే మశూచిక రాదు. రుద్రాక్షలు శివసంబంధమైనవి.

జిల్లేడు(అర్క):

       శ్లేష్మ, పైత్య, వాత దోషాలను హరిస్తుంది. చర్మరోగాలను, వాతం నొప్పులను, కురుపులను, పాము, తేలు విషాన్నీ, పక్షపాతాన్నీ, బోదకాలు వ్యాధినీ, పోగొటుతుంది. ఇందులో తెల్లజిల్లేడు చాలా శ్రేష్టం. ఉపయోగించి విధానం తెలిస్తే దీని ఆకులు, పాలు, పూలు, కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి, ఉపశమనం కల్గిస్తాయి.

రేగు చెట్టు:

        (బదరీ) దీని గింజలు మంచిబలాన్ని కల్గిస్తాయి. ఆకులు నూరి, తలకు రుద్దుకొని, స్నానం చేస్తూంటే వెంట్రుకలు పెరుగుతాయి. దీని ఆకుల్ని నలగకొట్టి, కషాయం కాచి, అందులో సైంధవలవణం కలిపి తీసుకొంటే బొంగురు గొంతు తగ్గి, స్వరం బాగా వస్తుంది. దీని పండ్లు చలువ చేస్తాయి. మంచిరక్తాన్ని కల్గిస్తాయి. మూలవ్యాధిని పోగొట్తాయి. పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. (జిల్లేడు, రేగు, విషయంలో కొన్ని దోషాలూ ఉన్నాయి. కనుక వేద్యుని ద్వారా తెలిసికొని ఉపయోగించాలి.)

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,

సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.

       “సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం”- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుణ్ణి పూజించాలి. పిదప తర్పణం చేయాలి.

మాఘప్రశస్తి:

       మా+అఘ=పాపంలేనిది – పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే! శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా – రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

        రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం:

దాజన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు,

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,

మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః

ఇతి సప్తవిధం పాపం స్నానా న్మే సప్తసప్తికే!

సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి.

జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన రధసప్తమీ! నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక!

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మాఘ మాసం ప్రాముఖ్యత

         “మాఘ మాసం” ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి “శుక్ల పక్ష చవితి” దీనిని “తిల చతుర్థి”అంటారు. దీన్నే “కుంద చతుర్థి” అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున “డుంఢిరాజును” ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు.”కుంద చతుర్థి” నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు

దు:దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!”

అని చేసిన తరువాత

సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!”

అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.

        ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. “మాఘశుద్ద పంచమి”ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే “సరస్వతీదేవి” జన్మించిందట. ఈనాడు “రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.

       అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే “సూర్య సప్తమి”అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.

       సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే “శమంతకమణి” ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి “మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!” శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా “శివరాత్రి”వరకూ అన్నీ పర్వదినాలే.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చొల్లంగి అమావాస్య – నాగోబా జాతర

చొల్లంగి అమావాస్య :

      పుష్య మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయల్లో ఒకటైన తుల్యభాగ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ప్రతిఏటా జరిగే చొల్లంగి తీర్ధానికి ఎంతోమంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటు పెద్దలకు పిండప్రదానం చేయడం, చొల్లంగిలో వెలసిన స్వామి వారిని అర్చించడం జరుగుతుంది.

నాగోబా జాతర : నాగోబా జాతర గురించి మీకు తెలుసా?….  

పుష్య అమావాస్యరోజు.. లోకమంతా నలుపురంగు పులుముకుంటుంది..

అదే చీకటిలో వెలుగులు వెతుకుతారు ఆదివాసీలు!

నిష్ఠగా నాగదేవునికి దీపారాధన చేసి పూజిస్తారు!

పవిత్ర గంగాజలంతో అభిషేకిస్తారు!

మూడురోజులపాటు కన్నులపండువగా జాతర నిర్వహిస్తారు!

ప్రజాదర్బార్, బేటింగ్‌లతో సాగే జాతరే.. నాగోబా!

జనవరి 30 రాత్రి పవిత్ర గోదావరి నదీజలాభిషేకం అనంతరం జాతర మొదలయింది. తొలినుంచి వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు! వాటితో నాగోబా దైవానికి అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా మూడురోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. వేడుకల అనంతరం(ఫిబ్రవరి 3న) ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంది.

       పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ.

       జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు.

       ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

జాతర కథ..

       క్రీ.శ 740.. కేస్లాపూర్‌లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికిగురై తిరిగి పయనమవుతూ.. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు! ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయం పట్టుకొని.. తనకు తెలిసిన పురోహితుడు (పధాన్ పడమార్)ని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. ఏడు కడవల ఆవుపాలతోపాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించి, 125 గ్రామాలమీదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరినీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకంచేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్‌లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు!

సిరికొండ… కుండలు

       ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేస్తారు. ఇదికూడా ఆచారంలో భాగమే! గుగ్గిల్ల వంశీయులకు మెస్రం వంశీయులమధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి! పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిల్ల పెద్ద రాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర (చిప్పలు), దీపాంతలు, నీటికుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా, వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు.

నాగోబా పూజా విధానం

       గోదావరి నదినుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంవూతీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్షికమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నిటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్షికమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్షికమంలో పాట్లాల్, గయిక్ వాడి, హవాల్ దార్ మొదలైన వారు పాల్గొంటారు.

భేటింగ్ కీయ్‌వాల్ : నూతన వధువు పరిచయ వేదిక

       మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్ ‘ అంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటి దాకా వారు నాగోబా దేవుణ్ని చూడడం, పూజించడం నిషిద్ధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజసామాక్షిగిని పట్టుకొని, కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. వధువులు ఇద్దరు చొప్పున జతలు గా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్షికమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మహాత్మా గాంధీ వర్ధంతి

(1869 అక్టోబర్ 2 – 1948 జనవరి 30)

      బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా మలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించడంతో భారత దేశానికి స్వాతంత్య్రం  లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యం  పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2 వ తేది కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు జన్మించాడు. కాగా గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో ఒక దివాన్ గా పచేసేవాడు. ఉన్నత విద్య చదవక పోయినా సమర్థుడైన ఉద్యోగిగా పేరు సంపాదించాడు. అలాగే తల్లి హిందూ సంప్రదాయాలను తు.చ. తప్పక పాటించే సాధ్వీమణి. తల్లి దండ్రుల సంరక్షణలో గాంధీజీ బాల్యం గడిచింది. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. తరగతి గదిలో ఎక్కువ బిడియ పడుతూ వెనుక వరసలో కూర్చొనే వాడు. పాఠశాల విడిచిన వెంటనే ఆట పాటల యందు ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి పోయేవాడు. ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియ వాడ్‌లో కొనసాగింది. గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. అయితే గాంధీ ఇందుకు రాకరించాడు. చెడు సావాసాల వల్ల పొగ త్రాగడం, మాంసం తినడం జరిగింది. అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది తిరిగి ఇటువంటి పనులు చేయనని తల్లి దండ్రులకు ప్రమాణం చేశాడు. గాంధీకి 13 వ ఏట కస్తూరి బాయితో బాల్య వివాహం జరిగింది. గాంధీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బారిష్టర్ విద్యను అభ్యసించడాకి తన 17 వ ఏట లండన్ నగరాకి వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం కఠోర నియమాలతో విద్యను పూర్తి చేసి స్వదేశాకి తిరిగి వచ్చాడు. కొంత కాలం ముంబై, కథియ వాడ్ లలో న్యాయవాదిగా ప్రాక్టీసు నిర్వహించారు. సత్య వాక్య పరిపాలనా దక్షుడైన గాంధీజీకి  ఎక్నొ సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురై బాధ కలిగింది. కాగా 1893 లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లాడు. అయితే అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొని మిక్కిలి మనస్తాపానికి గురయ్యాడు. అయినా మొక్కవో ధైర్యంతో సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని శ్వేత జాతీయుల దురహంకారన్ని ఎదిరించి జాతి భేద్నా తొలగించేందుకు అవిశ్రాంత పోరాట్నా సాగించాడు. ట్రాన్స్ వాల్ పట్టణంలో ఫోక్స్ ఆశ్రమ్నా స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపీయన్ అనే వార పత్రికను స్ధాపించాడు. కాగా 1915 జనవరి 9 వ తేది న దక్షిణాఫ్రికా నుండి భారత దేశాకి తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమ్నా స్దాపించాడు. ఇక్కడే తన అనుచరులకు సత్యం, అహింస మొదలగు మార్గాలను అనుసరించే విధాన్నా బోధించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ మహాత్మా అని సంబోధిస్తూ టెలిగ్రాం పంపాడు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను తొలిసారిగా కలుసుకున్నాడు. ఇతర జాతీయ నాయకులు సంస్కరణల కోసం చర్చలు సాగిస్తుండగా గాంధీజీ బీహార్ లో చంపారన్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. ఇక్కడి రైతులు తీన్ కథియా అనే పద్ధతికి కట్టుబడి ఉండేవారు. తమ భూముల్లో పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విని చాలా మంది చంపారన్ రైతులు తమ ప్రాంతాకి వచ్చి కాపాడమని ఆయనను ఆహ్వాంచారు. గాంధీ అక్కడికి వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వాకి తెలియ పరచడంతో తీన్ కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ సాధించిన ఈ విజయం అనేక మంది యువ జాతీయ వాదులను ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, గుణ శీలమైన, నిర్ణయాత్మకమైన, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారి ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే గుజరాత్ లో కైరా జిల్లాలో పంటలు పండక పోయినప్పటికీ పన్నులు చెల్లించమని రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు నిరసనగా 1918 లో సత్యాగ్రహం ప్రారంభించాడు. అపుడు ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేసింది. ఇదే సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పనివారు తమ వేతనాలను పెంచమని సమ్మె చేయగా గాంధీజీ సత్యాగ్రహం చేపట్టి మిల్లు యజమానులను అంగీకరింప జేసి కార్మికుల వేతనాల్లో 35 శాతం పెరుగుదలను సాధించాడు. స్ధానిక ప్రాంతాలలో చేసిన సత్యాగ్రహ ప్రయోగాలలో విజయ్నా సాధించిన తర్వాత గాంధీజీ తన దృష్టి జాతీయ సమస్యల వైపు మళ్లించాడు. కాగా బ్రిటిష్ ప్రభుత్వం 1919 లో ప్రవేశపెట్టిన మాంటేగు ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతీయులలో అసంతృప్తి కలిగించాయి. అంతే గాకుండా విప్లవ కారుల కార్యక్రమాలను అణచి వేసేందుకు విచారణ లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్ట్నా చేసింది. భారతీయులందరూ ఈ చట్ట్నా తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా గాంధీజీ రౌలత్ చట్టాకి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా సాధారణ హర్తాళ్ కు పిలుపుచ్చాడు. ప్రజలు స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాలని సూచించాడు. ఈ పిలుపుకు స్పందించి దేశ ప్రజలందరూ అపూర్వ ఉత్సాహంతో కదలి వచ్చారు. ప్రజా ప్రతిఘటన అణచి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీజీ ఢిల్లీ కి వెళుతుండగా ఆయనను మధ్యలోనే ఆపి బలవంతంగా ముంబైకి పంపారు. గాంధీ ముంబైకి చేరుకున్న సమయంలో గుమిగూడిన ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ప్రజా నిరసన వెల్లువను అణచి వేత చర్య తో ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గాంధీజీ యంగ్ ఇండియా, నవ జీవన్ పత్రికల్లో సంపాదకత్వ్నా ప్రారంభించాడు. 1919 ఏప్రిల్ 10 న పంజాబ్‌లో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే నాయకులను అరెస్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అమృతసర్ లో ప్రజలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. కొంత మంది అధికారులు కూడా మరణించారు. ఇద్దరు బ్రిటిష్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వారి చర్య పట్ల నిరసన తెలిపేందుకు 1919 ఏప్రిల్ 13 న అమృత సర్ లో జలియన్ వాలా బాగ్ అనే విశాల మైన బహిరంగ స్ధలం ఉన్న ఒక తోట మైదానంలో అధిక సంఖ్య లో ప్రజలు సమావేశమయ్యారు. దీనికి మూడు వైపులా మూసి ఉండి కేవలం ఒక వైపు మాత్రమే ద్వారం ఉండేది. అప్పటి  సైనిక కమాండర్ అయిన జనరల్ డి.డయ్యర్ తన సైక విభాగం తో చుట్టుముట్టి ఉన్న ఒక ద్వార్నా మూసివేయించి రైఫిల్లతో, మెషిన్ గన్‌లతో కాల్పులు జరపమని ఆదేశించాడు. సైనికులు తమ దగ్గర ఉన్న మందు గుండు సామాగ్రి అయిపోయేంత వరకూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. వేలాది మంది గాయ పడ్డారు. గాంధీజీ దీన్ని అత్యంత అనాగరిక చర్యగా పేర్కొని తీవ్రంగా ఖండించారు. కాగా 1920 లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ ప్రవేశ పెట్టిన సహాయ రాకరణోద్యమ తీర్మాన్నా ఏకగ్రీవంగా ఆమోదించింది. 1942 లో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో భారత రాజకీయ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. గాంధీజీ బ్రిటిష్ పాలకులకు క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా గాంధీతో సహా చాలా మంది నాయకుల్ని నాటి ప్రభుత్వం నిర్భందించింది. అనంతరం నాటి భారతీయుల స్వాతంత్య్ర పోరాటానికి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావనిని భారతీయులకు అప్పగించింది. కాగా స్వతంత్ర భారత అభివృద్ధి చూడక ముందే 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యాడు. ఆధునిక కాలంలో ఆవిర్భవించిన మహాత్ములలో ప్రప్రథముడు మన జాతిపిత. సత్యాహింసలు అనే ఆయుధాలతో భారతీయులను స్వతంత్ర సమర యోధులుగా తయారు చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు చరమ గీతం పాడిన మహా మనిషి … భారత ప్రభుత్వం జనవరి 9 వ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా ప్రకటించింది.కాగా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నేటి పాలకులు, ప్రజలు అనుసరించి,ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం ఉండగలదని ఆశిద్దాం!

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

గణతంత్ర దినోత్సవం / రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

        భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి 15 ఆగస్టు, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.

    అలా.. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.

       కాగా.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.

       1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.

        ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర” రాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

        గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలర్పించిన  నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన (సాహసం, తెగువ, సమయస్ఫూర్తి, అన్నింటినీ మించి ఆపదలో ఉన్నవారిని కాపాడాలనే మానవతా.. ఇన్ని సుగుణాలు కలిగిన) విద్యార్థులకు పతకాలను అందజేస్తారు. అదే విధంగా ఈ రోజును పురస్కరించుకుని దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ పెరేడ్‌లను నిర్వహిస్తారు. అనేక పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పెరేడ్‌లలో పాల్గొంటారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా.. ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ, ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి 26ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని  ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయడం మన కర్తవ్యం. 

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

 (జననం: జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు)

       నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు.

      బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.

       బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ మరియు జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 18 ఆగస్టు, 1945 లో తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదం లో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.

  • వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)
Categories
Vipra Foundation

ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం (మకర సంక్రమణం)

అందరికీ భోగి-సంక్రాంతి-కనుమ-ముక్కనుమ శుభాకాంక్షలు..!

       సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి జరుపుకోవడం మన ఆచారంగా అనాదికాలంగా వస్తోంది. ధనుర్మాసం ఆఖరి రోజు “భోగి” పండుగ. అప్పటివరకూ సూర్యుడు ధనూరాశిలో సంచరించి సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ ప్రారంభమౌతుందని భారతీయుల నమ్మకం. ఈ పండుగ రోజుల్లో పూజలూ, పిండివంటలూ, పతంగులూ మాత్రమే కాకుండా సరదాగా ఈ పండుగ వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం..!

        ఉత్తరాయణం అంటే “ఉత్తర దిశలో ప్రయాణం” అని అర్థం. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు ఒకసారి (అరునెలలు పాటు), ఉత్తరం వైపు ఒకసారి (ఆరు నెలలు) ప్రయాణిస్తాడు. అది అందరికీ తెలిసిందే. అందులో, ఉత్తరదిశలో ప్రయాణించే కాలాన్ని “ఉత్తరాయణం”గా, దక్షిణదిశలో ప్రయాణించే “దక్షిణాయణం”గా వ్యవహరిస్తున్నాం. “మకర సంక్రమణం” అంటే మకర రాశిలోకి ప్రవేశించడం. అయితే, సూర్యుని ఉత్తర దిశా గమనం, మకర సంక్రాంతి కన్నా 25(సుమారు) రోజులు ముందే మొదలైపోతుంది. అంటే “ఉత్తరాయణం” ముందే ప్రారంభమైనట్టు…!

      ఋతువులు ఏర్పడే క్రమం గురించి మనకి ముందే తెల్సు కదా… ఈ క్రింది చిత్రం దానికి సంబంధించినదే..!

      సూర్యుడు మకరరేఖ (అంటే దక్షిణార్థ గోళంలో) ఉంటాడు. ఆరు నెలల తర్వాత అంటే కర్కాటకరేఖ (అంటే ఉత్తరార్థ గోళం) పైకి వస్తాడు. అంటే ఉత్తరంగా ప్రయాణించినట్టేగా..! అదే ఉత్తరాయణం …! అలాగే మరో ఆరు నెలలు తిరిగేసరికి మకరరేఖ పైకి వెళ్తాడు. అంటే దక్షిణంగా ప్రయాణించినట్టు., అది దక్షిణాయణం..! సంవత్సరంలో సూర్యుని కదలికలని(భూమికి సాపేక్షంగా) ఈ క్రింది చిత్రం స్పష్టతనివ్వవచ్చు..!

       ఇక్కడ చెప్పేదేంటంటే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం అనేది ఒక కొండ గుర్తు మాత్రమే..! నిజానికి ఉత్తరాయణం ఇంకా ముందే మొదలైపోతుంది. (తిలక్‌ ఆర్యవలస సిద్ధాంతాన్ని సమర్ధించిన విధంగా చూస్తే, ఉత్తర ధృవం వద్ద పగలు ప్రారంభమయ్యేది కూడా ఉత్తరాయణంలోనే డిసెంబర్‌ తర్వాతనే..!) ప్రతీ యేడాదీ., సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడానికీ, ఉత్తరాయణం ప్రారంభం కావడానికీ మధ్యలో 50 సెకండ్ల తేడా పెరుగుతొందని, ఇప్పటి పరిశీలన..! మన జ్యోతిష్కులు వీటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు.. అందుకే సంక్రాంతి, ప్రతీ 80 సంవత్సరాలకోసారి ఒకరోజు వాయిదా వేయబడుతూ వస్తోంది.

       ఆర్యభట్టుని సూర్య సిద్ధాంతం ప్రకారం ఉత్తరాయణ ప్రారంభానికీ, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడానికి మధ్యన ఉండే వ్యవధి గరిష్టంగా 27కి చేరి, ఆ తర్వాత తగ్గింపబడుతుంది (లేదా తగ్గిపోతుంది). ఈ లెక్క ప్రకారం 2294 సంవత్సరం తర్వాత మకర సంక్రాంతి ముందుకి జరుగుతూ వస్తుంది (80 ఏళ్లకోసారి..). కానీ ఇప్పటి ఆధునిక విజ్ఞానవేత్తల ఉద్దేశ్యం, అది అలా పెరుగుతూనే ఉంటుందని..!

       సంక్రాంతికి ముందు రోజు అంటే భోగి రోజున మంటలు ఎందుకు వేస్తారు అనేదానిక్కూడా ఇక్కడే సమాధానం వెతుక్కోవచ్చు. ఉత్తరాయణ ప్రారంభం అయ్యే రోజుగానీ, ఆ ముందు రోజుగానీ, మొత్తం సంవత్సరంలో రాత్రిభాగం ఎక్కువగా ఉండే రోజు అవ్వడం వల్లన మంటలు వేసి పండగ మొదలుపెట్టడం వచ్చి ఉండచ్చు..! అయితే, ముందు చెప్పినట్టు ఉత్తరాయణ ప్రారంభం అవ్వడం వల్ల, సంక్రాంతి ఎక్కువ రాత్రి భాగం ఉందే రోజు అవ్వదు..! ఇప్పుడంటే, ఉత్తరాయణ ప్రారంభం(Winter solistice) గురించి సులువుగా చెప్పేస్తున్నాంగానీ, 200 సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పే విధానం జనంలో వాడుకలో లేదు కదా..! మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే ఖచ్ఛితంగా ఉత్తరాయణం మొదలైపోయిందని నిర్ధారించేసుకోవచ్చు కనక, మకర సంక్రమణం వరకూ ఆగి, అప్పుడు పండగ మొదలుపెట్టి ఉండవచ్చు..! సరే..! ఈ లెక్కన దక్షిణార్థగోళంలోని వారు అంటే ఆస్ట్రేలియా, న్యూజిలేండ్‌, దక్షిణ ఆఫ్రికా లాంటి చోట్ల మకర సంక్రాంతికి బదులు కర్కాటక సంక్రాంతి (జూన్‌ జూలైల దగ్గర) జరుపుకోవాలేమో..!

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మకర సంక్రాంతి

        సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మన ప్రత్యక్ష దైవము. అతడు అన్ని జీవరాశులకు ఆధారము, ఆలంబన అందించే అద్భుతమైన తేజోరాశి. ఖగోళ శాస్త్రం రవిని స్థిరతారగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని ఋజువు చేసినా మనం అనుసరించేది చూసేది గ్రహకూటముల, నక్షత్ర రాశుల గతులు మరియు సూర్యగమనం.  మనకున్నవి పన్నెండు రాశులు. సూర్యుడు నెలకొక రాశిలో కాలం గడిపి, ఆ తరుణం గడచిన పిదప ఒక రాశిని వదలి తరువాతి రాశిలో ప్రవేశిస్తుంటాడు.  సూర్యుని ప్రవేశం జరిగిన రాశికి సూర్యుడు సంక్రమిస్తాడు. అదే సంక్రమణం. దీనినే సంక్రాంతి అంటాము. అలా సూర్యుడు పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కలిగిస్తాడు. అయితే ఇందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం.  ఇది సూర్యుని ఉత్తరదిక్కు ప్రయాణం. ఈ ప్రయాణాన్నే ఆయనం లేదా ఆయణం అంటారు. ఉత్తరాయణం శుభప్రదమైనది. ఇది పుణ్యకాల ప్రారంభం. ఈ పుణ్యకాలంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఎక్కువగా. ఈ పుణ్యకాలం కోసమే తండ్రి శంతనుని నుండి స్వచ్ఛంద మరణం వరంగా పొందిన కురుపితామహుడైన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో విపరీతంగా గాయపడి ఒరిగినపుడు అర్జునుడు అమర్చిన అంపశయ్యపై ఉత్తరాయణ ఆరంభమయే వరకు నిరీక్షించాలనుకుంటాడు.

        ఉత్తరాయణ శుభారంభం అయిన మకర సంక్రాంతి చాల విశిష్టమైనది. ఉత్తరాయణంలో సూర్యునిగమనం ఉత్తరముఖంగా మారడంతో పగటికాలం క్రమంగా పెరుగుతూ వస్తుంది. సూర్యరశ్మి క్రిమి సంహారిణి. అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.  అయితే సూర్యునికిరణాలు ఎక్కువగా సోకితే అది మనకు కూడ మంచిదికాదు. ఎందుకంటే సూర్యరశ్మి లోని అతి నీలలోహిత కిరణాలు చర్మవ్యాధులను, చర్మ సంబంధమైన క్యాన్సర్ ను ఇతర రుగ్మతలను కలిగిస్తుంది.

       ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. మకర సంక్రాంతి మనకు శుభతరుణం. సంక్రాంతి మనకు తెస్తుంది క్రొత్త కాంతి. ఈ పండగ ముఖ్యంగా మూడు దినాలు. భోగి, సంక్రాంతి, కనుము.

        సంక్రాంతికి ముందు రోజు భోగి. ఈ రోజు తూర్పు తెల్లారక ముందే నిద్ర లేచి భోగిమంట వేస్తారు. పిల్లలు ఆవు పేడతో చేసిన భోగిపిడకలు దండలుగా గుచ్చి భోగి మంటలో వేస్తారు. భోగి దినం సాయంత్రం పసిపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగిపళ్ళులో నేరేడు పళ్ళు, కొత్త పైసలు, చెరుకు ముక్కలు, చాక్ లేట్లు కలిపి పసిపిల్లలను ఎవరి ఒడిలోనైనా కూర్చోపెట్టి తలమీదుగా జారుతూ భోగి పళ్ళు పోస్తారు.

        మరునాడు సంక్రాంతి పండుగ. ఇదే మకర సంక్రాంతి. ఇది ముఖ్యంగా దీనినే పెద్ద పండుగ అంటారు. పండిన పంటలు నూర్పుకు వచ్చి, తమ కష్టానికి ప్రతిఫలం లభించిన రైతులు పెద్దయెత్తున ఈ పండగ జరుపుకుంటారు. ఇళ్ళముందు ముదితలు, ఆడ పిల్లలు పేడ నీళ్ళతో కల్లాపి జల్లి, ముగ్గులు పెట్టి, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. పగటి పూడ గాలిపటాల (పతంగుల) పండగ ఉంటుంది. ఇళ్ళలో బొమ్మల కొలువులు పెడతారు.  హరిదాసులు ఇంటింటికీ తిరిగి రావమ్మా మహాలక్షి రావమ్మ అని పాడుతుంటారు.

       కనుమును పశువుల పండుగ అని కూడ అంటారు. రైతులు గంగిరెద్దులను అలంకరించి ప్రతి యింటికి పోయి అయ్యవారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు అని సన్నాయి వాయిస్తూ గృహస్థుల నుండి బియ్యం, కానుకలు గ్రహిస్తారు.

        ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.

మనం సంక్రాంతి అని పిల్చుకుంటే మహారాష్ట్రీయులు, గుజరాతీలు మకర సంక్రాంతి అంటారు. తమిళులు పొంగల్ అని పిలిస్తే పంజాబీలు లోరీ అంటారు. సంక్రాంతి అందరికీ ఇష్టమే అయినా, రైతులకి మరీ ప్రియమైన, పెద్ద పండుగ. అప్పుడే పంట చేతికి రావడంతో ఎంతో ఇష్టంగా, ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవరోజు కనుమ.

జయసింహ రాసిన కల్పధ్రుమం’ లో సంక్రాంతిని ఇలా వర్ణించారు

తత్ర మేశాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరితః

    సూర్యస్య పూవస్మాద్రాసే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి”

       దీని అర్ధం ఏమిటంటే మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందు ఉన్న రాశి లోంచి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

పుష్యమాసం ప్రాముఖ్యత

పుష్య మాసమును పౌష్య మాసం అని కూడా  అని పిలుస్తారు. పుష్యమాసంలో రవి పాక్షికంగా ధనుస్సు రాశిలో  పాక్షికంగా రాశిచక్రం యొక్క మకర రాశి (మకరం) లో సంచారం  చేస్తుంది. హిందూ మతం చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 10వ నెల. రవి మకర రాశిలో  ప్రవేశించినప్పుడు ఆ రోజు మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో క్యాలెండర్ ప్రకారం ఉత్తరాయణం అని పిలుస్తారు. ఉత్తరంవైపుకు దిశలో సూర్యుని యొక్క ప్రయాణం ప్రారంభంలో సూచిస్తుంది. ఇటు వంటి పలు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత జోడించబడింది.

ఈ నెలకు  పుష్యమి నక్షత్రం పేరు పెట్టారు. నెల దీనిలో చంద్రుడు నెల పుష్య మాసంగా లెక్కించి ఉంది పౌర్ణమి రోజున లేదా దగ్గరగా పుష్యమికు కూటమి వద్ద ఉంది. శ్రీ లక్ష్మీ నారాయణ దేవతగా పుష్యమి పాలిస్తుంది మరియు పూజలు చేయాలి. పుష్యమి నక్షత్రమ్ రాశిచక్రం సైన్ క్యాన్సర్ (కర్కాటక  రాశి)లో  పడతాడు మరియు బృహస్పతి (గురుడు) నక్షత్ర  దేవత అయితే శని  దాని పాలక గ్రహంగా  ఉంటుంది.

భోగి వంటి ముఖ్యమైన పండుగలు, మకర సంక్రాంతి పుష్యమి నక్షత్రమ్ లో సంభవించింది. సౌర నెల ధనుర్మాసం భోగి  పండుగతో ముగుస్తుంది. సెయింట్ శ్రీ నరహరి తీర్ధులు  (శ్రీ మాధవాచార్యులు  రెండవ శిష్యుడు) యొక్క ఆరాధనా; శ్రీ రఘోత్తమ తీర్ధులు (తిరుకొఇల్లుర్ Thirukoilur) మరియు శ్రీ పురందర దాసు గారి ఆరాధనా ఉత్సవములు ఈ  పుష్యమాసం  సమయంలో వస్తుంది. ఉడిపి శ్రీ క్రిష్ణ దేవాలయం వద్ద ప్రముఖ Paryaya పండుగ రెండు సంవత్సరాలకు ఒకసారి పుష్య సమయంలో జరుగుతుంది.

మకర సంక్రమణ మాఘ మేలా త్రివేణి సంగమం (ప్రయాగ-అలహాబాద్) వద్ద, ప్రముఖ బాతింగ్ ఫెస్టివల్ మరియు మతపరమైన ఫెయిర్ ప్రారంభంలో సూచిస్తుంది. ఇది లార్డ్ విష్ణు ద్వారా తేనె కుండ (అమృతా కలశం) మోసుకెళ్ళే అయితే తేనె యొక్క కొన్ని చుక్కల అలహాబాద్ (ప్రయాగ), హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయినీ వద్ద పడిపోయింది అని చెబుతారు. ఈ పవిత్ర స్థలాలు  తీర్థాలు (Theerthas) మానవులు ఈ ప్రదేశాలలో పవిత్ర స్నానం ద్వారా వారి పాపాలు కడగడం అని పేరు గణనీయమైన ఖ్యాతిని గడించారు. మకర సంక్రాంతి రోజున ఈ ప్రదేశాలలో స్నానం అత్యంత ప్రతిభావంతులైన గా పరిగణించబడుతుంది, ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చెందింది.

ఈ నెల దేవతలకు అలాగే పూర్వీకులకు రెండు వివిధ ఆచారాలు మరియు పూజలు చేస్తూ అంకితం. సప్తమి, అష్టమి మరియు నవమి పక్ష పుష్య మాసం యొక్క బహుళ తిధుల రోజుల పితృ యజ్ఞాలు,  శాన్నవతి శ్రార్ధం (Shannavathi Sraaddha) భావన కింద పడిపోవడం పితృ తర్పణాలు చేయవలసిన  పవిత్ర రోజులు  ఇవి Poorvedyu, Ashtaka మరియు Anvashtaka రోజుల గా సూచిస్తారు. పుష్యమాసంలో వేద అభ్యసన, వేదాలు పౌర్ణమి రోజు కోసం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత యొక్క లాట్ పుష్య జోడించబడింది. పుష్యమాసం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా భారతదేశం యొక్క కొన్ని ప్రాంతాల్లో వస్త్ర దానం మరియు తిల దానం మొదలైనవి ఈ నెలలో అనుకూలమైన నెలగా పరిగణించబడుతుంది.

పుష్య మాసం – నువ్వులు , బెల్లం ప్రాముఖ్యత :- పుష్యమాసం శని మాసం. ఈ మాసం లో శని ప్రభావం అధికంగా ఉంటుంది. జ్యోతిశాస్త్రం ప్రకారం శని మన శరీర జీవ నాడి కారకుడై ఉంటాడు. ఈ జీవ నాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనను ,రక్త ప్రసరణను నిర్ణయిస్తుంది. ధనుర్మాసం అయిపోయేటప్పటికి ,శరీరంలోని కొవ్వు పదార్ధం తగ్గడం వల్ల , మకర మాసం మొదలు అయ్యే సమయానికే ఈ కొవ్వు పదార్ధపు కొరతను తీర్చాలని చెప్పబడింది. ఇందు వల్ల రవి ప్రభావం (ఎండ వేడిని) ఎదుర్కోవటానికి శరీరంలోని ముఖ్య జీవనాడి ఆరోగ్యంగా పని చెయ్యడం వల్ల, హృదయ స్పందన సక్రంగా ఉండేటట్లు చెయ్యగల “నువ్వులు – బెల్లం” తినాలి అనే నియమం పెట్టారు.

పుష్యమి నక్షత్రం శని నక్షత్రం..ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత. శనికి అధి దేవత యముడు. “యమం ” అంటే “సం యమం” అని అర్ధం, అంటే ఆధీనంలో ఉంచుకోవటం. అంటే శరీరాన్ని ఆరోగ్యపు ఆధీనంలో ఉంచుకోవటం ఈ జీవ నాడి మూలంగ మాత్రమే సాధ్యమవుతుంది. జీవనాడి యొక్క ఈ క్రియకు కొవ్వు పదార్ధం తక్కువ అయితే శ్క్తి లేకపోవడం, అనారోగ్యం మొదలు అయినవి కలుగుతాయి. వీటిని నివారించే శక్తి కేవలం నువ్వులు బెల్లానికి మాత్రమే ఉంది.

–           వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ గోదా కళ్యాణము

    భోగిపండగనాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణము జరుపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారము .

       ధనుర్మాసం నెలరోజులూ వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన “తిరుప్పావై” ని అనుసంధించి ఆఖరున కల్యాణంతో ముగించి శ్రీ గోదారంగనాథుల కృపకు  పాత్రులుకావటం మనందరకూ అత్యంత ఆవశ్యకం.

       శ్రీ విల్లి పుత్తూరంలో వేంచేసియున్న వటపత్ర శాయికి తులసీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలాలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీవిష్ణుచిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్డమానముగా పెరుగుతూ తండ్రియొక్క భక్తి జ్ఞాన తత్సార్యాలకు వారసురాలైనది.

      తండ్రిచే కూర్చబడిన తోమాలలను ముందుగా తానే ధరించి “స్వామికి తానెంతయు తగుదును” అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకుని మరల అ మాలలను బుట్టలో పెడుతూ ఉండేడిది.

       ఇది గమనించిన విష్ణుచిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టిమాలలు కై౦కర్యము చేయుట అపరాధమని తలచి మానివేసిరి . శ్రీస్వామి విష్ణుచిత్తులకు, స్వప్నమున సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకత్యంతప్రీతి __ అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేసిరి.

       ఈమె సామాన్య మనవకాంత కాదనియు తన్నుద్దరించుటకు ఉద్భవించిన యే దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కై౦కర్యమును చేయసాగిరి.

       యుక్త వయస్సు రాలైన గోదాదేవిని చూసిన విష్ణు చిత్తులు ఆమెకు వివాహము చేయనెంచి అమ్మా! నీకు పెండ్లీడు వచ్చినది నీ వేవరిని వరింతువో చెప్పుము నీ కోరిక మేరకే వివాహము చేతును అనిరి.

       తండ్రి మాటలు వినిన గోదాదేవి లఙ్ఞావదనయై తమరు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అపురుషోత్తముని తప్ప నేనింకెవరినీ వరింపను ఇతరుల గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసెను.

       అప్పుడు విష్ణుచిత్తులు “కొమడల్” అను లోకప్రసిద్ద గ్రంధము ననుసరించి ఆ వటపత్రశాయి వైభవముతో ప్రారంభించింది నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో అర్చామూర్తులైయున్న పెరుమాళ్ళ వైభవాతిశయయులను వర్ణింపసాగిరి అ క్రమములో చివరకు “అజికియ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపరేఖా విలాసములను వర్ణింపగనే “జితాస్మి” అని, ఆమె హృదయమందంతటను అరంగనాథుని దివ్య మంగళ స్వరూపమే నింపి యుంచుకొనినదై గగుర్పాటు పొందుచుండెను.

       ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు “అదెట్లు సాధ్యము” అని చింతాక్రాంతులై నిదురింప __ ఆ శ్రీరంగనాధులు స్వప్నమున శాక్షాత్కరించి నీ పుత్రిక భూజిత గోదను మాకు సమర్పింపుడు ఆమెను పాణిగ్రహణము చేసికొందును.

వివాహ మహొత్సావానికి నా అజ్ఞమేరకు  తగిన సామగ్రులు తీసుకుని పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో మిమ్ముల స్వాగతి౦చెదడు అని పలుకగా

విష్ణుచిత్తులు మేల్కోంచి అత్యంత ఆనందోత్సాహములతో తనజన్మ సార్ధకమైనదని పొంగి పోవుచూ _ సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొని పోయిరి.

       అచట సమస్త జనులున్నా పాండ్యమహీభూపాలుడున్నా విష్ణు చిత్తులను _ ఆ సన్నివేశము దర్శించి ధనుల్వైరి.

       ఇట్లు అండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాసు వ్రత కారణమున పరమాత్మను తానుపొంది మనలను ఉద్దరించుటకు మార్గదర్శినియై నిలచినది.

       శ్రీరంగనాధుడు, స్వయముగా అమెనే వరించి _ పాణిగ్రహణము చేసివాడు దీనినే మనము భోగిపండుగనాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము.

శ్రీ గదా రంగనాథుల కళ్యాణము చూచినను చేయించినను, ఈ కథ వినినను __చదివిననూ సకల శుభములు చేకూరుననుటలో సందేహములేదు.

గోదారంగనాథుల వారి కల్యాణి గీతాన్ని నిత్యమూ అలపిద్దాం లోకకల్యాణానికి పాటు పడదాం.

            కల్యాణ గీతిక

        (కాంభోజ  రాగము _ త్రిపుట తాళము )

    ప ..     _ శ్రీ గోదారంగనాధుల కళ్యాణము గనరే

    అ..ప..    _ శ్రీ కల్యాణముగని  _ శ్రీల భిల్లరే!

    చ..      _ ఆకాశమే విరిసి _ పందిరి యైనది

            భూదేవియే మురిసి __ అరుగు వేసినది

        అష్టదిక్కులు మెరసి _ దివిటీలు నిలిపినవి

        అష్టైశ్వర్యములు  తరలి __ నిలువెల్ల కురిసినవి….

    చ …     విష్ణు చిత్తుని కన్య విష్ణువునే వలచినది

        నిష్టతో మార్గళి వ్రతము చేసినది

        ఇష్టసఖులను మేల్కోల్పి  _ వెంటగోన్నది

        జిష్ణుని హితకరు కృష్ణుని చేబట్టినది

    చ ….    జీవాత్మయే పరమాత్మకు అంశమ్మని చాటినది

        శేషి శేషభూతులు పరమార్ధము తెలిపినది

        దివ్య మంగళ విగ్రహ సాయుజ్యము నరశినది

        దివ్య ద్వయ మంత్రార్ధంబిలను __స్థాపించినది

    చ …     శ్రీ గోదా రంగనాథుల కల్యాణ గుణ విభవము

        శ్రీ ద్వయ మంత్ర రత్నమ్మున కన్వీయ మీజగము

        ఇదిగనిన అనుసంధి౦చిన శుభప్రదము

        మదినిపాడరె _ రంగనాథుని గీతము జయము జయము

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)