Categories
Vipra Foundation

ఫాల్గుణ మాసం ప్రాముఖ్యత

      ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గుని బుద్ది  వికాసాన్ని దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని  శాస్త్ర వచనం. వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది. కొత్త అవకాశాలకి ప్రతీకగా చిగుళ్ళ రూపం లో ఆశలను ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందీ  మాసం.

      శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు  పన్నెండు రోజులూ భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు. ఈ మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి.

      శుక్లపక్ష ఏకాదశి దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు ఈ  రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం. ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.

      ద్వాదశి -దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు  ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల  పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది.

      పౌర్ణమి – మహా ఫల్గుని అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామి ని ఊయలలో ఉంచి ఊపుతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. ఉత్తర భారతదేశం లో  రాక్షస పీడ  తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాదిస్తారు. ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు.పాల్గుణ  పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది.ఈ రోజు చందనం తో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖం గా ఉంటారు. 

      అమావాస్య – ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్ట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజు పితృ దేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రధానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వంశాభివృద్ది జరుగుతుందని ప్రతీతి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మహాశివరాత్రి

        హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

మాఘకృష్ణ చతుర్దశ్యామాది దేవో మహానిశి

శివలింగ తయోద్భూత: కోటి సూర్య సమప్రభ.

       కోటి సూర్యలకు సమానమైన ప్రకాశంగల ఆ మహాలింగం ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి. ఆ మహాగ్ని స్తంభానికి ఆది, అంతం లేదు. ఆ లింగ స్వరూపం నిర్గుణ పరతత్త్వ స్వరూపం.

       ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలొనర్చి, ఉపవాసం ఉండి రాత్రి అంతయు జాగరణము చేసి మరునాడు భోజనం చేయుదురు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుదురు. అన్ని శివక్షేత్రము లందు ఈ ఉత్సవము గొప్పగా జరుగును. పూర్వం శ్రీశైలం క్షేత్రమందు జరుగు ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రము లో విపులముగా వర్ణించాడు. శైవులు ధరించు భస్మము/విభూతితయారుచేయుటకు ఈనాడు పవిత్రముగా భావిస్తారు.

మహాశివ రాత్రి వృత్తాంతం

        మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

        గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణమహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

        అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

      ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, “నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును” అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, “నీచూపులు ప్రసన్నంగా లేవేమి?” అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ “నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను” అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో “జగత్తునాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు” అంటాడు.

        ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో “బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది ” అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు.విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ అది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ ‘నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే” అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శిక్ష మరియు వరము

        శివ పురాణం, విద్వేశ్వర సంహితలోని ఏడవ ఎనిమిదవ అధ్యాయములలో ఉన్నదీ విషయం.

ఈశ్వర ఉవాచ: అరాజ భయమేతద్వైజగత్సర్వం నశిష్యతి! తతస్త్వం జహి దండార్హం వహ లోకధురం శిశో!! వరందదామి తే తత్ర గృహాణ దుర్లభం పరమ్! వైతానికేషు గృహ్యేషు యజ్ఙేషు చ భవాన్గురుః!! నిష్ఫలస్త్వదృతే యజ్ఙః సాంగశ్చ సహ దక్షిణః! ……..

       శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మకు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను (పిల్లవానిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకొన్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలా) ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, “ఓ బ్రహ్మా నీకు గొప్పనైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను, అగ్నిష్టోమము, దర్శ మొదలగు యజ్ఙములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఙములలో అన్ని అంగములు ఉన్నా అన్నింటినీ సరిగా నిర్వర్తించినా, యజ్ఙనిర్వహణముచేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఙము వ్యర్థము అగును” అని వరమిచ్చెను.

మొగలి పువ్వుకు శాపము

       ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

       అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, ” మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును” అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

       ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో “మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

      ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది” అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

మహాశివరాత్రి వ్రత కథ

       ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.

       ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి “శివ శివ” యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.

       మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక “వ్యాధుడా! నన్ను చంపకుము” అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక “నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను” అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

       రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో “ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును” అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

       మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని “నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

       ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను. “ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును.” అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

       అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము.”

ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము.

శివరాత్రి పూజా విధానాలు

జాగరణము

       జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున వుపవాసము ఊడ్లెను.

రుద్రాభిషేకం

       వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తం గా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం  అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్రం

       పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు “న” “మ” “శి” “వా” “య” (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం

       మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

శివసహస్రనామస్తోత్రం

       శివసహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి.

మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి పండుగ మీకు సర్వ శుభాలూ చేకూర్చాలని ఆశిస్తున్నాం.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

విజయ ఏకాదశి కధ

       యుదీశ్తర మహారాజు శ్రీ కృష్ణ భగవానుని తో ఇలా అనాడు, “ఓ వాసుదేవ, ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాని వివరించ మని కోరగా” 

శ్రీ కృష్ణ పరమాత్మ :

       ఓ యుదిశ్తర, ఈ మాఘ మాసం లో వచ్చేటువంటి ఏకాదశి పేరు “విజయ ఏకాదశి”. ఈ ఏకాదశి ని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరి వారి పాపాలు కూడా తొలిగిపోతాయి .

       ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుప మని కోరెను, అప్పుడు బ్రహ్మ ఇవిధంగా చెపనరబించెను :

       ఓ నారద మహా ముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు , నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది . ఈ పేరు లో చెప్పిన విదం గానే ఈ ఏకాదశి వ్రతం అనీ విజయాలను చేకూరుస్తుంది సందేహమే లేదు.

       శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు, సీత, లక్ష్మనుని తో కలిసి పంచవటి లో నివసించేవాడు. రావణడు సీత దేవి ని అపహరించినప్పుదు శ్రీ రాముడు దిగులుతో అనీ కొలుపొయినవాడి లగుండెను సీతా దేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది వివరం అడుగగా, జటాయువు సీతమ్మ ని రావణాసురుడు ఎలా అపహరించాడో, సితామాతని కాపాడబోయి రావణుడు చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరనిస్తాడు  శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువి కి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతా దేవిని వెతికే క్రమం లో కబందుడిని సంహరిస్తాడు.

అటు తరువాత శ్రీ రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు. సుగ్రీవుదు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తాయారు చేసి హనుమంతుని అమ్మవారిని వెతకటానికి లంకకి వెళ్లి వెతకమని ఆగ్న్య. హనుమ లంక లో సిత్తమ్మని  అశోకవనం లో చూసి శ్రీ రాముని ముద్రికని చూపి, అయన గుణగణాలను కొనియాడి, హితవు పలికి సీతా దెగ్గర ఉంగరం తెసుకుని తిరిగి శ్రీ రాముని వాడకు వచ్చి వివరించెను . శ్రీ రాముడు సుగ్రీవుని సహాయం తో లంకా నగరాని చేరుకునే సముద్రానికి చేరుకొని ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి, లక్ష్మణునితో ఎలా అన్నాడు, ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదె ఇప్పుడు మనం ఏమి చెయవలను

       అందరిలోకి మంచివడివైన శ్రీ రామ, బలదలబ్య అనే ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగరలోనే ఉన్నారు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం. అయన మాత్రమే మనకి ఈ సమయం లో సహాయపడగలరు నాయి సెలవిచ్చి అయన దగ్గరకి బయల్దేరారు.

బలదలబ్య ఋషి ని చేరుతూనే నమస్కరించి కుసలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు .

బలదలబ్య

       శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము , దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లబిస్తుంది.

       ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసి , కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించలి. దీనినీ శ్రీమన్నరాయణ దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నరాయణు కి పూజ చేసి, ఈ కుండకి కి పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, వేసి నమస్కరించి ఉపవసింఛి రాత్రి కి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి అ కుండకి పూజ చేసి ఏదయినా ఒక నది లో కలిపేయాలి. తరువాత ఉత్తముడయిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి. ఈ విధం నువ్వు ని సేన ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లబిస్తుంది అని చెప్పను.

       శ్రీ రామచంద్రుడు బలదలబ్య ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికీ వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది.

       ఓ నారద ఈ విధం గ ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకం తో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి చెండాలమయిన పాపాలు అయిన హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంట లోక ప్రాప్తి లబిస్తుంది. అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి, యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో, ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం లబిస్తుంది అని చెప్పేను.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

జాతీయ సైన్స్ దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)

          మనదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 28 వ తారీఖున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు.

          1928వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీన భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ (సర్.సి.వి.రామన్) ఒక వినూత్న, విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేశాడు. “ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను “స్టోక్ రేఖ” లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా “వ్యతిరేక స్టోక్” రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని “రామన్ ఫలితము” అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని “జాతీయ విజ్ఞాన శాస్త్రదినము”గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును “రామన్స్ డే” అని గూడ అంటారు. ప్రపంచం నలుమూలల రామన్ పేరు మారుమోగిపోయింది.

            ఫిబ్రవరి 28, 1928న సర్‌ సి.వి.రామన్‌, తన ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనుగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కా రంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో, ఇలా ఇంకా ఎన్నో సాధించాలనకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్తజ్ఞ్రుల పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్‌ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ఈ నేషనల్‌ సైన్స్‌ డే లక్ష్యాలు.

         ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. ఉదాహరణకు DRDO, ISRO వంటి సంస్థల్లోకి ముందస్తు అనుమతిలేకుండా ఆ రోజు ఎవరైనావెళ్ళవచ్చును.  భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు, విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ. ముఖ్యంగా ప్రతి విద్యార్తి స్రుజనాత్మకంగా అలోచింపజేసెతత్వాన్ని ప్రొత్సహించటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం .

        ప్రతి సంవత్సరం ఒక థీమ్ (ఉద్దేశ్యం) ను తీసుకొని ఆ విషయం పట్ల ప్రజల్లో అవగహాన కల్పించి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ ద్రుక్పతాన్ని పెంపొందిచుటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.  

రామన్ ఫలితము – అనువర్తనాలు (ఉపయోగాలు)

* అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.

* రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

* అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.

* కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.

* మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.

* వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.

* మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.

* డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.

* మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.

* వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.

* జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.

* ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.

* కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.

చివరగా

    సైన్సు ఒక జీవన విధానం.   సైన్సు మనకు ఎమి తెలియని అయోమయస్తితి నుండి , నిర్దిస్టమైన అవగాహన  దిశగా , ఖచ్చితమైన  , విశ్వసనీయమైన మార్గం గుండా తీసుకొనిపోతుందని అనటంలో ఏలాంటి సందేహం లేదు. .ఫ్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైన  ఆర్థిక , సమాజిక , పారిశ్రమిక అభివృద్ధి  అనేది ఆ దేశ  శాస్త్ర  సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే   కొలమానంగా పరిగనించ  బడుతుంది . అందుకే  నేడు   శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక  కొలమానం గా మారిది.  నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అననేది ప్రగతికి చిహ్నం .

మరో ముఖ్యమైన  విషయం  ఏమిటంటే  రామన్ తన ప్రయోగానికీ  అయిన ఖర్చు  కేవలం 150 రూపాయలు మాత్రమే  . ఇంత తక్కువ  ఖర్చుతో ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రావటం అనేది ఇంత వరకు జరుగలేదు , భవిష్యత్తులో కూడ జరగదు. తనకు వచ్చిన డబ్బుతో భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం అయిన  భారతీయ విజ్ఞాన సంస్థానం’ (Indian Institute of science) కొరకు ఇవ్వటం జరిగింది. ఇల ఎందరో మన దేశానికి చెందిన  శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో  మన దేశ  ఎనలేని కీర్తి  ప్రతిష్టలతో  దేశ కీర్తిని  స్టలను  విశ్వవ్యాప్తం   చేశారు. విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక – సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.

అందుకే  ” జై జవాన్,     జై కిసాన్ ,  జై విజ్ఞాన్ ” అనే నినాదంతో  ముందుకు వెళ్ళి, దేశానికీ మన వంతు క్రుషి చేయవలసిన అవసరం ఎంతైన ఉంది.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతి

(23 జూలై 1906  —  27 పిబ్రవరి 1931)

        చంద్ర శేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. ఆయన జూలై 23, 1906 బాదర్కా, ఉన్నాఒ జిల్లా, ఉత్తరప్రదేశ్ లో జన్మించారు.మన దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ప్రముఖుడుగా పేరెన్నికగన్నాడు.

        బాల్యము : మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పండిత్ సీతారాం తివారికి, అగరాణీదేవికి చంద్రశేఖర అజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుణ్ణి చేయడానికి కాసి లో చదివించాలను పట్టుదల వుండేది. కాని ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోడానికి తల్లి తండ్రులు చేసిన ఒత్తిడిని భరించ లేక తన పదమూడవ ఏట ఇల్లొదిలి ముంబయి పారి పోయాడు. ముంబయిలో ఒక మురికి వాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పని చేశాడు. అనేక కష్టాలు పడ్డాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఇంతటి కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది. రెండేళ్ళ ఆ మురికి వాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు.

       అదే సమయంలో భారత స్వాతంత్రం కొరకు మహాత్మ గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడికినట్టున్నది. అప్పుడే చంద్ర శేఖర్ తాను కూడ భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించు కున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు మాత్రమె. ఉత్సాహంగా తాను చదువుతున సంస్కృత పాఠశాలముందె ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయ మూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తల తిక్క సమాదానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తల తిక్క సమాదానాలు చెప్పాడు. న్యాయమూర్తి అతనికి 15 రోజులు జైలు శిక్ష విధించాడు.

       ఇతని సమాదానాలకు న్యాయమూర్తి ఏమనుకున్నాడో ఏమోగాని తాను విధించిన 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్ …. చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు.

       విప్లవము ఉద్యమాలు : తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్ లో విప్లవ భీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్, అఘ్నూల్ల ఖాన్ , రోషన్ సింగ్ లు ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిసి అందులో భాగస్వామి అయ్యాడు. 1924 ఆగస్టు 9 వ తారీఖున ఈ విప్లవకారులంతా కలిసి ఆకోరి అనే వూరు వద్ద ప్రభుత్వ ధనం వున్న రైలును ఆపి దోపిడి చేశారు. కొంత కాలానికి ఆ విప్లవ కారులంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ తప్ప. చంద్ర శేఖర్ అజ్ఞాత వాసంలోకి వెళ్ళి పోయాడు.

       రహస్య జీవనంలో భాగంగా ఆజాద్ ఉత్తరప్రదేశ్ లోని ఓర్చా అరణ్యం లో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువు గా మారాడు. ఆ తర్వాత ప్రభుత్వం పై తాము చేసిన అన్ని కుట్రలకు ప్రణాలికలకు ఆ కుటీరమే స్థావరం అయింది. కానీ రైలు దోపిడి కేసులో పోలీసులు చంద్రశేఖర్ కొరకు గాలిస్తూనే ఉన్నారు.

       చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్ లో భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారకుడైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాలనుకున్నారు. ఆ కుట్రలో భాగంగా పొరబాటున తాము గురిపెట్టిన వ్వక్తి స్కాట్ అనుకొను సాండర్స్ అనే పోలీసు ను కాల్చారు. కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్, రాజ్ గురు లను చనన్ సింగ్ అనే పోలీసు వారిని వెంబడించి పట్టుకో గలిగాడు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోడానికి చనన్ సింగ్ ను కాల్చక తప్పలేదు.

       తమ రహస్యజీవనంలో భాగంలో ఝాన్సీ పట్టణంలో సహ విప్లవ కారులతో కలిసి ఒక ఇంట్లో వున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఝాన్సీ పట్టణానంతా గాలిస్తున్నారు. అలా నగరాన్నంతా గాలించి చివరికి ఆజాద్ ఒక గదిలో వుంటాడన్న పూర్తి నమ్మకంతో ఆ గది చుట్టు పోలీసులను మొహరించి ఒక ఉదుటున తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేసించారు. కాని ఖాలీగా వున్న ఆ గది వారిని వెక్కిరించింది. ఇది జరిగింది 1929 మే నెల 2వ తారీఖున.

       పార్లమెంటు పై దాడి కేసు : ఈలోపు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంటు పై దాడి చేయడము, వారిని పోలీసులు పట్టుకోవడము, న్యాయస్థానంలో వారి ఉరి శిక్ష పడడము జరిగి పోయాయి. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతొ కలత చెందాడు. వారిని విడిపించడానికి ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్ లాల్ నెహ్రూని కలిసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు ఆజాద్. కాని నెహ్రూ అజాద్ కు ఏ సమాదానము చెప్పలేదు.

       దాంతో కలత చెందిన ఆజాద్ అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పారుకులొ తమ ఇతర విప్లవ మిత్రులత భగత్ సింగ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో రహస్య పోలీసులున్నారని అనుమానమొచ్చింది ఆజాద్ కి. వెంటనే తన రివ్వార్ కి పని చెప్పాడు. ముగ్గురు పోలీసులు అతని తూటాలకు బలైపోయారు. ఇంతలో మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్ ని వెంబడిస్తూనె వున్నారు.

        ఆజాద్ వారిని తన రివ్వాల్వర్తో నిలవరిస్తూనే వున్నాడు.తన తుపాకీలో ఇంకో తూటానె మిగిలి వున్నది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. చీ బ్రిటిష్ వారికి తాను పట్టుబడటమఅంతే మరో క్షణం ఆలోసించ లేదు ఆజాద్ పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపు మళ్ళింది. అంత 25 ఏండ్ల యువకుడు చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మాఘ పౌర్ణమి

     మహా మాఘి ……….. మాఘ పౌర్ణమిచాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది. పౌర్ణమి నాడు మఘ నక్షత్రం ఉండుట వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరువచ్చిం.

”అకార్తీక మాసం దీపానికెంత ప్రాధాన్యత ఉందో మాఘమాసంలో స్నానానికంత ప్రాశస్త్యం. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయమంటారు. ఈమాసంగురించి పద్మపురాణంలో వివరంగా ఉంది.

    మాఘస్నానం చిరాయువు, సంపద, ఆరోగ్యం, సౌజన్యం, సౌశీల్యం, సత్సంతానం కలగచేస్తుంది. ‘తిల తైలేన దీప శ్చయా: శివగృహే శుభా:’ అని శివ పురాణం పేర్కొంది. దీన్నిబట్టి శివాలయంలో ప్రదోషకాలంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరంలో ఇది పదకొండో మాసం. గృహనిర్మాణాలు ప్రారంభిస్తే మంచిది. ఈ మాసంలో ఆదివారాలు విశేషమైనవి. ఆదివారాల్లో స్నానా నంతరం సూర్యుడికి అర్ఘ్యమివ్వడంతో పాటు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం, ఆదివార వ్రతం చేయడం మంచిది. ఆదివారాలు తరిగిన కూరగాయలు తినకూడదంటారు.

   తెలుగునాట మాఘపాదివారాల్లో స్త్రీలు నోము నోచుకుంటారు. ఈ నెల్లో వచ్చే నాలుగాదివారాలు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి సూర్యోదయ సమయానికి సూర్యారాధన చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.

       యజ్ఞంలో అశ్వమేధం, పర్వతాల్లో హిమాలయం,వ్రతాల్లో సత్యనారా యణస్వామి వ్రతం, దానాల్లో అభయదానం, మంత్రాల్లో ప్రణవం, ధర్మాల్లో అహింస, విద్యల్లో బ్రహ్మవిద్య, ఛందస్సులో గాయత్రీ, ఆవుల్లో కామధేనువు, వృక్షాల్లో కల్పతరువు ఎంతగొప్పవో స్నానాల్లో మాఘ స్నానం అంత మహిమాన్వితమైంది. సూర్యుడు మకరరాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో, ఆనాటి నుంచి ప్రాత:స్నానం తప్పక చేయాలి. నదులు, చెరువులు, సముద్రతీరాలదగ్గర లేదా బావివద్దా స్నానంచేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పద్మ పురాణం స్పష్టం చేస్తోంది.

      ప్రతిరోజూ పర్వదినమే: ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనవే. శుద్ధ విదియ త్యాగరాజస్వామి ఆరాధన చేస్తే, తదియనాడు ఉమాపూజ, లలితా వత్రం చేయాలంటుంది చతుర్వర్గ చింతామణి. చవితిరోజు ఉమాదేవిని, గణపతిని పూజించాలంటారు. ఇక పంచమిని శ్రీపంచమనీ, మదన పంచ మని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది సరస్వతీదేవి జన్మదినం. సర్వత్రా చదువుల తల్లిని, రతీ మన్మధుల్ని పూజిస్తారు. ఈ రోజున వసంతోత్సవ ఆరంభం అనీ, పంచాంగ కర్తలు వసంత పంచమిని ఉదహరిస్తారు. షష్ఠి రోజున మందార షష్ఠి, వరుణ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు.

      ఇక మాఘశుద్ధ సప్తమే ‘రథసప్తమి’గా జరుపుకుంటారు. ఈ రోజు సూర్యుని పూజించాలి. అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు భీష్ముడిని పూజించటం సత్ఫలితాలనిస్తుంది. నవమిని మహానంద నవమి అని, స్మృతి కౌస్త్తుభం, నందినీదేవి పూజ చేయాలని చతుర్వర్గచింతామణి చెబుతుంది. ఇక ఏకాదశినాడే పుష్యవంతుడనే గంధర్వుడు ఉపవసించి శాపవిముక్తయ్యాడు. ఈనాడే గోదావరి సాగరసంగమమైన అంతర్వేదిలో శ్రీమహాలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

      భీముడు ఏకాదశీవ్రతం చేసి, కౌరవులను జయించిందీ రోజే. శుద్ధ ద్వాదశినాడు వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువునీ భక్తి ప్రపత్తులతో అర్చిస్తారు. త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా పాటిస్తారు. విశ్వకర్మ దేవశిల్పి కావటంతో మహాపురుషుడిగా భావిస్తారు. మాఘ పౌర్ణమి అన్ని రోజుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైనది. దీన్ని ‘మహామాఘి’ అని కూడా పిలుస్తారు.

      బహుళ పాడ్యమినాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు. ఇక శ్రీరాముడు రావణ సంహారంకోసం లంకవెళ్ళేందుకు సేతునిర్మాణం బహుళ ఏకాదశి నాడే పూర్తి అయిందంటారు. ద్వాదశి ముందురోజు ఉపవాసముండి ద్వాదశినాడు నువ్వులు దానమిచ్చి, తలస్నానం చెయ్యాలంటారు. అందుకే దీన్ని తిలద్వాదశీ వ్రతం ఆచరిస్తారు.

      ధర్మశాస్త్ర పురాణ తిహాసాలు నేర్చుకునేందుకు త్రయోదశి మంచిరోజని చెబుతారు. బహుళ చతుర్దశి మహాశివరాత్రి. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవ శుభదినం. ఈనాడు భక్తిశ్రద్ధలతో మనస్సును లగ్నం చేసి ఏకాగ్రతతో మహాశివుణ్ని ఎవరైతే స్మరిస్తారో వారికా పరమేశ్వరుడు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాంటారు. ఉపవాసం, జాగరణకు ప్రశస్తమైన రోజిది. అమావాస్య స్వర్గస్తులైన పితరులకు తర్పణం వదిలే రోజు.

      అత్యంత మహమాన్వితమైన మాఘమాసం నెలరోజులూ క్రమం తప్పకుండా స్నానదానాదులను నిర్వహించడం వల్ల సకల పాపాలు, సర్వ రోగాలు, దరిద్రాలు నశించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అన్నిటా జయం లభిస్తుంది. మాఘమాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడికి అభిషేకంచేసి, అర్చించి శివాలయంలో ప్రదోషకాలంలో దీపారాధన చేస్తే దీర్ఘాయుష్షుతో పాటు సుఖశాంతులు వర్ధిల్లుతాయి.

      కాబట్టి ప్రతివారూ ఈ మాసంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందేందుకు ప్రయత్నిద్దాం.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

మెహర్ బాబా జయంతి

        చూపులో కరుణ, మోములో చిద్విలాసం.. ఆయనే ‘మెహర్ బాబా’

        దాదాపు 44 ఏళ్లు అంటే.. జులై 10, 1925 నుంచి సమాధిని పొందే వరకు మౌనదీక్షలో గడిపారు ఆ బాబా.  కేవలం చేతి సైగలతోనే సంభాషించేవారు. ప్రజలతో బహిరంగ సమావేశాలు నిర్వహించి కుష్టువ్యాధిగ్రస్థులకు, పేదవాళ్ళకు, మానసిక వ్యాధులతో బాధ పడుతున్నఎందరికో సేవలు చేసిన భారతీయ ఆధ్యాత్మిక గురువు. ఆయనే మెహెర్ బాబా. ఆయన జన్మనామం మెర్వన్ షెరియార్ ఇరానీ.

         మెహర్ బాబా ఫిబ్రవరి 25, 1894లో మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. 19 సంవత్సరాల వయసులో మెహర్ బాబా ఆధ్యాత్మిక అన్వేషణను ప్రారంభించి,  1922 లో ఆయనే ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించారు.  1940వ దశ్కమంతా బాబా సూఫీలో భాగమైన మాస్ట్స్ అనే ప్రత్యేక వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులతో కలిసి జీవనాన్ని సాగించారు.

         బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకంతీరు గురించి అనేక ఉపన్యాసాలను ఇచ్చి ప్రజలకు సరైన దిశానిర్దేశనాన్ని చూపించారు.  ఈ ప్రపంచం మిథ్య అనీ భగవంతుడొక్కడే సత్యమనీ, ప్రతి ఒక్కరు తమలోని పరమాత్మను తెలుసుకోవాలని భోదించారు. ఖచ్చితమైన గురువు ఎలా ఉంటాడో ఆయన విశదపరిచారు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనముందని,  ఇతరులకు చెడు చెయ్యక పోవడమే మనం చేయగలిగే మంచి అని బోధించారు.  భౌతిక సుఖాలకోసమెంత తపించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మవైపు పడగలిగితే తప్పకుండా భగవంతుని దర్శనం లభిస్తుందని అన్నారు. ఇటువంటి ఆయన బోధనలు డిస్కోర్సెస్,  గాడ్ స్పీక్స్ అనే పుస్తకాలలో పొందుపరచబడ్డాయి. బాబాజాన్ వల్ల దివ్యస్థితిని, ఉపాసనీ మహరాజ్ వల్ల లోకస్థితిని పొందిన ఆయన 1921 సంవత్సరం ఆఖరుకల్లా అవతార పురుషుడయ్యారు. మెహర్‌బాబాను ‘పర్వర్‌దిగార్’ గా షిరిడీ సాయిబాబా సంబోధించారు. ఆయన అవతారుడని తెలిపారు. 1922లో అవతారోద్యమం ప్రారంభించి, శిష్యులకు శిక్షణ ఇచ్చారు. హజరత్ బాబాజాన్ , ఉపాసనీ మహరాజ్ , షిరిడీ సాయిబాబా, నాగపూర్‌లోని తాజుద్దీన్‌బాబా, పూణే సమీపంలోని నారాయణ్ మహరాజ్ అనే ఐదుగురు సద్గురువులచే మెహర్ బాబా అవతారుడని పిలువబడ్డారు.

         ఆధ్యాత్మిక కారణాలచే 44 సంవత్సరాలు మౌనం వహించారు. ఈ మౌన వ్రతంలోనే 13 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. మౌనంలోనే ఆయన 1969 జనవరి31న మహా నిర్యాణం పొందారు. అప్పటి నుంచి ఏటా మహారాష్ట్రలోని అహ్మదాబాద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహరాబాద్‌లో నిర్యాణం పొందిన రోజున బాబా అనుయాయులు కలుస్తారు. ప్రస్తుతం 72 దేశాలలో మెహర్‌బాబా కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాబా బోధించిన సత్యం, ప్రేమలను అవి విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన బోధనల్ని ఒకసారి మనసారా స్మరించుకుందాం.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

బీష్మ ఏకాదశి

        కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి. తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ఉంది.

      భీష్ముడి గురించి తెలియని వారుండరు. మహాభారతంలో  భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. మహాభారత గాథకు మూల స్తంభమైన భీష్ముడు పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.

సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.

       కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.

        భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు. సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ, క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని పాటిస్తున్నారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

శ్రీ మధ్వ నవమి

      మాఘశుక్ల నవమి ‘మధ్వ నవమి’ గా ప్రసిద్ధం. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం- శ్రీమధ్వాచార్యుల శ్రీవారి అవతారం. ఆయన ఆశ్వయుజ విజయదశమి నాడు 1238లో దక్షిణ కన్నడ పజక క్షేత్రంలో జన్మించారు. వాసుదేవుడని నామకరణం చేశారు. పన్నెండో ఏట అక్షితప్రేక్ష తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. ఆ వయస్సులోనే సకల శాస్త్ర జ్ఞానం సంపాదించుకున్నందువల్ల గురువులు వాసుదేవుడికి పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యే మార్గానికి చిహ్నంగా- శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.

       శూన్యవాదం, నిరీశ్వరవాదం ప్రబలి, జాతిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఆయన సదాచారాన్ని ప్రబోధించారు. ప్రభువుకు సత్‌కర్మలను నివేదించమని భక్తులకు ఆదేశించారు. వేదం కేవలం కర్మకాండ కాదు, నిత్య జీవన విధానానికి అన్వయించదగ్గ ఒక దివ్య ప్రబంధమని నిర్వచించారు. ఒక అనుష్ఠాన వేదాంతిగా భగవద్గీత, బ్రహ్మసూత్ర, మహాభారత, భాగవత పురాణ ఇత్యాది గ్రంథాలకు విపుల వ్యాఖ్యానాలు సమకూర్చారు. ప్రథమ హనుమ, ద్వితీయ భీమ, తృతీయ పూర్ణప్రజ్ఞ అన్న విశ్వాసం మేరకు శ్రీమధ్వాచార్యులు ఎన్నో మహిమలను ప్రదర్శించారంటారు. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు.

       రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యులవారే. నేటికీ అనునిత్యం సుప్రభాత సేవలతో శ్రీకృష్ణ సేవా కార్యక్రమాలు ఆ క్షేత్రంలో నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయి. అలా జరగటానికి అనువుగా, ఎనిమిది మఠాలను శ్రీమధ్వాచార్యులు ఏర్పాటుచేసి, ఎనమండుగురు తీర్థులను ప్రతినిధులుగా చేశారు. హృషీకేశ తీర్థులు పాలకూర్‌ మఠానికి, నరసింహ తీర్థులు అడమారు మఠానికి, జనార్దన తీర్థులు కృష్ణపుర మఠానికి, ఉపేంద్ర తీర్థులు పుట్టిగె మఠానికి, వామన తీర్థులు షిరూర్‌ మఠానికి, విష్ణుతీర్థులు సోడె మఠానికి, రామతీర్థులు కనిమార్‌ మఠానికి, అధోక్షజ తీర్థులు పెజావర మఠానికి అధిపతులై, గురువు ఆజ్ఞ మేరకు ‘పర్యాయ’  క్రమంలో కృష్ణుణ్ని కొలవటం గమనించదగ్గ విశేషం. ఈ పర్యాయ కార్యక్రమం ఇప్పటికీ క్రమం తప్పకుండా కొనసాగుతూ ఉంది.

       శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవిత కాలంలో మూడు పర్యాయాలు బదరీ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరి యాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగిరాని పయనమే మధ్వనవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశవ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అటు అతివాదానికి ఇటు మితవాదానికి మధ్యే మార్గంగా శ్రీమధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైతం ఒక హితవాదమనే చెప్పాలి. అహం బ్రహ్మాస్మి అయితే నువ్వెవరివి అన్న ప్రశ్నకు, కేవలం శరణాగతి అయితే నీ గతేమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా తత్వవాదాన్ని ఆచార్యులవారు అనుసంధించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలతోపాటు కర్తవ్య కర్మ ఆచరణ ద్వారా శ్రీచరణాలు చేరవచ్చునని మార్గదర్శనం చేశారు.

       జగత్తు మాయా మాత్రమే. జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే. పరమాత్మ సర్వస్వతంత్రుడు, జీవాత్మ అస్వతంత్రుడు. జీవోత్తముడు ఆచార్యుడు. ధర్మమార్గంలో, ఆచార్యుల అనుగ్రహం సంపాదించి, అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వులకు శిరోధార్యం.

       జీవిత కాలంలో ఆనందానుభూతి పొందగల సులభతరమైన భక్తిమార్గాన్ని ఆయన బోధించారు. అందుకే ఆచార్యులవారికి ఆనంద తీర్థులన్న నామధేయం బహుళ ప్రచారంలో ఉంది.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).      మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి).

           శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1627వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది. మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్లకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మహారాష్ర్ట సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. శివాజీ తండ్రి షాహాజీ, ఇతడు సుల్తానుల దగ్గర సైన్యాధికారి. తల్లి జిజియాబాయి. ఈ దంపతులకు 1630, ఫిబ్రవరి 19న జున్నార్ సమీపంలోని శివనెరీ కోటలో శివాజీ జన్మించాడు. జిజియాబాయి తాను పూజించే దేవత శివై (పార్వతి)పేరు శివాజీకి పెట్టింది.జిజియాబాయి కొడుకుకి చిన్ననాటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టింది. తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు పన్నాడు. 17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. శివాజీ బీజాపూర్ సుల్తాన్ నుంచి పురంధర్. రాయఘడ్, సింహఘడ్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత శివాజీ 1664లో సూరజ్ను ముట్టడించాడు. కానీ 1665లో ఔరంగజేబు పంపిన జైసింగ్ పూనాపై దాడి చేసి పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీనితో శివాజీ పురంధర్ సంధి కుదుర్చుకున్నాడు. శివాజీ అధీనంలో ఉన్న 35 కోటల్లో 23 కోటలను మొఘలు వశం చేశాడు. తర్వాత నాలుగు ఏళ్లకే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ1674లో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పాలన సుదీర్ 12:27 PM కాషాయవర్ణ సింహాల సమూహం –  శివాజీ పాలన సుదీర్ఘ కాలం యుద్ధాలతో సాగినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్ర్తీలకు సహాయం చేశాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు. ఒకసారి సైనిక అధికారి చిన్నముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ‘‘నా తల్లి నీ అంత అందమైనది అయితే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని” అని, ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపిం చాడు .శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు.

            కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే! అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీది..

శివాజీ మహారాజ్ కీ జై.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)