Categories
Vipra Foundation

నాద బ్రహ్మ శ్రీ త్యాగరాజ స్వామి (పుష్య బహుళ పంచమి)

           ”ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు..’ అనే పల్లవిని వినని, ఒక్కసారైనా సరదాగానైనా ఆ మాట అనని తెలుగువాడు వుండడు. శాస్త్రీయ సంగీత బాణీలోని ఒక కీర్తనలోని పల్లవిని జన బాహుళ్యం లోకి, ప్రజల హృదయాలలోకి ఒక సత్యాన్ని పలకడం ద్వారా తీసుకెళ్ళిన మహానుభావుడు నాదబ్రహ్మ గా కొనియాడబడిన త్యాగరాజస్వామి వారు!

           కర్ణాటక సంగీతంగా పిలువబడే దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీత విధానానికి ఆద్యుడు పురందర దాసు అంటారు..కానీ త్యాగరాజస్వామి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పితామహుడిగా గుర్తింపబడ్డారు.క్రీ.శ.04 -05 -1767 నాడు త్యాగరాజస్వామి వారు జన్మించారు, పురందర దాసు అంతకు 200 సంవత్సరాల క్రితం వారు. త్యాగరాజు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్..ఈ ముగ్గురినీ కర్ణాటక సంగీత వాగ్గేయకార త్రయం అంటారు. వీరిలో త్యాగరాజస్వామి వారి పేరు పండిత పామరులకు అందరికీ తెలిసిన పేరు. త్యాగరాజస్వామి వారి పూర్వీకులు ఆంధ్రులే.కర్నూల్ జిల్లాలోని కాకర్ల గ్రామంనుండి తమిళనాడు లోని తంజావూరు దగ్గిరి తిరువారూరుకు వలస వెళ్ళారు, ఆయన ముత్తాత పంచనాద బ్రహ్మ గారి హయాములో.వారి కుమారుడు, త్యాగ రాజస్వామి వారి తాత ఐన గిరి రాజ బ్రహ్మ గొప్ప కవి, పండితుడు, తంజావూరు రాజాస్థానంలో సన్మానం పొందిన వారు. ఆయన కుమారుడు రామబ్రహ్మ, త్యాగరాజ స్వామి వారి తండ్రిగారు, గొప్ప పండితుడే కాక మహా రామ భక్తుడు, ఆయన ఇంట్లో నిత్యమూ రామ పంచాయతన పూజ చేసే వారు. ఆయన ధర్మ పత్ని, త్యాగరాజస్వామి వారి తల్లి సీతమ్మ కూడా రామభక్తురాలు. తంజావూరు రాజు తుల్జాజీ మహారాజు నిత్యమూ రామబ్రహ్మ గారిచేత రామాయణం వినిపించుకునే వారు. అటువంటి పరమ భక్తుల ఇంట పుట్టిన త్యాగరాజస్వామివారు శ్రీ రామ సాక్షాత్కారం పొందిన సాధకుడు. త్యాగరాజస్వామి వారికి ఇద్దరు అన్నలు. పంచనాద బ్రహ్మ,పంచాప కేశ బ్రహ్మ. పంచాపకేశ బ్రహ్మ యవ్వనంలోనే మరణించాడు.పెద్ద కుమారులు ఇద్దరూ చెడు అలవాట్లకు లోనై అపఖ్యాతి తెస్తే, ఆవేదనకు గురైన రామబ్రహ్మ తిరువారూరు లోని శివుడు త్యాగరాజ స్వామికి మొక్కుంటే పుట్టాడు కనుక మూడవ కుమారుడికి త్యాగరాజస్వామి అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి రామబ్రహ్మ సమీపంలోని తిరువాయూర్ కి వెళ్లి నివాసం ఏర్పరచుకున్నారు.

         ఐదు నదులు కావేరి,కొలరూన్,కోడమూరుతి,పెన్నార్,వేట్టార్..చట్టు ముట్టి ప్రవహిస్తున్న పుణ్యక్షేత్రం తిరువాయూర్.అక్కడి సంస్కృత పాఠశాలలోనూ, అక్కడి మహా విద్వాంసులు శోంఠి వేంకట రమణయ్య పంతుల వారి వద్ద సంగీత విద్యలోనూ అభ్యాసం చేశారు త్యాగరాజస్వామి వారు.ఆ రోజుల్లోనే రామక్రిష్ణానంద స్వామి అనే యోగి ఈయనకు రామతారకమును ఉపదేశించారు, ఆ తర్వాత నారదోవాస్తి అనే మంత్రం ఉపదేశించారు, స్వరార్ణవం అనే మహత్తర సంగీత కళా రహస్య నిధి ఐన పుస్తకాన్ని ఇచ్చారు. ఆయన నారద మహర్షి అవతారం అని త్యాగరాజ స్వామి వారి నమ్మకం. ఇంట్లో నిత్యమూ తల్లిదండ్రుల కు సహాయంగా రామసేవా కార్యక్రమం లో మగ్నులై సంగీత విద్వాంసురాలైన తల్లి అన్నమయ్య కీర్తనలను, భద్రాచల రామదాసు కీర్తనలను, క్షేత్రయ్య పదాలనూ పాడుతుంటే ఒకరోజు తను ఆశువుగా ”నమో నమో రాఘవాయ” అనే కీర్తనను దేశి తోడి రాగం లో పాడి ఆనాటినుండి మొదలుకొని, 24000 కీర్తనలను రచించారని ప్రతీతి, కానీ ఇప్పుడు అన్నీ లభ్యములు కావు. తండ్రి మరణంతో, తల్లీ, తనూ, భార్యతో సామాన్య జీవనం కొనసాగిస్తున్న త్యాగరాజస్వామి వారు నిత్యం కావేరి తీరంలో శ్రీరామ షడక్షరీ మంత్ర జపం ఒక లక్షా ఇరవై ఐదు వేల సార్లు చేశే వారు, తర్వాత ఆ నది తీరంలో తన కీర్తనలు పాడుకుంటుంటే గ్రామ ప్రజలు వింటూ ఆనందించే వారు, ఇంట్లో నిత్య అర్చన, అనంతరం వాల్మీకి రామాయణం, పోతన భాగవత పారాయణం,పురందరదాసు కీర్తనలను పాడుకోవడం ఇవీ వారి దినచర్యలో భాగాలు.

              తంజావూర్ మహారాజు, మహారాజు స్వాతి తిరునాల్ వంటి రాజులూ, ఎందరో సంపన్నులు ఎన్ని రకాలుగా ఆహ్వానించినా ఏ నాడూ రాజాశ్రయం కొరకు యాచించని మహానుభావుడు. గణిత, జ్యోతిష, సంగీత విద్య విశారదుడు, మహా రామ భక్తుడు,సంప్రదాయం ప్రకారం నారద మహర్షి అవతారం, వాల్మీకి అవతారం త్యాగరాజస్వామి వారు. మొదటి భార్య పార్వతి కాలవశాత్తూ మరణించిన తర్వాత తన తల్లి బలవంతం మీద జీవిక కొనసాగించడానికి, గృహస్థ ధర్మాన్ని కొనసాగించడం కొరకు తన భార్య చెల్లెలు కమలమ్మను వివాహం చేసుకొని, ఒక కుమార్తెను కని, అమెకి ‘సీతా మహాలక్ష్మి’ అని పేరు పెట్టుకున్నారు!నిత్యం వీధులలో తన గాన రసప్రవాహం పారిస్తూ, యాచక వృత్తిలో వచ్చిన దానిలో తన కుటుంబాన్ని వెళ్ళదీసి , శిష్యులకూ భోజనం పెట్టి సంగీతం నేర్పారు!

          ఎందరు రాజులూ, చక్రవర్తులు ఆహ్వానించినా ఏ నాడూ గ్రామం దాటి వెళ్ళక, కంచి కామకోటి పీఠం ఆచార్యులవారు తాము కదలలేని స్థితిలో ఈయనను చూడాలనుకుంటున్నారు అని తెలిసి కంచి వెళ్లి దారి పొడవునా ఎందరో శిష్యుల, ప్రశిష్యుల అతిధిగా తమిళనాట తమ సంగీత గంగను పొంగించి, కంచిలో కొన్ని రోజుల బస తర్వాత తిరిగి వస్తూ తిరువక్తియూరు లో వీణా కుప్పయ్యర్ అనే ఒక శిష్యుని ఇంట బస చేసి, ఆ వూరి సంపన్నుడు ఒకడు ఈయన మీద భక్తితో కానుకలు ఇస్తే, ఆ శిష్యుడు ఈయనకు తెలియకుండా ఇతర శిష్యులకు బంగరునాణాల సంచిని ఇస్తే వారు పల్లకీలో దాచారు. తిరుగు మార్గంలో అడవిగుండా పల్లకీ వెళ్తున్నప్పుడు బందిపోట్లు దోచుకోవడానికి వస్తే మనదగ్గిర ఏముంది కనుక భయం అన్నారు త్యాగరాజస్వామి వారు.శిష్యులు అప్పుడు బంగరు నాణాల సంగతి చెప్పి, రామ సేవలో లోటు రాకుండా వుండడం కోసమని ఇస్తే తీసుకున్నామని చెప్పారు.అయితే రాముని సొమ్మును రాముడే కాపాడుకుంటాడు అని..ఇరుప్రక్కల తోడై రారా..అని కీర్తన పాడుకుంటుంటే రామలక్ష్మణులు ధనుర్ధారులై ఆ దొంగలను భయపెట్టి పారద్రోలారు. మర్నాడు వీరు బస చేసిన దగ్గిరకు ఆ దొంగలు వచ్చి క్రితం రాత్రి తాము చూసిన ఇద్దరు భటులను, వారి అంద చందాలను, వారి చేతులలోని విల్లంబులను, వారి లాఘవాన్ని పొగడుతుంటే, వారికి నమస్కరించి మీరే అదృష్టవంతులు..రామలక్ష్మణులను కళ్ళారా చూశారు అని ఆనంద బాష్పాలు రాల్చారు త్యాగయ్య. దారిలో తిరుపతిలో దర్శనానికి సమయం అయిపోయిందని అర్చకులు తెర వేస్తే, ”తెర తీయగరాదా..తిరుపతి వేంకట రమణ మత్సరమను తెర తీయగ రాదా” అని కీర్తనను ఆలపిస్తే తెర దానంతట అదే తొలిగిపోయి స్వామి దర్శనం లభించింది త్యాగరాజ స్వామి వారికి. ఇలాంటివే ఎన్నో మహిమలను దర్శింప జేస్తూ ఇంటికి తిరిగివచ్చారు.ఇదొక్కటే ఆయన చేసిన యాత్ర గ్రామాన్ని విడిచి.

             ఈయన అన్న రాజుల ప్రాపకాన్ని వద్దంటున్నాడు అనే కోపంతో ఈయన పూజించుకునే రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్న, సీత, హనుమాన్ విగ్రహాలను కావేరిలో వేస్తే కావేరి వొడ్డునే శోకిస్తూ ప్రార్ధిస్తే, విగ్రహాలు వాటంతట అవే పైకి తేలాయి. ఆనందంతో ఉప్పొంగుతూ ”కనుగొంటిని శ్రీ రాముని నేడు”, ”;రారా మా యింటి దాక”..అని కీర్తనలను పాడుతూ మేళ తాళాలతో విగ్రహాలను ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి మరలా పూజలు ప్రారంభించారు.. ఈయన అన్నగారికి తమ తప్పుతెలిసి వచ్చి ఆయన కూడా శ్రీ రామ భక్తులైనారు. ఈయనకు కుమారులు లేనందున అన్నగారైన జప్యేషుని కుమారులే ఈయన స్మారక చిహ్నమైన సమాధి వద్ద పూజలు చేస్తున్నారు.. వారి సంతతి వారే ఇప్పటికీ ఆ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు.

       రెండవ భార్య కమలమ్మ మరణించిన తర్వాత, తీవ్ర వైరాగ్యానికి బాధకు గురి అయి,తము కూడా వెళ్లి పోవలసిన సమయం వచ్చిందని తెలిసికొని, పుష్య శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రాత్రి పూజ,సంగీత సాధన, భోజనాలు ఐన తర్వాత, శిష్యులకూ, అందరికీ, పుష్య బహుళ పంచమి నాడు తన ఇంటికి రమ్మని చెప్పి ..పుష్య బహుళ పంచమి నాడు 06 -01 -1847 నాడు పూజ, అర్చన, సంగీత సాధన ఐన తర్వాత , ఆపత్ సన్యాసం స్వీకరించి, శ్రీ రామనామజపం చేస్తూ సమాధిలోకి వెళ్లి, తమ ప్రాణాలను త్యజించారు. అందరి సమక్షంలో ఆయన కపాలం విచ్చుకొని, ఒక దివ్య జ్యోతి శ్రీ రామునిలో కలిసిపోయింది. తిరువయూరులో, అక్కడే ఆయనకు ‘బృందావనం’, సమాధి నిర్మించారు, ఈ నాడు తమిళనాడు లో ఆది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం.ఈ నాడు ఆయన జయంతి..ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు అన్న మహానుభావుని జయంతి ఉత్సవాల రోజుననే యాదృచ్చికంగా ‘మన మహనీయులు’ గ్రూప్ ప్రారంభింపబడి..ఆయనను గురించిన ఈ పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.

           త్యాగరాజస్వామి వారి కీర్తనలు బహు వేదాంత రహస్యాల సారాలు. ప్రపంచం మొత్తం శ్రీ రామ తత్త్వంతో నిండి వుందని భావించి సర్వత్రా శ్రీ రాముడినే దర్శించిన కారణ జన్ముడు..ఎక్కువగా తెలుగులోనూ,కొన్ని సంస్కృతం లోనూ కీర్తనలను రచించిన సంగీత శాస్త్ర రహస్య కళానిధి ఐన, నారద మహర్షి అవతారం ఐన శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలను సంప్రదాయం ప్రకారమే, ఆయన నిర్దేశించిన రాగ,తాళ పద్ధతులలోనే సభ్యతగా, సంస్కార బద్దంగా ఆలపించడం, అలాగే ఆదరించడం మన కనీస కర్తవ్యం. దురదృష్ట వశాత్తూ తెలుగు సినిమాలలో, ఇతరత్రా ఆయన కీర్తనలను అక్కడక్కడా దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. దీనిని నిరసించాల్సిన అవసరం ఉన్నది.’

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వైకుంఠ ఏకాదశి – ముక్కోటి ఏకాదశి

        ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది, పవిత్రమైనది.

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|    హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||

        అట్టి సుమధుర మూర్తిని ఈ ‘ఏకాదశి‘ రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా “ముక్కోటి ఏకాదశి” గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.

ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ “ముక్కోటి ఏకాదశి” రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే “ముక్కోటి ప్రదక్షిణ” అని పిలుస్తూ ఉంటారు.

         ఈ వైకుంఠ ఏకాదశినే పుత్రద” ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం సుకేతుడు” అను మహారాజు ‘భద్రావతి‘ అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు ‘చంపక‘ ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, ‘పుత్రసౌభాగ్యం‘ కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది.

         ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే ‘వార్త‘ తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము ‘విశ్వదేవులము‘ మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని ఆ దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా పుత్రద ఏకాదశి’ నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, ఆ పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా ‘చంపక‘ దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశీ వ్రతాన్ని’ పూర్తిచేస్తారు.

         అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్‌శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ పుత్రద ఏకాదశి’ లోని మహత్యం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

కార్తీకపురాణం ద్వితీయ అధ్యాయం : సోమవార వ్రత మహిమ

       వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

       “కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.

కుక్క కైలాసానికి వెళ్లుట…

       “పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడుఏ. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

        ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.

       ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.

       బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.

కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.

వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.

దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”

ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సంస్కృత (संस्कृत) భాషా ఉత్సవ శుభాకాంక్షలు.

       కొన్ని దశాభ్దాల క్రితం భారత ప్రభుత్వం  ప్రోత్సాహంతో శ్రావణ పౌర్ణిమ నాడు సంస్కృతము (संस्कृतम्) భాషా ఉత్సవంగా పరిగణించే విదానం ఆచరణలోనికి వచ్చింది.  ఈ రోజు సమస్త భారతీయభాషలకు మూలమైన సంస్కృత (संस्कृत) భాషను స్మరించుకొనే పవిత్ర సాంప్రదాయము అవుతుంది . ప్రభుత్వపరంగా సంస్కృత దివస్ గా వేడుకలు నిర్వహిస్థారు.  ప్రభుత్వ పక్షాన ఈ రోజు భాషా పండితులకు సన్మానిస్తారు .  ఈరోజు ఈ వేడుకను జరుపుకోవటం వాళ్ళ సంస్కృతము (संस्कृतम्) భాష వైపు ఆకర్షించటానికి ఉత్తమమైన మార్గం ఎర్పడింది.  మనం ఈ భాషగురించి కొంచెం తెలుసుకుందాం. 

       సంస్కృతము (संस्कृतम्)  ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము.

సంస్కృతము (संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష మరియు భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు.

జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా:

* 1971–>2212 * 1981–>6106 * 1991–>10000 * 2001–>14135.

అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. మత్తూరులో 95 శాతం మంది, జిహ్రీలో 100 శాతం మంది సంస్కృతంలో సంభాషించడం విశేషం.

       సంస్కృతం అంటే ‘సంస్కరించబడిన’, ‘ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన’ అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.

      ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; మరియు భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడ ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము.

సంస్కృత దివస్ శుభాకాంక్షలు .

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

విఖనస మహర్షి (వైఖానస) జయంతి

“శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం  అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం”

          శ్రావణ పౌర్ణమిరోజున జంధ్యాల పండగ, రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాము. ఇదేరోజు “వైఖానస జయంతి” కూడా జరుపుకుంటాము. వైఖానసులకు పరమ పవిత్రమైన రోజు ఇది. తిరుమలలో జరిగేనిత్యపూజలు, సేవలు, ఉత్సవాలు, దేవాలయ నిర్మాణం దగ్గరనుంచి, విగ్రహం తయారీ, ప్రతిష్ట, అర్చన మొదలైన విధివిధానాలన్నీ వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి. ఈ శాస్త్రాన్ని అందించిన వాడు శ్రీ విఖనస మహర్షి.  వైఖాన మహర్షిజన్మ దినమే  వైఖానస జయంతి. వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరిప్రస్తావన మొదటిసారిగా నుధర్మశాస్త్రం లో వస్తుంది. మనువు మనిషియొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తోంది. నారాయణీయంలో కూడా వీరిప్రస్తావన వస్తుంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది.  వైఖానసులు పూజారులే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండేవారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం కొంత తగ్గినప్పటికీ…రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసినా… వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు. ఒకానొక కథనం ప్రకారం భగవంతుని ఆదేశం మేరకు వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. ఆలయంలో పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తూ ఉంటారు. అంతలోనేఅందరు వైఖానసులు  ఎవరో గుర్తు తెలియని విధంగా నరికివేయబడతారు. అదిచోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా పోవడంతో రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమైచర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనేపూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగితేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారివైభవం తెలుసుకున్న రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటినుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో ఇప్పటికీ వైఖానస- శ్రీవైష్ణవ వైరం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై చాలా వివాదాలున్నాయి. రామానుజుల వారు వైఖానసాన్ని పక్కన బెట్టి శ్రీవైష్ణవాన్ని ముందుకు తేవాలని యత్నించినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివ శరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే అన్నదిగమనించదగ్గ విశేషం.

          ఈ శాఖకు మూలపురుషుడైన వైఖాన మహర్షి విష్ణుమూర్తి అంశతో నాలుగు భుజములు, శంఖు చక్రాలతో నైమిశారణ్యంలో అవతరించారు.  అలా ఆవిర్భవించిన విఖనసునితో శ్రీ మహావిష్ణువు… 

శ్లోకం :   మయా నియుక్తో విఖనా మదారాధన కృద్భవ – మామారాధ్య మునిశ్రేష్ఠశ్రేష్ఠ ముల్లోకేనివసిష్యసి –

          సూత్రమ్ కురు మహాభాగా త్వనామ్నా యాజుషీ శ్రుతౌ –  వైఖానస మిదం ప్రోక్తం లోకేఖ్యాతిం గమిష్యతి ॥

అనగా (ఓ విఖనస బ్రహ్మ నాయొక్క విగ్రహారాధనకు నా చేసృష్టించ బడిన నువ్వు. నా విగ్రహారాధన కొరకు ఒక సూత్రమును యజుర్వేదానుసారంగా రచించు అదినీ పేరు మీద లోకంలో ఖ్యాతి గడిస్తుంది) అప్పుడు విఖనస మహర్షి “ఓ స్వామి నీ యొక్క ఆరాధనకు మరియు శాస్త్ర రచనకు నాకు అనువైన ఒక ప్రదేశం సూచించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు మహా విష్ణువు తన చక్రాయుధాన్ని వదిలి ఇదిఈ ప్రదేశమును సూచించునొ అదియేనీకు నివాస యోగమని శెల్లవిస్తాడు. ఆ చక్రాయుధము అన్ని లోకములు తిరిగిచివరకు భూ లోకమున ఒక సుందర ప్రదేశం తాకిఅదృశ్యమౌతుంది. చక్రము క్ర యొక్క “నిమి” (ఇరుసు) తగిలిన ప్రదేశము కనుక దానిని “నైమిశారణ్యం “అన్నారు, అది మహర్షులకు పుట్టినిల్లు. మనం ఏ పురాణం విన్నా.. ఈ పవిత్రమైన నైమిశారణ్యం ప్రస్తావన లేకుండా వుండదు. కొంతకాలం తపస్సు చేసిన పిమ్మట విఖనసుడు విష్ణువుయొక్క ఆదేశానుసారం శాస్త్ర రచనకు ఉపక్రమించాడు. యజుశాఖకు అనుసంధానంగా వేద ప్రమాణ పూరితంగ వేదాంగాలలో ఒకటైన “కల్పసూత్రం” రచించాడు. ఈ కల్పసూత్రమందు శ్రౌత, దైవిక శారీరక కర్మల గురించి వివరంగా తెలుపబడింది. ఇదియే “వైఖానసాగమానికి మూల గ్రంధం. దీని యందు చెప్పబడిన “గృహదేవతార్చన”ని ప్రమాణంగా తీసుకొని భృగు, మరీచి, అత్రి, కశ్యపులు, ఆలయ నిర్మాణము నుండిమొదలు నిత్య నైమితిక ,కామ్య ఉత్సవాల వరకు చేయ వలసిన దైవిక కర్మల గురించి అనేక గ్రంధాలు రచించారు. వీరేకాక బోధయనాది మహర్షులు కూడా ఈ కల్పసుత్రానేప్రమాణంగా చేసుకొని వారియొక్క శాస్త్రాని రచించారు. ఈ ఆగమం గురించి పురాణాలలో వేదాలలో గొప్పగా చెప్పబడింది. శ్రౌతంలో చెప్పిన యగాలను ఇప్పటికిపలువురు ఈ శాస్త్రానుసారంగానే ఆచరిస్తున్నారు. అందరూ అందుకే వైఖానసాన్నిఅంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశం మేరకు ఆయనని పూజించేందుకు విఖనస మహర్షితిరుమలకు చేరుకుంటాడు. అక్కడేఆయనకి ‘రంగదాసుడు’ అనేభక్తుడితో పరిచయం ఏర్పడుతుంది. రంగదాసుడి భక్తిశ్రద్ధశ్రద్ధలు … వినయ విధేయతలు చూసి మహర్షి ఎంతగానో సంతోషిస్తాడు. స్వామివారి సేవకు తగిన భక్తుడు లభించాడని ఆనందంతో పొంగిపోతాడు. ఇక రంగదాసుడు కూడా స్వామివారి సేవకుగాను తనకి సరైన మార్గం చూపించే వ్యక్తి దొరికినందుకు ఆనందిస్తాడు. స్వామివారికి మహర్షి నిత్యపూజలు నిర్వహిస్తూ ఉండగా, అందుకు అవసరమైన పూజా ద్రవ్యాలను రంగదాసు సమకూరుస్తూ ఉండేవాడు. ఒకరోజున పూజా ద్రవ్యాల కోసం వెళ్లిన రంగదాసుడు, స్వామి పుష్కరిణిలో గంధర్వ దంపతులు జలకాలడుతూ ఉండటాన్ని చూస్తూ అక్కడే నిలబడిపోతాడు. పూజకివేళ మించిపోయిన తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చి తిరిగివస్తాడు. స్వామివారిపాదాలపైపడితన వలన జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అయినా ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకున్న స్వామివారు ఆగ్రహించకుండా అనుగ్రహిస్తాడు.

          ఈ జన్మను చాలించి మరుజన్మలో తన భక్తుడిగా తన ఆలయ నిర్మాణ బాధ్యతను చేపట్టవలసిందిగా ఆదేశిస్తాడు. అందుకు రంగదాసుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆ తరువాత ‘తొండమానుడు’గా జన్మించి స్వామివారికి మహాభక్తుడై ఆయనకి ఆలయాన్ని నిర్మించి సంతోషంగా సమర్పిస్తాడు.

“ఏ నఖాః తేవైఖానసాః ఏ వాలాః తేవాలఖిల్యాః ” అన్న వేద వాక్యాను సారంగా ఎవరైతేఅనఖా: అనగా పాపరహితులో వారేవైఖానసులు అని అర్ధం. శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానేవైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించేవారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించేబ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషినుండివచ్చింది కాబట్టి వైఖానసం అయింది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.

“శ్రీ లక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం – అస్మదాచార్య పర్యంతాం వందేగురు పరంపరాం” అన్న వైఖానస మహర్షిప్రార్ధనా శ్లోకం పఠించి..ఘనమైన అంజలి ఘటిద్దాం .

 –             వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)  

Categories
Vipra Foundation

తొలి ఏకాదశి, శయన ఏకాదశి – చాతుర్మాస్య వ్రతం – గోపద్మ వ్రతం – ప్రాముఖ్యత

తొలి ఏకాదశి, శయన ఏకాదశి :-

        మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

       ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి” అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాల కొక సార అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము.

       ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

       అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

       తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే “ఏకాదశి” అనీ, ఆమె మూడు వరాలు…

1. సదా మీకు ప్రియముగా ఉండాలి.

2. అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.

3. నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి.

అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి ఉన్నాయి.

మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

చాతుర్మాస వ్రతము :-

      ఆషడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాల కడలి మీద శయనిస్తాడు కావున ఈ నాలుగు నెలల్లో ఒక్కోనెల ఒక్కో పదార్ధాన్ని తినరు (వదలివేస్తారు ) దీనినే ‘ చాతుర్మాస ‘ వ్రతము అంటారు .ఈ వ్రతాన్నిగృహస్థులు నాలుగు నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆషాఢ మాసం లో మొదలైన ఈ వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం వరకు కొనసాగుతుంది. ఒక్కో నెలలో ఒక్కొక్క విధమైన నియమాలతో ఉపవాస దీక్షను ఆచరించ వలసి ఉంటుంది.

వ్రత సంకల్ప విధానం: చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే వాళ్ళు

          “త్వయి సుప్తే జగన్నాథ,జగత్సుప్తం భవేదిదం|

          విబుద్ధేచ విభుద్యేత,ప్రసన్నో మే భవాచ్యుత||

          చతురో వార్శికాన్ మాసాన్ దేవస్యోత్థాపన వధి|

          శ్రావణే వర్జయేత్ శాకం దధి భాద్రపదే తథా||

          దుగ్ధమాశ్వయుజే మాసి  కార్తికే ద్విదళం త్యజేత్|

          ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత||

          ఇదం వ్రతం మయాదేవ!గృహీతం పురతస్తవ|

          నిర్విఘ్నం సిద్ధి మాయాతు ప్రసాదాత్తే రమాపతే||

          గృహీతేస్మిన్ వ్రతే దేవ పంచత్వం యదిమే భవేత్|

          తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన||”        

    అనే శ్లోకాలను  పఠించాలి.

       భావం: ఈ చాతుర్మాస్యాలలో శ్రావణంలో శాకాన్ని(కూర,దుంప,పళ్ళు,ఆకులు)వదులుతున్నాను,భాద్రపదంలో పెరుగును,ఆశ్వయుజంలో పాలను,కార్తికంలో ద్విదళ ధాన్యాన్ని(రెండు బద్దలుగా వచ్చే పెసలు మొదలైన  గింజలు) విసర్జిస్తున్నాను.ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు.ఒకవేళ వ్రతం మధ్యలో మరణం సంభవిస్తే వ్రత సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించమని” ప్రార్థించి స్వామికి శుద్ధమైన జలంతో అర్ఘ్యం ఇవ్వాలి.

                  ఈ వ్రతం చేయటం వాళ్ళ ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేగాక దారిద్ర్య బాధలు తొలగడానికి తప్పక ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ధర్మ శాస్త్రాల వచనం.

    ఆషాడమాసము లో … ఆకుకూరలు , (విరోచనాలు వాంతులు ఉన్న కాలము కావున ఆకుకూరలు తినకుండా ఉంటే మంచిది ),

    శ్రావణ మాసములో … పెరుగు (గాస్టిక్ ఎసిడిటీ పెరగకుండా ఉండడానికి– కాలములో ఎసిడిటీ ప్రొబ్లంస్ ఎక్కువ కాబట్టి ),

    భాద్రపద మాసము లో … పాలు ( గొడ్లు ఎదకట్టే కాలము కావున ),

    ఆశ్వీయుజ మాసము నుంచి కార్తీకము వరకు పప్పుదినుసులు వదిలేస్తారు.

       ఈ నాలుగు నెలలు ఈ పదార్ధాలు తినరు . ఆశ్వీయుజ, కార్తీక మాసాలలో శాకవ్రతము చేస్తూ ఆకుకూరలు, కంద, చేమ.. తో చాలామంది భోజనం చేస్తారు, ఇవన్నీ అరోగ్యకరమైన సూత్రాలు.

      విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించెను

       ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస వ్రమతని చెప్పారు కదా… ఏ కారణం వల్ల దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి? విధానం ఏమిటి? అన్నీ వివరించమని కోరెను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పెను…

       ఓ ధనలోభా వినుము… చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొనును. ఆ నాలుగు నెలలకే చాతుర్మాసమని పేరు. ఈ నాలుగు నెలల్లో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుకొంటిని కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేయుచున్నాను.

       మొదట వైకుంఠమునందు గరుడగంధర్వులు, దేవతలు, వేదాలచే సేవింబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఉండగా నారదమహర్షి వచ్చి నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలు అయిన పిదప శ్రీహరి నారదమహర్షిని లోకమంతా ఎలా ఉందని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా! నీకు తెలియని విషయాలంటూ ఈ సృష్టిలో ఏమున్నాయి. అయినా నన్ను చెప్పమనడంలో నీ గొప్పదనం అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో సాధుపుంగవులు, మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. మరికొందరు భుజింపకూడదని పదార్థాలను భూజిస్తున్నారు. మరికొందరు పుణ్యవ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార పూరితులై పరులను నిందిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిస్తున్నారు. మరి వీరంతా ఎలా ముక్తి పొందుతారో నాకు తెలియడం లేదని మహర్షి ఆవేదన చెందుతాడు. వీరందరినీ ఉద్ధరించేందుకు తగిన మార్గం ఉపదేశించమని అర్ధిస్తాడు.

       అందుకా జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కలవరపడి లక్ష్మీదేవితో పాటు, గరుడ, గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ లోకంలోని సకల జీవుల్ని పరిశీలిస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతుంటాడు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు. మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని వారు ఎదురుగానే తప్పుకుతిరిగేవారు, మరి కొందరు అసలు ఈయనవంకే చూసేవారు కాదు. వారందరినీ చూస్తూ ఈ మనుజులను ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తాడు శ్రీహరి. ఈ విధంగా ఆలోచిస్తూనే ఓ రోజు శ్రీహరి నిజరూపంలో లక్ష్మీదేవితో సహా సకల దేవతాగణంతోనూ కలిసి నైమిశారణ్యముకు వెడతాడు.

       ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమాలకు వచ్చిన శ్రీహరిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, లక్ష్మీనారాయణలను పరిపరి విధాలుగా స్తోత్రాలు చేస్తారు.

       ఈ విధంగా మునులందరూ కలిసి లక్ష్మీనారాయణులను స్తోత్రము చేసిన తదుపరి జ్ఞాన సిద్ధుడను మహాయోగి ఓ దీనబాంధవా! వేదవ్యాసుడని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రులుగా గలవాడివని, నిరాకారుడవని, సర్వజనులచే పూజింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. ఓ నందనందనా మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వల్ల మేము మా ఆశ్రయములు, మా నివాస స్థలములన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా మేమీ సంసారబంధం నుండి బయటపడే మార్గాన్ని నిర్ధేశించమని వేడుకొనెను. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం చేసుకోలేడు. నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలగుతుంది. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! మమ్ము కాపాడమని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా! నీ భక్తికి నేనెంతో సంతోషించితిని. నీకు ఇష్టమైన వరము కోరుకోమని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరమునుంచి విముక్తుడను కాలేక సతమతమవుతున్నాను కాబట్టి నీ పాద పద్మములపై నా ధ్యానముండునటుల అనుగ్రహించమని వేడుకొనెను.

       అంతట శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధా! నీవు కోరిన విధంగానే వరమిచ్చితిని. అది కాక ఇంకొక వరం కోరుకోమనెను. అప్పుడు జ్ఞానసిద్ధుడు మా బోటి వారే సంసారబంధమునుండి తప్పించుకోలేకపోతున్నతారు. మరి సామాన్యులను కూడా ఉద్దరింపమని కోరగా నారాయణుడు చిరునవ్వుతో భక్తా ఈలోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు పోవుటకు ఒక వ్రతమును సూచిస్తున్నాను. ఆ వ్రతమును అందరూ ఆచరించవచ్చును. జాగ్రత్తగా వినమనెను.

       నేడు ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి నిద్ర లేస్తాను. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రతమని అంటారు. ఈ కాలంలో త్రిసంధ్యలలో చేసే పూజలు, వ్రతాలు నాకు ఎంతో ఇష్టం. ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ, ఇతరులచేత చేయిస్తారో వారంతా నా సన్నిధికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ దశమి నుండి కూరలు, శ్రావణ శుద్ధ దశమి నుంచి పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి పాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకు నేను ఇలా శయనింతునని తెలిపి శ్రీమన్నారాయణడు శ్రీమహాలక్ష్మితో పాలసముద్రమునకు వెళ్ళి శేషపానుపుపై పవళించెను.

       ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస్యవ్రత విదానాన్ని ధనలోభికి అంగీరసుడు వివరించెను. ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ, పురుష బేధము లేదు. అందరూ చేయవచ్చుననెను. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళెనని తెలిపిరి.

గోపద్మ వ్రతం :-

ఈ ‘తొలి ఏకాదశి’ నాడు “గోపద్మ వ్రతం” చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.

        ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని ‘గోమాతకు’ ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.

       అట్టి గోమాత నివశించే గోశాలను ఈ ‘తొలిఏకాదశి’ దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క “అప్పడాన్ని” వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్) 

Categories
Vipra Foundation

పింగళి వెంకయ్య వర్ధంతి

(ఆగష్టు 2, 1876 – జూలై 4, 1963)

“మూడు రంగులు….” భారత స్వాతంత్ర్య  సంగ్రామానికి  ఊహించని  ఉత్సాహాన్ని అందించాయి.

అవే మూడు రంగులు ఒక అర్ధరాత్రి రెప రెప లాడుతుంటే…అది చూసి ఈ  దేశం మురిసిపోయింది.

ఆ మూడు రంగులని చూడగానే  ప్రతి  భారతీయుడి మనసు సంతృప్తి, కీర్తితో ఉప్పొంగి పోతుంది.

ఆ మూడు రంగులే మన బలం… మన ఐకమత్యం… మన కీర్తి…మన గౌరవం…

ఆ మూడు రంగులే 130 కోట్ల భారతీయుల హృదయాలను “ఇండియా” అనే ఎమోషన్ తో మైమర్చేలా చేస్తున్నాయి.

దేశ సరిహద్దులో రక్షణగా ఉండే ప్రతి సైనికుడికి ఆ మూడు రంగులే తోడు, ధైర్యం… ఆ మూడు రంగులు తన పార్థివ దేహం పైన కప్పబడిన, అదే ఈ జన్మకి దక్కిన విశిష్టమైన గౌరవంగా భావిస్తారు ఆ సైనికులు. అది ఆ మూడు రంగులు మనకిచ్చే గర్వం,గౌరవం. “ఈ పతాకం సామాన్యమైంది కాదు…సామ్రాజ్యవాద సూచకం కాదు… ఏ దేశాన్ని ఆక్రమించే విధానాన్ని సూచించే కేతనం అసలే కాదు. ఇది మన స్వాతంత్ర్య చిహ్నం.” భారత రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రవేశపెడుతూ జవహర్ లాల్ నెహ్రూ అన్నమాటలివి. స్వాతంత్ర్య భారత సమర స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన “త్రివర్ణ పతాక సృష్టికర్త, బహుభాషావేత్త, స్వాతంత్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త మరియు జియాలజిస్ట్” గా మన దేశానికి సేవలందించిన పింగళి వెంకయ్య గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ఈయన ఆగస్ట్‌ 02, 1878 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతురాయుడు, వెంకతరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయన 19 సంవత్సరముల వయసులో బొంబాయిలో సైనిక శిక్షణ పొంది దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలొనే మహాత్మ గాంధీ గారిని కలిసారు. అప్పుడు గాంధీ గారితో వెంకయ్య గారికి ఏర్పడిన సాన్నిహిత్యం ఆర్దశతాబ్ధం పాటు నిలిచింది.

యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత వెంకయ్య గారు 1906 నుండి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. మద్రాసులో ప్లేగు ఇన్స్పెక్టర్ గా శిక్షణ తీసుకున్నారు. కొంతకాలం  బళ్లారిలో ప్లేగు  ఇన్స్పెక్టర్ గా  పని చేశారు. అది  విసుగు అనిపించి, ఇన్స్పెక్టర్ గా మానేసి శ్రీలంకలోని కొలంబో వెళ్లి పొలిటికల్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత  రైల్వే గార్డ్ గా  కొంతకాలం పనిచేశారు. అది కూడా మనసుకు అంతగా నచ్చలేదు.  దాంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి కళాశాలలో చేరి,  సంస్కృతం,  ఉర్దూ,  జపనీస్ భాషలో ప్రావీణ్యం పొందారు. ఈయన ప్రొఫెసర్ గొట్టే ఆధ్వర్యంలో జాపనీస్ చరిత్ర అభ్యసించారు. అలా జపాన్ భాషలో అనర్గళంగా  మాట్లాడగలిగే వెంకయ్య గారిని  “జపాన్ వెంకయ్య” గా  సంబోధించేవారు  కొందరూ.

రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారికి వ్యవసాయం పట్ల చాలా మక్కువ ఉండేది. అదే  మక్కువతో వ్యవసాయ శాస్త్రంలో కూడా అధ్యయనం చేశారు. ముక్త్యాల రాజా నాయని రంగారావు బహదూర్ గారు వెంకయ్య గారితో వ్యవసాయ పరిశోధనశాల స్థాపించేలా ప్రోత్సహించారు. ఆ సందర్భంలోనే ఈయన అమెరికా నుండి పత్తి విత్తనాలను తెప్పించి పండించారు. అలాగే ఆయన “వ్యవసాయ శాస్త్రం” అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఈయనకి లండన్లోని రాయల్ అగ్రికల్చర్ సొసైటీలో సభ్యత్వం లభించింది.

ఆ తర్వాత వెంకయ్య గారు బందరులోనే ఒక జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పని చేశారు.  వ్యవసాయ శాస్త్రం, చరిత్ర, వ్యాయామం, గుర్రపు స్వారీ  మరియు  సైనిక శిక్షణ కూడా  విద్యార్థులకు బోధించేవారు. యువతరంలో జాతీయ భావాలను రగిలించేందుకు చైనాలో జాతీయ విప్లవాన్ని సాగించిన ‘సన్ యెట్ సెన్’ జీవిత చరిత్ర రచించి సంచలనం సృష్టించి లండన్ టైమ్స్ పత్రికచే ప్రశంసలందుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశానికైనా “బ్రిటీష్ యూనియన్ జాక్ జెండా” ఎగురవేయబడుతుంటే వెంకయ్య గారికి అది నచ్చలేదు. మనకు ఒక జాతీయ పతాకం లేనందువల్లనే కదా ఈ అవమానం  అనే బాధతో జాతీయ పతాకం రూపొందించడం పై దృష్టి సారించారు.

1916 లో “భారతదేశానికొక జాతీయ జెండా” (ఏ నేష్నల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా) అనే పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రచురించారు. ఈ గ్రంధానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్ర మంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసారు. ఈ పుస్తకం కాంగ్రెస్ పెద్దల దృష్టికి రావడంతో వెంకయ్య గారిని కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించారు. అ సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే ఎగురవేసారు. అయితే 1919లో జలంధర్‌కి చెందిన లాలా హన్స్‌రాజ్ ఆ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా, గాంధీ 1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో వెంకయ్యను పిలిచి, కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిసి మధ్య రాట్నం ఉండేలా జెండా చిత్రించమని కోరాడు. గాంధీ సూచన ప్రకారం వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. అలా రూపొందించబడిన జెండాలో కాషాయం హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది, అలాగే ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆశయంలో తెలుపును కూడా అందులో చేర్చారు. ఏప్రిల్‌ 13, 1936  ప్రచురితమైన ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యగారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

1921లో పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం 22.7.1947 న భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించింది. నెహ్రూ గారి సూచన మేరకు  త్రివర్ణ పతాకం లో రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చబడింది. ఆ తరువాత వెంకయ్య గారు క్రమంగా రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. తర్వాత మద్రాసు వెళ్లి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లమా పట్టా తీసుకున్నారు. ఆ తరువాత నెల్లూరు వచ్చి, మైకా ఖనిజం గురించి పరిశోధన కొనసాగించారు. అటు తర్వాత వెంకయ్య గారు అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ మొదలగు ప్రదేశాలలో ఖనిజ నిల్వల మీద పరిశోధన కొనసాగించారు. అంతవరకూ శాస్త్రీయంగా వజ్రాలు  బొగ్గు నుంచి ఉత్పన్నం అవుతాయని అందరూ భావించేవారు.  కానీ వెంకయ్య గారు  మొదటిసారిగా  వజ్రపు తల్లి రాయిని కనుగొని  ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఆవిష్కరణ మీద ఒక ఆంగ్ల పుస్తకం కూడా రచించారు.  దాంతో ప్రజలు వెంకయ్య గారిని వజ్రాల వెంకయ్య అని కూడా సంబోధించేవారు. 1955 లో ఆయన కనుక్కున్న వజ్రపు తల్లి రాయిని చూసిన జియాలాజికల్ సర్వే అధికారులు ఈయనను సలహాదారుగా నియమించుకున్నారు.

మనదేశంలో స్వాతంత్ర్య అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్లు మంజూరయ్యాయి. కానీ వెంకయ్య గారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. దానివల్ల వెంకయ్య గారి జీవితంలో తన చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయి. వృధ్యాప్యంలో ఆర్ధిక బాధలు ఈయనను చుట్టుముట్టాయి, దక్షిణాఫ్రికాలో మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన గుడిసె వేసుకుని గడపసాగారు. ఆయన ఏనాడూ ఏ పదవిని ఆశించలేదు, కానీ ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనని నిర్మించాడు ఆయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవనిస్థాయి. వారికి కావాల్సిన వసతులని ప్రభుత్వాలే సమకూరుస్తాయి. కానీ మన ప్రభుత్వం వెంకయ్య గారిని గుర్తించకపోవడం శోచనీయం, జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలలో మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని రాసేవారు,  కానీ వెంకయ్య పేరుని  ఏనాడు సూచించకపోవడం విచారకరం.

వెంకయ్య గారి చివరి రోజుల్లో విజయవాడలో కొంతమంది  ప్రముఖులు  ఆయనకి ఆర్థిక సహాయం చేయాలనుకున్నారు. కానీ ఆర్థికంగా  సహాయం చేస్తామంటే అంగీకరించని అభిమానవంతులు అని తెలిసిన ప్రముఖులు పింగళి వెంకయ్యను సన్మానించాలని అనుకున్నారు. కష్టం మీద ఆయనను ఒప్పించి 1963 సంక్రాంతి నాడు సన్మానం చేసి కొంత నగదు అందజేశారు.  అతను ఆ  సన్మాన సమయంలో కూడా జాతీయ జెండా  గురించే ఇలా మాట్లాడారు “తాను మరణించినపుడు తన భౌతిక కాయాన్ని  త్రివర్ణ పతాకం తో కప్పండి. స్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి అదే నా చివరి కోరిక”. ఆ సన్మానం జరిగిన తర్వాత ఆయన 6 నెలలు మాత్రమే జీవించారు.1963 జూలై 4న ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇంతటి విశిష్ట సేవలు అందించిన  వెంకయ్య  గారికి కనీస గుర్తింపు కూడా ఇవ్వలేకపోయాయి ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు. స్వాతంత్రానంతరం ఆయన చనిపోయే వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయనను విస్మరించడం బాధ కలిగించే విషయం. 1947 తర్వాత 1963 సంవత్సరం వరకు ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగాయి. కానీ ఒక్కసారి కూడా పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపశిల్పి అని ప్రభుత్వాలు సన్మానించిన దాఖలాలు లేవు. జాతీయ పతాకం ఎగిరే అంత కాలం స్మరించుకోదగిన ధన్యజీవి వెంకయ్య గారు నిరాడంబరమైన, నిస్వార్ధమైన జీవితం గడిపిన మహామినిషి పింగళి వెంకయ్య గారు.

ఆయనను ప్రజలు మర్చిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపచేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింగళి వెంకయ్య గారికి మన దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది.

మీకు ఇండియా అనగానే  మొదట  ఏం గుర్తొస్తుంది… భారత జెండానే… కదా…. అలాంటి గుర్తింపు మనకిచ్చిన మహర్షికి మనం ఏమివ్వగలం. ఆ మహాత్ముడు ఇచ్చిన పతాకాన్ని ప్రపంచ నలుమూలల రెపరెపలాడించడం తప్ప. ఆయన వర్ధంతి సందర్భంగా మన జాతీయ పతాక సృష్టికర్తను ఒక సారి మనసారా స్మృతింద్దాం.

    –          వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

సోమవతి అమావాస్య

అమ సోమవతి వ్రతం – సోమవారం + అమావాస్య :-

సోమవారం + అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచు . శనివారం రోజున మాత్రమే చెట్టుని తాకాలి , సోమవారం రోజున చెట్టుని తాకకూడదు .  సోమవారం రోజున తెల్లవారు ఝామున లేచి దేవాలయలం వేప చెట్టు రావి చెట్టు కింద నాగ శిలలు ఉణ్టయి , ప్రదక్షిణ చేసి దీపారధన చేసి. శిలలు కి నిలతో తడిపి పద్మం ముగ్గు పెట్టి , చెట్టుకి గంధం కలిపిన నీలు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఆమ సోమ వార వ్రాత కధ పుస్తకం లో శ్లోకాలు చుడువుకోవాలి. ఒక వేల కధ పుస్తకం దొరకక పోతే కూడా కింద శ్లోకం చడుకుంటూ ప్రదక్షిణ చేయాలి. నిత్య సౌభాగ్య వతి గ దీవించమని వెదుకొవలి. పండు నైవేద్యం నివేదించాలి. తరువాత ముతయిదువులకి పండు తాంబూలం ఇవ్వాలి.

వ్రత కథ – విధానము :-

      అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు.ఆ కూతురి వివాహాంలో సన్నికల్లు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుందని,ఆ బాలికను సప్తసముద్రాలకు అవతల ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకువెడితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్న గారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు.

      అన్నాచెల్లెళ్ళిద్దరు సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి,”సముద్రాలను దాటడమెలాగా?” అని దిగాలుపడి ఉండగా చెట్టుపై నుండి  ఒక పండు వారి మద్యన పడింది..అన్నాచెఅన్నాచెల్లెళ్ళిద్దరు ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులిట్టే మాయమయ్యాయి.అనంతరం అదే చెట్టుమీదనుండి ఒక గండభేరుండ పక్షి దిగి వచ్చి వాళ్ళిద్దరిని తన వెన్నుమీద కూర్చోబెట్టుకుని సప్తసముద్రాల అవతల ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటొ ఎగిరిపోయింది.

      అది మొదలు అన్నాచెల్లెళ్లు చాకలి పోలి వాకిలి తుడిచి ,కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ,దగ్గరలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు.తను నిద్రలేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ,రకరకాల ముగ్గులతోనూ కళకళలాడుతుండటం చూసిన చాకలిపోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలని కాపుకాసి,ఒకనాడు అన్నాచెల్లెళ్ళను కనిపెట్టింది,”ఎవరు మీరు? నా వాకిలినెందుకు ఊడుస్తున్నారు ? మీకేం కావాలి ?” అని అడిగింది.అందుకు అన్నగారు తన చెల్లెలి విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి,ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు.చాకలిపోలి సమ్మతించి,తన ఏడుగురు కోడళ్లని పిలిచి,తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి,ఆ అన్నాచెల్లెళ్లతో బయల్దేరింది.ఆమె దివ్యశక్తితో సప్తసముద్రాల్ని దాటి,వాళ్ల ఇంటికి చేరి పిల్లకి పెళ్ళి చేయమంది పోలి .పెళ్ళి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు.వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి ధారపోసి అతనిని మళ్ళి బ్రతికించాడు.అది చూసి అందరు ఆశ్చర్యపోయారు.ఆమె నెంతగానో స్తోత్రం చేశారు.

      కాని తన నోము ఫలాన్ని ధారపోయడం వలన,ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు.ఆ సంగతిని కనిపెట్టిన చాకలి పోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయల్దేరింది.దార్లో కనిపించిన రావి చెట్టును చూసి,108 గువ్వరాళ్లని ఏరి పట్టుకుని ఆ చెట్తుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది.ఇక్కడిలా చెయ్యగానే,అక్కడ ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్రలేచినత్లుగా లేచి కూర్చున్నారు.

      పోలి ఇంటికి చేరాక,ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి,జరిగిన అద్బుతానన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా,చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది.

      విధానం :- ఒకానొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి. అశ్వత్థ(రావి) వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చెయ్యాలి.

శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ | మద్యతో విష్ణురూపిణే |  అగ్రత శ్శివరూపాయ | వృక్షరాజాయతే నమ: |

       అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ,నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి.చివర్లో ఒక పండో ఫలమో,మణో,మాణిక్యమో చెట్టు మొదలులో ఉంచి నమస్కరించాలి.అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.

       ఉద్యాపన :- అలా 108 వ అమావాస్యా సోమవారం నాడు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత, వృక్షమూలంలో భియ్యంతో మండపం ఏర్పరిచి,బంగారంతో (యధాశక్తి) నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి,108 కలశాలను స్థాపించి ఆరాధించాలి.ఆఖరున మండపాన్ని,కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి.ముత్తయిదువలకు 108 ఫలాలను గాని,రత్నాలను గాని వాయనదానమివ్వాలి.

– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

వైశాఖ బహుళ ఏకాదశి అపరైకాదశి

వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉపవాసాన్ని మనం పాటిస్తే, మన దుఃఖం, బాధ, అవినీతి లాంటి చెడుగుణాలు దూరమవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలువబడుతుంది. పంజాబ్, జమ్మూ & కాశ్మీర్ మరియు హర్యానాలో, అపారా ఏకాదశిని ‘భద్రకళి ఏకాదశి’ ‘అజల ఏకాదశి’ గా జరుపుకుంటారు మరియు భద్రాకాళి దేవిని పూజించడం ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భద్రకాళి జయంతి’గా జరుపుతారు. ఒరిస్సాలో దీనిని ‘జలకృత ఏకాదశి’ అని పిలుస్తారు మరియు అక్కడ జగన్నాథ్ గౌరవార్థం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు, తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే ఈ భద్రకాళి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తలపించినా… భక్తులకు మాత్రం శాంతమూర్తే! ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అనీ, అపర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని ఈ అర్థానికి సూచన కావచ్చు.

అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా అర్థం వస్తుంది. అపర ఏకాదశి రోజు భగవదారాధనలో మునిగితే… మన మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందనే సూచనేమో! అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పిన మాటలే పై అర్థాలకు బలం చేకూరుస్తాయి. ‘అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే… గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించేసినట్టుగా, సూర్యుడు చీకటి చీల్చిపారేసినట్టుగా మన పాపాలన్నీ నశించిపోతాయని’ చెబుతారు.

శ్రీమహావిష్ణువు అవతరించిన అవతారాల్లో ఒక్కొ అవతారానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటిలో ముఖ్యంగా వామనావతరాన్ని గురించి చెప్పుకోవాలి. అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న విష్ణువును పూజిస్తారు. ఈ రోజున వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు. గంగాస్నానం నేడు ఎంతో ప్రత్యేకమైంది. అపర ఏకాదశి రోజున గంగా స్నానం చేయడం వల్ల పూర్వకాల పాపాలు కూడా పరిష్కరమవుతాయని అంటారు.

అపారా ఏకాదశి వ్రతాన్ని చేసేవారు గత మరియు ప్రస్తుత పాపాలను సులభంగా వదిలించుకోగలడని మరియు మంచితనం మరియు సానుకూలత మార్గాన్ని పొందగలడని నమ్ముతారు.ఈ రోజున ఉపవాసం ఉండే వారికి అపరిమితమైన సంపద లభిస్తుందని నమ్ముతారు. ఏకాదశి ఉపవాసం దశమి నుంచి మొదలై ద్వాదశి వరకు కొనసాగుతుంది. ఈ రోజు ఉపవాసం పాటించే వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి గంగా నీటితో స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించే ప్రజలు సూర్యాస్తమయం తరువాత ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపరాఏకాదశి సందర్భంగా వ్యక్తి తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.

                అపర ఏకాదశి రోజు పూజ చేసేందుకు గాను ప్రత్యేక స్థలాన్ని ఎంచుకుని అక్కడ శుభ్రపరుచుకోవాలి. అనంతరం విష్ణువు, లక్ష్మీ దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. విష్ణువు విగ్రహానికి పువ్వులు, తమలపాకు, కొబ్బరి మొదలైనవి అర్పించాలి. తర్వాత మీ కోరికలన్నీ నెరవేర్చడానికి విష్ణువును ప్రార్థించాలి. సాయంత్రం విష్ణువు విగ్రహం ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు అన్న దానం చేయాలి. పూజలు చేసిన అనంతరం ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయాలి.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)

Categories
Vipra Foundation

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ జయంతి

       భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (ఏప్రిల్ 14, 1891 – డిసెంబర్ 6, 1956) “బాబాసాహెబ్” అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.

బాల్యము :-  1891 భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ మరియు చివరి సంతానంగా జన్మించాడు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) వారు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహర్ కులానికి చెందినవారు కావున అంటరానివారిగా సామాజిక మరియు ఆర్థికఇబ్బందులకు గురి అయ్యారు. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యం లో అంబేద్కర్ పూర్వికులు పనిచేశారు. వీరి తండ్రి భారత సేవలు మోహో సైనిక స్థావరంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశాడు.

డా.బి.ఆర్.చదువులు : Dr.Ambedkar *(1891-1956)* B.A., M.A.,M.Sc.,D.Sc.,Ph.D.,L.L.D.,D.Litt.,Barrister-at-Law

B.A. (ముంబాయి విశ్వవిధ్యాలయం) M.A. (కోలంబియా విశ్వవిధ్యాలయం) M.Sc.( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్) Ph.D. (కోలంబియా విశ్వవిధ్యాలయం) D.Sc. ( లండన్ స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్) L.L.D. ( కోలంబియా విశ్వవిధ్యాలయం) D.Litt. ( ఉస్మానియా విశ్వవిధ్యాలయం) Barrister-at-Law (గ్రేస్ ఇన్ లండన్) law qualification for a lawyer to practice law in royal court of England.

భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ‘ భారతరత్న ‘ అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.

       బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన, రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించిన వాడు అంబేద్కర్. జననం 1891 ఏప్రిల్ 14న. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది. మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న గోరెగావ్ కు భీమ్‌రావ్, అన్న, మేనల్లుళ్ళతో పాటు వెళ్ళాడు. అనుకున్నట్లు, మామ స్టేషన్‍కు రాలేకపోయారు. స్టేషన్ నుండి, గ్రామానికి వెళ్ళటానికి బండిని కుదుర్చుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండివాడికి, వీళ్ళు మెహర్ కులస్థులని తెలిసింది. అందరినీ బండి నుండి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండివాణ్ణి బతిమాలు కొన్నారు. రెండింతలు బాడుగ ఇస్తామన్నారు. భీమ్‌రావ్ అన్న బండి తోలేటట్లు, బండివాడు నడచి వచ్చేటట్లు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధికుళాయి నీరు తాగుతూ వున్న భీమ్‌రావ్ ను కొట్టి మంచినీరు త్రాగకుండా గెంటివేశారు. కులంపేర భీమ్‌రావ్ ను అవమానాలకు గురిచేశారు. రామ్‍జీ, సతారా వదలి పిల్లల చదువుకోసం బొంబాయి చేరారు. భీమ్‌రావ్ ఎల్‌ఫిన్‌స్టన్ హైస్కూల్ లో చేరి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. సంస్కృతం చదువు కోవాలని ఆశించారు. కులం అడ్డు వచ్చింది. ఇష్టంలేకున్నా పర్షియన్ భాష చదివారు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్ళి చేశారు. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్ధి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో నెగ్గారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువుపూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్ధిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయం చేరారు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించారు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత “ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా” అను పేరుతో ప్రచురించబడినది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చారు. అప్పటికాతని వయస్సు 27 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది. మహారాజాగారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కాని ఆఫీసులో నౌకర్లు కాగితాలు ఆయన బల్లపై ఎత్తివేసేవారు! కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణకెంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ ‘మూక నాయక్’ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించారు. 32 సంవత్సరాల వయసులో డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను పొందాడు. కాని ఆఫీసు జవానులు కూడా ఈయనను అస్పృశ్యుడుగా చూచారు. 1927లో మహద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకుండినది: అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయ కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని ఉండడు. ‘ అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశారు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నారు. 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ ‘మనుస్మృతి’ని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కల్గించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అపుడపుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నారు. అంతేకాదు, మనుస్మృతి లోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నారు. 1931లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశ సన్నాహాల సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలుసుకున్నారు. “ఏ దేశంలో లేదా ఏ మతంలో తమను కుక్కలకన్నా, పిల్లులకన్నా హీనంగా చూస్తున్నారో అదేశాన్ని గురించి తానే విధంగాను భావించలేను అంటూ గాంధీజీ, ‘ఐ హేవ్ నో హోమ్ ల్యాండ్'”అని చాటి చెప్పారు. ఆ తర్వాత రౌండుటేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లారు. 1932లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించారు. “మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు.” అన్నాడు అంబేద్కర్. కొన్ని సంవత్సరాలు అస్పృశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం పోరాటం సాగించాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ ‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు, అన్నారు. అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 అక్టోబర్ 14న నాగ్ పూర్ లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించారు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నారు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు వూపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు. అంబేద్కర్ పెక్కు గ్రంథాలు వ్రాశాడు. ‘ది ప్రాబ్లం ఆఫ్ ది రూపీ’, ‘ప్రొవిన్షియల్ డీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటీష్ ఇండియా’, ‘ది బుద్దా అండ్ కార్ల్ మార్క్స్’, ‘ది బుద్ధా అండ్ హిజ్ ధర్మ’ ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమారావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశారు.

డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు

మహారాష్ట్ర ప్రభుత్వం(బొంబాయి), విద్య శాఖా వారు డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములను వివిధ సంపుటములో ప్రచురించారు. 1994 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటములను తెలుగులో అనువదించి ప్రచురించారు.

–              వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)