తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పేద బ్రాహ్మణుల అభివృద్దే ద్యేయంగా 2015 సంవత్సరంలో వరంగల్ జరిగిన “బ్రాహ్మణ అర్చక వేధిక” ద్వారా “తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్”ను ప్రకటించడం దానికి శ్రీ కె వి రమణాచారి గారిని చైర్మన్ గా ప్రకటించి బ్రాహ్మణుల సంక్షేమానికి వివిద పథకాలను ప్రకటించడం జరిగింది.
ప్రభుత్వ పథకాలను పేద, మద్య తరగతి వర్గాలకు అంధించే లక్షంతో బ్రాహ్మణ పరిషత్ ను స్థాపించిన నాటి నుండి నేటి వరకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అంధించడం కోసం “హెల్ప్ సెంటర్” ఏర్పాటు చేసి, ఉచిత సభ్యత్వాలు ఇస్తూ బ్రాహ్మణ ద్రువీకరణ (లెటర్ హెడ్) పత్రములను, కుల దృవీకరణ పత్రాలు ఇప్పించడంలో క్రియా శీలకంగా వ్యవహరించడం, ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తూ, అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, ఉచితంగా ధరఖాస్తులను ఆన్లైన్ చేస్తూ వారికి సంబందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తదితర పత్రాలను సమకూరుస్తూ, గ్రామీణ మరియు పట్టణ బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ పరిషత్ అందించే ఫలాలను అందించాలనే మా “హెల్ప్ సెంటర్” సంకల్పం అంచలంచెలుగా నెరవేరుస్తున్నామని చెప్పుటకు గర్వపడుతున్నాం, పథకాల సాదనలోనే కాకుండా వాటి వినియోగంలో, విది విదానల రూపకల్పనలో, ఉచితంగా అవగాహన, చైతన్యం కల్పిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఒక వ్యవస్థనే నడుపుతూ తెలంగాణలోనే మేటిగా నిల్చింది, ఈ అవకాశాలను అర్హులందరూ వినియోగించుకోవాలని సవినయంగా కోరాతున్నామ్.
ఇప్పటివరకు వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండి లబ్ది దారులను తయారుచేసి తద్వారా వివిద రకాల చిన్న, మద్య తరహా కుటీర (స్వయం ఉపాది) పరిశ్రమలను, అనేక రకాల సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ రంగాలను ఏర్పాటు చేసుకొని, వారి జీవన బృతికి తోడ్పాటు అందించడం జరుగుతున్నది.
అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విడుదల చేసిన వేయి హెల్త్ కార్డ్స్ గాను “హెల్ప్ సెంటర్” నుండే 351 కుటుంభాలకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించాం, ఈ హెల్త్ కార్డ్స్ సంబందిత ఇన్సూరెన్స్ కొంపనీ ద్వారా కవరేజ్ (ఇంప్లిమేంట్) అయి దాదాపుగా 37 కుటుంబాలకు 21 లక్షల రూపాయల పైచిలుకు వైద్య ఖర్చులను అందించడం ద్వారా ఆ కుటుంభాలకు ఆర్ధిక భారం కాకుండా అనేక బ్రాహ్మణ కుటుంభాలకు దీర్గకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలకుసైతం పరిష్కారం చూపించించడంలో దోహదపడ్డాయి. ఇవే కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఒవర్సీస్ (విదేశీ విద్య) లాంటి పథకాలను మన బ్రాహ్మణ కుటుంబాలకు చేరవేయడంలో ముందుండడం జరిగింధి.
ఇంతటి ఈ ధర్మ యజ్ఞానికి దైవంతో పాటు పెద్దల, నిత్య కర్మానుస్టానపరుల ఆశ్వీర్వాదములు లభించాయి కాబట్టే రాష్ట్రంలోనే అన్ని బ్రాహ్మణ సంఘాల కంటే పథకాల సాదనలో మొదటి స్థానంలో ఉండడం జరిగింధి.
ఇలా అనేకమందికి సేవ చేసే సదవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు ధన్యుడను. ఇలాగే మీ అందరి ఆత్మీయ, ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాపై ఉంటాయని ఆశీస్తూ… మీ వల్లూరి పవన్ కుమార్