సర్వే జనాః సుఖినో భవంతు… ఇది ప్రతి బ్రాహ్మణుడి ఆశయం. సమాజంలో తరతరాలుగా బ్రాహ్మణ వర్గమునకు అపరిమితమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. దానికి వారు నిర్వర్తిస్తున్న కర్మలు, పూజాధికాలే కారణం. బ్రాహ్మణుడు సర్వజనుల సౌఖ్యాన్ని కోరుతాడు.
ఈ వెబ్ సైట్ ప్రధానోద్దేశం దేశ దేశాల్లో మరియు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిర పడిన బ్రాహ్మణులని ఒకరితో ఒకరికి సంబంధాలు ఉండేలా చూడటం మరియు బ్రాహ్మణుల మద్య శాఖా బేధం లేకుండా వివిద బ్రాహ్మణ సంఘాలు నిర్వహించే కార్యక్రమాల ముఖ్య వివరాలు మరియు వివాహ పరిచయ వేదికల సమాచారం వారికి సకాలములో చేరవేయడం, మనం సంకల్పించి తలపెట్టిన బ్రాహ్మణ భవన (విప్ర సదనం) నిర్మాణానికి సంభందించిన సమాచారంతో పాటు, అన్ని రకాల పండుగలు, ప్రశాస్త్యాలను, ఆద్యాత్మిక కార్యక్రమాల వివరాలను, వేడుకలను, కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు అందరికీ అందుబాటులో ఉంచడం, ప్రముఖ దేవాలయాల ప్రశాస్త్యాలను మొదలైనవి పొందుపరచడం జరుగుతుంది.
దీనికి సంబంధించి మరిన్ని సలహాలు, సూచనలు తెలుపవలసిందిగా బ్రాహ్మణ భందువులను కోరుతున్నాము.