భారతదేశ ప్రగతికి రైతే ప్రధానం. కర్షకుడు సంతోషంగా ఉన్న రోజున మన దేశం అభివృద్ధి చెందిన దేశమని చెప్పవచ్చు. చలి, ఎండ, వానకు ఎరువక కుటుంబాన్ని వదిలి సరిహద్దులో ఉన్న సైన్యం ప్రశాంతంగా ఉన్న నాడు దేశ రక్షణకు ఇబ్బందిలేదు. అందుకే జై జవాన్.. జై కిసాన్ అని నేను అంటున్నాను.. అన్నాడు మన దేశ రెండవ ప్రధాని లాల్‌బహదుర్ శాస్ర్తి.(ఈయన కంటే ముంద గుల్జారీలాల్ నందా ప్రధానిగా చేసినా అది తాత్కాలిక బాధ్యతలు మాత్రమే.. కాబట్టి అధికారికంగా రెండవ ప్రధాని శాస్ర్తిగారే..)
లాల్ బహదుర్ శాస్ర్తి
ప్రధానమంత్రి పదవిలో…
జూన్ 9, 1964 – జనవరి 11, 1966
విదేశీ వ్యవహారాల మంత్రిగా…
9 జూన్, 1964 – 18 జులై, 1964
హోం మంత్రిగా…
4 ఏప్రిల్ 1961- 29 ఆగస్టు 1963
జననం : 2 అక్టోబరు 1904
ప్రాంతం : మొగల్‌సారాయ్, ఉత్తరప్రదేశ్
మరణం : 11 జనవరి 1966 (వయసు 61)
ప్రాంతం : తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
వృత్తి : రాజకీయాలు
రాజకీయ పార్టీ : భారత జాతీయ కాంగ్రెస్
భార్య : లలితా దేవి
లాల్ బహాదుర్ శాస్ర్తి భారత దేశ రెండవ శాశ్వత ప్ర ధానమంత్రి, దేశ స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి. దేశ ప్రజలతోనే కాదు ఇతర దేశాధినేతలతో నూ పొట్టివాడైనా గట్టివాడు అనిపించుకున్నాడు. ఉత్తరప్ర దేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్లో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జ న్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కు టుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్‌ను చూసుకొని ఆ త ల్లిదండ్రులెంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్యశృంఖా లలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయా లని అప్పటికే కృషి చేస్తున్న మహాత్మాగాంధీ జన్మదినమైన అక్టోబరు 2న, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతు లకు మరీ ఆనందం కలుగచేసింది. నిరాడంబరతకు తో డు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండే ది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి.
అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊ రికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్‌బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. దురదృష్టవశా త్తు ఏడాదిన్నరకే లాల్ బహదూర్ తండ్రి మరణించ డంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధా రమైంది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు. తాత గారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహ దూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరం గా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానా లను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు త నకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తు న్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపా ధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు.
స్వాతంత్య్రోద్యమం..
1921లో గాంధీ ప్రారంభించిన సహా య నిరాకరణోద్యమంలో పాల్గొనడా నికి కాశీలోని జాతీయవాద కాశీ విద్యా పీఠంలో చదవడం ప్రారంభించాడు. 1926లో శాస్ర్తి అనే పట్టభద్రుడయ్యా డు. స్వాంతంత్య్రోద్యమ పోరాటకా లంలో తొమ్మిది సంవత్సరాలు జైలు లోనే గడిపాడు. సత్యాగ్రహ ఉద్య మం తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు.
రాజకీయ జీవితం : స్వాతంత్య్రం త ర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గంలో గృహ మంత్రిగా పని చేశాడు. 1951లో లోక్‌సభ ప్రధాన కార్యద ర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరి యళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతి క బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశా డు. తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో చేరి తొలుత ర వాణా శాఖ మంత్రిగా, గృహ మంత్రిగా, హోంశాఖా మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు.
ప్రధానమంత్రిగా.. : 1964లో అప్పటి ప్రధాని నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికి, లాల్ బహదూర్ శాస్ర్తీ, మొరార్జీదేశాయ్ సిద్ధంగా ఉండగా, అప్ప టి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావా లున్న లాల్ బహదూర్ శాస్ర్తీకి మద్దతుపలికాడు. శాస్ర్తి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభాన్ని తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేశాడు. దీర్ఘకాలిక పరిష్కారానికి దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలు పరిచాడు. 1965 ఆగష్టులో పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూకా శ్మీర్‌లోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుంచి విడిపోతార ని ఆశించింది. అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న శాస్ర్తి త్రివిధ దళాలకు ని యంత్రణ రేఖను దాటి లాహోర్‌ను ఆక్రమించుకోవడానికి ఆదేశాలు ఇచ్చి ధీర పటిమను ప్రదర్శించారు.
మరణంపై
వీడని మిస్టరీ…
తాష్కెంట్లో ఉన్న సమయంలో శాస్ర్తిగారు మరణించారు. చనిపోవడానికి కొద్ది సేపటి ముందు తన వ్యక్తిగత సహాయకుడు చేసిన వంట కాకుండా.. ఆయన భారత రాయబారి టిఎన్ కౌల్ వంట మనిషి జాన్ మహమ్మద్ చేసిన వంట తిన్నారు. ఆ తర్వాత ఆయన శరీరం నీలంగా మారడం, సహజ మరణమేనని ఓ పత్రంపై సంతకం చేయమన్నా వ్యక్తిగత సహాయకులు నిరాకరించడం అనుమానాలకు తావిచ్చింది. చివరకు లలితా శాస్ర్తి 1970లో తన భర్త మరణంపై విచారణకు డిమాండ్ కూడా చేశారు.
- వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)