కొన్ని దశాభ్దాల క్రితం భారత ప్రభుత్వం ప్రోత్సాహంతో శ్రావణ పౌర్ణిమ నాడు సంస్కృతము (संस्कृतम्) భాషా ఉత్సవంగా పరిగణించే విదానం ఆచరణలోనికి వచ్చింది. ఈ రోజు సమస్త భారతీయభాషలకు మూలమైన సంస్కృత (संस्कृत) భాషను స్మరించుకొనే పవిత్ర సాంప్రదాయము అవుతుంది . ప్రభుత్వపరంగా సంస్కృత దివస్ గా వేడుకలు నిర్వహిస్థారు. ప్రభుత్వ పక్షాన ఈ రోజు భాషా పండితులకు సన్మానిస్తారు . ఈరోజు ఈ వేడుకను జరుపుకోవటం వాళ్ళ సంస్కృతము (संस्कृतम्) భాష వైపు ఆకర్షించటానికి ఉత్తమమైన మార్గం ఎర్పడింది. మనం ఈ భాషగురించి కొంచెం తెలుసుకుందాం.
సంస్కృతము (संस्कृतम्) ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము.
సంస్కృతము (संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష మరియు భారతదేశ 23 ఆధికారిక భాషలలో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు.
జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా:
* 1971–>2212 * 1981–>6106 * 1991–>10000 * 2001–>14135.
అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. మత్తూరులో 95 శాతం మంది, జిహ్రీలో 100 శాతం మంది సంస్కృతంలో సంభాషించడం విశేషం.
సంస్కృతం అంటే ‘సంస్కరించబడిన’, ‘ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన’ అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.
ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; మరియు భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడ ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము.
సంస్కృత దివస్ శుభాకాంక్షలు .
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)