మన దేశ తొలి ఉపాధ్యక్షుడు, రెండవ అధ్యక్షుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్ 5న జన్మించారు. ఆయన జన్మించిన రోజును దేశవాసులు ‘టీచర్స్ డే’గా జరుపుకుంటున్నారు. 1962 నుంచి 1967 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేశారు రాధాకృష్ణ. ఆ సమయంలో కొందరు విద్యార్థులు, స్నేహితులు రాధాకృష్ణన్‌ను కలిసి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని అతనివద్దకు వచ్చినప్పుడు, “నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను”, అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో “ఉపాధ్యాయ దినోత్సవం” గా జరుపుకుంటున్నారు.
జననం – విద్యాభ్యాసం ప్రారంభ జీవితం, విద్య…
గొప్ప వేదాంతి…
సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు. 1888 సంవత్సరం సెప్టెంబర్ 5న జన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణి లో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. సర్వేపల్లి వారిది అతి సాధారణ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి జమిందారు వద్ధ చిన్న ఉద్యోగం చేశేవారు. తిరుత్తణి లో జన్మించిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాతృ భాష తెలుగు. ఆయన తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజెలికల్ లూథర్ మిషన్ స్కూల్లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనంతరం ఎం.ఎ. పూర్తిచేశారు. ఇక డాక్టర్ రాధాకృష్ణన్ అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.
మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ ఆర్ట్స్ పట్టా అందుకున్నారు. సర్వేపల్లి గారికి, శివకామమ్మ గారితో 1904 లో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న మృతిచెందారు.
ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా దేశ అధ్యక్షుడిగా1962 నుంచి 1967వరకు పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు.
గొప్ప ప్రొఫెసర్‌గా…
కోల్‌కతా యూనివర్సిటీలోని కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌లో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రొఫెసర్‌గా 1921 నుంచి 1935 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో 1936 నుంచి 1952 వరకు పనిచేయడం విశేషం. ఆయన ఉత్తమ అధ్యాపకుడిగా విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేస్తూ పలువురి ప్రశంసలనందుకున్నారు. ఆయన ప్రతిభకుగాను నైట్‌హుడ్(1931), భారతరత్న (1954), ఆర్డర్ ఆఫ్ మెరిట్ (1963) అవార్డులను అందజేశారు. ఇక 1909లో సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనంతరం మైసూర్ యూనివర్సిటీ వేదాంతం ప్రొఫెసర్‌గా అతన్ని నియమించింది.
ఈ సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్ ద క్వెస్ట్, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ జర్నల్ ఆప్ ఎథిక్స్‌కు ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ఆయన తొలిసారిగా ‘ది ఫిలాసఫి ఆఫ్ రవీంద్రనాథ్’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్ ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్ మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా చేయాలని రాధాకృష్ణన్‌ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్ బనారస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ యునెస్కోలో ఇండియా ప్రతినిధిగా 1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతో పేరుతెచ్చుకున్నారు.
చేపట్టిన పదవులు
మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
1929లో, ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు “తులనాత్మక మతము”(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
గౌరవములు
ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.
1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రకటించింది.
రచనలు
The Ethics of the Vedanta and Its Material Presupposition
(వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు)(1908) – ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము)(1918).
The Reign of Religion in Contemporary Philosophy
(సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి)(1920).
Indian Philosophy (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).
The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము)(1926).
The Religion We Need (మనకు కావలిసిన మతము)(1928).
Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు)(1929).
An Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము)(1932).
East and West in Religion (ప్రాక్ పశ్చిమాలలో మతము)(1933).
Freedom and Culture (స్వాతంత్ర్యం మరియు సంస్కృతి)(1936).
The Heart of Hindusthan (భారతీయ హృదయము)(1936).
My Search for Truth (Autobiography) (నా సత్యశోధన(ఆత్మకధ))(1937).
Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు)(1938).
Eastern Religions and Western Thought
(తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
Mahatma Gandhi (మహాత్మా గాంధీ)(1939).
India and China (భారత దేశము మరియు చైనా)(1944).
Education, Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).
Is this Peace (ఇది శాంతేనా)(1945).
The Religion and Society (మతము మరియు సంఘము)(1947).
The Bhagwadgita (భగవధ్గీత)(1948).
Great Indians (భారతీయ మహానీయులు)(1949).
East and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని చింతనలు)(1955).
Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).
సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ముఖ్య కొటేషన్లు
మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది.
ద్వేషాన్ని ద్వేషంతో చల్లార్చలేము. ప్రేమాభిమానాలతోనే చల్లబర్చగలము.
- వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)