ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది. ముస్లింలు కూడా పాల్గొనే ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీక! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో ఈ బోనాల జాతరలో కొన్ని లక్షల మంది పాల్గొంటారు.
లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు. ఈ అమ్మవారు మహామహిమాన్వితగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించడానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారు.
తలుగు వారి సంస్కృతి వైభవానికి బోనాల పండుగ ఒక విజయకేతనం. ఇది తెలంగాణా ప్రత్యేకతను చాటే విశిష్ట పండుగ. పండుగైనా ఏదో ఒక సందర్భానికి ప్రతీకగా నిలిచిపోయి వుంటుంది. అలాగే ఈ బోనాల పండుగ కూడా ఋతువులు మారే ఈ ఆషాడమాసంలో వర్షాలు ప్రారంభ మవుతాయి. వాతావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా వ్యాధులు సంక్రమించేకాలం. ప్రాచీనకాలంలో ఈ ఋతువులో కలరా, ప్లేగు వ్యాధులు ఎక్కువగా వ్యాపిం చేవి. ఇప్పుడంత వైద్య సౌకర్యాలు లేని ఆ రోజులలో దేవతలను కొలిచేవారు.1813 సం||లో నగరంలో వేలాది మంది ప్లేగు వ్యాధి బారిన పడ్డప్పుడు మహంకాళీ దేవిని వేడుకోవటంతో వ్యాధి తగ్గు ముఖం పట్టిందని ఆనాటి ప్రజలు నమ్మారు. అప్పటి నుండి నగరంలో ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తు న్నారు.
ఏడో నిజాం కాలం నుండి సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో బోనాలపండుగ ఘనంగా జరిగేది. ఈ పండుగలో ముస్లింలు కూడా పాల్గొనేవారని చెపుతున్నారు. ఇది మత సామరస్యానికి ప్రతీకనే కదా! ఇప్పటికి నగరంలో చిన్నా పెద్దా దేవాలయాలు కలిపి మూడు నాలుగు వందల దేవాలయాలలో ఈ బోనాల జాతర జరుగుతుంది.కొన్ని లక్షల మంది భక్తితో దీనిలో పాల్గొంటారు.జంట నగరాల నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి మహంకాళీ బోనాల జాతరలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు.
ఈ పండుగ జాతర మొదట గోల్కొండ కోటలో మొదలవుతుంది. ఈ మహోత్సవం గోల్కొండ కోటలోని జగదాంబికా ఆలయంలో ప్రారంభమై నెల రోజుల పాటు సాగుతుంది. గోల్కొండ కోటలో మాతా జగదాంబికా ఆలయంలో అబుల్ హసన్ తానీషా కాలంలో ప్రధానమంత్రి సైనికాధి కారులుగా వున్న అక్కన్న మాదన్నల కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు చెపుతారు. నిజాం కాలంలో కూడా ఇక్కడ ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు జరిగేవి.
ఆషాడ మాసం మొదటి గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు నగరంలోని వివిధ దేవాలయాలలో జరిగి చివరకు మళ్లి గోల్కొండ కోటలో ముగుస్తాయి.
ఆషాడ మాసం రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ (లష్కర్ బోనాలు) ఆలయంలోను, మూడవ ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహినీ మహంకాళీ అమ్మవారి ఆలయం లోను జరుగుతాయి. వీటితోపాటు జంటనగరంలోని అన్ని దేవాలయాల లోను బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి.
హరిబౌలీలోని అక్కన్నమాదన్న, శాలిబంబలోని ముత్యాలమ్మ, గౌలిపురాలోని కోట మైసమ్మ, సుల్తాన్ షాహి నల్ల పోచమ్మ, ఉప్పుగూడ మహంకాళి, అలియాబాద్ దర్బార్ మైసమ్మ, మిర్ఆలం మండి మాతామహంకాళి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, మేకల మండి నల్ల పోచమ్మ ఇలా అనేక దేవాలయాలలో ఈ బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే ప్రతి చిన్న బస్తీలోనూ కూడా ఈ బోనాల పండుగ ఎంతో వేడుకగా జరుగుతుంది. అక్కన్న మాదన్న దేవాలయంలో మహంకాళీ అమ్మవారిని వీధులలో ఊరేగిస్తారు.లాల్‌దర్వాజా సింహవాహినీ శ్రీమహంకాళీ దేవాలయానికి ఒక ప్రత్యేకత వుంది. ఈ సింహవాహిసీ శ్రీమహంకాళీ దేవాలయానికి వందేళ్ల పైగా చరిత్ర వుందంటారు. ఈ అమ్మవారు మహామహిమా న్వితగా భక్తులు కొలుస్తారు. ఇక్కడ జరిగే బోనాల జాతరను తిలకించ డానికి తెలంగాణా జిల్లాల నుండే కాక ఇతర ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు తరలివస్తారని అంటారు. నిజాం ప్రభువులు నగర రక్షణ కోసం నగరం చుట్టూ పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు. నగరానికి రాకపోకలకు వీలుగా అక్కడక్కడ దర్వాజాలు, కిటికీలు ఏర్పాటు చేసి అక్కడ శక్తి స్వరూపుణి అయిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాంటి దర్వాజాలలో లాల్‌దర్వాజా ఒకటి. ఇక్కడి దర్వాజాకు స్థానికులు పండగలకు ఎర్రని జాజు రంగు వేయడంతో లాల్‌దర్వాజా అనే పేరు వచ్చిందని అంటారు. లాల్‌దర్వాజా దగ్గర కూడా అమ్మవారి విగ్రహం వుండేది. అమ్మవారికి నిజాం నవాబు పూజలు చేసాడని అంటారు. 1908 సం||లో మూసీనదికి వరదలు వచ్చి నగరం అతలా కుతలం అయినప్పుడు అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ ఆలీఖాన్ అయోమయంతో పడ్డారు. అప్పటి ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సలహాకోరారు. ఆయనకు కూడా ఏం చెప్పాలో తోచక సంకట స్థితిని ఎదుర్కొన్నారు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఇలాంటి ప్రళయం సంభవిస్తుందని, ఆమెను శాంతిప జేయడానికి పూజలు చేయాలని నిజాం ప్రభువుకు సూచించారు. మహారాజా కిషన్ ప్రసాద్ సలహా మేరకు నిజాం నవాబు బంగారు చాటలో లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టు వస్త్రాలతో అమ్మ వారికి పూజ చేసారు.
అనంతరం ఈ ప్రాంతంలో స్థానికులు ఆలయాన్ని పునరుద్ధరించి 1968 సం||లో కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీ శంకచార్యులవారిచే విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. మొదట్లో ఇక్కడ కూడా బోనాల పండుగ సందర్భంగా జంతు బలులనిచ్చేవారు. అయితే 1953 నుండి జీవరక్షక ప్రచారమండలి సహకారంతో జంతుబలుల స్థానంలో గుమ్మడి కాయలను బలి ఇస్తున్నారు.ఈ బోనాల పండుగ సందర్భంగా మహంకాళీ దేవాలయంలో అమ్మ వారిని పురవీధుల్లో ఊరేగిస్తారు.
మొదటి రోజు పలహారం బండిని ఊరేగిస్తారు. రెండో రోజు రంగం ఉంటుంది. శివసత్తులూగే మహిళ భవిష్యద్వాణి వినిపిస్తుంది. బోనాల పండుగ సందర్భంగా జరిగే యాత్రలో పురుషులు పాల్గొంటారు. నృత్యాలు చేస్తారు. కన్నుల పండు గగా జరిగే ఈ బోనాల పండుగ జాతర చూసి తీరవలసిందే.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)