జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ). మరణం – 04.04.1680 (చైత్ర పౌర్ణమి).
శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1627వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది. మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్లకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మహారాష్ర్ట సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. శివాజీ తండ్రి షాహాజీ, ఇతడు సుల్తానుల దగ్గర సైన్యాధికారి. తల్లి జిజియాబాయి. ఈ దంపతులకు 1630, ఫిబ్రవరి 19న జున్నార్ సమీపంలోని శివనెరీ కోటలో శివాజీ జన్మించాడు. జిజియాబాయి తాను పూజించే దేవత శివై (పార్వతి)పేరు శివాజీకి పెట్టింది.జిజియాబాయి కొడుకుకి చిన్ననాటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టింది. తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు పన్నాడు. 17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. శివాజీ బీజాపూర్ సుల్తాన్ నుంచి పురంధర్. రాయఘడ్, సింహఘడ్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత శివాజీ 1664లో సూరజ్‌ను ముట్టడించాడు. కానీ 1665లో ఔరంగజేబు పంపిన జైసింగ్ పూనాపై దాడి చేసి పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీనితో శివాజీ పురంధర్ సంధి కుదుర్చుకున్నాడు. శివాజీ అధీనంలో ఉన్న 35 కోటల్లో 23 కోటలను మొఘలు వశం చేశాడు. తర్వాత నాలుగు ఏళ్లకే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ1674లో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పాలన సుదీర్ 12:27 PM కాషాయవర్ణ సింహాల సమూహం – శివాజీ పాలన సుదీర్ఘ కాలం యుద్ధాలతో సాగినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్ర్తీలకు సహాయం చేశాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు. ఒకసారి సైనిక అధికారి చిన్నముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ‘‘నా తల్లి నీ అంత అందమైనది అయితే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని” అని, ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపిం చాడు .శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు.
కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే! అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీది..
శివాజీ మహారాజ్ కీ జై.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)