(1916 నవంబర్ 25 —1991 డిసెంబర్ 05)
నిజాం వ్యతిరేక పోరాటం లో ప్రముఖ పాత్ర ఆయనది. స్వాతంత్రోద్యమంలో వరంగల్ నుంచి ఎదిగిన తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో ఆయనొకరు. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడిగా గుర్తింపుపొందారు. నిజాం నిరంకుశ పరిపాలనకు వ్య తిరేకంగా స్వామి రామానందతీర్థ నాయకత్వంలో పోరాటం సాగించిన కొద్దిమంది నాయకులలో ఆయన ఒకరు. ఆయనే తిరువరంగం హయగ్రీవాచారి. వరంగల్ పురపాలక సంఘం ప్రథమ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేస్తూ విభిన్న వర్గాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనను ప్రత్యేక పాత్ర పోషించారని ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు హయగ్రీవాచారి చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు.
బాల్యం విద్యాభాస్యం..
హయగ్రీవాచారి 1916 నవంబర్ 25న ధర్మసాగర్ గ్రామంలో జన్మించారు. తిరునగరి శ్రీనివాసాచార్యులు-ఆండాళమ్మ ఆయన తల్లిదండ్రులు. మూడొ తరగతి వరకు ధర్మసాగర్‌లోని వీదిబడిలో చదివారు. కాంతంరాజు, రావుల నరసింహరెడ్డి వద్ద పెద్దబాలశిక్ష చదివారు. ఆ తరువాత వారి కుటుం బం హన్మకొండ పట్టణంలో స్థిరపడింది. ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఉన్నత పాఠశా ల ఉండేది. ఉన్నత పాఠశాలల్లో చదివే రోజుల్లోనే హయగ్రీవాచారిపై జాతీయోద్యమ ప్రభావం అందరిలాగే పడింది. 1932లో నిర్వహించిన కాకతీయ ఉత్సవాలు ఆనాటి యువకులను ఉత్సాహపరిచాయి. ఎంతోమందిలో ఉత్తేజాన్ని నిం పాయి. ఆ ఉత్సవాల నిర్వహణలో పర్సా రంగారావు, ఉద య రాజుశేషగిరిరావు, ఆవంచ వెంకట్రావు, మాదిరాజు రా మకోటేశ్వరరావు, కాళోజీ రామేశ్వర్‌రావులతోపాటు విద్యార్థి సేవాదళ హయగ్రీవాచారి పనిచేశారు. 1935లో హయగ్రీవాచారి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్‌లో చేరారు. హైదరాబాద్ వెళ్లి బీఏలో చేరి మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఆయ న పూర్తి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు.
వరంగల్‌కు అయ్యగారు ముద్ర
హయగ్రీవాచారిని అందరూ అయ్యగారు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆయన చేపట్టిన అనేక పదవుల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి పోచంపాడు నీళ్లు తీసుకువచ్చి వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలలో మంచినీటి కొరత తీర్చటంలో హయగ్రీవాచారి ఎంతోకృషి చేశారని ఆయనకు పేరుం ది. సహకార ఉద్యమ వ్యాప్తిలోనూ, బలహీన వర్గాల పురోగతిలోనూ అయ్యగారి అసాధారణమైందని ఆయన అభిమాను లు గుర్తుచేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా బోర్డు వైస్ చైర్మన్‌గా హయగ్రీవాచారి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషిచేశారని ఆనాటి కాంగ్రెస్ నాయులు పేర్కొంటున్నారు. 1950-52లో వరంగల్ జిల్లా పారిశ్రామిక సలహా మండలి సభ్యులుగా జిల్లా లో పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. రాష్ట్రస్థాయిలో, అఖిలభారత స్థాయిలో వివిధ అంశాలపై మహాసభలు నిర్వహించడంలో ఆయన పాత్ర కృషి చెప్పుకోదగింది. హైదరాబాద్ హిందీ ప్రచార స భ అధ్యక్షుడిగా, హిందీ ప్రతిస్ఠాన్ వ్యవస్థాపకులుగా హిందీ భాషకు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.
వరంగల్ పురపాలక సంఘం తొలి అధ్యక్షుడిగా..
వరంగల్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి హయగ్రీవాచా రి ఎంతో శ్రమించారు. ఆయన కృషి ఫ లితంగానే వరంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. వయోజన ఓటింగ్ పద్ధతిపై ఎన్నికైన వరంగల్ పురపాలక సంఘ తొలి అధ్యక్షుడిగా హయగ్రీవాచారి ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానంతరం ఆయన చేపట్టిన తొలిపదవి ఇదే..
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. నలుగురి సీఎంల వద్ద మంత్రిగా..
హయగ్రీవాచారి అవిభాజ్య వరంగల్‌జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, నలుగురు సీఎంల మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేశారు. 1972 నుంచి ఆయన మంత్రిగా పనిచేశారు. పీవీ నర్సింహారావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, టీ.అంజయ్య, భువనం వెంకట్రామ్‌రెడ్డిగా పనిచేశారు. ఆయన నిర్వహించిన పదవులను సమర్థవంతంగా చేశారనే పేరును సంపాదించుకున్నారు. పంచాయతీరాజ్, సాంకేతిక విద్య మొదలైన శాఖలను ఆయన నిర్వహించిన కాలంలో ఆయా శాఖల నుంచి జిల్లా వాటాను తెచ్చుకోగలిగారని ఆయనకు పేరుంది.
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)