స్వస్థలం: మడికొండ మరియు ములుగు, వరంగల్ జిల్లా
బాల్యం: దండంపల్లి, నల్గొండ జిల్లా
నివాసం: హైద్రాబాద్
తలిదండ్రులు: రావిచెట్టు వెంకటమ్మ- నరసింహారావు (మన్సబ్‌దార్)
జననం: 27 నవంబర్ 1877 మరణం: 3 జులై 1910 (33 సం,లు)
ధర్మపత్ని: లక్ష్మీనరసమ్మ
కీ శే రంగారావు దంపతుల సేవా దర్శిని
- శ్రీ శంకర భగవత్పూజ్య గీర్వాణ రత్నమంజూష – సంస్కృత గ్రంధాలయ వ్యవస్థాపన (క్రీ. శ. 1900 కు పూర్వం)
కొమర్రాజు లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, ఆదిపూడి సోమనాధరావు, మైలవరపు నరసింహ శాస్త్రి గారల బృమ్దాన్ని హైద్రాబాద్ రాజ్య భాష, గ్రంధాలయ, ప్రచురణోద్యమ పితామహులుగా పిలుస్తారు. వీరందరిలో పూర్తిగా తెలంగాణాకు చెందినవారు రావిచెట్టు రంగారావుగారొక్కరే)
- శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం- వ్యవస్థాపన 1 సెప్టెంబర్ 1901 (రంగారావు గారిస్వగృహంలో), తొలి 5 సంవత్సరాలు నిర్వాహకుడు(కార్యదర్శి, గ్రంధపాలకుడు, గణకుడు, భృత్యుడు)
- రావిచెట్టు రంగారావుగారు కొందరు విద్యార్ధులను తన పోషణలో ఉంచుకొని చదివించారు (వారిలో ఆదిరాజు వీరభద్రరావు గారొకరు)
- కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి అనుబంధంగా ఒక పాఠశాలను నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.
- శ్రీ రాజరాజ నరెంద్ర భాషానిలయం, హన్మకొండ 26 జనవరి 1904
- విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపన 1906 (ద్రవ్య దాత, కార్యనిర్వాహకుడు), గ్రంధ ప్రచురణకోసం కొంతకాలం మద్రాసుకు కాపురం మార్చారు.
- మూసీ వరద (1908) బాధితుల సహాయార్ధం పలుకార్యక్రమాలు చేపట్టారు.
- కాంగ్రేస్ స్వదేశీ ఉద్యమం (1905) కంటే పదేళ్ళ పుర్వమే స్వదేశీ వాదాన్ని ఆచరించారు. బందరు జాతీయ కళాశాలకు సాయపడ్డారు.
- మాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మకు 1907లో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురణలను బహూకరించారు
- ఆయన ఉదారవాది, సామాజిక సామరస్యవాది.
- రంగారావుగారు చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో లక్ష్మీనర్సమ్మ గారి సహకారం, క్రియాశీల భాగస్వామ్యం ఉన్నాయి.
- మహిళాసంఘాలను నెలకొల్పి తన భార్య లక్ష్మినర్సమ్మ గారిని అధ్యక్షులుగా చేసి మహిళాభ్యుదయానికి కృషి చేశారు.
- రంగారావుగారి మరణానంతరం లక్ష్మీనరసమ్మగారిచ్చిన రూ 3 వేల విరాళంతో ప్రస్తుఅ సుల్తాన్‌బజార్ స్థలాన్ని (పాతపెంకుటిల్లుతో సహా) ఖరీదు చేశారు.
- హైద్రాబాద్ రాజ్య ప్రజాస్వామిక, సాంస్కృతిక ఉద్యమాలకు సంబందించి ప్రభుత్వ దృష్టిలోకి వెళ్ళిన మొదటి తెలుగువాడు రావిచెట్టు రంగారావుగారే.
బరోడా (గుజరాత్) రాజు షాయాజీ రావు గైక్వాడ్‌ను (1863- 1939) భారతదేశ ఆధునిక గ్రంధాలయోద్యమ పితామహునిగా గుర్తిస్తారు. ఆధునిక గ్రంధాలయోద్యమం ప్రారంభమైన కాలాన్ని 1907నుండి లెక్కిస్తారు.
హైద్రాబాద్‌లో 1901లో ప్రారంభమైన ఈ ప్రజాగ్రంధాలయ వ్యవస్థ 1926 వరకు 64 గ్రందాలయాలకు చేరింది. ఇది ప్రజలకోసం ప్రజల చేత ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకొన్న గ్రంధాలయ వ్యవస్థ. ఆంధ్రజన సంఘానికి (1921) ఈ గ్రంధాలయ, ప్రచురణ వ్యవస్థ పూర్వరంగంగా పనిచేసింది.
కీ. శే. రావిచెట్టు రంగారావు గారు మా తాతగారైన రావిచెట్టు రాజేశ్వర్ రావు గారికి అన్నయ్య (పెదనాన్న కొడుకు), రంగారావుగారు నిస్సంతు. మడికొండనుండి రంగారావుగారు తమ అమ్ముమ్మగారింటికి వెళ్ళగా మాతాతగారు ములుగుకు వెళ్ళారు.
విజ్ఞప్తి:
మాతృభాష, గ్రంధాలయోద్యమాలలో వారి స్ఫూర్తిని కొనసాగించడంకోసం రంగారావు గారి జయంతి (27 నవంబర్), వర్ధంతి (3 జులై)లను ప్రభుత్వం నిర్వహిందచాలి.
రాష్ట్రంలోని గ్రంధాలయాలు, విద్యాలయాల్లో రంగారావుదంపతుల చిత్ర పఠాన్ని ఉంచాలి
జయంతిని తెలంగాణా గ్రంధాలయ దినోత్సవంగా ప్రకటించాలి.
రంగారావు దంపతుల విగ్రహాలను టాంకుబండుపై నెలకొల్పాలి
రంగారావు దంపతుల తపాలా బిళ్ళకోసం కెంద్రప్రభుత్వానికి సిఫార్సు చేయాలి
- ప్రతాపరుద్ర గ్రంధాలయం, మడికొండ వ్యవస్థాపకులు కీ శే పెద్ది శివరాజం గారు మాకు చెప్పిన విషయాలు.
- తెలంగాణా సాహిత్య వికాసం- కె శ్రీనివాస్ (తెలంగాణా ప్రచురణలు)
- సంస్కర్త రావిచెట్టు రంగారావు- కుర్రా జితెంద్రబాబు (మిసిమి ఫిబ్రవరి 2012)
- సమగ్ర ఆంధ్ర సాహిత్యం (నాలుగవ సంపుటం)
- కొమర్రాజు లక్ష్మణరావు- ఆజ్మీరు వీరభద్రయ్య
- మాడపాటి హన్మంతరావు- ఆకెళ్ళ రాఘవెంద్ర
– వల్లూరి పవన్ కుమార్ (విప్ర ఫౌండేషన్)